
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్‌లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్‌బ్రాండ్ పాలిటిక్స్‌తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్‌ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం.
గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్‌లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..
ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్‌డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది.
ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్‌లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్‌మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్‌మాస్క్‌లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం.
కుటుంబ నేపథ్యం..
పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.
ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె.
అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ రంగు దుస్తులే ఎందుకంటే..
రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది.
కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్‌ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..)