తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ- ప్రియ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. 2014లో వీరి వివాహం జరగ్గా 2023లో బాబు పుట్టాడు. ఈ ఏడాది జనవరిలో భార్య మరోసారి గర్భం దాల్చిన విషయాన్ని బయటపెట్టారు. తాజాగా ప్రియ.. తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


