సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే! | Gold Prices Decline In India Within 24 Hours, Here Are The Latest City Wise Rates Inside | Sakshi
Sakshi News home page

సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!

Mar 13 2026 9:12 PM | Updated on Mar 14 2026 3:54 PM

Gold Price Down in India Know The Latest Rates Here

భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 తగ్గి.. రూ.1,60,690 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1400 రూపాయలు తగ్గి.. రూ. 147300 వద్ద నిలిచింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 1530, రూ.1400 తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 1,60,840 & రూ. 1,47,450 వద్ద ఉన్నాయి.

చెన్నైలో మాత్రం గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉదయం ఎంత ధర ఉందో, సాయంత్రానికి కూడా అదే ధర వద్ద నిలిచింది. దీంతో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162560 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,49,000 వద్ద నిలిచింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement