Indian markets
-
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్‌టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్‌ఫ్లై గంధిమతి, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్‌వేస్‌లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్‌పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్‌లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లోకి బీఎస్ఏ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్‌స్టార్ 650 మోడల్‌తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్ఎం టార్క్‌తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్‌ను 1910లో విడుదల చేసింది. -
కరకర @ 50,000 కోట్లు!
కరకరలాడే సేవ్ భుజియా, వేయించిన పల్లీలు, బఠానీలు, మిక్చర్, జంతికలు ఇలా ఒకటేమిటి.. సాంప్రదాయ చిరుతిళ్లను ఇప్పుడు ఐదు, పది రూపాయల ప్యాకెట్లలో భారతీయులు లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. పొటాటో చిప్స్ ఇతరత్రా పాశ్చాత్య స్నాక్స్ హవాకు సాంప్రదాయ, బ్రాండెడ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ గండికొడుతున్నాయి. విదేశీ, దేశీ కంపెనీలు మారుమూల ప్రాంతాల జనాలకు సైతం ఈ ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను అందిస్తూ మార్కెట్‌ను భారీగా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీయంగా సాల్టెడ్ స్నాక్స్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.50,800 కోట్లకు ఎగబాకాయి. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ స్నాక్స్ వాటా క్రమంగా జోరుందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం స్నాక్స్ మార్కెట్లో సాంప్రదాయ రుచుల వాటా 56 శాతానికి చేరుకోవడం దీనికి నిదర్శనం. ఐదు, పది రూపాయల చిన్న ప్యాకెట్ల రూపంలో రకరకాల దేశీ రుచులన్నీ లభించడంతో పాటు విదేశీ స్నాక్స్ రకాలతో పోలిస్తే కొంత ఎక్కువ పరిమాణం కూడా ఉంటుండటం దేశీ స్నాక్స్ జోరుకు ప్రధాన కారణంగా నిలుస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘భారతీయులు ఎక్కువగా సాంప్రదాయ రుచులనే ఇష్టపడతారు. ఇప్పుడిది స్నాక్స్ మార్కెట్లో కూడా ప్రతిబింబిస్తోంది’ అని బికనీర్‌వాలా ఫుడ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సురేశ్ గోయెల్ పేర్కొన్నారు. ఈసంస్థ దేశవ్యాప్తంగా సాంప్రదాయ రెస్టారెంట్ల నిర్వహణతో పాటు బికానో బ్రాండ్‌తో స్నాక్స్ ప్యాకెట్లను కూడా విక్రయిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వాటిదే జోరు... మొత్తం దేశీ స్నాక్స్ మార్కెట్లో బంగాళదుంప చిప్స్, కుర్కురే, ఫింగర్ స్టిక్స్ వంటి పాశ్చాత్య స్నాక్స్ వాటా రెండు దశాబ్దాల క్రితం మూడింట రెండొంతుల మేర ఉండేది. దీన్ని కూడా పెప్సీ ఫ్రిటో లేస్, ఐటీసీ ఫుడ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలే శాసిస్తూ వచ్చాయి. ‘గతంలో బడా కంపెనీలు విక్రయించే పాశ్చాత్య స్నాక్స్ ఇంటింటా తిష్ట వేశాయి. ఇప్పుడీ ట్రెండ్ రివర్స్ అవుతోంది. సాంప్రదాయ స్నాక్స్ తయారీదారులు తమ పంపిణీ వ్యవస్థను విస్తరించుకోవడం ద్వారా పల్లెటూర్లకు కూడా చొచ్చుకుపోతున్నాయి’ అని గోయెల్ చెప్పారు. కొత కొన్నేళ్లుగా సాంప్రదాయ స్నాక్స్ విభాగం భారీగా అమ్మకాలను కొల్లగొడుతోంది. ఇక మార్కెట్ వాటా విషయానికొస్తే, సాల్టెడ్ స్నాక్స్‌లో హల్దీరామ్స్, పెప్సీ, బాలాజీ, ఐటీసీ, బికాజీ వంటి పెద్ద కంపెనీలకు 60 శాతం మార్కెట్ వాటా ఉండగా.. మిగతా 40 శాతాన్ని చిన్నాచితకా కంపెనీలు, ప్రాంతీయ సంస్థల చేతిలో ఉండటం విశేషం. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎక్కువ గ్రాములను అందిస్తుండటం, మరిన్ని స్థానిక రుచులతో ఉత్పత్తులను ప్రవేశపెడుతుండటం వాటికి కలిసొస్తోంది. ‘ఇప్పటికే పాతుకుపోయిన కంపెనీలు సాంప్రదాయ స్నాక్స్‌లో జోరు పెంచుతుండగా.. ప్రాంతీయంగా పేరొందిన కంపెనీలు సైతం క్రమంగా జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాయి’ అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ కృష్ణారావు బుద్ధ చెబుతున్నారు. ఇలా అందరూ స్థానిక సాంప్రదాయ రుచులను అందించేందుకు పోటీపడుతుండటంతో వాటి అమ్మకాలు కూడా పెరిగేందుకు దోహదం చేస్తోందని, దీంతో అన్‌బ్రాండెడ్ సంస్థల నుంచి మార్కెట్ క్రమంగా సంస్థాగత కంపెనీల చేతికి వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.హల్దీరామ్స్ హవా...ప్రస్తుతం దేశంలో ఏ మారుమూలకెళ్లినా హల్దీరామ్స్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! మిక్చర్ పొట్లం, పల్లీల ప్యాకెట్ నుంచి రకరకాల ఉత్తరాది, దక్షిణాది రుచులతో సాంప్రదాయ స్నాక్స్‌కు పర్యాయపదంగా మారిపోయింది ఇది. హల్దీరామ్స్ దాదాపు 25% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2023–24లో కంపెనీ విక్రయాలు 18% ఎగసి రూ.12,161 కోట్లకు చేరాయి. పెప్సికో స్నాక్స్ అమ్మకాలు 14% పెరిగి రూ. 7,336 కోట్లుగా నమోదయ్యాయి. గుజరాత్‌కు చెందిన బాలాజీ వేఫర్స్ సేల్స్ 12% వృద్ధితో రూ.5,931 కోట్లకు దూసుకెళ్లడం విశేషం. భారతీయ స్నాక్స్ మార్కెట్ జోరుతో విదేశీ కంపెనీల ఇక్కడ ఫోకస్ పెంచాయి. హల్దీరామ్స్ను చేజిక్కించుకోవడానికి అమెరికా ప్రైవేటు ఈక్విటీ (పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్ రంగంలోకి దిగినట్లు టాక్. 51% మెజారిటీ వాటా కోసం బ్లాక్‌స్టోన్ రూ. 40,000 కోట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం. హల్దీరామ్స్ విలువను రూ.70,000–78,000 కోట్లుగా లెక్కగట్టినట్లు తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెర్సిడెస్ ఈవీ @ 66 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్‌లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. -
60 లక్షల ప్యాసింజర్ వాహనాలు
ముంబై: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వెహికిల్స్ మార్కెట్ 6 శాతం వార్షిక వృద్ధితో 2029–30 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. ఆ సమయానికి 18–20 శాతం వాటా చేజిక్కించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం సంప్రదాయ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ విభాగంలో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. కఠినమైన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ–3) నిబంధనలు 2027 నుండి ప్రారంభం కానుండడంతో ఈవీలు, సీఎన్జీ వాహనాల వాటా పెరుగుతుంది. మరోవైపు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల ధరలు అధికం అవుతాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 2029–30 నాటికి ఈవీల వాటా 20 శాతం, సీఎన్జీ విభాగం 25 శాతం వాటా కైవసం చేసుకుంటాయని అంచనాగా చెప్పారు. కొన్నేళ్లుగా కొత్త ట్రెండ్.. వినియోగదార్లకు ఖర్చు చేయతగిన ఆదాయం పెరగడం, తక్కువ కాలంలో వాహనాన్ని మార్చడం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని శైలేష్ చంద్ర అన్నారు. పైస్థాయి మోడల్‌కు మళ్లడం, అదనపు కార్లను కొనుగోలు చేసేవారి వాటా పెరుగుతోందని చెప్పారు. కొన్నేళ్లుగా ఇది ట్రెండ్‌గా ఉందని అన్నారు. నూతనంగా కారు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గుతోందని వివరించారు. ఎస్‌యూవీల కోసం ప్రాధాన్యత పెరుగుతోంది. పెద్ద ఎత్తున కొత్త మోడళ్ల రాకతో ఈ సెగ్మెంట్ వాటా ఎక్కువ కానుందని శైలేష్ తెలిపారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్లకయ్యే ఖర్చుతో ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీ ఫీచర్లు, అప్గ్రేడ్లు కొన్నేళ్లుగా ట్రెండ్‌గా ఉన్నాయని, ఇది సహజమైన పురోగతి అని ఆయన అన్నారు. అత్యంత విఘాతం..సీఏఎఫ్ఈ–3 కఠిన నిబంధనలు రాబోయే ఐదారు సంవత్సరాలలో పరిశ్రమకు అత్యంత విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. సీఏఎఫ్ఈ–3 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ఇదే జరిగితే బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 2023–24లో దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో కంపెనీకి 13.9 శాతం వాటా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఏడు మోడళ్లతో 53 శాతం మార్కెట్లో పోటీపడుతోందని వివరించారు. కొత్త మోడళ్లతో పోటీపడే మార్కెట్‌ను పెంచుకుంటామని వెల్లడించారు. కర్వ్, సియెర్రా మోడళ్లను రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త మోడళ్ల కోసం ఆదాయంలో 6–8 శాతం వెచ్చిస్తామని వెల్లడించారు. అయిదారేళ్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపారం కోసం రూ.16–18 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. -
భారత్‌లో యాపిల్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం. అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్ డాలర్లకు వచ్చి చేరాయి. -
శామ్సంగ్ కొత్త ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శామ్సంగ్ భారత్‌లో గెలాక్సీ సిరీస్‌లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది. ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్ చేస్తాయని శామ్సంగ్ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. -
రెండు దశాబ్దాల్లో 30 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత మార్కెట్ నుంచి గత రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సోర్సింగ్ విభాగం) ఆండ్రియా ఆల్బ్రైట్ తెలిపారు. ఇప్పుడు 2027 నాటికల్లా ఏటా 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు. వాల్‌మార్ట్ గత 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వాల్‌మార్ట్ గ్రోత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న భారత్‌లాంటి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమనేది దిగ్గజ సరఫరాదారులతో తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, అలాగే దీర్ఘకాలికంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థ కోసం కొత్త సంస్థలతో సంబంధాలను ఏర్పర్చుకునేందుకు తోడ్పడగలదని ఆల్బ్రైట్ చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల ఆధునీకరణ, విస్తరణలో తోడ్పడేందుకు ఉద్దేశించిన వాల్‌మార్ట్ వృద్ధి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50 వేల మందికి కంపెనీ శిక్షణనిచి్చనట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని గ్రోత్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ తెలిపారు. హీరో ఎకోటెక్ తయారు చేసే క్రూయిజర్ సైకిళ్లు, మిసెస్ బెక్టర్స్ ఉత్పత్తులు, వెల్స్పన్ టవళ్లు మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
టాటా పంచ్ ఈవీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.10.99 లక్షలతో మొదలై రూ.14.49 లక్షల వరకు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో చేరుకుంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 25 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 190 ఎన్ఎం టార్క్‌తో 120 బీహెచ్పీ, అలాగే 114 ఎన్ఎం టార్క్‌తో 80 బీహెచ్పీ వర్షన్స్‌లో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్సీ, ఈఎస్పీ, క్రూజ్ కంట్రోల్, 360 లీటర్ల బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వ్యారంటీ ఉంది. డెలివరీలు జనవరి 22 నుంచి ప్రారంభం. -
2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ..
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం. జనవరి నాటికి నిర్ణయం.. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి. ఇదే క్రమంలో తక్కువ టారిఫ్‌లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్‌లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది. భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్‌లను, అందులో 10%కి, అంటే 10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్‌లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
భారత్‌కు థామ్సన్ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న థామ్సన్.. భారత ల్యాప్టాప్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రారంభ, మధ్య, ప్రీమియం విభాగాల్లో 2024 మార్చి నాటికి ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యూఎస్, ఫ్రాన్స్, యూరప్‌లో వీటిని విక్రయిస్తోంది. అలాగే భారత్‌లో తయారైన స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో థామ్సన్ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ రూ.300 కోట్లతో అత్యాధునిక ప్లాంటును ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ వద్ద స్థాపిస్తోంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే టీవీల తయారీలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ వార్షిక సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుంది. 15 ఏళ్ల విరామం తర్వాత 2018లో సూపర్ ప్లా్రస్టానిక్స్ భాగస్వామ్యంతో థామ్సన్ భారత్‌లో రీఎంట్రీ ఇచి్చంది. స్మార్ట్ టీవీలతోపాటు వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కండీషనర్స్, చిన్న ఉపకరణాలను భారత్‌లో విక్రయిస్తోంది. టాప్–5లో భారత్.. అంతర్జాతీయంగా భారత్‌ను టాప్–5లో నిలబెట్టాలని లక్ష్యంగా చేసుకున్నట్టు థామ్సన్‌ను ప్రమోట్ చేస్తున్న యూఎస్‌కు చెందిన ఎస్టాబ్లి‹Ù్డ ఇంక్ సేల్స్ డైరెక్టర్ సెబాస్టియన్ క్రాంబెజ్ తెలిపారు. ‘భారత్‌లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యూరప్‌లోని భాగస్వాములను ప్రోత్సహిస్తాం. వారు డబ్బులు ఆదా చేయడంతోపాటు ఇక్కడి ఉత్పత్తులు పోటీ ధరలో లభిస్తాయి. నాణ్యత కూడా బాగుంది. వారు భారత్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశాలు టీవీలకు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించారు. సూపర్ ప్లా్రస్టానిక్స్‌కు భారత్‌లో కొడాక్, బ్లాపంక్ట్, వైట్ వెస్టింగ్‌హౌజ్ టీవీ, వైట్ వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల హక్కులు సైతం ఉన్నాయి. -
షాకిస్తున్న బంగారం ధర: కొనగలమా? నవంబరు నాటికి..!
Today Gold and Silver prices రికార్డు స్థాయి నుంచి కిందికి దిగివచ్చినట్టే వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న పండుగల సీజన్లో బంగారానికి డిమాండ్ పెరనున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో వెండి బంగారం మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 55,000కి చేరుకున్నాయి .అలాగే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60వేల దిశగా కదులుతోంది.(జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 54,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220పెరిగి రూ. 59,890 వద్ద ఉంది. అటే వెండి కూడా లాభాల్లోనే ఉంది. రూ. 700రూపాయలు ఎగిసి కిలోవెండి ధర రూ. 78,200 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ ఉండే బ్యాక్-టు-బ్యాక్ పండుగల నేపథ్యంలో సెప్టెంబరు- నవంబర్ త్రైమాసికంలో పసిడి మెరుస్తూనే ఉంటుందని,ఈ నవంబర్ 2023 చివరి నాటికి 62 వేలకు దాటవచ్చనేది అంచనా. యూఎస్ ఆర్థిక డేటా , డాలర్ , ముడి చమురు ధరలలో పెరుగుదలో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఔన్సు 2,090డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ముగిసింది. ఏది ఏమైనా బంగారం ధరలు యూఎస్ ఫెడ్ ధోరణి, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కరెన్సీ డాలరు కదలికల ఆధారంగా మారుతూ ఉంటాయి అనేది గమనార్హం. (భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు) -
హోండా ఎలివేట్ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ ప్రవేశపెట్టింది. ఎలివేట్‌కు భారత్ తొలి మార్కెట్ కాగా, ఈ మోడల్ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్‌యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్‌తో 6–స్పీడ్ మాన్యువల్, 7–స్పీడ్ సీవీటీ ట్రిమ్స్‌లో 1.5 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. లీటరుకు మైలేజీ మాన్యువల్ ట్రిమ్ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, లేన్ వాచ్ కెమెరా, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్డీ ఫుల్ కలర్ టీఎఫ్టీ మీటర్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో, డ్రైవ్ వ్యూ రికార్డింగ్ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు పోటీనిస్తుంది. అయిదు ఎస్‌యూవీలు: భారత్‌లో 2030 నాటికి అయిదు ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్‌ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్‌లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. -
కవాసాకి కొత్త బైక్ వచ్చేసింది: ధర వింటే షాకవుతారు!
2024 Kawasaki Z900RS: కవాసాకి ఇండియా Z900RS 2024 బైక్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. జెడ్ 900ఆర్ఎస్ 2024 మోడల్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్ పెయింట్ థీమ్‌లో లభిస్తుంది. 2024 మోడల్ బైక్లోదాదాపు పాత ఫీచర్లనే అందించింది.ముందు భాగంలో రౌండ్ హెడ్‌లైట్, ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సాడిల్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్,, రెండు చివర్లలో స్పోక్-స్టైల్ కాస్ట్ వీల్స్. 2024 మోడల్బైక్లో ఫుల్-LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ABS, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ , అసిస్ట్ , స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో తీసుకొచ్చింది. హార్డ్‌వేర్‌లో ట్విన్ 300mm ఫ్రంట్ డిస్క్‌లు, సింగిల్ 250mm రియర్ రోటర్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ,రియర్ మోనోషాక్ ఉన్నాయి. ఇంజీన్ 948cc, ఇన్లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటి. సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడిన ఈ మోటార్ గరిష్టంగా 8,500rpm వద్ద 107bhp , 6,500rpm వద్ద 95Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఇంజన్ సరికొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.భారత మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 ,స్పీడ్ ట్విన్ వంటి వాటికి గట్టిపోటి ఇవ్వనుందని మార్కెట్ అంచనాలు. -
కొనుగోలుదారులకు గుడ్ న్యూస్, దిగొస్తున్న పసిడి, వెండి ధరలు
Today August 2nd gold and silver prices: హైదరాబాద్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. శ్రావణ మాసంలో బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈనేపథ్యంలో వరుస సెషన్లలో బంగారం కాస్త నెమ్మదిస్తున్నారు.తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 300 రూపాయలు క్షీణించి రూ. 55,110 గా ఉంది.అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 330 రూపాయలు తగ్గి రూ. 66110గా ఉంది. అటు వెండి ధర కూడా తగ్గింది. కిలోవెండి ధర 700 రూపాయలు పతనమై రూ. 80,300గా ఉంది. ( దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు (ఆగస్టు 2) బంగారం ధరలకోసం క్లిక్ చేయండి) దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 1 కేజీ వెండి ధర ఢిల్లీ- రూ.77,300 చెన్నై- రూ. 80,300 ముంబై - రూ. 77,300 కోల్‌కతా - రూ. 78,000 బెంగళూరు - 76,500 ఎంసీఎక్స్ షాక్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మంగళవారం భారత మార్కెట్లో క్షీణించిన పసిడి ధరలు ఆగస్టు 2, బుధవారం బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 182 లేదా 0.31 శాతం స్వల్ప పెరుగుదను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ అమెరికా డాలర్‌తోపోలిస్తే బుధవారం బంగారంధర పెరిగింది. ట్రెజరీ దిగుబడులు, ఆసియా స్టాక్‌లు ఫిచ్ అమెరికా ట్రిపుల్-ఎ క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో డాలర్ బలహీన పడింది. దీంతో సురక్షితమైన బులియన్‌పై ఆసక్తిని పెంచిందని రాయిటర్స్ నివేదించింది. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 1,946.97 డాలర్లగానూ, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,984కి డాలర్లు చేరుకుంది. -
శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...
Samsung Galaxy Z Fold 5 and Z Flip 5: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్పోన్లను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్‌ను కూడా ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ S9 సిరీస్‌లో మూడు మోడల్స్తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎస్ 9 అల్ట్రా మోడల్స్‌ను లాంచ్ చేసింది. ('ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్‌కు షాకే!) ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన షావోమి, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్ అన్ని డివైస్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. Snapdragon 8 Gen 2 SoC కొత్త కీలు డిజైన్‌తోపాటు Z Flip 5 డిస్ప్లేకి కొన్ని అప్గ్రేడ్లను కూడా చేసింది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ధరలు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్): రూ 99,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,09,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ): రూ 1,54,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,64,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్): రూ 1,84,999 ప్రీ-బుకింగ్ కస్టమర్లు రూ. 23,000 (జెడ్ ఫ్లిప్ 5 కోసం రూ. 20,000) వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. ఇందులో క్యాష్‌బ్యాక్ అప్‌గ్రేడ్ బోనస్‌లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17 లైవ్ సేల్, ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్‌గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్‌లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్‌లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్‌గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్‌ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
ఆడి క్యూ8 ఈ–ట్రాన్ వస్తోంది
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 ఆగస్ట్‌లో ఆవిష్కరిస్తోంది. ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్‌కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్‌లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్‌లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. -
రియల్మీ నార్జో సిరీస్ 5 జీ స్మార్ట్ఫోన్లు: 100ఎంపీ కెమెరా, ధర, ఇతర ఫీచర్లు
సాక్షి, ముంబై: రియల్మీ నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు వచ్చేశాయ్. రియల్మీ నార్జో 60, రియల్మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లతో పాటు అమెజాన్ , రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా జూలై 15 నుంచి అందుబాటులో ఉంటాయి. రియల్మీ నార్జో 60 ప్రొ ప్రారంభ ధర రూ. 23,999, రియల్మీ నార్జో 60 ప్రారంభ ధర రూ.17,999గా ఉంటాయి. రియల్మీ నార్జో 60 రెండు స్టోరేజ్ మోడల్స్‌లో లభ్యం. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, , 128 జీబీ స్టోరేజ్ రూ. 17,999. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉంటుంది. రియల్మీ నార్జో 60 ప్రొ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 23,999 12జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. రియల్మీ నార్జో 60 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.9-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 100 ఎంపీ+ 2ఎంపీ రియల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రియల్మీ నార్జో 60 స్పెసిఫికేషన్స్ 6.43-అంగుళాల AMOLED స్క్రీన్ ,90Hz రిఫ్రెష్ రేట్ 64+2ఎంపీ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీకెమెరా 5,000mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రీ-ఆర్డర్ ఆఫర్: నార్జో 60 5జీ కొనుగోలుపై 1,000 కూపన్ లభ్యం. దీంతోపాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి నార్జో 60 Pro 5జీ ని కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ. 1,500 తక్షణ తగ్గింపు. -
లెక్సస్ కారు @ రూ.2.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ లెక్సస్.. తాజాగా భారత్‌లో కొత్త ఎల్సీ 500హెచ్ మోడల్‌ను పరిచయం చేసింది. నాలుగు సీట్లు ఉన్న ఈ లగ్జరీ కూపే ధర రూ.2.39 కోట్లు. గ్లాస్ బ్లాక్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషీన్డ్ టెక్స్చర్తో అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, 3.5 లీటర్, 6 సిలిండర్, మల్టీ స్టేజ్ హైబ్రిడ్, లీటరుకు 12.3 కిలోమీటర్ల మైలేజీ, 264 కిలోవాట్ పవర్ ఏర్పాటు ఉంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇదీ చదవండి: ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకన్లలోనే చేరుకుంటుంది. పనోరమిక్ వ్యూ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 10 ఎయిర్‌బ్యాగ్స్, కార్బన్ ఫైబర్ రీ–ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ రూఫ్, డైనమిక్ హ్యాండ్లింగ్ సిస్టమ్, వేరియేబుల్ గేర్ రేషియో స్టీరింగ్, డ్రైవ్ స్టార్ట్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, ఈబీడీతో ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. భారత్‌లో హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో లెక్సస్ షోరూంలు ఉన్నాయి. (వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో) లగ్జరీ కార్లు, స్మార్ట్ఫోన్లు, ఈవీల పై తాజా సమాచారం కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఎంజీ చిన్న ఈవీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ భారత్‌లో అడుగుపెడుతోంది. ఏప్రిల్ 26న కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. బుకింగ్స్ సైతం అదే రోజు మొదలు కానున్నాయి. ధర రూ.10–12 లక్షల మధ్య ఉంటుంది. ఇండోనేషియాలో ఎంజీ విక్రయిస్తున్న వ్యూలింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించనుంది. రెండు డోర్లతో తయారైంది. నలుగురు కూర్చునే వీలుంది. పొడవు సుమారు 3 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, ఎత్తు 1.63 మీటర్లు ఉంటుంది. 20 కిలోవాట్ అవర్ బ్యాటరీ, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 2–స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కమాండ్స్ వంటి హంగులు ఉన్నాయి. కామెట్ ఈవీని భారత్‌లో తయారు చేసేందుకు ఎంజీ కసరత్తు ప్రారంభించింది. బావొజున్ యెప్ ఎస్యూవీ 2025లో దేశీయ మార్కెట్లో రంగ ప్రవేశం చేయనుంది. -
ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ ప్రొడక్షన్ షురూ, లాంచింగ్ సూన్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్’ ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్‌లోని తన హలోల్ ప్లాంట్ నుండి తొలి ఈవీని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్‌పై నిర్మించిన 'హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ'తో రానుంది. తమ కాంపాక్ట్ కామెట్ దేశీయ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ భావిస్తోంది ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్స్‌తో అర్బన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్ స్మార్ట్ ఈవీ కామెట్‌ను లాంచ్ చేయనున్నామని మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వెల్లడించారు.ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా GSEV ప్లాట్‌ఫారమ్‌ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. కాగా లాంచింగ్‌కుముందు కంపెనీ విడుదల టీజర్ ప్రకారం డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్‌తో పాటు డాష్‌బోర్డ్, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్ రెండు-స్పోక్ డిజైన్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్లో బాక్సీ డిజైన్ ఎల్ఈడీహెడ్లైట్లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లుగాఉండనున్నాయి. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగానూ, అలాగే టియాగో ఈవీ, CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుందని అంచనా. -
ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్లో
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజి మోటార్ ఇండియా త్వరలోనే నగరాల్లో రోజువారీ ప్రయాణాలకనుగుణంగా ఉండేలా ఒక స్మార్ట్ కారును తీసుకొస్తోంది. ‘కామెట్’ పేరుతో స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న Wuling Air EV ఆధారంగా తన 'కామెట్'ని తీసుకొస్తోందని సమాచారం. కేవలం 2,900mm పొడవుతో, కామెట్ Tiago EV , CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుంది. (ఇదీ చదవండి: నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!) ఒక్క ఛార్జ్‌తో 150-200 కిలోమీటర్ల రేంజ్‌తో కామెట్ వస్తోంది. ఇది 25 kWh బాటరీ, 50kW మోటారుతో అందుబాటులోకి రానుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బాటరీ మెరుగైన బాటరీ లైఫ్, పెర్ఫార్మన్స్తో అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో వాహన దారులకు అలరించనుంది. డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్ , ఇతర కనెక్టెడ్ ఫీచర్స్ తో ప్రీమియం వాహనాలకు ఏమాత్రం తగ్గకుండా కామెట్ మార్కెట్లోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 10 లక్షలోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పార్కింగ్ స్థలాల లేమి, కాలుష్యం మధ్య ఎంజీ కామెట్ వేగవంతమైన, సరసమైన, భవిష్యత్తు పరిష్కారమని కంపెనీ పేర్కొంది. -
దేశీ మార్కెట్లో మరింత వృద్ధిపై లంబోర్గిని దృష్టి
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సూపర్‌స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గిని చైర్మన్ స్టెఫాన్ వింకెల్మాన్ తెలిపారు. ముందుగా హైబ్రిడ్ వాహనాలు.. ఆ తర్వాత పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఇందుకు దోహదపడగలవని ఆయన చెప్పారు. భౌగోళికరాజకీయ పరిస్థితులతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమకు అవసరమయ్యే విడిభాగాలు మొదలైన వాటిని ఇతరత్రా మరిన్ని దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వింకెల్మాన్ చెప్పారు. దీనితో భారతీయ విడిభాగాల సరఫరా సంస్థలకు కూడా వ్యాపార అవకాశాలు లభించగలవని ఆయన తెలిపారు. భారత్‌లో భారీగా పన్నులు, మౌలికసదుపాయాలపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ.. వృద్ధికి కూడా అవకాశాలు బాగానే ఉన్నాయని వింకెల్మన్ చెప్పారు. అయితే, వృద్ధి ఎంత స్థాయిలో ఉండొచ్చనేది చెప్పలేనని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు 2021లో కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం 2023లో తొలి హైబ్రిడ్ మోడల్‌ను (విద్యుత్, ఇంధనంతో నడిచేది) ప్రవేశపెట్టనుంది. 2024 ఆఖరు నాటికి ప్రస్తుతం తమకున్న మోడల్స్ శ్రేణి మొత్తాన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనుంది. లంబోర్గిని గత ఏడా ది భారత్‌లో 92 వాహనాలు విక్రయించింది. అంతక్రితం ఏడాది 2021లో నమోదైన 69 యూనిట్లతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. -
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్‌లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్‌లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
అతి మూత్ర సమస్యకు చెక్:ఎంఎస్ఎన్ తొలి జనరిక్ మెడిసిన్ లాంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఫెసోబిగ్ పేరుతో ఫెసోటిరోడిన్ ఫ్యూమరేట్‌కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ సమానమైన జనరిక్ వర్షన్‌ను తయారు చేసింది. అతి చురుకైన మూత్రాశయం, మూత్రాన్ని ఆపుకోలేని సమస్యకు ఈ ఔషధం ద్వారా అందుబాటు ధరలో చికిత్స లభిస్తుందని ఎంఎస్ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి తెలిపారు. దేశంలోని స్త్రీ, పురుషుల్లో ఈ సమస్య విస్తృతంగా ఉందని వివరించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన 80 శాతం మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందట. భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆపుకొనలేని సమస్యతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అవగాహన లేకపోవడంతో వృద్ధాప్యంలో ఇది మామూలే అని అనుకుంటున్నారనీ, ఇది వివిధ వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! -
Samsung Galaxy S22 5G: భారీ ఆఫర్, ఇక హోలీనే!
