breaking news
Almora district
-
రెక్కల గుర్రం
ఆయన పేరు రవీ టమ్టా. స్వస్థలం దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా. చదివింది సాదాసీదా బీఏ మాత్రమే. అయితేనేం, అక్షరాలా అద్భుతమే సాధించి చూపించారు. ఎలాంటి ఇంజనీరింగ్ పరిజ్ఞానమూ లేకుండానే ఏకంగా ఎగిరే ఎలక్ట్రిక్ కారు తయారు చేశారు!! అబ్బురపరిచే ఈ ఆవిష్కరణకు కావాల్సిన సాంకేతిక తదితర పరిజ్ఞానమంతటినీ ఆయన కేవలం ఇంటర్నెట్ ద్వారా అందిపుచ్చుకోవడం విశేషం! ఎగిరే కారును రూపొందించే క్రమంలో ఎన్నిసార్లు వైఫల్యాలు ఎదురైనా టమ్టా ఏనాడూ కుంగిపోలేదు. ఎక్కడా పట్టువిడవలేదు. పైపెచ్చు ప్రతి వైఫల్యం నుంచీ పాఠాలు నేర్చుకున్నారు. నిత్యం తనకు తాను పదును పెట్టుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని పరిశోధనలు చేస్తూ, ఒక్కో అడ్డంకినీ దాటుతూ వచ్చారు. అలా ఒకటీ రెండేళ్లు కాదు, ఏకంగా 13 ఏళ్ల పాటు పట్టువిడవని విక్రమార్కుని మాదిరిగా ప్రయత్నించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారన్న వేటూరి మా(పా)టను నిజం చేయడమే గాక తెలివితేటలకు, చదువుకు సంబంధమే లేదని కూడా రుజువు చేశారు. సింగిల్ సీటుతో కూడిన తన ఎగిరే కారుకు హపిదా స్కైనెక్స్ అని పేరు పెట్టుకున్నారు టమ్టా. గత ఆగస్టులోనే విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ కూడా ముగించారు. ఇక ప్రభుత్వపరంగా కూడా పరీక్షలు జరిగి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులు లభించడమే తరువాయి.పదేళ్ల తపస్సు ఉత్తరాఖండ్‌లో అక్షరాలా స్వర్గాన్ని తలపించే అల్మోరా హిమ సానువుల్లో ప్రఖ్యాత జాగేశ్వర్ ధామ్ సమీపంలోని కఫ్లీఖాన్ అనే కుగ్రామం టమ్టా స్వస్థలం. ఆకాశాన్ని చుంబించే అక్కడి మంచుకొండల్లో ప్రయాణం స్థానికులకు నిత్య నరకమే. ముఖ్యంగా జీవన్మరణ పరిస్థితుల్లో అత్యవసరంగా ఆస్పత్రులకు చేరుకోవడమైతే అక్షరాలా పెను సవాలే. ఈ పరిస్థితులే ఎగిరే కారు రూపొందించేలా టమ్టాను ప్రేరేపించాయి. సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఎందుకంటే ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఊళ్లోనే సాగింది. అనంతరం నైనాటాల్లో బీఏ చేశారు. ఆర్థిక వనరులు అంతకన్నా లేవు. కానీ ఈ పరిమితులేవీ ఆయన్ను ఆపలేకపోయాయి.ఇంటర్నెటే గురువు టమ్టా తండ్రి హరీశ్ రామ్ ఓ మెకానిక్. అలా ఊహ తెలిసినప్పటి నుంచీ వాహనాల మధ్యే పెరిగిన టమ్టా, ఆ అనుభవమే పెట్టుబడిగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయనకు ఇంటర్నెటే గురువైంది. అందులో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఎగిరే కారు రూపకల్పన దిశగా ముమ్మర పరిశోధనలు మొదలు పెట్టారు. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో ఒక్కో అడుగూ వేస్తూ సాగారు. ఎన్ని చెప్పినా, ఎగిరే కారంటే ఆషామాషీ వ్యవహారం అసలే కాదు. డిజైన్ మొదలుకుని బ్యాటరీ పనితీరు, వాహన స్థిరత్వం, భద్రత దాకా ప్రతిదీ పెను సవాలే. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వచ్చారు టమ్టా. అందుకోసం ప్రతి వైఫల్యాన్నీ ఎప్పటికప్పుడు అన్ని కోణాల నుంచి సమీక్షించుకున్నారు. అలా ఆ వైఫల్యాలనే విజయ సోపానాలుగా మలచుకుంటూ వచ్చారు. పలు ప్రయత్నాల అనంతరం మల్టీరోటార్ డ్రోన్ల తరహా టెక్నాలజీ సాయంతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపెల్లర్ల సాయంతో అనుకున్నది సాధించారు. ఇవీ ప్రత్యేకతలు → ఎగిరే కారు ‘హైపిడా’విశేషాలు అన్నీ ఇన్నీ కావు...→ ఇది రన్‌వేతో నిమిత్తమే లేకుండా హెలికాప్టర్ మాదిరిగా ఉన్నచోటి నుంచే నిట్టనిలువుగా ఎగిరేలా, దిగగలదు. → దీని తయారీకి అత్యంత తేలికైన ఫ్రేమ్‌ను ఉపయోగించారు టమ్టా. → ఇందులో ఒకటే సీటుంటుంది. ఒకరకంగా అదే కాక్‌పిట్ కూడా.→ ఇది ఎలక్ట్రిక్ వెహికల్. కనుక ఖరీదైన ఏవియేషన్ ఫ్యూయల్, ఎథనాల్ వంటివి వాడాల్సిన జంఝాటమే లేకుండా ఎంచక్కా ఇ–బ్యాటరీ సాయంతో నడుస్తుంది. కాలుష్యానికి ఆస్కారమే ఉండదన్నమాట.→ ట్రాన్స్పరెంట్ అద్దాల్లోంచి డ్రైవర్‌కు బయటి ప్రపంచం, బయటి నుంచి చూసేవాళ్లకు డ్రైవర్ ఎంచక్కా కనిపిస్తారు. -
ఆ ఆడియోతో షాకయ్యా.. మహిళా మంత్రి కన్నీళ్లు
మహిళా భద్రతపై భరోసా కల్పించాల్సిన ఓ మహిళా మంత్రి.. తన భర్త నుంచే ప్రాణహాని ఉందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, కులం పేరుతో దూషిస్తూ వేధించారంటూ పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన భర్తకు గతంలోనే పెళ్లయినా ఆ విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో భర్త వేధింపులను వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే ఆమె ఆస్పత్రిలో చేరడం కలకలం రేపుతోంది.తన ప్రభుత్వ నివాసంలో సిబ్బంది ఎదుట తన భర్త కులం పేరుతో అవమానకరమైన పదజాలంతో దూషించారని రేఖా ఆర్య ఆరోపించారు. కొన్ని కంపెనీల డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించినట్లు చూపించేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించారని కూడా ఆమె ఆరోపించారు. రేఖా ఆర్య.. రెండు ఆడియో క్లిప్‌లను కూడా విడుదల చేశారు. అందులో తన భర్త ఓ మహిళతో మాట్లాడుతూ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వినిపిస్తోందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.అల్మోరా జిల్లాలోని సోమేశ్వర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా ఆర్య.. మంత్రిగా కొనసాగుతున్నారు. వివాహ సమయంలో తాను అవివాహితుడినని సాహు చెప్పారని రేఖా ఆర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత ఆయనకు అప్పటికే వివాహమైందని.. ఆ వివాహం ద్వారా పిల్లలు కూడా ఉన్నారని తెలిసిందన్నారు. అప్పటికే తనకూ పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యుల సలహా మేరకు.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై మౌనంగా ఉన్నానని తెలిపారు.ఇటీవల తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. ఇతర మహిళలతో ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని రేఖా ఆర్య అన్నారు. తాను అభ్యంతరం చెప్పినప్పుడు మొదట తన తప్పును అంగీకరించి.. క్షమాపణ చెప్పారని, కానీ ఆ తర్వాత కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంబంధాలను వ్యతిరేకించినప్పుడు తనపై దాడి చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాల సాయంతో సంబంధిత కంపెనీల డైరెక్టర్ పదవి నుంచి తాను తొలగించబడినట్లు చూపించారని కూడా రేఖా ఆర్య ఆరోపించారు. తాను అలాంటి పత్రాలపై సంతకం చేయలేదని.. రాజీనామా కూడా సమర్పించలేదని ఫిర్యాదులో స్పష్టం చేశారు.తన వీడియోలో రేఖా ఆర్య మాట్లాడుతూ.. ఆడియో రికార్డింగ్ తనను తీవ్రంగా కలచివేసిందని.. తన బంధంపై ప్రశ్నలు తలెత్తేలా చేసిందని అన్నారు. నిజాయతీగా, నిబద్ధతతో జీవించినందుకు దక్కే ఫలితం ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇంతటి బాధలోనూ నా బాధ్యతను నేను మర్చిపోలేదు.. ఇకపై చెప్పడానికి నా దగ్గర మాటలు లేవంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వానికి ఇది తీవ్ర అవమానం అంటూ వ్యాఖ్యానించింది. ఒక రాష్ట్ర మంత్రి స్వయంగా తన భర్త నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అది ప్రభుత్వానికి సిగ్గుచేట్టు అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా మెహ్రా దసౌని అన్నారు.उत्तराखंड की कैबिनेट मंत्री रेखा आर्य का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है,जिसमें वह रोते हुए अपनी पीड़ा जाहिर कर रही हैं। मामला उनके फैमिली से जुड़ा है, उन्होंने अपने पति के खिलाफ कैण्ट थाने में fir कराई है,उन्होंने अपने पति से अपनी और बच्चों की जान को खतरा बताया है। https://t.co/yRNhmAL2Qm— Naseem Ahmad (@NaseemNdtv) October 15, 2026ఇదీ చదవండి: Viral Video: మహిళా అధికారిణిపై రెచ్చిపోయిన ఐఏఎస్ -
పాఠశాల సమీపంలో పేలుడు పదార్థాలు
చంపావత్: ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో ఏకంగా 161 జిలెటిన్ స్టిక్స్ లభించడం తీవ్ర కలకలకం సృష్టించింది. దాభ్రా పట్టణంలోని సాల్ట్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న కొన్ని ప్యాకెట్లను ప్రిన్సిపల్ సుభాష్ సింగ్ ఈ నెల 21వ తేదీన గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. పలు ప్యాకెట్లలో మొత్తం 161 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ పేలుడు పదార్థాలకు ఉగ్రవాదులకు సంబంధించినవి కావని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. బ్లాస్టింగ్‌కు ప్లాన్?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. 20 కిలోలకు పైగా బరువున్న జిలెటిన్ స్టిక్స్ ప్యాకెట్లు బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎర్రకోట పేలుడు, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలో 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తాజాగా ఇలా పేలుడు పదార్ధాలు లభ్యంచడంతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా సుల్త్ ప్రాంతంలోని దబారా గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల సమీపంలో 161 శక్తివంతమైన పేలుడు పదార్థమైన జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల సమీపంలో పిల్లలు ఆడుకుంటుండగా సమీపంలోని పొదల్లో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. దీంతో, స్కూల్ ప్రిన్సిపాల్.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి వారిని అలర్ట్ చేసింది. బాంబు నిర్వీర్య బృందం, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల్లో గాలించాయి. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని.. నమూనాలను సేకరించాయి. అనంతరం, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.#WATCH | Almora, Uttrakhand | On recovery of gelatin sticks near a school, Almora SSP Devendra Pincha says, "...In the Dabra village, around 161 gelatin sticks were found in the bushes near the school. The local police arrived at the scene and the BDS team was also called in. The… pic.twitter.com/xdGv0hqAsA— ANI (@ANI) November 22, 2025ఈ సందర్బంగా అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) దేవేంద్ర పించా మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు పదార్థాల స్వాధీనంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ధృవీకరించబడిన సమాచారాన్ని వివరిస్తామని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. జిలెటిన్ స్టిక్స్‌ను సాధారణంగా నిర్మాణాలు, మైనింగ్ పనుల్లో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఇంత భారీ మొత్తంలో వీటిని గ్రామానికి ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1908, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు. లోతైన విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పి వెల్లడించారు. -
బస్సు లోయలో పడి 17 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతిచెందగా 22 మంది గాయపడ్డారు. 40 మంది ప్రయాణికులతో పిథోరాగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ బస్సు ధ్యారీ వద్ద వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించామని కుమాన్ డీజీపీ పుష్కర్ సాయిలాల్ తెలిపారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.


