చంపావత్: ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో ఏకంగా 161 జిలెటిన్ స్టిక్స్ లభించడం తీవ్ర కలకలకం సృష్టించింది. దాభ్రా పట్టణంలోని సాల్ట్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న కొన్ని ప్యాకెట్లను ప్రిన్సిపల్ సుభాష్ సింగ్ ఈ నెల 21వ తేదీన గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. పలు ప్యాకెట్లలో మొత్తం 161 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ పేలుడు పదార్థాలకు ఉగ్రవాదులకు సంబంధించినవి కావని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు.


