breaking news
son wedding
-
సామూహిక వివాహాల్లోనే తాళి కట్టిన సీఎం కొడుకు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన చిన్న కొడుకు అభిమన్యు వివాహాన్ని నిరాడంబరంగా చేశారు. ఈ క్రమంలో అదే వేదికపై మరో 21 జంటలకు వివాహం జరిపించి.. యువతులకు పెళ్లి సారె సైతం అందించారాయన. మోహన్ యాదవ్ చిన్న కొడుకు అభిమన్యు డాక్టర్. వధువు ఇషితా పటేల్ కూడా వైద్యురాలే. ఈ ఇద్దరు ఆదివారం తన నియోజకవర్గం ఉజ్జయిని(సౌత్) క్షిప్రా నది తీరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల కార్యక్రమంలో ఒక్కటయ్యారు. పెళ్లి కొడుకులంతా గుర్రాలపై ఉరేగింపుగా రాగా.. పెళ్లి కూతుళ్లు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా మండపానికి వచ్చారు. ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువులు, బాబాలు, అతికొద్ది మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి హాజరైన వీఐపీలకు అక్కడికి వచ్చిన జనాలతో కలిపే భోజనాలు వడ్డించారు. అభిమన్యు-ఇషితలకు బాబా రామ్‌దేవ్ ఆశీర్వాదం.. చిత్రంలో సీఎం మోహన్ యాదవ్ కూడా(కుడి చివర)మిగిలిన జంటలకు కన్యాదాన సామాగ్రి, ఇంటి కానుకలు, మొత్తం వివాహ ఖర్చుతో సహా మొత్తం బాధ్యతను యాదవ్ కుటుంబమే భరించింది. దీనికి తోడు.. ఖరైదీన గిప్ట్‌లు తీసుకురావొద్దంటూ ముందుగానే అందరికీ సమాచారం అందించారు. పాతిక వేల మంది దాకా వివాహానికి హాజరు కాగా.. దగ్గర్లోని ఆలయానికి వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చూసుకున్నారు. వివాహాల పేరిట అర్భాటాలకు పోయి ఖర్చులు చేసే బదులు ఇలా వివాహాలు జరిగితే మంచిదని.. ప్రధానమంత్రి చెప్పినట్లుగా పెళ్లిళ్లు సాధారణంగా జరగాలని, ఇలాంటి వివాహాలు సమానత్వానికి ప్రతీకని సీఎం మోహన్ యాదవ్ సందేశం ఇస్తున్నారు. ఇలాంటి వేదికలతో తన వివాహం జరగడం మరింత సంతోషాన్ని ఇస్తోందంటూ అభిమన్యు చెబుతున్నాడు. వివాహానికి హాజరైన జంటల్లో వివిధ వర్గాల(SC, ST) జంటలు ఉండడంతో సామాజిక సమానత్వం, సామరస్యానికి మోహన్ యాదవ్ నిదర్శనంగా నిలిచారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. सादगी हो तो मोहन यादव जैसी 🔥आज मध्यप्रदेश के मुख्यमंत्री मोहन यादव जी ने ऐसा काम कर दिया, जिसकी चर्चा पूरे देश में होगी।👉 मोहन यादव जी अपने बेटे अभिमन्यु यादव—जो खुद डॉक्टर हैं—की शादी सामूहिक विवाह सम्मेलन में करा रहे हैं।👉 एक तरफ पिता पूरे सूबे के मुख्यमंत्री, दूसरी… pic.twitter.com/AaCeA2b3eO— Aniket Yadav (@teamaniketyadav) December 1, 2025 He is a CM! He could've easily afforded spending crores on his son's wedding to make it a grand political show. But CM .@DrMohanYadav51 chose to get his son married in सामुहिक विवाह ceremony in presence of sadhus & saints to bless every couple.A powerful message to society.👏 pic.twitter.com/CccDmFg0Sq— BhikuMhatre (@MumbaichaDon) December 1, 2025 -
కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
ఘనంగా అరకు ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుక
సాక్షి, అరకులోయ రూరల్: అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కుమారుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ వివాహ వేడుక స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్ పర్సన్ స్వాతి రాణి, ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే హైమావతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అరకులోయ, పాడేరు తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు) -
వైభవంగా ఎంపీ బాలశౌరి కుమారుడి వివాహం
-
సీఎంను కలిసిన పాణ్యం ఎమ్మెల్యే.. కుమారుడి వివాహానికి ఆహ్వానం
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన భార్య కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు కాటసాని శివ నరసింహారెడ్డితో పాటు కలిశారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాయంలో కలిసి ఈ నెల 22వ తేదీన కర్నూలులోని పంచలింగాల సమీపంలోని మాంటీస్సొరి పాఠశాల ఆవరణలో జరిగే తమ కుమారుడు శివ నరసింహారెడ్డి వివాహానికి హాజరు కావాలని పెళ్లి పత్రికను అందించారు. -
కరోనాను జయించినా.. వీడని మృత్యువు
