బీఆర్‌ఎస్‌దే విజయం.. క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా | BRS Sandhya Rani Elected As Kethanapalli Municipal Chairperson, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌దే విజయం.. క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా

Apr 4 2026 12:36 PM | Updated on Apr 4 2026 3:10 PM

BRS Sandhya Rani Elected As kethanapalli Municipal Chairperson

సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఘన విజయం దక్కింది. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇ‍క్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్‌ పడింది.

రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు.

ఇక, క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎట్టకేలకు క్యాతనపల్లి మున్సిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పంతం నెగ్గించుకున్నారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, సీపీఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్‌-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్‌, కాంగ్రెస్‌ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా పొత్తు ధర్మంలో ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. 

కాంగ్రెస్ కు బిగ్ షాక్ క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement