
పేషెంట్‌కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. శరీరంలోని ప్రతీ అవయవానికి చేసే సర్జరీకి ముందుగా మత్తుమందు(అనస్థీషియా)ఇస్తారు. దీంతో నొప్పి బావన ఉండదు. క్లిష్టమైన, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు అనస్థీషియా నిపుణులు చేస్తున్న సేవలు అత్యంత ముఖ్యమైనవి. తెరవెనుక డాక్టర్ అనస్థీషియా. వీరికోసం ఏటా అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1846 అక్టోబర్ 16న తొలిసారి విలియం టీజీ మోర్టన్ అనే వైద్యుడు ఈథర్ అనస్థీషియాను విజయవంతంగా ప్రదర్శించారు.
మత్తుమందు లేని రోజుల్లో..
అనెస్తీషియా అమలులోకి రానిరోజుల్లో పేషెంట్‌కు శస్త్రచికిత్స చేయాలంటే, మత్తు రావడానికి తలపై గట్టిగా కొట్టడం, పాములతో కరిపించడం, వివిధ రకాల మత్తు పదార్థాలు తినిపించడం, గట్టిగా చేతులతో పట్టుకుని ఆపరేషన్లు చేసేవారని చెబుతున్నారు. అనస్థీషియాను కనిపెట్టాక చిన్న సూదితో శరీరంలో మత్తు ఎక్కించేసి పేషెంట్‌కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తున్నారు.
జీజీహెచ్‌లో 13 మంది అనస్థీషియాలు..
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనస్థీషియాల సహకారంతో ప్రతీనెల వేలాది ఆపరేషన్లు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ సిమ్స్ అనుబంధ జీజీహెచ్‌లో అనెస్తీషియా విభాగం ప్రత్యేకంగా ఉంది. ఇందులోని ఇద్దరు ప్రొఫెసర్లు, 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఎస్‌ఆర్ సేవలు అందిస్తున్నారు.
పేషెంట్ కోలుకునే వరకు..
పేషెంట్‌కు మత్తుమందు ఇచ్చేది అనస్థీషియాలే అయినా.. శస్త్రచికిత్స పూర్తయి, కోలుకునే వరకూ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. పేషెంట్ త్వరగా కోలుకున్నాడంటే అందులో అనస్థీషియా పాత్రకీలకంగా ఉంటుంది.
వైద్యరంగంలో కీలకం
వైద్యరంగంలో అనస్థీషియా చాలా కీలకమైనది. ప్రస్తుత వైద్య విధానంలో మత్తుమందు లేకపోతే అనే ఊహనే కష్టంగా ఉంటుంది. మత్తుమందు అందుబాటులోకి రావడంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
– దండె రాజు, ఆర్‌ఎంవో, జీజీహెచ్
తెరవెనుక వైద్యుడు
తెరవెనుక వైద్యుడు అనస్థీషియా. ఆపరేషన్ చేయడానికి సర్జన్‌తోపాటు అనస్థీషియా కూడా కీలకమే. పేషెంట్ కోలుకునే వరకు పర్యవేక్షిస్తుంటాడు. జీజీహెచ్‌లో చాలా హైరిస్క్ కేసులు కూడా అనెస్తీషియాల సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం.
– అరుణ, గైనిక్ హెచ్‌వోడీ, జీజీహెచ్
(చదవండి: