
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..
ప్రస్తుతం యూఎస్‌లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు.
దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్‌ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.
జిలాజిన్ అంటే ఏమిటి?
జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది.
ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్‌గా చెప్పాలంటే నోర్‌పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట.
Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM
— 0HOUR (@0HOUR1__) September 6, 2025
ప్రమాదకరమైన ప్రభావాలు..
ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట.
తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం.
ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.
📍For informational purposes:
These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.
It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳
Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025
(చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..)