హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే మహిళకు ఆ జీవితం తృప్తినివ్వలేదు. సొంత బిజినెస్ చేయాలనే కోరిక కలిగింది. ఆ ఆలోచనే పట్టుదలగా మారింది. అదే ఆమె జీవితంలో కీలక మలుపునకు దారి తీసింది. ఇపుడు ఏడాది ఏకంగా రూ.4 కోట్లు ఆర్జిస్తోంది. 13 ఏళ్ల పాటు నర్సుగా సేవలందించిన ఆమె మొదలు పెట్టిన బిజినెస్ ఏంటి? ఆమెవిజయ రహస్యం ఏంటి తెలుసుకుందామా?
పట్టుదల ఉండాలే గానీ..
అమెరికాలోని అరిజోనాకు చెందిన 38 ఏళ్ల కామి (మారు పేరు) ఒక హాస్పిటల్‌లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌లో నర్సుగా పనిచేసింది. జీవితం రొటీన్‌గా, మార్పు కావాలని అని అనిపించింది. ఈ పని నుంచి బైటపడాలంటే ఉద్యోగం మానేసే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చాలా తీవ్రంగా ఆలోచించింది. పెట్టుబడి కోసం ఇల్లు అమ్మాలని భావించింది. వ్యాపారానికి రెండు మూడు వెంచర్‌లను పరిశీలించింది. చివరికి కొంతమంది స్నేహితులు,బంధువు సలహా మేరకు లాండ్రోమాట్ వ్యాపారాన్ని ఎన్నుకుంది. విదేశాల్లో లాండ్రోమాట్ అనేది కస్టమర్లు తమకు తాముగా బట్టలు ఉతుక్కునే స్వీయ-సేవ లాండ్రీ.
నర్స్‌గా పనిచేయడం చాలా ఇష్టం, కానీ "బెడ్‌సైడ్ నర్సింగ్ నిజంగా కష్టం" అని పేర్కొంది. లాండ్రోమాట్ కొనుగోలుకు నిధుల కోసం 2020లో తన ఇంటిని విక్రయించింది. మిగిలిన మొత్తం, వాషింగ్ మెషీన్ల లాంటి పరికరాల కొనుగోలు కోసం లోన్లు తీసుకుంది. అలా ఉద్యోగం చేస్తూనే వ్యాపారాన్ని మొదలు పెట్టి అది లాభదాయకంగా మారడంతో నర్సింగ్‌ను విడిచిపెట్టింది. వ్యాపారం కాస్త పుంజుకోగానే, ఆ ప్లేస్‌ను పురుద్ధరించి, లాండ్రికి సంబంధించిన బట్టల పికప్, డెలివరీతో సహా సేవలను విస్తరించింది. తద్వారా అప్పులు తీరుస్తోంది.
2020 నుండి 2023 వరకు అటు ఉద్యోగం, ఇటు వ్యాపారం రెండింటినీ మేనేజ్ చేస్తూ పూర్తిగా నిబద్ధురాలై పనిచేసింది. ఆకర్షణీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాండ్రోమాట్‌పైనే దృష్టిపెడుతూ స్థిరమైన కస్టమర్‌లు,సిబ్బందితో దిన దినాభివృద్ధి చెందుతోంది. లాండ్రోమాట్ గత సంవత్సరం (2024లో) దాదాపు రూ. 4.2 కోట్లు ఆర్జించింది. పక్కనే ఉన్న సెలూన్ నుండి దాదాపు రూ. 24.96 లక్షల అద్దె కూడా సంపాదించింది. అంతేకాదు వారానికి ఐదు నుండి ఆరు గంటలు మాత్రమే వ్యాపారం మీద దృష్టిపెడుతుంది. వ్యవస్థాపక ప్రయాణం గురించి సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడం ద్వారా అదనంగా 10 గంటలు గడుపుతుంది. సోషల్ మీడియా ద్వారా మరో రూ.18.30 లక్షలు సంపాదిస్తోంది. తన వ్యాపార వృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు పోతోంది. రెండో లాండ్రోమాట్ సెంటర్ పెట్టడంతోపాటు, రిటైర్‌మెంట్ ప్లాన్స్ కూడా పక్కాగా ఉన్నాయంటోంది కామి.
పరిమిత వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ, ఆమె పాడ్‌కాస్ట్‌లు, పుస్తకాలు, పరిశ్రమ ఈవెంట్‌ల ద్వారాతన నైపణ్యాన్ని మెరుగు పర్చుకుంది. వారాంతాలు, తనకిష్టమైన ప్రయాణాలుకోసం సమయాన్ని కేటాయించే సౌలభ్యాన్ని అందిస్తోంది లాండ్రోమాట్.


