బలవన్మరణానికి పాల్పడిన వివాహిత
బిడ్డ, మనవడి మరణాన్ని తట్టుకోలేక విషం తాగిన తల్లి
భర్త వేధింపులే కారణమని మృతురాలి బంధువుల ఆరోపణ
కేసు దర్యాప్తు చేస్తున్న మీర్‌పేట పోలీసులు
హైదరాబాద్: మరో నెల రోజుల్లో కుమారుడి తొలి పుట్టిన రోజు వేడుకలు....ఇందుకోసం భార్యా భర్తలిద్దరూ అవసరమైన షాపింగ్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి...వీటిని తట్టుకోలేక ఓ తల్లి తన 11 నెలల బాబుకు విషమిచ్చి తానూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇదే తరుణంలో కన్న కూతురు, మనవడు తన కళ్లముందే చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మృతురాలి తల్లి విషం తాగింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండలం పాల్వయికి చెందిన యశ్వంత్ రెడ్డి, సుష్మిత (27)లకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 నెలల బాబు అశ్వంత్ నందన్ రెడ్డి ఉన్నాడు. కొంత కాలంగా వీరు హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లోని కుందనిక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. యశ్వంత్ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా, తండ్రి గతంలోనే చనిపోవడంతో సుషి్మత తల్లి లలిత (50) కూడా కూతురు, అల్లుడి వద్దే ఉంటోంది. మరో నెల రోజుల్లో కుమారుడు అశ్వంత్ నందన్ రెడ్డి తొలి జన్మదినం ఉండడంతో ఈనెల 7న భార్యాభర్తలిద్దరూ షాపింగ్ చేశారు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. రోజూ మాదిరిగానే ఈనెల 8న ఉదయం విధులకు వెళ్లిన యశ్వంత్ రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి రాగా, లోపల గడియ పెట్టి ఉంది.
ఎంత కొట్టినా తీయకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసుల సాయంతో కిటికీ తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని భార్య, మంచంపై కొడుకు మృతి చెందగా, అత్త కొనఊపిరితో ఉండగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మృతురాలి బంధువులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. యశ్వంత్ రెడ్డి వేధింపుల వల్లే సుష్మిత తన కుమారుడికి విషమిచ్చి బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి పెద్దనాన్న సంజీవరెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