సాక్షి,ముంబై: సౌత్‌కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ అసలు ధర రూ.85,999గ ఉండగా, తాజా ఆఫర్లో అమెజాన్‌లో కేవలం రూ.57,998 కి కొనుగోలు చేయవచ్చు. రూ.28వేల తగ్గింపుతోపాటు, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది లాంచ్ చేసిన ఎస్ 22 సిరీస్‌లో ఇదే ఎఫర్డ్బుల్ ప్రైస్ డివైస్‌గా పేరొందింది. గెలాక్సీ ఎస్ 22 5జీ ఫీచర్లు 6.1 అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లే 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 8 Gen 1 octa-core ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 50+12+10 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3700 mAh బ్యాటరీ -
2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు నెక్ట్స్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్‌తో లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల ప్రకారం కొత్త డిజైన్, కొత్త అప్డేట్స్తో 2024 మారుతి సుజుకి డిజైర్‌ను లాంచ్ చేయనుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ చేయనున్న బ్రాండ్ లైనప్‌లో డిజైర్ మొదటి కాంపాక్ట్ సెడాన్ కానుంది. 2024 ప్రథమార్థంలో భారత మార్కెట్లో కొత్త డిజైర్‌ను విడుదల చేయాలని భావిస్తోంది కంపెనీ. రానున్న న్యూజెన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ఉంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టిపోటీగా మార్కట్లోకి ప్రవేశించనుంది. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ లీటరుకు 35కి.మీకంటే ఎక్కువ ఇంధన సామర్థ్యంతో దేశంలో అతి తక్కువ ఖరీదుతో బలమైన-హైబ్రిడ్ వాహనం డిజైర్ కానుందని అంచనా. మూడు ఇంజీన్ వేరియంట్లు 2024 డిజైర్ మూడు ఇంజన్ ఎంపికలతో లాంచ్ కానుంది. 1.2L NA పెట్రోల్ ఇంజీన్, 1.2L స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజీన్ , 1.2 లీటర్ల సీఎన్జీ (Z12E)ఇంజీన్ ఉన్నాయి. ఫీచర్లు ఎక్స్టీరియర్గా పునర్నిర్మించిన ఫ్రంట్ ఫాసియాతో పాటు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, భారీ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, మెషిన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే సౌకర్యవంతమైన క్యాబిన్, బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ కూల్డ్ స్టోరేజ్ కన్సోల్ ప్రధానంగా ఉండనున్నాయి.మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సరికొత్త సుజుకి కనెక్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపర్చనుంది. మారుతి అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి రానున్న ఈ కారు ప్రస్తుత మోడల్ పోలిస్తే రూ. 80వేలు లేదా రూ. 1 లక్ష ఎఎక్కువ ధరనిర్ణయించవచ్చని భావిస్తున్నారు. మారుతి డిజైర్ బేస్ మోడల్ ధర రూ. 6.44 లక్షలు -
ఏటా ఒక కొత్త హోండా కారు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా భారత మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించి ఏటా ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. పెట్రోల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్‌లో రూ.10 లక్షలు, ఆపై ధరలో వీటిని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుమురా తెలిపారు. ‘ప్యాసింజర్ వాహన రంగంలో 40 శాతం వాటా రూ.10 లక్షల పైచిలుకు మోడళ్లదే. ఈ విభాగం వాటా మరింత పెరగనుంది. అమేజ్, సిటీ మోడళ్ల టాప్ ట్రిమ్స్ 60 శాతం పైగా వాటా కైవసం చేసుకున్నాయి. విదేశాల్లో విక్రయిస్తున్న మోడళ్లను సైతం ఇక్కడ ప్రవేశపెడతాం. రూ.260 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా సేల్స్ నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తున్నాం’ అని వివరించారు. వృద్ధిపై దృష్టిపెట్టాం.. : అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత మోడళ్లపై ఫోకస్ చేయాలని నిర్ణయించామని సుమురా చెప్పారు. ‘ఈ ప్రణాళికలో భారత్ కూడా ఉంది. అయితే మౌలిక వసతులనుబట్టి ఒక్కో మార్కెట్ ఒక్కోలా ఉంటుంది. అంతర్జాతీయ పోకడలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లో డీజిల్ మోడళ్లను నిలివేశాం. చిప్ కొరత ప్రభావం ఇప్పటికీ కంపెనీపై ఉంది. రాజస్థాన్ ప్లాంటులో ఏటా 1.3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. కొత్త మోడళ్ల రాకతో ప్లాంటు వినియోగం పెరుగుతుంది. ప్లాంటు పూర్తి సామర్థ్యం ఏటా 1.8 లక్షల యూనిట్లు. దీనిని 2.2 లక్షల యూనిట్లకు విస్తరించవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలతో రెండేళ్లుగా భారత్‌లో లాభాలు గడిస్తున్నాం. ఈ ఏడాది రానున్న ఎస్‌యూవీతో అమ్మకాలు అధికం అవుతాయి’ అని తెలిపారు. కొత్త వెర్షన్స్‌లో సిటీ.. సిటీ కొత్త వెర్షన్స్‌ను కంపెనీ గురువారం ప్రవేశపెట్టింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇది తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం. మైలేజీ వర్షన్నుబట్టి లీటరుకు 17.8–18.4 కిలోమీటర్లు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్ (ఈహెచ్ఈవీ) ధర రూ.18.89 లక్షల నుంచి మొదలు. మైలేజీ లీటరుకు 27.13 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో సిటీ అమ్మకాల్లో 15 శాతం వాటా ఈహెచ్ఈవీ నుంచి ఉంటుందని హోండా భావిస్తోంది. -
సూపర్ ఫీచర్లతో హెచ్‌పీ పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్‌ట్యాప్: షాకింగ్ ప్రైస్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ,Nvidia GeForce RTX 4080 ను జోడించింది. హెచ్‌పీ ఒమన్ ధర రూ.2,69,990గా నిర్ణయించింది. ఇండియాలో ఒమెన్ ప్లేగ్రౌండ్ స్టోర్స్, HP వరల్డ్ స్టోర్స్ , HP ఆన్లైన్ స్టోర్ వంటి వివిధ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో ఒమెన్ 17 ఒమెన్ గేమింగ్ హబ్‌గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌టాప్ హెచ్‌పీ ఒమెన్ 17 ఫీచర్లు 17.3-అంగుళాల IPS డిస్ప్లే క్వాడ్ HD (2560 × 1440 పిక్సెల్‌లు) రిజల్యూషన్ 24 కోర్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ప్యానెల్ 240Hz రిఫ్రెష్ రేట్ 32 జీబీ DDR5 ర్యామ్, 1TB PCIe NVMe SSD నిల్వ Nvidia RTX 4080 ల్యాప్‌టాప్ GPUతో వస్తుంది. ఇంకా ఒమెన్ 17 బ్యాంగ్ & ఒలుఫ్సెన్ డ్యూయల్ స్పీకర్స్, 720p HD వెబ్‌క్యామ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్రోఫోన్ల Wi-Fi 6E కనెక్టివిటీ, థండర్‌బోల్ట్ 4 టైప్-C పోర్ట్, మూడు USB టైప్-A పోర్ట్స్, HDMI పోర్ట్, మినీ డిస్ప్లే పోర్ట్, RJ-45 పోర్ట్ , RTX 40 సిరీస్ ల్యాప్‌టాప్ 330W ఛార్జింగ్‌కు మద్దతుతో 83 Wh Li-ion పాలిమర్ బ్యాటరీ మొదలైనవి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
టెక్నో పాప్ 7ప్రో: ఫీచర్లు అదుర్స్! ధర మాత్రం రూ. 7వేల లోపే
సాక్షి,ముంబై: టెక్నో మొబైల్ సంస్థ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. టెక్నో పాప్ 7ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వరుసలో పాప్ 6 ప్రో తరువాత ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.56 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేతో టెక్నో పాప్ 7 ప్రో, ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ప్రత్యేక ఫీచర్లు నిలుస్తున్నాయి. రెండు కలర్ వేరియంట్లు, రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. టెక్నో పాప్ 7ప్రో ఫీచర్లు 6.56 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే క్వాడ్-కోర్ MediaTek Helio A22 SoC ఆండ్రాయిడ్ 12-ఆధారిత HiOS 11.0 12మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా 5 000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ధర,లభ్యత 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ధర 6,799, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 7,299 ఫిబ్రవరి 22 నుండి అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. -
మహీంద్ర ఎక్స్‌యూవీ400 ధర ఎంతంటే? తొలి 5వేల బుకింగ్‌లకే!
సాక్షి,ముంబై: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 400 భారత మార్కెట్లోకి వచ్చేసింది. మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎక్స్యూవీగా చెబుతున్న ఈ కారును గత ఏడాది సెప్టెంబర్ (2022)లో అధికారికంగా లాంచ్ చేయగా ధరలను మాత్రం తాజాగా ప్రకటించింది. ధరలు మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ధరలు రూ. 15.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఒక వేరియంట్ ధర 16.49 లక్షలు. టాప్ లైన్ XUV400 EL వేరియంట్ ధర రూ. 18.99 లక్షలు. అయితే ఇవి ప్రారంభ ఆఫర్ ధరలనీ, మొదటి 5,000 బుకింగ్‌లకు మాత్రమే ఈ రేట్లు చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ కంపెనీ డీలర్‌షిప్‌లలోకి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ జనవరి 26న ప్రారంభం. ఎక్స్యువీ 400 ఈఎల్ డెలివరీలు మార్చి 2023 నుంచి ప్రారంభమైతే, దీపావళి సీజన్లో ఎక్స్యువీ 400 ఈసీ డెలివరీలు ప్రారంభంకానున్నాయి. మొదటి దశలో 34 నగరాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ఎస్యువీ ప్రయాణంలో మరుపురాని క్షణం ఎక్స్యువీ 400 ఆవిష్కరణ అని మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ వీజె నక్రా తెలిపారు. అత్యున్నత పనితీరు, డిజైన్, స్పేస్,టెక్నాలజీని ఆకర్షణీయమైన ధరలో ఎక్స్యువీ 400 అందిస్తుందన్నారు. మహీంద్రా కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV EC, EL అనే రెండు వేరియంట్లలో లభ్యం. EC వేరియంట్లోని 34.5 kWh లిథియం ఇయాన్బ్యాటరీ , 375 కిమీ పరిధిని, EL వేరియంట్ 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను 456 కిమీ పరిధిని అందిస్తుంది. ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, ఇన్ఫినిటీ బ్లూ, నాపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే యొక్క ఐదు రంగుల్లో లభ్యం. అయితే EL వేరియంట్లో ఎగువన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో అందిస్తోంది. -
ఓప్పో 5జీ స్మార్ట్‌ఫోన్ : ధర రూ. 20వేల లోపు
సాక్షి, ముంబై: ఒప్పో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదీ రూ.20వేల లోపు ధరతో ఒప్పో ఏ78 ని తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్లోనే తీసుకొచ్చిన ఒప్పో ఏ78 జనవరి 18నుంచి కొనుగోలుకు లభ్యం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ సందర్భంగా కార్డ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ధర, లభ్యత ఒప్పో ఏ78 5జీ ధర రూ.18,999గా నిర్ణయించిందికంపెనీ. సింగిల్ వేరియంట్లో (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్) గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఒప్పో ఈ-స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో ఏ78 5జీ సేల్ షురూ అవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఎస్బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు గరిష్ఠంగా రూ.1,300 అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఏ78 5జీ పూర్తి స్పెసిఫికేషన్స్ 6.56 ఇంచుల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 (Android 13) బేస్డ్ కలర్ఓఎస్ 13 50+ 2 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ , 33 వాట్స్‌ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
మారుతి లవర్స్‌కు అలర్ట్, కొత్త కారు కొనాలంటే..!
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021, డిసెంబరులో ప్రకటించిన మారుతీ సుజుకి ఇండియా జనవరి 16 నుంచి కార్ల ధరల పెంపు అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.వెల్లడించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది. కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను అప్డేట్ చేయడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెంపు తప్పడలం లేదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో మారుతీ సుజుకీ లవర్స్ కారు కొనాలంటే మరింత ధర పడనుంది. మారుతి ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుండి SUV గ్రాండ్ విటారా వరకు రూ. 3.39 లక్షల నుండి రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య వాహనాను విక్రయిస్తోంది. -
గాడ్జెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్, లెనోవో అద్బుతమైన 5జీ ట్యాబ్ వచ్చేసింది!
సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్‌తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. పీ 11 అనే 5జీ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ధర, లభ్యత 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్‌లో అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల నాన్‌స్టాప్‌గా వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. లెనోవో ట్యాబ్ పీ11 5జీ స్పెసిఫికేషన్స్ క్వాల్కమ్ స్నాప్‌డడ్రాగన్ 750జీ ఎస్ఓసీ ఆడ్రేనో 619 జీపీయూ 11 అంగుళాల 2కే ఐపీఎస్ టచ్‌స్క్రీన్ 7700ఎంఏహెచ్ బ్యాటరీ డివైజ్ స్లాట్ ద్వారా 5జీ సిమ్‌ని ఇన్సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ పీ11 5జీ ట్యాబ్‌లో 8ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్ స్పీకర్లను జోడించింది. -
పండుగ పూట పసిడి ప్రియులకు షాక్, రికార్డు ధర
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచ మాంద్యం భయాల నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దేశీయమార్కెట్లో పసిడి ధర రూ. 56,200 దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1,898 డాలర్లు, వెండి ఔన్స్ 23.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం బంగారం ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందనిహెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. తద్వారా ఆగస్టు 2020లో రూ. 56,191 నమోదైన మునుపటి రికార్డును అధిగమించింది. రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ 10 గ్రాముల ధర రూ.121 పెరిగి రూ.56,236కి చేరుకుంది. ఈ రోజు (జనవరి 13) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 220 ఎగిసి రూ. 56,290 స్థాయికి చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారం రూ.56,290గా ఉంది. కిలో వెండి ధర 74వేల రూపాయలుగా ఉంది. బెంగళూరులో రూ.56,340కి వద్ద ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,250 గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ (మధ్యాహ్నం 3 గంటలకు) 10 గ్రాములు, దాదాపు 0.50 శాతం రూ. 56,140 పలికింది. బలహీనమైన డాలర్, అమెరికాలో ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు నెమ్మదించవచ్చనే అంచనాలు పసిడికి బలాన్నిస్తున్నాయి. డిసెంబర్లో యూఎస్ వినియోగదారుల ధరలు తగ్గడంతో రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్ట వచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
స్టైలిష్ డిజైన్‌తో టార్క్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు టార్క్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ - క్రాటోస్ ఎక్స్‌ని ఆవిష్కరించింది.అలాగే సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఈ-మోటార్‌సైకిల్ క్రా టోస్ ఆర్(kratos R) పేరిట తీసుకొచ్చింది. వేగవంతమైన, మెరుగైన, టోర్కియర్: ది స్పోర్టియర్ క్రాటోస్ ® X అని టార్క్ కంపెనీ ప్రకటించింది. 2023 రెండో త్రైమాసికంలోఈ మోటార్ సైకిల్ బుకింగ్‌లు ప్రారంభం. మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగాన్ని మరింత అందుబాటులోకి ,ఆచరణాత్మకంగా చేయడానికి కట్టుబడి ఉన్నామని TORK మోటార్స్ వ్యవస్థాపకుడు,సీఈఓ కపిల్ షెల్కే తెలిపారు. ఈ రోజు కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయి అని సంతోషం ప్రకటించారు. బెస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీతో స్పోర్టియర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అద్భుతమైన సౌకర్యం, మెరుగైన పనితీరు , మెరుగైన రైడింగ్ అనుభవం కోసం రూపొందించినట్టు తెలిపారు. తమ డైనమిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అత్యుత్తమ పవర్‌ట్రెయిన్, టార్క్‌ను అందిస్తుందనీ, డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్, ఇతర సేఫ్టీ ఫీచర్లు హోస్ట్ రైడింగ్ అనుభవాన్ని మరింత సురక్షితం చేస్తుందని వెల్లడించారు. అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కాగా కంపెనీ ఇటీవల పూణేలో తన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని (COCO మోడల్) ప్రారంభించింది. హైదరాబాద్, సూరత్, పాట్నా నగరాల్లో డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం, పూణే, ముంబై, హైదరాబాద్‌లో డెలివరీ చేస్తోంది. త్వరలో ఇతర మార్కెట్లలో కూడా ప్రారంభించ నుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ బైక్స్‌ను బుక్ చేసుకోవచ్చని టార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రాటోస్ ఆర్‌లో రిఫైన్డ్ లైవ్ డాష్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, మెరుగైన ముందు, వెనుక బ్లింకర్లు లాంటి మార్పులు చేసింది. అలాగే ఈ మోటార్ సైకిల్ జెట్ బ్లాక్, వైట్.రెండు కొత్త వేరియంట్లలో లభిస్తుంది -
అదిరిపోయే కీవే రెట్రో బైక్ ఎస్ఆర్ 250, కేవలం 2 వేలతో
న్యూఢిల్లీ: హంగేరియన్ బ్రాండ్ కీవే ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. SR125 సిరీస్‌లో కీవే ఎస్ఆర్ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. రెట్రో మోడల్ బైక్ ఎస్ఆర్ 250 ప్రారంభ ధరను 1.49 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 2 వేల రూపాయలతో ఆన్లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 223cc ఇంజన్, 7500 rpm వద్ద 15.8 bhp, 6500 rpm వద్ద16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2023 ఏప్రిల్ నుండి SR250 డెలివరీలను ప్రారంభం. ఇండియాలో ఎస్ఆర్ 125కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని AARI మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. ఇది భారతదేశంలో హంగేరియన్ బ్రాండ్ 8వ ఉత్పత్తి. ఈ బ్రాండ్‌ను అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెట్ చేస్తోంది. We are excited to Launch the All-New #SR250 from Keeway. Buckle up to witness a Retro ride with a twist! Priced at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit: https://t.co/TZ4YeuD8Jb or call: 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #Launch #Hungarian pic.twitter.com/TS3Joj6XeH — KeewayIndia (@keeway_india) January 11, 2023 The SR 250 is available in 3 appealing colours! Price starts at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit : https://t.co/TZ4YeuD8Jb or call : 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #SR250 #AutoExpo2023 #AutoExpo #Launch #Hungarian pic.twitter.com/IU6s0KuxJ6 — KeewayIndia (@keeway_india) January 11, 2023 -
ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా
సాక్షి,ముంబై: ఐకూ 11 5జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్షిప్ మొబైల్గా మంగళవారం (జనవరి10) ఆవిష్కరించింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్, 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లేతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదేనని ఐకూ తెలిపింది. రాత్రిపూట 4K వీడియోలను రికార్డ్ చేసేలా వివో V2 ఇమేజింగ్ చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎనిమిది నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. Ready your wishlist, because the #iQOO11 with India’s First 2K E6 AMOLED Display at just ₹51,999*. Sale starts 13th Jan, 12PM exclusively on https://t.co/ZK4Krrdztq & @amazonIN. 24 Hours Early Access* for Prime Members. *T&C Apply#MonsterInside #AmazonSpecials #iQOO11Launch pic.twitter.com/8iGVM3hDBE — iQOO India (@IqooInd) January 10, 2023 p> ఐకూ 11 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 ఇంచుల 2K ఈ6 అమోలెడ్ డిస్ప్లే హెచ్డీఆర్10+, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ 50+8 +13 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఐకూ 11 5జీ ధరలు, తొలిసేల్ ఐకూ 11 5జీ బేస్ మోడల్, 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. టాప్ వేరియంట్, 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.64,999గా ఉంది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం. ఆల్ఫా, లెజెండ్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం. ఆఫర్లు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ 11 5జీని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, 3 వేల రూపాయల దాకా స్పెషల్ ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
రియల్మీ10 వచ్చేసింది.. 5జీ సపోర్ట్ ఉందా? లేదా?