ఇచ్చోడ: ఓ తాపీ మేస్త్రీ కరోనాను జయించినా.. మృత్యువు వీడ లేదు. తన కుమారుడి పెళ్లికి ఒక్కరోజు ముందు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో జరిగింది. గ్రామానికి చెందిన మెడపట్ల రాజు (45)కు ఈ నెల 2న కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా.. పాజిటివ్ అని తేలింది. చికిత్స అనంతరం 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. కాగా, తన కుమారుడు కల్యాణ్ వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే.. గురువారం సాయంత్రం రాజు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి ఆడటం లేదని చెప్పడంతో నిర్మల్ అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచాడు. చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు బలవన్మరణం బాలిక గర్భంపై ‘సోషల్’ వార్.. ఎమ్మెల్యేకు తలనొప్పి -
సీపీ అంజనీకుమార్ కుమారుడి వివాహ ఫోటోలు
-
ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కి పెరోల్
-
లాలూ ఇచ్చిన షాక్ మాములుగా లేదు
పట్నా : రాజకీయాల్లోనే పరస్పర విమర్శలు.. శత్రుత్వం ఉంటాయని.. వ్యక్తిగత జీవితాలకు అవి అడ్డురావని మరోసారి రుజువైంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. రాజకీయ ప్రత్యర్థిగా భావించే సుశీల్ కుమార్ మోదీ ఇంట జరిగిన వేడుకకు లాలూ హాజరై ఆశ్చర్యపరిచాడు. మోదీ కుమారుడు ఉత్కర్ష్ వివాహం ఆదివారం జరిగింది. విరోధాలను పక్కనపెట్టి లాలూ ఈ కార్యక్రమానికి హాజరుకాగా, సుశీల్సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై సుశీల్ ఆప్యాయ ఆలింగనంతో లాలూని ఆహ్వానించాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. లాలూ అక్కడి నుంచి వెళ్లేంతవరకు వారిద్దరినే మీడియా హైలెట్ చేయటం విశేషం. కొన్ని రోజుల క్రితం ఈ పెళ్లి వేడుకకు హాజరై రచ్చ చేస్తానని లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ మధ్య హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై తీవ్ర విమర్శలు రావటంతో తన ప్రకటనపై వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించాడు. ఈ వేడుకకు కేంద్ర మంత్రులు అరున్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్, ధర్మేంద్ర ప్రధాన్, గిరిరాజ్ సింగ్, బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, గోవా గవర్నర్ మృదులా సిన్హా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, హర్యానా సీఎం మనోహార్ లాల్ ఖట్టర్, జార్ఖండ్ సీఎం రఘబర్ దాస్‌లు హాజరయ్యారు. కళ్యాణ వేదిక నుంచి హాజరైన ప్రజలతో వరకట్నం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. -
కొడుకు పెళ్లి చూసి కన్నుమూసిన తల్లి
ఖిలావరంగల్ : ఒకవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం.. తరుముకొస్తున్న మృత్యువు.. మరోవైపు తన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడాలన్న తపన..ఆమెను కొద్ది క్షణాలను జీవంగా ఉంచింది. మనసారా తనయుడిని ఆశీర్వదించిన మరుక్షణంలోనే ఆ మాతృమూర్తి అనంతలోకాలకు పయనమైం ది. పలువురి హృదయాలను కలిచివేసిన ఈ ఘటన 20 డివిజన్ లక్ష్మీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన మంగళగిరి ఆరువయ్య, సక్కుబాయి(50)దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం సక్కుబాయి క్యాన్సర్ బారిన పడింది. సర్కారు దవాఖానలో వైద్యపరీక్షలు చేయించుకోగా ఏడాదికన్నా ఎక్కవకాలం బతకలేదని వైద్యులు తేల్చి చెప్పారు. తనకున్న ఏకైక కుమారుడు రాజేష్ వివాహం చూసి తనువు చాలించాలని తరచూ స్థానికులకు చెప్పుకుని వాపోయేది. దీంతో స్థానిక పెద్దలు ముందుకు వచ్చి పేదింటి యువతి సమతను రాజేష్‌కు ఇచ్చి గురువారం ఉదయం ఉర్సుగుట్టపై వివాహం చేశారు. అయితే నవదంపతులు ఇంటికి చేరుకుని తల్లి సక్కుబాయి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కొద్ది సేపట్లోనే ఆ మాతృమూర్తి కన్నుమూసింది. దహన సంస్కారాలు చేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో హన్మకొండకు చెందిన వ్యాపారి పోరండ్ల కుమారస్వామి, టీఆర్ఎస్ నేత బోరిగం నర్సింగం, వంటల మల్లమ్మ, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కూనూరు శేఖర్‌గౌడ్ ముందుకు వచ్చారు. రూ.9వేలు ఆర్థిక సాయం అందజేసి అంత్యక్రియలు జరిపించారు.


