భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

శివాజీనగర: క్రైస్తవులకు పవిత్ర దినం శుభ శుక్రవారం(గుడ్‌ఫ్రైడే)ను రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రమంతా ఉపవాస, వాక్యధ్యాన, ప్రార్థనలతో ఆచరించారు. చర్చిల్లో ప్రార్థనలు, వాక్యధ్యానం, యేసు శిలువ కార్యం, ఉపదేశం జరిగాయి. శివాజీనగర సెయింట్‌ మేరీ బసిలికా, ఎం.జీ.రోడ్డులోని సెయింట్‌ మార్క్స్‌ క్యాథడ్రల్‌ చర్చి, ఆల్‌పీపల్స్‌ చర్చి, సెయింట్‌ థామస్‌ చర్చి, సెయింట్‌ ప్యాట్రిక్‌ చర్చి, శివాజీనగర ఫ్రాన్సిస్‌ జేవియర్‌ చర్చి, శిశు జీసస్‌ చర్చి, మిస్పా తెలుగు చర్చి, మార్తహళ్లి సిద్ధాపుర అమాన తెలుగు చర్చి, యశ్వంతపుర జయచామరాజేంద్ర నగర బేథెల్‌ మిషన్‌ ఇన్‌ ఇండియా చర్చితో పాటు పలుచోట్ల ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమాలను చర్చి వెబ్‌సైట్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ప్రసారం చేశారు. క్రై ్తస్తవులు ఇళ్లలో నుంచే ఆచరణలో పాల్గొన్నారు.

ఏసు పలికిన మాటల విశదీకరణ

ఏసును గొల్గొతా కొండకు తీసుకెళ్లిన ఆనాటి దృశ్యాలను, యేసుక్రీస్తు శిలువను మోసుకొని ఊరేగించిన దృశ్యాలను కూడా ప్రదర్శించారు. మిస్పా తెలుగు చర్చి పాస్టర్‌ రెవరెండ్‌ బెరాకా ఆండీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్‌లో లిఖించిన ఏసు శిలువపై పలికిన ఏడు మాటలను పాస్టర్లు విశదీకరించారు. మొదటి మాట గురించి పాస్టర్‌ రెవరెండ్‌ డీ.బెరాకా ఆండీ, రెండో మాటను రెవరెండ్‌ ఎస్‌.ఫిలిప్‌, మూడో మాటను రెవ.యూ.విల్సన్‌ జాషువా, నాలుగో మాటను రెవరెండ్‌ టీ.ప్రసాదరావు, ఐదో మాటను రెవరెండ్‌.ఆన్‌ స్కైల్యాబ్‌, ఆరో మాటను హెచ్‌.విజయరాజులు, ఏడో మాటను రెవరెండ్‌ డీ.బెరాకా ఆండీ వివరించి, భక్తుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యశ్వంతపుర బేథెల్‌ మిషన్‌ ఇన్‌ ఇండియా చర్చిలో బిషప్‌ రెవరెండ్‌ ఎం.బెంజమన్‌ గుడ్‌ఫ్రైడే ప్రత్యేకతను వివరించారు.

చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

ఏసుక్రీస్తును ధ్యానించిన క్రైస్తవ బాంధవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement