breaking news
Zombie Reddy
-
ఉన్నట్లా... లేనట్లా ... సీక్వెల్స్‌పై సందిగ్ధం!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4... ఇలా పలు భాగాలుగా సినిమా తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు దర్శక–నిర్మాతలు హిట్ అయిన సినిమాని ఫ్రాంచైజీలుగా తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ మూవీస్‌పై అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ ఉంటోంది. దీంతో సీక్వెల్స్ చేయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని ప్రీ ప్రోడక్షన్లో ఉన్నాయి.అయితే ఇక్కడ చర్చించదగ్గ మరో విషయం ఏంటంటే... కొన్ని హిట్ సినిమాల సీక్వెల్స్‌లో భాగంగా రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ షూటింగ్ పట్టాలెక్కలేదు. ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్: దేవర 2, కల్యాణ్ రామ్: బింబిసార 2, కిరణ్ అబ్బవరం: క 2, తేజ సజ్జా: జాంబీ రెడ్డి 2, సాయిదుర్గా తేజ్ : విరూపాక్ష 2 వంటి విజయవంతమైన సినిమాలున్నాయి.అయితే రామ్ హీరోగా నటించిన ‘స్కంద’, విరాట్ కర్ణ కథానాయకుడిగా నటించిన ‘పెదకాపు’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ఈ చిత్రాల సీక్వెల్స్ ఉంటాయని యూనిట్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత వాటి ఊసే లేదు. మరి... పైన పేర్కొన్న సినిమాల సీక్వెల్స్ ఉన్నట్లా? లేనట్లా? అనే సందిగ్ధం సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం...ఎన్టీఆర్: దేవర ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘దేవర’ పార్ట్ 1’. ఈ మూవీ ద్వారా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు.‘దేవర: పార్ట్ 1’ 2024 సెప్టెంబరు 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి, సూపర్ హిట్‌గా నిలిచింది. హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. లాస్ ఏంజెల్స్‌లోని ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ అయిన తొలి భారతీయ సినిమాగానూ ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘దేవర: పార్ట్ 2’ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘దేవర: పార్ట్ 1’ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’ సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఎన్టీఆర్.ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీలో నటిస్తున్నారు. దీంతో ‘దేవర: పార్ట్ 2’ కోసం చాలా రోజులు వేచి చూసిన డైరెక్టర్ కొరటాల శివ తాజాగా బాలకృష్ణ హీరోగా ‘ఎన్బీకే 112’ సినిమాని ప్రకటించారు. ‘డ్రాగన్’ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. దీంతో ‘దేవర: పార్ట్ 2’ ఉంటుందా? లేదా అనే చర్చ జరుగుతోంది.రామ్: స్కంద రామ్ పోతినేని హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, శరత్ లోహితశ్వ, అజయ్ పుర్కార్, గౌతమి, ఇంద్రజ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2023 సెప్టెంబరు 28న విడుదల అయింది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారు.పక్కా మాస్ యాక్షన్‌గా బోయపాటి మార్క్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకి రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ‘స్కంద’ విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు చేశారు రామ్. ఇక బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ హీరోగా ‘అఖండ 2’ సినిమాని తెరకెక్కించారు. మరి ‘స్కంద 2’ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా అన్నది వేచి చూడాలి. కల్యాణ్ రామ్: బింబిసార నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అన్నది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంయుక్త, కేథరిన్ హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, శ్రీనివాస రెడ్డి, ప్రకాష్‌రాజ్, అయ్యప్ప పి. శర్మ, భరత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా 2022 ఆగస్టు 5న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి వచ్చిన ప్రేక్షకాదరణతో ‘బింబిసార 2’ని ప్రకటించింది చిత్రబృందం.అయితే ‘బింబిసార’ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా ‘బింబిసార 2’ పై ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘బింబిసార’ మూవీ తర్వాత ‘అమిగోస్, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ వంటి సినిమాలు చేశారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం వెంకటేశ్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారాయన. ‘బింబిసార’ తర్వాత చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ చిత్రం తెరకెక్కించారు వశిష్ఠ. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారీ దర్శకుడు. అయితే ‘బింబిసార 2’కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకూ రాలేదు. దీంతో ఈ మూవీపైనా ఇండస్ట్రీలో సందిగ్ధం నెలకొంది. కిరణ్ అబ్బవరం: క కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘క’ మూవీ ఒకటి. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ మూవీ తెరకెక్కించారు. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో అన్నపూర్ణ, అజయ్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టై¯Œ మెంట్స్, కేఏ ప్రోడక్షన్స్పై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా 2024 అక్టోబరు 31న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘క 2’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకొచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ‘క 2’ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్‌లో ‘దిల్ రూబా, కె ర్యాంప్, చెన్నై లవ్‌స్టోరీ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కిరణ్ అబ్బవరం. మరి ‘క 2’ సినిమా ఉందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తేజ సజ్జా: జాంబీ రెడ్డి బాలనటుడిగా పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు తేజ సజ్జా. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి’ మూవీ ద్వారా హీరోగా మారారు. ‘అ!’, ‘కల్కి’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమాలో ఆనంది, దక్ష నగార్కర్, హరితేజ, రఘుబాబు, ఆర్జే హేమంత్, కిరీటి, జబర్దస్త్ శ్రీను, వినయ్ వర్మ, అన్నపూర్ణ, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ మూవీ 2021 ఫిబ్రవరి 5న విడుదలైంది.తెలుగులో తొలి జాంబీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించడంతో హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే ‘జాంబీ రెడ్డి’ రిలీజై ఐదున్నరేళ్లు దాటినప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్‌లో తేజ సజ్జా ‘ఇష్క్, అద్భుతం, హనుమాన్, మిరాయ్’ వంటి సినిమాలు చేశారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘హనుమాన్’కి సీక్వెల్‌గా రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ తేజ సజ్జా నటిస్తున్నారు. అదే విధంగా ‘మిరాయ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘మిరాయ్: జైత్ర’ రూపొందుతుందని తేజ సజ్జా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ‘జాంబీ రెడ్డి 2’ పై తాజా అప్డేట్ మాత్రం లేదు.సాయిదుర్గా తేజ్ : విరూపాక్ష అప్డేట్ మాత్రం లేదు. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించారు. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, రవి కృష్ణ, సోనియా సింగ్, అభినవ్ గోమటం, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించారు.పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21న విడుదలై ఘనవిజయం సాధించింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డు సాధించింది. ఈ మూవీ రిలీజై మూడేళ్లు దాటినప్పటికీ ‘విరూపాక్ష’ సీక్వెల్‌పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ గ్యాప్‌లో ‘బ్రో, సంబరాల యేటిగట్టు’ వంటి సినిమాలు చేశారు సాయిదుర్గా తేజ్. ‘సంబరాల యేటిగట్టు’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ విడుదల తర్వాత అయినా ‘విరూపాక్ష’ అప్డేట్ వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి. విరాట్ కర్ణ: పెదకాపు విరాట్ కర్ణ హీరోగా పరిచయమైన చిత్రం ‘పెదకాపు 1’. ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్. రావు రమేశ్, తనికెళ్ల భరణి, అనసూయ భరద్వాజ్, బ్రిగడ సాగా, వికాస్, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్ర పోషించడం విశేషం.మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2023 సెప్టెంబరు 29న విడుదలైంది. 1983 నేపథ్యంలో ఉన్న కుల వివక్ష నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీ రిలీజై మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ గ్యాప్‌లో విరాట్ కర్ణ ‘నాగబంధం’ వంటి పాన్ ఇండియన్ మూవీ చేశారు. ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని చిత్ర దర్శకుడు అభిషేక్ నామా ప్రకటించారు. మరి ‘పెదకాపు 2’ ఉంటుందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... ‘మంగళవారం’ మూవీతో పాటు మరికొన్ని చిత్రాల సీక్వెల్స్ కూడా ప్రకటించినప్పటికీ సెట్స్‌పైకి వెళ్లలేదు.– డేరంగుల జగన్ మోహన్ -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్‌ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్‌లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్‌ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్‌గా చెప్పాలంటే నోర్‌పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
మెర్సీ ఫర్ యానిమల్స్ క్యాంపెయిన్‌లో దక్ష నగార్కర్ (ఫోటోలు)
-
చేతులు మారిన జాంబి రెడ్డి సీక్వెల్
-
బిగ్‌బాస్‌లోకి ‘జాంబి రెడ్డి’ భామ.. లిస్ట్‌లో ఇంకా ఎవరున్నారంటే...
బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు ఇటీవల విడుదలైన ప్రోమోతో తెరపడింది. ఇక నాగార్జున కూడా ప్రోమో షూటింగ్‌లతో బిజీగానే ఉన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్‌లో ఈ షోని ప్రారంభించాలని చూస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ బిగ్ రియాల్టీ షోకి వరుసగా మూడోసారి కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఇదిలా ఉంటే ఎప్పటి మాదిరే ఈ సీజన్‌కి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు ఉన్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో యంగ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. యువ హీరో తేజా సజ్జా హీరోగా ఇటీవల విడుదలైన జాంబి రెడ్డి లో ఓ రోల్ చేసిన లహరి శారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పటికే ఆమె ఒప్పందంపై సంతకం చేశారని, హౌస్ లోకి లహరి వెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని, ఆ తర్వాత వెండితెరపై వెలిగిపోవాలని ఆశపడుతుందట ఈ బ్యూటీ. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే.. బిగ్‌బాస్ షో ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే. -
మళ్లీ భయపెట్టడానికి జాంబీలు వస్తున్నాయి!
Zombie Reddy: తెలుగు ప్రేక్షకులకు తొలిసారి జాంబీలను పరిచయం చేసిన సినిమా జాంబీ రెడ్డి. హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఇలాంటి కొత్త జోనర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జా ఈ మూవీతో హీరోగా మారాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ మధ్యే ఓటీటీ‘ఆహా’లో విడుదలై 9.7 టీఆర్పీ రేటును సాధించింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రానుందట. తాజాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఈ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడని, దీనిపై హీరో తేజతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. . ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘ఒక గన్ను 6 బులెట్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం జాంబీరెడ్డి 2 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడట. మరి జాంబీ రెడ్డి సీక్వెల్‌పై వస్తోన్నవార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఆ డైరెక్టర్‌కు బేబమ్మ నో చెప్పడమేంటి? బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘పుష్ప’ -
‘ఆహా’లో జాంబిరెడ్డి, ఎప్పటినుంచంటే..
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జాంబిరెడ్డి సినిమా యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా డాబాగార్డెన్స్‌లోని ఓ హోటల్లో ఆదివారం హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ విలేకరులతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన ఈ సినిమా లాక్డౌన్ సడలింపులు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. అయితే అధిక శాతం మంది సినిమా చూడలేకపోయారని.. అలాంటి వారి కోసం ఈ నెల 26న ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా చూసి నచ్చితే పది మందికి చెప్పాలని కోరారు. విశాఖ నుంచి ఆహా ప్రీ రిలీజ్ టూర్ ప్రారంభించామని, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో కొనసాగిస్తామన్నారు. త్వరలో జాంబిరెడ్డి–2 తీయనున్నట్టు చెప్పారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ జాంబిరెడ్డిలో కశిరెడ్డి పాత్రలో నటించానన్నారు. ఆహాలో ఈ సినిమాను ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో నటుడు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సోషల్ హల్చల్: రాశి ఖన్నా అందాల విందు.. -
'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ
టైటిల్ : జాంబీ రెడ్డి జానర్ : జాంబీ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు దర్శకుడు : ప్రశాంత్ వర్మ నిర్మాత : రాజశేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె. రాబిన్ సినిమాటోగ్రఫి: అనిత్ విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021 మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్‌డౌన్‌ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్‌కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం. ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే.. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్‌తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్) నటన: ఇక ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!) -
'జాంబీ రెడ్డి'కి బెదిరింపులు: దర్శకుడు
‘‘లాక్ డౌన్ తర్వాత ఆరంభించిన ఫస్ట్ చిత్రం మా ‘జాంబిరెడ్డి’. మొదట్లో ఇద్దరు ముగ్గురుతో ఉన్న సీన్స్ చేశాం.. ఒక్కో వారం గ్యాప్ తీసుకొని చేయడం వల్లే సినిమా ఇంత ఆలస్యం అయ్యింది.. లేదంటే మా సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మన సినిమాల్లో లవ్ జానర్ ఎలానో జాంబీ కూడా ఒక జానర్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ అల్లుకుని ఈ సినిమా తీశా. హాలీవుడ్లో ఇప్పటికే జాంబీ సినిమాలు తీసినవాళ్లకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ సినిమా అనుకున్నాను. కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది. ఒక తెలియని విషయాన్ని మనకు తెలిసిన విషయానికి కనెక్ట్ చేసి చెప్తే సులభంగా అర్థమవుతుంది. త్రివిక్రమ్‌గారు ఈ విధంగా చేస్తుంటారు. మహాభారతం, భాగవతంతో కలిపి తన సినిమాల్లో చెబుతుంటారాయన. అలా నేను కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేద్దామనుకొని జాంబీ కాన్సెప్ట్‌కి ఫ్యాక్షన్ యాడ్ చేశాను. ‘జాంబిరెడ్డి’ టైటిల్ పెట్టినప్పుడు చాలానే బెదిరింపులు వచ్చాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఇండస్ట్రీలో భిన్నమైన స్వరాలు వినిపించాయి. ‘ఇలాంటి జానర్ మేం చేద్దాం అనుకున్నాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాదేమో అని వదిలేశాం’ అని కొందరు.. ‘మంచి ఐడియా’ అని మరికొందరు అన్నారు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ‘నువ్వు సాధించావ్’ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో పెద్ద హీరో అయితే మార్కెట్ పరిధి బాగుండేది. కానీ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టేదేమో? త్వరగా సినిమా చెయ్యాలనుకున్నాను.. తేజ సరిపోతాడనిపించి తీశాను. మా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యాక హిందీ రీమేక్‌కి అవకాశాలొచ్చాయి. సమంతగారికి చెప్పింది ‘జాంబిరెడ్డి’ కథ కాదు.. వేరేది. మేమిద్దరం ఆ స్క్రిప్ట్‌ని నమ్మాం.. కానీ నిర్మాత దొరకలేదు. నా దగ్గర ప్యాన్ ఇండియా కథలు కూడా ఉన్నాయ్. ‘జాంబిరెడ్డి’ విజయం సాధించి మంచి పేరు వస్తే, సీక్వెల్‌ని ప్యాన్ ఇండియా స్థాయిలో తీస్తాం’’ అన్నారు. -
తేజ మా మెగాఫ్యామిలీ మెంబర్
‘‘తేజ చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్. చిరంజీవిగారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. ‘ఓ బేబీ’ సినిమాలో తనని చూసి సర్ప్రై జ్ అయ్యాను. ప్రశాంత్ వర్మ గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబీ జానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాంబిరెడ్డి’ ప్రీ–రిలీజ్ వేడుకలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘ ‘శివ’ సినిమా టైమ్‌లో ఆర్జీవీని చూసి గొప్ప డైరెక్టర్ అవుతాడనుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయాలనే నా కల. ‘జాంబిరెడ్డి’తో నిజమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా నిర్మాత రాజశేఖర్ వర్మగారు కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. తేజ నాకు మంచి ఫ్రెండ్. ‘అ!’ సినిమా కన్నా ముందే తనతో ఓ చిత్రం చేయాలి... కుదరలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
హీరోగా నాకిది సరైన లాంచ్
