
పెరుగుతున్న బంగారం ధరలు.. ఆర్ధిక శ్రేయస్సు కంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిని సూచిస్తుందని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐఎమ్ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ రాసిన కథనంపై స్పందిస్తూ.. యూఎస్ మార్కెట్లపై చేసిన అంచనాతో తాను ఏకీభవిస్తున్నానని శ్రీధర్ వెంబు చెప్పారు. ''అమెరికా స్టాక్ మార్కెట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం కూడా ఒక పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తోంది. నేను బంగారాన్ని పెట్టుబడిగా భావించను, దానిని ఆర్థిక ప్రమాదానికి బీమాగా భావిస్తున్నాను. వ్యవస్థలోని అన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి AI కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు.
గీతా గోపీనాథ్ ఏమన్నారంటే?
వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా దెబ్బతింది. డాట్ కామ్ క్రాష్ తరువాత జరిగిన దానికంటే.. స్టాక్ మార్కెట్ కరెక్షన్ మరింత తీవ్రమైంది. టారిఫ్ యుద్ధాలు.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతర్లీన సమస్య అసమతుల్య వాణిజ్యం కాదు అసమతుల్య వృద్ధి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని మరిన్ని దేశాలు/ప్రాంతాల్లో అధిక వృద్ధి మరియు రాబడి అవసరం.
పెట్టుబడిదారులు చాలావరకు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం మాత్రమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వంలో కొత్త ఆందోళనలు పుడుతున్నాయి. ఈ తరుణంలో 2026 జనవరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!
కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు.. ముఖ్యంగా చైనా, జపాన్‌లలో బలమైన డిమాండ్ కారణంగా ప్రపంచ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) వ్యవస్థాపక సభ్యుడు & మాజీ చైర్మన్ అనంత పద్మనాబన్ పేర్కొన్నారు.
I agree with Dr Gita Gopinath.
The US stock market is in a clear and massive bubble.
The degree of leverage in the system means that we cannot rule out a systemic event like the global financial crisis of 2008-9.
Gold is also flashing a big warning signal. I don't think of… https://t.co/7xVPL3FXDq— Sridhar Vembu (@svembu) October 18, 2025