ఉత్తరఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్ ప్రాంతం సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో బోల్తాపడింది. ఈఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు మృతి చెందగా మిగిలిన 13 మందికి తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం కుంజాపురి ఆలయానికి సమీపంలో ఉంటుంది.
కాగా బస్సుప్రమాద ఘటనపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తననుతీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయాలైన ప్రయాణికులను వెంటనే జిల్లాయంత్రాంగం స్థానిక ఆసుపత్రులకు తరిలించిందని తీవ్రంగా గాయపడ్డవారిని రిషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.