‘‘బాలనటుడిగా చాలా సినిమాలు చేశాను. అవి మినహాయిస్తే ‘ఓ బేబీ’ నా తొలి చిత్రం. ఆ ప్రాజెక్ట్‌లో నాకన్నా పెద్ద స్టార్స్ ఉన్నారు. హీరోగా ‘జాంబీ రెడ్డి’ సినిమా నాకు సరైన లాంచ్. ఈ సినిమా విడుదల కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నా’’ అని తేజ సజ్జ అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మ నాకు చాలా సన్నిహితుడు. నా బలాలు ఏంటో తనకు బాగా తెలుసు. నన్ను హీరోగా ఎలివేట్ చేయడానికి ప్రశాంత్ బాగా కష్టపడ్డాడు. కోవిడ్ సమయంలో మా సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. లాక్డౌన్లో చాలా విషయాలు మారిపోయాయి. దాంతో ప్రేక్షకులను మరింతగా నవ్వించడానికి వ్యంగ్యంతో కూడిన ఉల్లాసమైన కామెడీని జత చేశాం. ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ చాలా బాగుంది. మా సినిమా టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమాని కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రవిజయం నా కెరీర్‌ను మార్చుతుందనే బలమైన నమ్మకం ఉంది. అన్ని రకాల పాత్రలు చేసి, ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
మూడోసారి మిస్ కాదల్చుకోలేదు!
‘‘తెలుగులో నా మొదటి చిత్రం ‘హోరా హోరీ’(2016). బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తేజాగారి దర్శకత్వంలో ఆ సినిమా చేసే అవకాశం వచ్చింది. చదువు కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించాను’’ అన్నారు దక్షా నగార్కర్. తేజ సజ్జ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. దక్షా నగార్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మ తీసిన ‘అ’ చిత్రంలో నిత్యామీనన్ పాత్రలో నేను నటించాల్సింది. అప్పటికి నాకంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడైతే ఆ పాత్రని ఒప్పుకునేదాన్ని. ‘కల్కి’కి కూడా సంప్రదించారు ప్రశాంత్ వర్మ.. కానీ కుదరలేదు. మూడోసారి మిస్ కాకూడదని ‘జాంబీ రెడ్డి’ చేశా. ఇందులో మ్యాగీ అనే గేమర్ పాత్రలో నటించాను. ప్రస్తుతం బెల్లంకొండ గణేశ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. రెండు పెద్ద నిర్మాణ సంస్థల్లో రెండు సినిమాలు, హిందీలో ఓ వెబ్ ఫిల్మ్ కమిట్ అయ్యాను’’ అన్నారు. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: సమంత
‘‘జాంబిరెడ్డి’ సినిమా టీజర్ అదిరిపోయింది. నా ఊహను మించిపోయింది. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. నాకు సినిమాలంటే ప్రాణం’’ అన్నారు సమంత. తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత విడుదల చేశారు. పోస్టర్‌ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిఫరెంట్‌గా ఉంది. టీజర్‌తో ప్రశాంత్ వర్మ భయపెడుతున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్‌ను సగం పూర్తి చేశాం. మిగిలిన భాగాన్ని లాక్డౌన్ తర్వాత పూర్తి చేశాం. నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడానికి ఈ సినిమా తీయలేదు. ఎంటర్టైన్ చేయడం కోసం తీశాను. ఈ సినిమా హిట్ సాధిస్తే ‘జాంబిరెడ్డి’ లెవల్ 2 స్క్రిప్ట్ ఉంది. నన్ను నమ్మిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ముందు సమంతగారితో ఓ సినిమా అనుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారు’’ అన్నారు తేజ సజ్జా. ఈ కార్యక్రమంలో ఆనంది, దక్షా నగార్కర్, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు పి. కిరణ్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి
‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైంది. తేజ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’. లాక్డౌన్ సడలించాక ప్రభుత్వ నిబంధనల మేరకు తెలుగు పరిశ్రమలో ముందు షూటింగ్ మొదలు పెట్టి, పూర్తి చేసిన తొలి చిత్రం మాదే. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం. మా సినిమాతో జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగుకి పరిచయం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి.


