హీరోగా నాకిది సరైన లాంచ్‌ | Teja Sajja Press Meet About Zombie Reddy Movie | Sakshi
Sakshi News home page

హీరోగా నాకిది సరైన లాంచ్‌

Feb 2 2021 5:55 AM | Updated on Feb 5 2021 12:19 PM

Teja Sajja Press Meet About Zombie Reddy Movie - Sakshi

‘‘బాలనటుడిగా చాలా సినిమాలు  చేశాను. అవి మినహాయిస్తే ‘ఓ బేబీ’ నా తొలి చిత్రం. ఆ ప్రాజెక్ట్‌లో నాకన్నా పెద్ద స్టార్స్‌ ఉన్నారు. హీరోగా ‘జాంబీ రెడ్డి’ సినిమా నాకు సరైన లాంచ్‌. ఈ సినిమా విడుదల కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నా’’ అని తేజ సజ్జ అన్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ, దక్షా నగార్కర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్‌ వర్మ నాకు చాలా సన్నిహితుడు. నా బలాలు ఏంటో తనకు బాగా తెలుసు.

నన్ను హీరోగా ఎలివేట్‌ చేయడానికి ప్రశాంత్‌ బాగా కష్టపడ్డాడు. కోవిడ్‌ సమయంలో మా సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. లాక్‌డౌన్‌లో చాలా విషయాలు మారిపోయాయి. దాంతో ప్రేక్షకులను మరింతగా నవ్వించడానికి వ్యంగ్యంతో కూడిన ఉల్లాసమైన కామెడీని జత చేశాం. ఈ చిత్రంలో యాక్షన్‌ పార్ట్‌ చాలా బాగుంది. మా సినిమా టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమాని కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రవిజయం నా కెరీర్‌ను మార్చుతుందనే బలమైన నమ్మకం ఉంది. అన్ని రకాల పాత్రలు చేసి, ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement