బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 2) మరోమారు తగ్గాయి. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఉదయం రూ. 250 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 550 రూపాయలకు చేరింది. అంటే గంటల వ్యవధిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 1,19,050 (22 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 610 తగ్గింది (ఉదయం రూ. 280 మాత్రమే తగ్గింది). దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,29,870 వద్ద నిలిచింది.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత తగ్గాయి. సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 610 రూపాయలు తగ్గి రూ. 1,30,020 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 550 రూపాయలు తగ్గి రూ. 1,19,200 వద్ద నిలిచింది.
చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 320 రూపాయలు తగ్గి రూ. 1,31,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి రూ. 1,20,400 వద్ద నిలిచింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


