ముంబైలో జరిగిన అమానవీయ ఘటన కలకలం రేపింది. మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, వివస్త్రను చేసి వీడియోల రికార్డ్ చేశారు కొంతమంది దుండగులు. ఎదురు తిరిగి మాట్లాడితే, ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించిన వైనం సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది.
మేనేజింగ్ డైరెక్టర్ , వ్యవస్థాపక సభ్యుడు అయిన జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ సహా ఒక ప్రైవేట్ కంపెనీ సీనియర్ అధికారులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమావేశం నెపంతో ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ (FIPPL) కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం ఆమెను వేధించి, తుపాకీతో బెదిరించి ఆమె నగ్నంగా మారాలని బలవంతం చేశారు. మహిళపై దుర్భాషలాడి, ఆమె నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి, దాని గురించి ఎవరికైనా తెలియజేస్తే వాటిని బహిరంగంగా వెల్లడిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీనికి సంబంధించి 51 ఏళ్ల బాధిత మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి మరియు క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.


