మెల్‌బోర్న్ తనకు అద్భుతమైన స్వాగతం పలికిందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌కు మంచి మిత్రుడని కొనియాడారు. ఈ రోజు గురువారం మెల్‌బోర్న్ మీట్ కార్యక్రమంలో మోదీతో కలిసి ఆస్ట్రేలియా ప్రధాని పాల్గొన్నారు. మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 30 వేల మంది ప్రవాస భారతీయులతో కలసి మెల్‌బోర్న్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.
ఆల్బనీస్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడని మెల్‌బోర్న్ వాసులతో గడపాడనికే ఆస్ట్రేలియా వచ్చానని ప్రధాని అన్నారు. 2014లో తొలిసారి 2023లో రెండోసారి ప్రస్తుతం మూడోసారి ఆస్ట్రేలియా వచ్చానని తెలిపారు. అహ్మాదాబాద్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదని అదే విధంగా మెల్‌బోర్న్ స్టేడియం క్రికెట్‌కు ఐకానిక్‌గా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.
మెల్‌బోర్న్‌ను మినీ ఇండియాగా పిలుస్తారని భారతీయుల పండుగలను ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.ఒక కల పూర్తవగానే మరో కల నిర్ధేశించుకోవాలని ఆస్ట్రేలియాతో పాటు భారత అభివృద్ధితో సైతం భాగస్వామ్యం కావాలని అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు
అంతకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మాట్లాడుతూ.. "ప్రపంచ దేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్పూర్తి మోదీ నాయకత్వంలో భారత్ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది" అని భారత ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడారు. కాగా ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొన్నారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాలలో దాదాపు 18 ముఖ్యమైన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.