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ కొత్త స్మార్ట్షోన్ను తీసుకొచ్చింది. రియల్మీ 10 పేరుతో తన ఫ్లాగ్షిప్ మొబైల్‌ను భారత మార్కెట్లో సోమవారం లాంచ్ చేసింది. అయితే దేశీయంగా 5జీ వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ 5జీకి సపోర్ట్ ఇవ్వకపోవడం రియల్మీ ఫ్యాన్స్‌ను నిరాశ పర్చింది. రియల్మీ 10 స్పెసిఫికేషన్లు 6.5అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 13 OS, MediaTek Helio G99 SoC 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ ఏఐ, 2 ఎంపీ బ్లాక్&వైట్ పొట్రయిట్ రియర్ డ్యుయల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ ఫస్ట్ సేల్, ఆఫర్, ధర ఈ స్మార్ట్‌ఫోన్ క్లాష్ వైట్ రష్ బ్లాక్ అనే రెండు రంగులలో లభ్యం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 13,999, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంటుంది. తొలి సేల్, జనవరి 15నుంచి రియల్ మీ, ఫ్లిప్‌కార్ట్ ఇతర ఆన్లైన్ స్టోర్లలో లభ్యం. రియల్మీ, ఫ్లిప్‌కార్ట్‌లో ICICI డెబిట్, క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. -
బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఎం04: ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం04 పేరుతో 'M' సిరీస్‌లో బడ్జెట్ ధరలో దీన్ని తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ మొబైల్గా 10 వేల రూపాయల లోపు ధరలో అందిస్తోంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తోపాటు, 64జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్(1 టీబీవరకువిస్తరించుకునే అవకాశం) కూడా శాంసంగ్ ప్రకటించింది. (లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!) శాంసంగ్ గెలాక్సీ ఎం04 ఫీచర్లు 6.5ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ హీలియో పీ35 సాక్,ఆండ్రాయిడ్ 12 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ డ్యుయల్ రియర్ కెమెరా: 13 ఎంపీ ప్రైమరీ, 2 ఎంపీ సెన్సార్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర, లభ్యత మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్‌లో లభ్యంకానున్న శాంసంగ్ గెలాక్సీ ఎం04 ధర రూ. 8,499గా ఉంది. సేల్ ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, శాంసంగ్ ఇండియా ద్వారా ప్రారంభమవుతుంది. (రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్‌పాట్!ఎలా?) -
లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: జర్మన్‌కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి) బవేరియన్ కార్‌మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్‌తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇంజీన్, ఫీచర్లు ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్పీ పవర్‌ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్‌లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మాసివ్ ఎస్‌యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్లైట్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్‌ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్‌లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌గా హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్‌ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: రియల్మీ 10 ప్రో 5జీ సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. రియల్మీ 10 ప్రో 5జీ రెండు వేరియంట్లలో,డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్, నెబ్యూలా బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది. రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ కూడా మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు 6.72 ఫుల్హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 680నిట్స్ పీక్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 108+2 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జింగ్ ధరలు, ఆఫర్ రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ 14 నుంచి డిసెంబరు నుంచి ఫస్ట్ సేల్ షురూ అవుతుంది. కాగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. రియల్మీ 10 ప్రో 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ రూ.19,999 ధరతో వచ్చింది. డిసెంబరు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యంకానుంది. లభిస్తుంది. రియల్మీ అధికారిక వెబ్సైట్లోనూ ఈ మొబైల్ సేల్కు వస్తుంది. -
సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో భారతదేశంలో పోవా-4 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 13 నుండి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మరియు జియో మార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. క్రయోలైట్ బ్లూ, యురానోలిత్ గ్రే , మాగ్మా ఆరెంజ్ రంగులలో ఇది లభ్యం. (సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?) స్మార్ట్ఫోన్లపై యూజర్ల అంచనాలకు అనుగుణంగా 15 వేల లోపు రేంజ్ 13 జీబీ ర్యామ్‌తో Helio G99 ప్రాసెసర్‌ని ఏకైక స్మార్ట్‌ఫోన్ పోవా-4ని పరిచయం చేయడం సంతోషంగా ఉందని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో అరిజీత్ తలపాత్ర అన్నారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం) టెక్నో పోవా-4 స్పెసిఫికేషన్లు 6.82-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత HiOS 12.0 MediaTek Helio G99 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునే సదుపాయం AI లెన్స్‌తో జతచేసిన 50 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 6000ఎంఏహెచ్ బ్యాటరీ -
సుజుకి కొత్త స్కూటర్, అదిరే ఫీచర్స్, ప్రీమియం లుక్, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బర్గ్‌మన్ స్ట్రీట్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఈఎక్స్ మోడల్‌ను విడుదలచేసింది. లేటెస్ట్ టెక్నాలజీ,నయా ఫీచర్లతో ప్రీమియం లుక్‌లో ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. (వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) ధర: సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ధరను రూ.1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 89,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ. 93,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి అందుబాటులో ఉంది.మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభ్యం. సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ఇంజీన్ ఫీచర్లు ఎఫ్ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-a) ఇంజిన్‌తో 124cc సీసీ మోటార్‌ను అమర్చింది. ఇది 8.6PS గరిష్ట శక్తిని ,10Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ,సైలెంట్ స్టార్టర్ సిస్టమ్ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. వెనుక 12 అంగుళాల వెడల్పైన, పెద్ద టైర్‌ను అమర్చింది. సుజుకీ రైడ్ కనెక్ట్ బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్‌తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ మరో ఫీచర్. ఇది స్మార్ట్‌ఫోన్‌ను సింక్ చేసే సౌలభ్యాన్ని రైడర్‌కు అందిస్తుంది. నావిగేషన్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ అలెర్ట్స్ ఈ బైక్ డిస్ప్లేలో చూడవచ్చు. స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవల్స్ కూడా డిజిటల్ కన్సోల్‌లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలు కూడా ఈ బైక్ డిజిటల్ కన్సోల్‌లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లను ఈ స్కూటర్ కన్సోల్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. -
మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే! బ్యాటరీ ధరలూ ప్రియం అవుతున్నాయని, వీటి భారం కస్టమర్లపై ఇంకా వేయలేదని కంపెనీ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. బ్యాటరీ ధరలు, నూతన నిబంధనలు ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ప్రభా వం చూపుతున్నాయని చెప్పారు. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పరిమిత స్థాయి మించి కాలుష్యం వెదజల్లితే ఈ పరికరం హెచ్చరిస్తుంది. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
వివో వైఓ2, ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే!
సాక్షి, ముంబై: వివో బడ్జెట్ ధరలో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ2 పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించడం విశేషం. ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్, 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో జోడించింది, vivo ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో వైఓ2 ఫీచర్లు 6.51-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1600 పిక్సెల్ రిజల్యూషన్ MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో Android 12 గో ఎడిషన్-ఆధారిత Funtouch OS 12 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ Trendy style and unmatched vibe. Unveiling the new #vivoY02 Buy Now : https://t.co/eDzazkRLla#ItsMyStyle #BuyNow pic.twitter.com/Pziuht03RY — vivo India (@Vivo_India) December 5, 2022 -
టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్: న్యూ లుక్ చూస్తే ఫిదానే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ప్రవేశపెట్టింది. కొత్త కలర్, కొత్త అప్డేట్స్తో స్పెషల్‌గా దీన్ని ఆవిష్కరించింది. కొత్త పెరల్ వైట్ కలర్లో వస్తున్న స్పెషల్ ఎడిషన్ 2023 వెర్షన్ ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇంజీన్, ఫీచర్లు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ పొందుపరిచారు. ఇది 250 ఆర్పీఎం వద్ద 17.39 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్‌లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్‌తో కొత్త పెర్ల్ వైట్ కలర్ కొత్త సీటు నమూనాతో డ్యూయల్-టోన్ సీటు ఎడ్జస్టబుల్ క్లచ్ అండ్, బ్రేక్ లివర్లు అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్మోడ్స్లో లభ్యం. TVS SmartXonnect కనెక్టివిటీ రేర్ రేడియల్ టైర్ గేర్ షిఫ్ట్ సూచిక సిగ్నేచర్ ఆల్-LED హెడ్‌ల్యాంప్ డేటైమ్ రన్నింగ్ లైట్ TVS Apache RTR సిరీస్ బైక్స్ అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ సెంట్రిసిటీలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నాయనీ, కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రేసింగ్ వారసత్వం, అనుభవంతో స్పెషల్ ఎడిషన్‌ని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
గంటకు150 కిలోమీటర్లు, ఫాస్టెస్ట్ ఈ-బైక్ ఇదే! ధర ఎంతంటే?
న్యూఢిల్లీ:ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరను ఎట్టకేలకు కంపెనీ ప్రకటించింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్టాండర్డ్, రీకాన్ ఒరిజినల్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ధరల విషయానికి వస్తే... స్టాండర్డ్ ధర రూ. 3.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలు. రీకాన్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అలాగే పరిమిత ఎడిషన్‌గా 77 యూనిట్లు మాత్రమే తీసుకురానుంది. భారతీయ మార్కెట్లో, కవాసకి నింజా 400, TVS Apache RR 310, BMW G 310 R 300cc బైక్స్‌కు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఆవిష్కరించబడిన మూడు సంవత్సరాల తర్వాత ఈ బైక్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. నవంబర్ 24 ఇండియన్ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 బుకింగ్‌లను స్టార్ట్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 10వేలకు బుకింగ్‌లను సాధించడం ఆసక్తికరంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో ఎయిర్‌స్ట్రైక్, లేజర, షాడో అనే మూడు ఆప్షన్స్‌లో లభ్యం. స్టాండర్డ్ వేరియంట్లో 7.1kWh బ్యాటరీ ప్యాక్, 85Nm శక్తిని అందించే 27kW మోటార్‌ను అందించింది. ఎలక్ట్రిక్ మోటార్ రీకాన్ వేరియంట్ల కోసం 29 kW పవర్, 90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 307 కిలోమీటర్ల వరకు ఈ బైక్‌పై ప్రయాణించవచ్చు. ఫ్యూచరిస్టిక్ స్పోర్ట్స్ బైక్ లుక్‌లో వచ్చిన వీటిల్లో బైక్ మోనోషాక్ ,ఇన్వర్టెడ్ ఫోర్క్ సెటప్ రియర్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను కూడా అందిస్తోంది. ప్రీమియం బైక్‌లో డీఆర్ఎల్ స్ట్రిప్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్ , టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ విషయానికి వస్తే, బైక్‌లు స్మార్ట్ TFT డిస్ప్లేను అందిస్తోంది. -
షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్ కార్లు కొనాలంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మూడు మోడళ్ల ధరలను పెంచుతోంది. వీటిలో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఉన్నాయి. మోడల్‌నుబట్టి ధర 1.8 శాతం అధికం కానుంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) సవరించిన ధరలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఎస్90 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, ఎక్స్‌సీ40 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం తాజా నిర్ణయానికి కారణమని వెల్లడించింది. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ఇదీ చదవండి: ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన -
ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150: ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: బజాజ్ కంపెనీ దేశీయ మర్కెట్లో సరి కొత్త పల్సర్ స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేసింది. యూత్ క్రేజ్‌కు అనుగుణంగా కొత్తగా అప్డేట్ చేసి స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150 బైక్‌ను ఆవిష్కరించింది. రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్, ఎబోనీ బ్లాక్ రెడ్, కరేబియన్ బ్లూ అనే 5 రంగుల్లో ఈబైక్ అందుబాటులోకి వచ్చింది. ధర: సింగిల్-డిస్క్, సింగిల్ సీట్ కలిగిన బైక్ ధర రూ.1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) అలాగే ట్విన్-డిస్క్, స్లిట్ సీట్ మోడల్ ధరను రూ.1,19,757 ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది కంపెనీ. ఇంజీన్, ఫీచర్లు 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 8500 ఆర్పీఎమ్ వదర్ద 14.5 హెచ్‌పీని, 13.5Nm టార్క్‌ను విడుదల చేస్తుంది ఈ బైకులో యూఎస్బీ మొబైల్ చార్జింగ్ పోర్ట్, గేర్ ఇండికేటర్, సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేకింగ్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లను తోపాటు,స్ప్లిట్ గ్రాబ్ రైల్, క్లిప్-ఆన్ బార్లు చ స్ప్లిట్ సీట్ సెటప్ డ్యూయల్-డిస్క్ వెర్షన్‌తో డిజైన్ మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దింది. వెనకాల సీట్ కాస్త హైట్ ఇచ్చి . LED DRLలు , LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ P150 హోండా యునికార్న్, హోండా ఎక్స్-బ్లేడ్ , సుజుకి జిక్సర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
క్రికెట్, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!
సాక్షి, ముంబై: వీయూ టెలివిజన్స్ 43 అంగుళాల సరికొత్త టీవీని ప్రారంభించింది. ముఖ్యంగా అధునాతన క్రికెట్ మోడ్ ,సినిమా మోడ్‌తో ఈ అద్భుతమైన టీవీని లాంచ్ చేసింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ నవంబర్ 27 నుండి మధ్యాహ్నం నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర 29,999గా ఉంచింది. వీయూ గ్లో ఎల్ఈడీ టీవీ ఫీచర్లు ఈ టీవీలో తాజా గూగుల్ టీవీ ఓఎస్‌తోపాటు ఏఐ ప్రాసెసర్‌తో కూడిన గ్లోప్యానెల్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కోర్ GPU, డాల్బీ అట్మోస్ వర్చువలైజేషన్తో వస్తుంది. తమ ఏఐ ప్రాసెసర్ ద్వారా ఓటీటీ కంటెంట్ మరింత మెరుగు పడుతుందనీ, అలాగే అధునాతన క్రికెట్ మోడ్‌తో వినియోగదారులు ప్రత్యక్ష స్టేడియం అనుభవాన్ని, 100 శాతం బాల్ విజిబిలిటీని పొందుతారనీ, డీజీ సబ్ వూఫర్, సొగసైన ఫ్రేమ్‌తో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాల్యూమ్ 100 శాతం పెంచినా కూడా తమ టీవీలోని సౌండ్ వైబ్రేట్ అవ్వదని తెలిపింది. 84వాట్ సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చేలా రెండు స్పీకర్లతో కూడిన ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌ను ఇందులో జోడించింది. కేవలం రెండు నెలల్లో 46675 యూనిట్లను విక్రయించామనీ, 2023లో రెండు లక్షల టీవీలను విక్రయించాలని భావిస్తున్నామని వీయూ టెక్నాలజీస్ సీఈఓ అండ్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. -
సూపర్ ఫీచర్లతో వివో ఎక్స్90 సిరీస్ వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో కొత్త సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. వివో ఎక్స్80 సిరీస్‌కు కొనసాగింపుగా వివో ఎక్స్90 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అద్భుతమైన ఫీచర్స్‌తో, ముఖ్యంగా నాలుగుపవర్ ఫుల్ కెమెరాలతో తీసుకొస్తోంది. వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రొ, వివో ఎక్స్90ప్రొ+ మూడు వేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్ చేయనుంది. త్వరలోనే భారత మార్కెట్లలో కూడా లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రైట్ రెడ్, బ్లాక్ కలర్లో ఇవి లభ్యం కానుంది. చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ వైబోలో ఫోటోలు, ఫీచర్లు లీక్ అయ్యాయి. వివో ఎక్స్90 ఫీచర్లు అంచనాలు 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 క్వాల్‌కాం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్ 50+50+ 64+48 రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్ 4,700mAh బ్యాటరీ ధర: ఈ రోజు (నవంబరు 22) సాయంత్రం లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, 800 డాలర్లు, సుమారు రూ. 65,315 ఉంటుందని అంచనా. -
దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ బైక్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోకి మరో కంపెనీ దూసుకొచ్చింది. తాజాగా మ్యాటర్ ఎనర్జీ (Matter Energy) తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్‌తో మ్యాటర్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. ఫీచర్లు ఈ బైక్‌లో అమర్చిన 10.5 kW ఎలక్ట్రిక్ మోటారు 520 Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్, 5 kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీని జతచేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 125-150 కిమీల పరిధిని అందజేస్తుందని కంపెనీ చెప్పింది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు అని కంపెనీ పేర్కొంది. ఎల్ఈడీ లైట్లు, స్ప్లిట్ సీట్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు , స్ప్లిట్ రియర్ గ్రాబ్ రైల్‌తో స్పోర్టీ స్ట్రీట్ బైక్ డిజైన్‌న్‌తో ఆకట్టుకుంటోంది.. ట్యాంక్ ఏరియాలో 5లీటర్ గ్లోవ్‌బాక్స్ ఉంది, ఇందులోనే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. ఇంకా 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్‌లు , మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లకు కూడా మద్దతు ఇస్తుంది. స్పోర్ట్, ఎకో, సిటీ మోడ్స్‌లో గ్రే అండ్ నియాన్, బ్లూ అండ్ గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్, రెడ్/బ్లాక్/వైట్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. 2023 మొదటి త్రైమాసికంలో బుకింగ్స్, డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర: ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా. -
ఆల్టోకే10 సీఎన్జీ కారు వచ్చేసింది... అందుబాటు ధరలో
సాక్షి, ముంబై: దేశీయఆటోమేకర్ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ కారు ఆల్టోకె10లో సీఎన్జీ మోడల్న లాంచ్ చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ ద్వారా తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది. సీఎన్జీ వర్షెన్ ధర రూ. రూ.5,94,500 ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. వీఎక్స్ఐ అనే ఒక వేరియంట్లోనే మారుతీ ఆల్టో కే10 సీఎన్జీ అందుబాటులోకి ఇచ్చింది. ఇటీవల తమ మోడల్స్‌లో మరిన్ని సీఎన్జీ వేరియంట్లను లాంచ్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఎస్- సీఎన్జీ వాహనాలను విక్రయించామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఆల్టో కే10 సీఎన్జీ ఇంజీన్ డ్యూయల్ జెట్ , డ్యూయల్ VVTతో 1.0లీటర్ ఇంజీన్ అందిస్తోంది.5300 RPM వద్ద 56 hp ,3400 RPM వద్ద 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ జత చేసింది. ఆల్టో కే10 సీఎన్జీ 33.85కి.మీ/కేజీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. డిజైన్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. ముఖ్యంగా థర్డ్-జెన్ ఆల్టో కే 10 మాదిరి డిజైన్‌ను కలిగి ఉంది. అయితే కొత్త పవర్ ట్రెయిన్‌కు అనుగుణంగా రైడ్ నాణ్యత, సౌకర్యం, భద్రతకు అనుగుణంగా క్యాలిబ్రేట్ చేసిందని పేర్కొంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ ఫిల్టర్స్ హీటర్‌తో కూడిన ఎయిర్ కండీషనర్తోపాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన SmartPlay డాక్, ఫ్యూయల్ అలర్ట్, డోర్ అజార్ వార్నింగ్, డిజిటల్ స్పీడోమీటర్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం పోర్ట్‌ఫోలియోలో 13 ఎస్- సీఎన్సీ మోడళ్లను కలిగి ఉంది. వీటిలో ఆల్టో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బాలెనో, ఎక్స్ఎల్6, సూపర్ క్యారీ,టూర్ ఎస్ ఉన్నాయి. మరోవైపు రెనాల్ట్ క్విడ్‌కి గట్టిగా పోటీ ఇచ్చిన ఆల్టో కే10 సీఎన్జీ వెర్షన్ మరింత పోటీగా నిలవనుంది.రెనాల్ట్ క్విడ్‌లో ఇంకా సీఎన్జీ వేరియంట్ రాలేదు. -
గుడ్‌న్యూస్: గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ కమింగ్ సూన్
సాక్షి,ముంబై: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో గూగుల్ తన యూజర్లకు తీపి కబురు అందించనుంది. త్వరలోనే గూగుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోనును గూగుల్ తీసుకు రానుంది. గూగుల్ తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ‘పిక్స్ల్ ఫోల్డ్’ పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది. దీనిపై గూగుల్ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికి ఆన్లైన్లో తాజా లీకులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రీమియం విభాగంలో గూగుల్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోందని యూట్యూబ్, టిప్‌స్టర్ ఫ్రంట్ పేజ్ టెక్ జాన్ ప్రాస్సెర్ వెల్లడించారు. 2023, మే నెలలో దీన్ని గూగుల్ విడుదల చేయనుందని పిక్సల్ ఫోల్డ్ ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో రానుందని తెలపారు. అలాగే పిక్సెల్ 7 ప్రొ మాదిరిగానే ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఇంకా రియర్ ట్రిపుల్ కెమెరా,బెజెల్స్‌తో కవర్ స్క్రీన్, సెల్ఫీ కెమెరా సెన్సార్ కోసం హోల్డ్-పంచ్ పిల్-ఆకారపు కటౌట్‌తో రానుంది. దీని ధర రూ.1,799 డాలర్లు అంటే సుమారు రూ.1.45 లక్షలుగా ఉండనుంది. -
మైక్రో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..అత్యంత చౌక ధరలో
సాక్షి, ముంబై: భారతదేశపు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈ కారు నవంబరు 16న విడుదల కానుంది. దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ముంబై ఆధారిత పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ (పర్సనల్ మొబిలిటీ వెహికిల్) ఇండియాలో తన తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ మైక్రోకార్ EaS-Eని ఆవిష్కరించనుంది. EaS-E ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ అంచనాలు కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లేత గోధుమరంగు, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్ రంగుల్లో లభ్యం. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ ఫౌండర్ కల్పిత్ పటేల్ సమచారం ప్రకారం ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-200 కి.మీ పయనిస్తుంది. నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతంది. ఇందుకోసం 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ని ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈలో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ వంటివి ఉన్నాయి. ఇంకా మైక్రో ఎలక్ట్రిక్ కారు 550కేజీల బరువుతో పొడవు 2,915ఎంఎం, విడ్త్ 1,157ఎంఎం, హైట్ 1,600 ఎంఎంగానూ, వీల్‌బేస్ 2,087ఎంఎంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎంగా ఉంటుందట. -
ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్...స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ ప్రైస్!
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ మేకర్ ఆడి తన ఎస్‌యూవీలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఆడి క్యూ5 ఎస్‌యూవీలో స్పెషల్ ఎడిషన్‌ను కస్టమర్లకు అందిస్తోంది. ఇందులో మిర్రర్ హౌసింగ్ ,బ్లాక్‌లో ఆడి లోగోలు, బ్లాక్‌లో రూఫ్ రెయిల్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కొత్త బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ లాంటి అదనపు ఫీచర్లను ఇందులో జోడించింది. అలాగే ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ కిట్‌తో 2022 ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ భారతదేశంలో రూ. 67.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది. (ట్విటర్‌కు సవాల్: టాప్-...0 ఆల్టర్నేటివ్స్ ఇవిగో!) అంతేకాదురెండు స్పెషల్ కలర్స్‌తో (డిస్ట్రిక్ట్ గ్రీన్, ఐబిస్ వైట్) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేక ధరతో,పరిమితి కాలానికి అందిస్తోంది. ఆడి క్యూ5 కస్టమర్ల కోసం ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేయడం సంతోషంగా ఉందనీ, ఇది పరిమిత యూనిట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ ఇంజీన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (45 TFSI), 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తోంది. ఇది 249 hpపవర్‌ను, 370Nm టార్క్‌ను అందిస్తోంది. కేవలం 6.3 సెకన్లలో 0-100కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 237కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ డంపింగ్ కంట్రోల్‌తో అడాప్టివ్ సస్పెన్షన్‌ను అందిస్తుంది. కంఫర్ట్; డైనమిక్, ఇండివిడ్యువల్, ఆటో, ఎఫిషియెన్సీ,ఆఫ్-రోడ్ వంటి ఆరు డ్రైవ్ మోడ్స్‌లో ఇది లభ్యం. సింగిల్ గ్రిల్లే, వర్టికల్, స్ట్రట్స్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, సెన్సార్-నియంత్రిత బూట్ లిడ్ ఆపరేషన్ , LED హెడ్‌లైట్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ ప్లస్‌తో ఎక్స్టీరియర్ మిర్రర్ హౌసింగ్, బ్లాక్‌లో ఆడి లోగోలు, బ్లాక్‌లో రూఫ్ రెయిల్స్, 5 స్పోక్ V స్టైల్ గ్రాఫైట్ గ్రే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ క్యాబిన్లో ఖరీదైన లెదర్, లెథెరెట్ కాంబినేషన్ అప్హోల్స్టరీ, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ ఎయిడ్ ప్లస్‌తో పార్క్ అసిస్ట్, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్ 30 రంగులతో తీర్చి దిద్దింది. 755 వాట్స్ అవుట్‌పుట్‌తో 3D సౌండ్ ఎఫెక్టస్తో 19 స్పీకర్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ప్లే సపోర్ట్‌తో 25.65 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే లాంటి ఇంటీరియర్ ఫీచర్లున్నాయి. ధరలు: ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ రూ.67,05,000 (ఎక్స్ షోరూమ్) ఆడి క్యూ5 ప్రీమియం ప్లస్ ధర రూ. 60,50,000 (ఎక్స్-షోరూమ్) ఆడి క్యూ5 టెక్నాలజీ రూ. 66,21,000 (ఎక్స్-షోరూమ్) -
నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ జీ60 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ చేసిన నోకియా జీ60 5జీ ఇండియాలో నేటి(మంగళవారం)నుంచి ఫస్ట్ సేల్కు సిద్ధం. 5జీ నెట్వర్క్ సపోర్ట్(నాన్-స్టాండలోన్, స్టాండలోన్) 50 మెగాపిక్సెల్ కెమెరా తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి కీలక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా ఇండియా సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు, ఐస్ రంగుల్లో లభ్యం. ధర: 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే నోకియా G60 5G స్నాప్‌డ్రాగన్ 695 5G SoC 120Hz రిఫ్రెష్ రేట్,1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+5+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 4500mAh బ్యాటరీ -
అత్యంత చవకైన లావా బ్లేజ్ 5జీ సేల్: కమింగ్ సూన్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తేనుంది. లావా బ్లేజ్ 5జీ పేరుతో గత నెల ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022లో ఆవిష్కరించిన సంస్థ ఇక యూజర్లకు త్వరలోనే అందించనుంది. దేశంలోనే అత్యంత చౌక 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా లాంటి ఫీచర్లున్న ఈ ఫోన్ ధర రూ. 10999గా ఉంటుందని అంచనా. గ్రీన్ , బ్లూ రంగుల్లో అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. లావా 5జీ బ్లేజ్ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ డిస్ప్లే డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ,ఆండ్రాయిడ్ 12 ఓఎస్ 1600×720 పిక్సెల్ రిజల్యూషన్ 50+2+2 టట్రిపుల్ ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ For those who live in the fast lane. Blaze 5G. Only on Amazon.#ComingSoon #Blaze5G #IndiaJeele5G #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/MH2OZm0a1t — Lava Mobiles (@LavaMobile) November 3, 2022 -
నోకియా జీ60 5జీ: ఫ్రీ ఇయర్ బడ్స్, పరిచయ ఆఫర్ కూడా
సాక్షి,ముంబై: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నోకియా మళ్లీ దూసుకొస్తోంది. ఎక్కువగా బడ్జెట్, మధ్య-శ్రేణి ఫోన్లకు పరిమిత మైన నోకియా తాజాగా 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. నోకియా జీ60 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ కనెక్టివిటీతో పాటు భారీ డిస్ప్లే , ట్రిపుల్ రియర్ కెమెరా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలుగా నిలవనున్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ నోకియా జీ60 5జీ ధర రూ. 32,999గా నిర్ణయించిన కంపెనీ పరిచయ ఆఫర్‌గా రూ. 29,999కే అందిస్తోంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో నవంబర్ 8 నుండి లభ్యం కానుంది. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వారికి రూ.3,599 విలువైన నోకియా పవర్ ఇయర్ బడ్స్ ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల డిస్ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్ 1080×2400 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ 50+5+2 ఎంపీ టట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 4500ఎంఏహెచ్ బ్యాటరీ 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ -
మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కిస్బీ’ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ బైక్ లవర్స్‌ను ఆకర్షించేలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ప్యుగోట్ కిస్బీ’ ని త్వరలోనే దేశీయంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లను పలకరించే అవకాశం అంచనా. కిస్బీ ధర రూ. 1 లక్షగా ఉంటుందని భావిస్తున్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న మహీంద్ర ఈ-స్కూటర్ కిస్బీ...ఎథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 1.6 కేడబ్ల్యూహెచ్ 48వీ సామర్థ్యం గల లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్న కిస్బీ గంటలకు 45 కి.మీ. గరిష్ట వేగంతో 42 కి.మీ. మైలేజే ఇవ్వనుందిట. లాంచింగ్ ముందు ఇండియాలో ప్రత్యేకంగా తీసుకురానున్న కిస్బీ మోడల్ ఈవీ టెస్ట్ రన్ కూడా నిర్వహించింది. కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు ఏథర్ 450ఎక్స్ ఈవీ తరహాలో హైటెక్ ఫీచర్లను జోడించినట్టు తెలుస్తోందికలిగి ఉంది. స్కూటర్లో ట్యూబులర్ స్టీల్ చట్రం,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, వెనక డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్: మరో బడ్జెట్ ఫోన్
సాక్షి,ముంబై: ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్‌లో భారీ బ్యాటరీతోపాటు, మీడియా టెక్ ప్రాసెసర్, పంచ్ హోల్ సెటప్‌తో ‘ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే’ స్మార్ట్‌ఫోన్‌ను రివీల్ చేసింది. రేసింగ్ బ్లాక్, లూనా బ్లూ, అరోరా గ్రీన్, ఫాంటసీ పర్పుల్ నాలుగు రంగుల్లో ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే లభ్యం కానుంది. ఈ ఫోన్ ధర,భ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్పెసిఫికేషన్స్ 6.82అంగుళాల IPS LCD డిస్ప్లే 1640 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ మీడియా టెక్ హీలియో జీ 37ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (విస్తరించుకునే అవకాశం) 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 6, 000mAh బ్యాటరీ 18W ఛార్జింగ్ -
ఎఫర్డబుల్ ప్రైస్‌లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో కీలక స్పెసిఫికేషన్లు , ఫీచర్లతో గెలాక్సీ ఏ04ఈ (Galaxy A04e) లిస్ట్ చేసింది. బ్లాక్, బ్లూ, కాపర్ ఇలా మూడు కలర్ ఆప్షన్లలో రానున్న ఈ ఫోన్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే 13,499 రూపాయలువద్ద Galaxy A04s ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వస్తున్న ఈ ఫోన్ ధరను వినియోగదారులకు అందుబాటు ధరలో సుమారు పదివేలలోపే నిర్ణయించవచ్చని అంచనా. శాంసంగ్ గెలాక్సీ ఏ04ఈ ఫీచర్ల అంచనాలు 6.5 అంగుళాల HD+ ఇన్-సెల్ టచ్ LCD స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ చిప్సెట్ 720 x 1600 pixels, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 4 జీబీ ర్యామ్ 126 జీబీ స్టోరేజ్ ( 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం) 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమరా 5 000mAh బ్యాటరీ -
తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ వచ్చేసింది..సర్ప్రైజ్ ఆఫర్
సాక్షి,ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నేడు (శనివారం, అక్టోబరు 22)న లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఈ స్కూటర్ బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1తో పోలిస్తే 20వేల రూపాయల తగ్గింపుతో సరికొత్త ఎస్1 ఎయిర్‌ను తీసుకురావడం గమనార్హం. రోజూ ఒక స్కూటర్, అందరికీ స్కూటర్.అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎస్ 1 ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ S1 ధర రూ.84,999గా ఉంచింది. అయితే లాంచింగ్ ధర రూ. 79,999గా నిర్ణయించింది. కేవలం 999 రూపాయలు చెల్లించి దీన్ని ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ లాంచింగ్ ఆఫర్ అక్టోబర్ 24 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతందని కంపెనీ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జర్‌తో స్కూటర్ 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా ఈవెంట్లో తెలిపారు. ఇది కాకుండా, లాక్,అన్లాకింగ్ కోసం అధునాతన ఫీచర్లను అందించినట్టు చెప్పారు. అధునాతన డిజైన్‌తో అప్డేట్ చేసిన ఎస్1 ఎయిర్ ఎకో, రెగ్యులర్, స్పోర్ట్‌తో సహా మూడు రైడింగ్ మోడ్స్‌లో, అయిదు రంగుల్లో లభించ నున్నాయి. ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, బహుళ రైడ్ ప్రొఫైల్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ అండ్ కాల్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డెలివరీలు ఏప్రిల్ 2023 మొదటి వారంలో ప్రారంభం. A scooter for everyday, a scooter for everyone. The most awaited Ola S1 Air is here at an introductory price of Rs. 79,999! Offer valid till 24th October only. Hurry! Reserve now for Rs. 999 🥳🥳 pic.twitter.com/KmV0DGRs3Z — Ola Electric (@OlaElectric) October 22, 2022 -
వావ్.. 15వేలకే జియో ల్యాప్‌టాప్, సేల్స్ షురూ
సాక్షి,ముంబై: తక్కువ ధరలు ఇంటర్నెట్‌సేవలు, ఫీచర్ ఫోన్లు అందించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇపుడిక బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ‘జియోబుక్’ పేరుతో లాంచ్ చేసిన ఈ ల్యాప్‌టాప్ ధర ధర రూ.15,799గా నిర్ణయించింది. అయితే బ్యాంక్ ఆఫర్లతో ఇంకాస్త తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌కోసం ఎదురుచూస్తున్న సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా జియోబుక్ రూ. 15,000 కంటే తక్కువ ధరకే అందిస్తోంది.(TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన) ఎంబెడెడ్ జియో సిమ్ కార్డ్, 4జీ సిమ్‌కు సపోర్ట్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. JioOS ఆధారిత జియోబుక్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌కు యాక్సెస్ ఉంది. జియో తన తొలి ల్యాప్‌టాప్ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. మొదట రూ.19,500కి ధర నిర్ణయించినా, ప్రస్తుతం ధరను తగ్గించడంతోపాటు బ్యాంకు కార్డులపై ఆఫర్లు అందిస్తోంది. పలు బ్యాంకు కార్డు కొనగోళ్లపై రూ. 5,000 వరకు తక్షణ తగ్గింపు, క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ 3 వేల తగ్గింపు ఆఫర్, అలాగే క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది. డెబిట్ కార్డ్ హోల్డర్లు కూడా కొంత తగ్గింపు ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు. జియోబుక్ స్పెసిఫికేషన్స్ 11.6 అంగుళాల డిస్ప్లే 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్ Adreno 610 GPU స్నాప్‌డ్రాగన్ 665 SoC ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్( 128 జీబీవరకు విస్తరించుకునే అవకాశం 2 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ 2.0 పోర్ట్, 3.0 పోర్ట్, హెచ్‌డీఎం పోర్ట్ సపోర్ట్ -
బిగాసస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంత?
హైదరాబాద్: బిగాసస్ సరికొత్త బీజీ డీ15 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి మెటల్ బాడీతో భారత మార్కెట్ కోసం భారత్‌లోనే తయారు చేసిన స్కూటర్ ఇదని కంపెనీ తెలిపింది. ఒక్కసారి చార్జింగ్‌తో 115 కిలోమీటర్లు ప్రయాణించే డీ15 రోజువారీ కమ్యూటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. 16 అంగుళాల అలాయ్ వీల్స్‌తో బిగాసస్ నుంచి వచ్చిన తొలి స్కూటర్ ఇదే. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, 20కు పైగా బ్యాటరీ భద్రతా సదుపాయాలు, 77 సెంటీమీటర్ల పొడవైన సీట్, సైడ్ స్టాండ్ సెన్సార్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.99,999. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
రోల్స్ రాయిస్ అల్ట్రా-లగ్జరీ తొలి ఈవీ స్పెక్టర్: షాకింగ్ ధర
న్యూఢిల్లీ: బ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కస్టమర్లకోసం తొలి ఆల్-ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్టర్’ ను ఆవిష్కరించింది. 2023 చివరికి కస్టమర్లకు వాహనాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కారు పప్రారంభ ధర సుమారు దాదాపు రూ.3.5 కోట్లుగా ఉండనుంది. దాదాపు ఏడాది క్రితం దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన కంపెనీ తాజాగా దీన్ని లాంచ్ చేసింది.ఇప్పటికే దాదాపు 300కు పైగా ఈ లగ్జరీ కారును ప్రీబుకింగ్ అయ్యాయని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టన్ ముల్లర్-ఓట్వోస్ వెల్లడించారు. ఈవీ కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదే కాదు "అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే" , ఫాంటమ్ కూపేకి కొనసాగింపు అని పేర్కొన్నారు. తమ స్పెక్టర్ 3.4 సెకన్లలో 0-100 (కిమీ/గం) వేగం పుంజుకుంటుందని తెలిపారు. డిజైన్ పరంగా, ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యం, విశాలమైన గ్రిల్‌ను యాడ్ చేసింది. అలాగే బానెట్‌పై కొత్త 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ అని పేర్కొంది. కేవలం 2 డోర్లు మాత్రమే ఉన్న ఈ అతి విలాసవంతమైన కారులోని ఇతర విశేషాలను గమనిస్తే. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేను అందించింది.అలాగే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, హై-మౌంటెడ్ అల్ట్రా-స్లిమ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్), అలాగే ఏరో-ఆప్టిమైజ్ 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. -
వరల్ఢ్లోనే తొలి ఫోల్డ్ ల్యాపీ, ప్రీబుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్
సాక్షి, ముంబై: ఇండియాలో ల్యాప్‌టాప్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్న ఆసుస్ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెడ్’ ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ అని చెబుతున్న కంపెనీ దీని ధరను రూ. 3,29, 990గా నిర్ణయించింది. ల్యాప్‌టాప్ కోసం ప్రీబుకింగ్స్‌ను కూడా షురూ చేసింది. ప్రీ-బుకింగ్ ఆఫర్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ల్యాప్‌టాప్ రూ.2,84,290 కే లభిస్తుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్‌కు అవకాశం ఉంది. జెన్‌బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది ఆసుస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4.8 అంగుళాల స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ కీ బోర్డు ద్వారా యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్, డిస్ప్లేలా వాడుకోవచ్చు. ఈ కొత్త లాపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్టెండెడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉండటం మరో విశేషం. అంతేకాదు మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కేవలం నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ ల్యాపీలో 500 జీబీ ఎస్ఎస్డీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉచితం. 65W AC ఫాస్ట్ ఛార్జర్ మద్దతుతో 75 WHrs బ్యాటరీ సగటు వినియోగం 10 గంటలు. ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ల్యాపీ స్పెసిఫికేషన్స్ 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్ప్లే 12.5 అంగుళాల ఫోల్డ్ స్క్రీన్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్ కార్డ్ 5 ఎంపీ ఏఐ కెమెరా డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్ నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్ -
200ఎంపీ కెమెరా, మోటరోలా కొత్త వేరియంట్, భారీ లాంచింగ్ ఆఫర్
సాక్షి,ముంబై: మోటరోలా తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 65,000 గా నిర్ణయించింది. (Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్‌లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా?) ధర, లాంచింగ్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ సహా, ఇతర ఆన్లైన్స్టోర్లలో రూ. 64,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్‌గా 56,999 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు ఎస్బీఐ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపుకూడా లభ్యం. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ 8జీబీ వేరియంట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండియాలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్) మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్స్ 6.67 FHD+ OLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1500నిట్స్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen1, ఆండ్రాయిడ్ 12 200+50+12ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 60 ఎంపీ సెల్ఫీ కెమెరా 4610 mAh బ్యాటరీ 125 వాట్ ఛార్జింగ్ -
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 టర్బో స్టోర్ట్ : ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి
సాక్షి,ముంబై: మహీంద్రా కొత్త టర్బో స్పోర్ట్ ఎక్స్‌యూవీ 300ని లాంచ్ చేసింది. సాధారణ మోడల్‌తో విభిన్నంగా ఉండేలా స్పోర్టీ ఎక్స్టీరియర్ ఎలిమెంట్ష్తో మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఎక్స్‌యూవీ ప్రారంభ ధర రూ.10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). లభిస్తుంది. W6, W8 W8(O) వేరియంట్లలో బ్లేజింగ్ బ్రాంజ్ విత్ బ్లాక్ రూఫ్ టాప్, నాపోలీ బ్లాక్ విత్ వైట్ రూఫ్ టాప్, పెర్ల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ టాప్ , బ్లేజింగ్ బ్రాంజ్ మోనోటోన్ కలర్స్‌లో ఇది లభ్యం. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఇవ్వలేదు. కేవలం 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే టర్బో స్పోర్ట్ ఎక్స్‌యూవీ 300 లభిస్తుంది. ఇంజీన్, ఫీచర్లు 1.2-లీటర్ mStallion TGDi టర్బో పెట్రోల్ ఇంజన్ ఇందులో అందించింది. ఈ ఇంజీన్ 5000 RPM వద్ద 130 PS, 1500-3750 RPM వద్ద 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 సెకన్లలో 0-60 km/hr వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో రెడ్ గ్రిల్ ఇన్సర్ట్లు, ఆల్-బ్లాక్ ORVMలు, ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, లెథెరెట్ సీట్లు, క్రోమ్-ఫినిష్ పెడల్స్ , డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్స్ వంటి స్పోర్టీ డిజైన్ యాక్సెంట్స్‌తో వచ్చింది. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు & ఆటో హెడ్‌ల్యాంప్‌లు, అడాప్టివ్ గైడ్‌లైన్స్‌తో వెనుక పార్కింగ్ కెమెరా, 17.78 సెం.మీ ఇన్ఫోటైన్మెంట్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, బ్లూసెన్స్ కనెక్ట్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్అండ్ ఫోల్డబుల్ ORVMలు, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, స్టీరింగ్ లాంటి ఫీచర్లు దీని సొంతం. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 4 డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP విత్ హిల్ స్టార్ట్ అసిస్ట్, ABS, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ డీయాక్టివేషన్ స్విచ్, ISOFIX సీట్లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. -
హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం లాంచ్ చేసింది. కొత్త ఈవీ అనుబంధ సంస్థ- విడా బ్రాండ్ క్రింద ఇ-స్కూటర్లను ప్రారంభించడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి హీరో మోటో ప్రవేశించింది. విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్‌లు ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు అక్టోబర్ 10న ప్రారంభం. డిసెంబర్ రెండో వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక్కో ఛార్జింగ్‌కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని హీరో వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇది OTA అప్డేట్లను అందించడానికి కనెక్ట్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. కాగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఇ-స్కూటర్లతో పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0
సాక్షి,ముంబై: పండుగ సీజన్ సందర్భంగా హీరో మోటోకార్ప్ కొత్త బైక్‌ను రిలీజ్ చేసింది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0 పేరుతో కొత్త ఎడిషన్ బైక్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంచింది. హీరో కనెక్ట్‌తో తీసుకొచ్చిన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 రైడర్లను కనెక్ట్‌గా ఉండేలా చేసే స్మార్ట్ మొబిలిటీ బైక్. దీని ద్వారా ఈ వెహికల్ లైవ్ లొకేషన్‌ను ట్రేస్ చేయవచ్చు. ఇంకా టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్,పిలియన్ గ్రిప్‌పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్‌తో వస్తోంది. హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో రూ. 1,29,738 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇంజీన్, ఫీచర్లు 163cc ఎయిర్-కూల్డ్ BS-VI కంప్లైంట్ ఇంజన్. ఇది 6500 RPM వద్ద 15.2 PS పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రేమ్ ,పిలియన్ గ్రిప్‌పై రెడ్ యాక్సెంట్లతో మ్యాట్ బ్లాక్ షేడ్తోపాటు జియో ఫెన్స్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, టోప్ల్ అలర్ట్, టో ఎవే అలర్ట్ , అన్‌ప్లగ్ అలర్ట్‌లతో సహా రైడర్ వారి వాహనం గురించి అప్డేట్గా ఉంచేలా ఫీచర్లను ఇందులో పొందుపర్చింది. -
టాటా టియాగో ఈవీ వచ్చేసింది: వావ్...తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అత్యంత సరసమైన టియాగో ఈవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా తమ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 10వేల మంది వినియోగదారులకు 8.49 (ఎక్స్-షోరూమ్, ఇండియా) లక్షలకు అందించనుంది. XE, XT, XZ+ XZ+ టెక్ అనే నాలుగు ట్రిమ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్ బుకింగ్‌లు అక్టోబర్ 1 నుండి అందుబాటులో ఉంటాయి. డెలివరీలు జనవరిలో ప్రారంభమవుతాయి. ఈ పండుగ సీజన్లో దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో EVని టాటా మోటార్స్ సంక్రాంతి కానుకగా వినియోగ దారులకు అందించనుండటం మరో విశేషం. -
గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7ప్రొ కమింగ్ సూన్
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ తోపాటు పిక్సెల్ వాచ్‌ను కూడా తీసు కొస్తోంది. అక్టోబర్ 6న ‘మేడ్ బై గూగుల్’ పేరుతో నిర్వహించే గ్లోబల్ స్పెషల్ ఈవెంట్లో వీటిని లాంచ్ చేయనుంది. ఆన్లైన్ రిటైల్ భాగస్వామిని ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో అందుబాటులో ఉంటాయి. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటుందని గూగుల్ ధృవీకరించింది. మీ వెయిటింగ్ ముగిసింది! పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ త్వరలో భారత్‌లోకి రానున్నాయి. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అంటూ గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. స్నీక్‌పీక్ అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ ఫిచర్ల విషయానికి వస్తే...6.3 అంగుళాల డిస్ప్లే, టెన్సర్ G2 చిప్సెట్, 5,000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్, ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని అంచనా. పిక్సెల్ 7 అబ్సిడియన్ (నలుపు),వైట్, లెమన్‌గ్రాస్ (పసుపు) కలర్స్‌లో రానున్నాయి పిక్సెల్ 7 ప్రొ అబ్సిడియన్ బ్లాక్, వైట్, హాజెల్ (ఆకుపచ్చ) రంగులలో అందుబాటులో ఉంటుంది. Here's a sneak peak 👀 https://t.co/pt5Aoa2qsB pic.twitter.com/4hbcD0wufY — Google India (@GoogleIndia) September 21, 2022 -
ట్రిపుల్ ఏఐ రియర్కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, అదీ బడ్జెట్ ధరలో
సాక్షి,ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 50మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, 6X జూమ్ పెరిస్కోప్-స్టైల్‌తో లావా బ్లేజ్ ప్రొ అనే కొత్త బడ్జెట్ ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన లావా బ్లేజ్‌కు ఈ స్మార్ట్‌ఫోన్ సక్సెసర్. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్, ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, టైప్‌సీ చార్జర్లాంటి ఇతర ఫీచర్లను ఇందులో అందించడం విశేషం. లావా బ్లేజ్ ప్రొ స్పెసిఫికేషన్స్ 6.5అంగుళాల HD డిస్ప్లే ఆండ్రాయిడ్ 12, MediaTek G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 5000mAh బ్యాటరీ కెపాసిటీ ధర, లభ్యత లావా బ్లేజ్ ప్రో రూ. 10,499లుగా కంపెనీ ధర నిర్ణయించింది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ , గ్లాస్ గోల్డ్ అనే నాలుగు విభిన్న రంగుల్లో ఈ ఫోన్ లభ్యం. ఫ్లిప్‌కార్ట్, లావా ఇ-స్టోర్ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. -
ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు!
కొంత కాలంగా బడ్జెట్ టీవీల మార్కెట్లో దూసుకుపోయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తాజాగా ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ విభాగంలోకి ప్రవేశించింది. టెలివిజన్ మార్కెట్లో తమ మార్కెట్‌ని అన్ని విభాగంలో విస్తరిస్తూ, ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్, 55 ఇంచెస్ జీరో సిరీస్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేకంగా ఇన్ఫినిక్స్ జీరో (Infinix Zero 55 Inch QLED 4K) స్మార్ట్ టీవీని అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఇందులో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్‌తో వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలో అద్భుతమైన క్వాంటమ్ డాట్ టెక్నాలజీని అమర్చారు. జీరో సిరీస్‌లోని ZERO 55-inch QLED 4K TV రూ. 34,990 గా ఉంది. ప్రస్తుతం ఉన్న X3 సిరీస్ క్రింద ప్రారంభించిన ఇతర ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్ 4K TV ధర కేవలం రూ. 24,990. ఈ రెండు ఆండ్రాయిడ్ టీవీలు సెప్టెంబర్ 24 నుంచి సేల్స్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మైండ్‌బ్లోయింగ్ ఫీచర్లు ఇవే.. మీకు ఇష్టమైన టీవీ షోలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు, సినిమాల ఫ్రేమ్ రేట్‌ను పెంచేందుకు డాల్బీ విజన్, హెచ్డీఆర్( HDR 10+) సపోర్ట్ , బెజెల్ లెస్ డిజైన్ దీని ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పిక్చర్ క్వాలిటీ మెరుగ్గా ఉండేలా క్వాంటమ్ డాట్ డిస్ప్లేను ఇస్తున్నట్టు ఇన్ఫినిక్స్ పేర్కొంది. మీడియా టెక్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ సీఏ55 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. పీక్ బ్రైట్నెస్ 400 నిట్స్ వరకు ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. వైర్లెస్ కనెక్టివిటీ కోసం డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. ఈ QLED స్మార్ట్ టీవీకి మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై పోర్ట్‌లు ఉన్నాయి. ఇందులో డాల్బీ డిజిటల్ ఆడియోతో కూడిన రెండు పవర్‌పుల్ ఇన్నర్ బిల్ట్ 36వాట్స్ బాక్స్ స్పీకర్లు, 8K నుండి 20K Hz వరకు సౌండ్ క్వాలిటీని పెంచే 2 ట్వీటర్లు ఉన్నాయి. ఈ ప్రీమియం టీవీ సిరీస్ గురించి మాట్లాడుతూ, ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్, మాట్లాడుతూ.. మా ఫ్లాగ్షిప్ క్వాంటం డాట్ టెక్నాలజీతో తయారుచేసిన సరికొత్త 55 ఇంచెస్ QLED 4K TV భవిష్యత్తులో గేమ్-ఛేంజర్ గా మారుతుందన్నారు. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
రియల్ మీ సరికొత్త ఫోన్ సీ30ఎస్ లాంచ్, లోబడ్జెట్ ధర
న్యూఢిల్లీ: రియల్మీ కంపెనీ సీ సిరీస్ నుంచి సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరలోనే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. యూనిసాక్ ఎస్సీ9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ డిస్ప్లే 6.5 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ ఏఐ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రియల్మీ సీ30ఎస్ స్పెసిఫికేషన్స్ 6.5 ఇంచుల HD+ LCD డిస్ప్లేను 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 బేస్ట్ రియల్మీ యూఐ గో ఎడిషన్‌తో 64 జీబీదాకా విస్తరించుకును అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ధరలు,లభ్యత 2 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.7,499, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. స్ట్రిప్ బ్లాక్, స్ట్రిప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభ్యం. రియల్మీ సీ30ఎస్ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ సందర్భంగా సెప్టెంబరు 23నుంచి సేల్కు రానుంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు,బైక్స్‌తో ఎల్ఎంఎల్ కొత్త ఇన్నింగ్స్
సాక్షి,ముంబై: టూవీలర్ మార్కెట్లో సంచలనం ఎల్ఎంఎల్ (లోహియా మెషీన్స్ లిమిటెడ్) స్కూటర్స్ గుర్తున్నాయా? ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-స్కూటర్లతో మళ్లీ మర్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆధునిక డిజైన్, రెట్రో లుక్‌లో ఈ-స్కూటర్లు, బైక్స్‌ను లాంచ్ చేయనుంది. కాన్పూర్‌కు చెందిన పురాతన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ యాజమాన్యం కింద, ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 29న ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌తో మూడు వాహనాలను పరిచయం చేయనుంది. బైక్స్, ఇ-స్కూటర్లు రెండింటికీ సంబంధించి ప్రకటన ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ బైక్‌లు 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. అంతేకాదు వీటిని దేశీయ మార్కెట్‌కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. రానున్న 3-5 ఏళ్లలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. హర్యానా మనేసర్‌లోని హార్లే-డేవిడ్సన్ తయారీ యూనిట్లోనే ఈ బైక్‌లను ఉత్పత్తి చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000ఎల్ఎమ్ఎల్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తోంది. కాగా 90లలో ఎల్ఎంఎల్ వెస్పా పేరు తెలియని వారుండరు. 100 సీసీ శ్రేణితో బజాజ్ స్కూటర్లతో పెద్ద పోటీనే ఉండేది. ఈ పోటీని తట్టుకోలేక 2018లో మూతపడింది ఎల్ఎంఎల్. -
టొయాటో హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ, వాటికి గట్టిపోటీ
సాక్షి, ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని శుక్రవారం లాంచ్ చేసింది. వీటి ధరలరూ. 15.11 లక్షల (ఎక్స్-షోరూమ్)గా సంస్థ ప్రకటించింది. నాలుగు వేరియంట్లలో లభ్యం కానున్న దీని టాప్-స్పెక్ నియో డ్రైవ్ (మైల్డ్-హైబ్రిడ్) వేరియంట్ రూ. 17.09 లక్షలు, హై వేరియంట్ ధర రూ. 18,99,000 (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. 2022 జూలైలో దీన్ని తొలిసారి పరిచయం చేసిన సంస్థ దాదాపు రెండు నెలల తర్వాత దీన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్ కోసం అధికారిక బుకింగ్‌లను ప్రారంభించింది. టయోటా ఇండియా డీలర్‌షిప్‌లలోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే త్వరలోనే ధరను ప్రకటించనున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీకి కూడి ఇది పోటీగా నిలవనుందని అంచనా. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) S eDrive 2WD హైబ్రిడ్ రూ. 15.11 లక్షలు G eDrive 2WD హైబ్రిడ్ రూ. 17.49 లక్షలు V eDrive 2WD హైబ్రిడ్ రూ. 18.99 లక్షలు V AT 2WD నియో డ్రైవ్ రూ. 17.09 లక్షలు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో బలమైన హైబ్రిడ్ టెక్‌తో e-CVTతో వస్తుంది. ఇది 91 bhp & 122 Nm ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్ 79 bhp, 141 Nm ను ప్రొడ్యూస్ చేస్తుంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు ఇంత అద్భుతమైన స్పందన లభిస్తోందంటూ వినియోగదారులకు అసియేట్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అతుల్ సూద్ ధన్యవాదాలు తెలిపారు. ఫీచర్లు: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ , సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, 7అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి టాప్ ఫీచర్లుఇందులోఉన్నాయి. టయోటా iConnect టెక్నాలజీ సహా క్రూయిజ్ కంట్రోల్, 55 ప్లస్ ఫీచర్లు లభ్యం. -
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్: అదరిపోయే ఫీచర్స్, కలర్స్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్యూవీ తొలి వార్షికోత్సవ ఎడిషన్ లాంచ్ చేసింది. టైగన్ ఎస్‌యూవీని లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా కొన్ని స్పెషల్ ఫీచర్లతో ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌గా సరికొత్తగా లాంచ్ చేసింది. రైజింగ్ బ్లూ కలర్, ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్‌లో ఇది అందుబాటులో ఉంది. స్టాండర్డ్ టైగన్‌తో పోలిస్తే ఇందులో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ , ఇతర ఫీచర్లతో తీసుకొచ్చింది. డైనమిక్ లైన్లో తీసుకొచ్చిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ స్పెషల్ ఎడిషన్ రెండు ఇంజీన్లతోరానుంది. 1.0 TSI MT & ATలో అందుబాటులో ఉన్న టాప్‌లైన్ వేరియంట్. "1" వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌తో స్పోర్టియర్ లుక్స్‌తో అదరగొడుతోంది. ఇందులో హై లగ్జరీ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, విండో వైజర్లతో సహా ప్రత్యేకంగా డిజైన్చేసిన 11 అంశాలు ఉన్నాయి. సెఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే టైగన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 వరకు ఎయిర్ బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ బ్రేక్‌లు, రివర్స్ కెమెరా, ISOFIX, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ సిస్టమ్ లాంటి పూర్తి స్థాయి 40+ భద్రతా ఫీచర్లను జోడించింది. అదనంగా 3 పాయింట్ సీట్ బెల్ట్‌లతో పాటు వెనుకవైపు 3 ఎడ్జస్టబుల్ హెడ్రెస్ట్ కూడా ఉంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్‌తో కూడిన 1.0L TSI ఇంజన్, 5000 నుండి 115PS (85 kW) గరిష్ట శక్తిని, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక. 5500 ఆప్పిఎం వద్ద గరిష్ట టార్క్ 178 టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5L TSI EVO ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ , 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో అమర్చబడి ఉంటుంది, ఇది 150PS (110 kW) గరిష్ట శక్తిని 5000, 6000 rpm వద్ద, 5000 టార్క్ అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన ధరలు రూ. 15.40 లక్షలు- రూ. 16.90 లక్షల వరకు ఉంటాయి. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్లో టాప్ 3 ఫైనలిస్ట్గి నిలిచి ప్రపంచస్థాయిలో టైగన్ ఖ్యాతిగడించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ఈ సందర్బంగా టైగన్ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. టైగన్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 40 వేల కంటే ఎక్కువ ఆర్డర్లను సాధించగా , 22వేల టైగన్లను డెలివరీ చేసింది. -
మోంట్రా ఈ-త్రీ వీలర్స్ వచ్చేశాయ్.. ధర ఎంతంటే?
హైదరాబాద్: ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా అనుబంధ కంపెనీ టీఐ క్లీన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మోంట్రా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. సబ్సిడీ అనంతరం ధర రూ.3.02 లక్షలు. 10 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందు పరిచారు. మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా (టిఐఐ) అనుబంధ సంస్థ ఐ క్లీన్ మొబిలిటీ (టిసిఎమ్) మంగళవారం చెన్నైలో మోంట్రా ఎలక్ట్రిక్ 3డబ్ల్యు ఆటోను ప్రారంభించడంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఒకసారి చార్జ్ చేస్తే వాహనం 197 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈవీ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అనేది అతిపెద్ద వృద్ధి సామర్థ్యం కలిగిన ఒకటని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ మురుగప్పన్ తెలిపారు. మెంట్రా ఎలక్ట్రిక్ బ్రాండ్‌తో ఇ-త్రీ-వీలర్ ఉత్పత్తులను, సెలెస్టియల్ ఎగాట్ బ్రాండ్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను, రైనో 5536 ద్వారా ఎలక్ట్రిక్ భారీ వాణిజ్య వాహనాలను పరిచయం చేయనుంది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూకుడుగా ఉంది. చెన్నై సమీపంలోని అంబత్తూరు ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 100కుపైగా డీలర్షిప్ కేంద్రాల ద్వారా ఈ త్రిచక్ర వాహనాలను విక్రయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈవీ విభాగంలో కనీసం నాలుగు ప్లాట్‌ఫారమ్స్ కోసం సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే!
సాక్షి,ముంబై: రెడ్మీ అందుబాటులో ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లీన్ ఆండ్రాయిడ్ 12,హీలియో ఏ22 చిప్, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో రెడ్మి ఏ1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది.ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ ధర రూ. 6,499గా ఉంచింది. సెప్టెంబర్ 9 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో రెడ్మి ఏ1 ధర, విక్రయ తేదీ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499. సెప్టెంబర్ 9నుంచి షావోమివెబ్సైట్, మై హోమ్, అమెజాన్ రిటైల్ అవుట్లెట్లలో లభ్యం. లేత ఆకుపచ్చ, లేత నీలం, నలుపు మూడు రంగుల్లో లాంచ్ అయింది. రెడ్మి ఏ1 స్పెక్స్, ఫీచర్లు 6.52 అంగుళాల 720p డిస్ప్లే 8 ఎంపీ రియర్‌కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10W మైక్రో-యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ -
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త కార్‌ను భారత మార్కెట్లో నేడు (సెప్టెంబరు 6, 2022) లాంచ్ చేసింది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్యూవీ తర్వాత, స్పోర్టీ అవతార్‌లో హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ విడుదల చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఈ స్పోర్టీ ఎస్‌యూవీకి సంబంధించి ఇండియాలో రూ. 21వేలతో బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఇంజీన్,ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0 కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 2వ జెన్ 7-స్పీడ్ డిసిటితో వస్తున్న ఈ ఇంజీన్ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 88.3 kw (120 PS), 172 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. డ్యూయల్ కెమెరాతో ప్రత్యేకమైన డాష్‌క్యామ్ అందిస్తోంది. 60కి పైగా హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్లున్నాయి. అలెక్సా , గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో హోమ్ టు కార్ (H2C)ని కూడా కలిగి ఉంటుంది. అలాగే కస్టమర్లకు సాధారణ, ఎకో, స్పోర్ట్ మోడ్ల మధ్య ఎంచుకోవడానికి వీలు కల్పించే డ్రైవ్ మోడ్ ఎంపికను కూడా ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 30కి పైగా భద్రతా ఫీచర్లు , 20కిపైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 4 డిస్క్ బ్రేక్‌లు, ISOFIX, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, పార్కింగ్ అసిస్ట్ లాంటి హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్‌లోని ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ ఎన్ ధరలు హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఎన్6, ఎన్8 అనే అనే రెండు వేరియంట్లలో లభ్యం. ఎన్ 6 వేరియంట్ ధర రూ. 12.16 లక్షలు కాగా, ఎన్8 వేరియంట్ ధర రూ. 13.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
హాప్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్: అదిరే..అదిరే..!
న్యూఢిల్లీ: ప్రముఖ ఈవీ బైక్స్ తయారీ సంస్థ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ సెగ్మెంట్లోకి దూసుకొస్తోంది. తాజాగా దేశీయ మార్కెట్లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్ రెండు మోడళ్ళను లాంచ్ చేసింది. ఆక్సో మోడల్లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.1.25 లక్షలు, రూ.1.40 మధ్య ఉండనున్నాయి. వినియోగదారులు తమ సమీప హాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్, లేదా ఆన్లైన్లో ఎలక్ట్రిక్ బైక్స్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 5వేల ప్రీ-లాంచ్ రిజిస్ట్రేషన్లు సొంతం చేసుకున్నామనీ, మరింత హైపర్గ్రోత్ను అంచనా వేస్తున్నామని హాప్ ఫౌండర్, సీఈవో కేతన్ మెహతా అన్నారు. రానున్న రోజుల్లో తమ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తామన్నారు. అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం తోపాటు, చార్జింగ్ సదుపాయల కోసం రూ.200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఫీచర్లు మూడు రైడ్ మోడ్‌లను (ఎకో, పవర్ , స్పోర్ట్) లో ఈ బైక్స్ లభ్యం. బైక్ ప్రముఖ ఫీచర్ల విషయానికి వస్తే IP67 రేటింగ్ 5 అంగుళాల అడ్వాన్స్డ్ ఇన్ఫో డిస్ప్లే, 72 V ఆర్కిటెక్చర్‌తో 6200 వాట్ పీక్ పవర్ మోటార్‌తో 200 Nm వీల్ టార్క్‌ను అందజేస్తుంది. స్మార్ట్ బీఎంఎస్,811 NMC సెల్స్‌తో కూడిన అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీతో ఆధారితమైన Oxo's 3.75 KWh బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అందించింది. 3.75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్‌తో తయారైన ఈ బైకు ఒక్కసారి చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.అ లాగే కేవలం నాలుగు గంటల్లోనే బ్యాటరీ 80 శాతం వరకు రీచార్జి అవుతుందని కేతన్ మెహతా వెల్లడించారు. అంతేకాదు కేవలం పోర్టబుల్ స్మార్ట్ ఛార్జర్‌తో ఏదైనా 16 Amp పవర్ సాకెట్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. -
పోకో ఎం5 వచ్చేసింది.. లాంచింగ్ ఆఫర్, ధర, ఫీచర్లు
సాక్షి,ముంబై: పోకో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇండియాతోపాటు ప్రపంచ మార్కెట్లో పోకో ఎం5ని లాంచ్ చేసింది. పోకో ఎం 4 M4 సిరీస్ సక్సెసర్ కొన్ని అప్గ్రేడ్లతో దీన్నివిడుదల చేసింది. భారతదేశంలో పోకో ఎం5 ధర, ఆఫర్ 4జీబీ ర్యామ్, 64 జీబీస్టోరేజ్ ధర రూ.12,499 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్ మోడల్ ధర రూ.14,499 ఎల్లో, ఐసీ బ్లూ , పవర్ బ్లాక్ మూడు రంగుల్లో ఇవి లభ్యం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సెప్టెంబర్ 13న సేల్ షురూ కానుంది. అయితే పరిమిత కాలానికి విక్రయ ఆఫర్లను అందిస్తున్నట్లుపోకో తెలిపింది. రెండు వేరియంట్లపై రూ. 1500 తగ్గింపును అందిస్తోంది. అంటే వీటిని వరుసగా రూ. 10,999 ప్రారంభ ధరతో రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. పోకో ఎం5 స్పెసిఫికేషన్స్ 6.58అంగుళాల డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+2+2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ -
కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు
సాక్షి,ముంబై: బైక్‌మేకర్ కీవే బెండా వీ302 సీ బైక్‌ను భారత మార్కెట్లోవిడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.89 లక్షల (ఎక్స్-షోరూమ్). అధీకృత బెనెల్లీ/కీవే డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.10,000 చెల్లించి కీవే వెబ్సైట్లో ఆన్లైన్లో ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ గ్లోసీ గ్రే, గ్లోసీ బ్లాక్ , గ్లోసీ రెడ్ అనే మూడు రంగులలో లభిస్తుంది. బెండా వీ302 సీ ఇంజీన్‌ను పరిశీలిస్తే 298cc, ట్విన్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చింది. ఇది గరిష్టంగా 29.5hp శక్తిని ,26.5Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు, డిస్క్ బ్రేక్స్, మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే స్టెప్-అప్ సింగిల్-పీస్ సౌకర్యవంతమైన సీటు, విస్తృత హ్యాండిల్ బార్, వైడ్ రియర్ వీల్, బైక్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్ల ఇంధనాన్ని నిల్వ చేయగలదు. అలాగే వీల్స్అన్నింటికీ -LED లైటింగ్ సెటప్‌ను అందించింది. ప్రస్తుతం, కీవే చైనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు కియాన్‌జియాంగ్ గ్రూప్‌లో భాగం. బెనెల్లీ కూడా దీని సొంతమే. 1999లో వచ్చిన కీవే 98 దేశాలలో దాని ఉత్పత్తులను అందిస్తోంది. బెనెల్లీ సిస్టర్ కంపెనీ కీవే మే 2022లో మూడు కొత్త ఉత్పత్తుల ద్వారా దేశీయ మార్కట్లోకి ప్రవేశించింది. కీవే కె-లైట్ 250V, కీవే వియెస్టే 300 కీవే సిక్స్టీస్ 300iబైక్స్‌ను ఇక్కడ తీసుకొచ్చింది. -
వివో నుంచి స్లిమ్ ఫోన్ ‘వై35’: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీ: వివో సంస్థ వై35 స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది చాలా స్లిమ్‌గా, నాజూకుగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ ఉంటుంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,499. రెండు రంగుల్లో లభిస్తుంది. డాన్ గోల్డ్, అగేట్ బ్లాక్ రంగుట్లో వివో ఇండియా ఆన్లైన్ స్టోస్టోర్తోపాటు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ కార్డులపై రూ.1,000 క్యాష్బ్యాక్నుసెప్టెంబర్ 30వరకు అందిస్తున్నట్టు వివో ప్రకటించింది. -
ఫెస్టివ్ సీజన్: రూ. 29వేలకే 4కే షావోమీ స్మార్ట్ టీవీ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి ఇండియా తాజాగా కొత్త సిరీస్ స్మార్ట్‌టీవీలను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో 43, 50, 55 అంగుళాల సైజుల్లో ఈ ప్రీమియం స్మార్ట్‌టీవీలు లభ్యం. డాల్బీ విజన్, డాల్బీ ఆడియోతో కూడిన ప్రీమియం బెజెల్-లెస్ డిజైన్‌తో 4కే రిజల్యూషన్ లాంటివి స్పెషల్ ఫీచర్లుగా షావోమీ ఎక్స్ స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది. 43 అంగుళాల స్మార్ట్‌టీవీ ధర రూ. 28,999, 50 అంగుళాల టీవీ ధర రూ. 34,999, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 39,999 నుండి ప్రారంభం. ఎంఐ హోమ్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ అండ్ ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది ప్యాచ్‌వాల్ తాజా వెర్షన్‌తో రూపొందించిన కొత్త సిరీస్ టీవీల ద్వారానేరుగా యూట్యూబ్ మ్యూజిక్‌ను నిరంతరాయంగా ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అధిక రిజల్యూషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, 4 కే విప్లవంలో తామే టాప్‌లో ఉన్నామనీ షావోమి ఇండియా సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ సుదీప్ సాహు తెలిపారు. వినియోగదారుల కోసం సరైన అప్‌గ్రేడ్‌గా ఉండే సిరీస్‌ని తీసుకు రావాలని భావిస్తున్నామన్నారు. భారతీయ వినియోగదారులకోసం హోమ్ స్క్రీన్‌పై IMDb ఇంటిగ్రేషన్, 300+ లైవ్ ఛానెల్‌లు, యూనివర్సల్ సెర్చ్ , కిడ్స్ మోడ్‌తో సహా ప్యాచ్‌వాల్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్యాచ్‌వాల్, Android TV 10 ప్లాట్‌ఫారమ్, 2 జీబీ ర్యామ్చ, 8 జీబీ స్టోరేజీ, ప్రముఖ 64-బిట్ క్వాడ్ కోర్ A55 చిప్‌తో ఆధారితంగా పనిచేస్తాయి. డ్యూయల్-బ్యాండ్ వైఫై,,బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. 3 HDMI పోర్ట్ (eARC x 1) తో పాటు, ఇది 2 యూఎస్బీ పోర్ట్‌లు రాజీపడని కనెక్టివిటీ, సంపూర్ణ వీక్షణ అనుభవం కోసం ఏవీ యర్‌ఫోన్ పోర్ట్‌తో కూడా ఈ టీవీలను తీసుకొచ్చింది. -
డుకాటి ఇండియా సూపర్ బైక్స్: దిమ్మ దిరిగే ధరలు
న్యూఢిల్లీ: డుకాటి ఇండియా 2022 పానిగేల్ వీ4 రేంజ్ బైక్స్‌ను విడుదల చేసింది. వీటి ధర రూ. 26.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. వేరియంట్లు ఉన్నాయి - స్టాండర్డ్, ఎస్,ఎస్పీ-2 ఇలా మూడు వేరియంట్లలో ఈ సూపర్ బైక్ అందుబాటులో ఉంది. అయితే ఫీచర్లను అప్డేట్ చేయడమే కాదు ధరలను కూడా అదే రేంజ్లో పెంచేసింది. కొత్త గ్రాఫిక్లతోపాటు, అద్భుతమైన డిజైన్‌తో 2022 పనిగేల్ వీ4 బైక్స్‌ని అప్డేట్ చేసింది. ఇక ధరల విషయానికి వస్తే బేస్ వేరియంట్ ధరను గతం కంటే రూ. 3 లక్షలు పెంచింది. ఎస్ ధర రూ. 31.99 లక్షలు (గతం కంటే రూ. 3.59 లక్షలు ఎక్కువ) ఎస్పీ2 ధర రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)( సుమారు 4 లక్షలు ఎక్కువ) .ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో మొత్తం 3 వేరియంట్ల బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంజీన్ 1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ . దీనికి కొత్త సైలెన్సర్ ఆయిల్ పంప్‌ను జోడించింది. తద్వారా ఈ ఇంజీన్ సామర్థ్యం 13,000 RPM వద్ద 215.5 HP , 9500 RPM వద్ద 123.6 Nm వరకుపెరిగిందని కంపెనీ ప్రకటించింది. ఇంకా ఫుల్లీ రెడ్ ఫెయిరింగ్లపై బ్లాక్ లోగోలు, డబుల్ ఫాబ్రిక్ సాడిల్, బ్లాక్ రిమ్స్‌పై రెడ్ ట్యాగ్ (S వేరియంట్లో) జోడించింది. హై ఎండ్ వేరియంట్ ఎస్పీ 2లో 1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్నే అమర్చింది. ఇంకా ఇటాలియన్ ఫ్లాగ్‌తో కూడిన కార్బన్ ఫైబర్‌లో వింగ్స్, STM-EVO SBK 9-డిస్క్ డ్రై క్లచ్, డెడికేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ స్ప్రాకెట్స్, 520 చైన్, ఎడ్జస్టబుల్ రైడర్ ఫుట్-పెగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రిమోట్ అడ్జస్టర్, మెషిన్డ్ బ్రేక్ చ, క్లచ్ లివర్లతో కూడిన బ్రెంబో MCS మాస్టర్ సిలిండర్, 9-స్పోక్ ఫోర్డ్ మెగ్నీషియం వీల్స్, కార్బన్ ఫైబర్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్ , సింగిల్ సీట్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
లంబోర్గిని సూపర్ లగ్జరీ కార్లు: ధర రూ. 4 కోట్లకు పైమాటే
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో విడుదలైన మోడళ్లను భారత్‌కు పరిచయం చేయాలని కార్ల తయారీ దిగ్గజం ఆటోమొబిలి లంబోర్గీని భావిస్తోంది. ఇక్కడి సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానాన్ని బలపర్చుకోవడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. లంబోర్గీని హురకాన్ టెక్నికా మోడల్‌ను గురువారం భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.4.04 కోట్ల నుంచి ప్రారంభం. త్వరలోనే ఊరూస్ పెర్ఫార్మెంట్ ఎస్‌యూవీని ఇక్కడకు తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. విదేశీ మోడళ్లను భారత్‌లో త్వరతగతిన విడుదల చేసేందుకు కృషిచేస్తున్నట్టు లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. కొత్త మోడళ్లను వేగంగా స్థానిక మార్కెట్లోకి తీసుకురావడం భారత్‌లో సంస్థ వృద్ధికి కీలక స్తంభమని ఆయన అన్నారు. గతంలో 8-10 నెలల సమయం పట్టేదని చెప్పారు. విదేశాల్లో పరిచయం చేసిన నెల రోజుల్లో ఊరూస్ను ఇక్కడకు తెచ్చామని, హురకాన్ ఈవోను తొలుత భారత్‌లో విడుదల చేశామన్నారు. లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2021లో కంపెనీ భారత్‌లో 69 కార్లను విక్రయించింది. హురకాన్ టెక్నికా 5.2 లీటర్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది. -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 53
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్–ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మ్యాటిక్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2.45 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక్కసారి చార్జి చేస్తే 529–586 కి.మీ. వరకూ నడుస్తుంది. 3.4 సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని పెంచుకునే దిశగా నాలుగు నెలల్లో మూడు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో ఈక్యూఎస్ 580, ఆ తర్వాత నవంబర్‌లో సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూబీని తేనున్నట్లు వివరించారు. రాబోయే అయిదేళ్లలో తమ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు మార్టిన్ చెప్పారు. -
సూపర్‌కార్ మేకర్ మెక్లారెన్ కమింగ్ సూన్, ఇక దిగ్గజాలకు గుబులే!
న్యూఢిల్లీ: బ్రిటీష్ లగ్జరీ సూపర్ కార్ల తయారీ సంస్థ, మెక్లారెన్ ఆటోమోటివ్ భారత మార్కెట్లోకి ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తోంది. మరో రెండునెలలోనే మెక్లారెన్ జీటీ, ఆర్టురా, 720ఎస్‌లతో లాంచింగ్‌తోపాటు, తన సూపర్, డూపర్ కార్లను భారత్‌కు తీసుకొస్తోంది. అంతేకాదు మెక్లారెన్ తొలి రిటైల్ అవుట్లెట్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఓపెన్ చేయనుంది. ఈ స్పోర్ట్స్‌కార్ మేకర్ ఎట్టకేలకు మెక్లారెన్ అధికారికంగాతన బబ్రాండ్ ఉత్పత్తులను మొత్తంభారత్ కస్టమర్లకు అందించనుంది. మెక్లారెన్ ఇండియా జీటీ ఐకానిక్ జీటీ త్వరలో భారతీయ రోడ్లపై సందడి చేయనుంది. మెక్లారెన్ జీటీ దేశంలోనే తొలి అధిక-పనితీరు గల హైబ్రిడ్ కారుగా నిలవనుంది. ఆర్టురాతో సహా భారతీయ వినియోగ దారులకు తన ఉత్పత్తులను అందిచనుంది. మెక్లారెన్ ఇండియా 720ఎస్ కూపే స్పైడర్ వేరియంట్లలో వస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సూపర్ కార్లను ఆవిష్కరించాలనేది రేసర్, ఇంజనీర్, వ్యవస్థాపకుడు, బ్రూస్ మెక్లారెన్ కల. దాదాపు 6 దశాబ్దాలుగా, మెక్లారెన్ ప్రతి సూపర్‌కార్ , హైపర్కార్లతో హైపెర్ ఫామెన్స్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో అగ్రగామిగా ఉంది. కాగా ప్రపంచ విస్తరణ ప్రణాళికలలో కీలకమైన మార్కెట్‌గా ఇండియాను భావిస్తోంది. అయితే రానున్న మెక్లారెన్స్ కార్లు లంబోర్ఘిని, మెర్సిడెస్-బెంజ్ ఏఎంజీ, BMW M, మసెరటి, పోర్స్చే, జాగ్వార్ లాంటి సూపర్ మోడల్కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
శాంసంగ్ గెలాక్సీ జెడ్ మోడల్స్ , డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఇండియా ఫోల్డేబుల్ విభాగంలో గెలాక్సీ జడ్ ఫ్లిప్4, ఫోల్డ్4 మోడళ్లను ఆవిష్కరించింది. ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ఇక్కడి మార్కెట్లో వీటిని పరిచయం చేశారు. వేరియంట్‌నుబట్టి ధర రూ.90 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ప్రీ-బుకింగ్‌లు భారతదేశంలో 50,000 దాటినట్లు దక్షిణ కొరియా దిగ్గజం ఇటీవల ప్రకటించింది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 అడాప్టివ్ 120 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ మెయిన్ స్క్రీన్, 1.9 అంగుళాల సూపర్ అమోలెడ్ 60 హెట్జ్ కవర్ డిస్ప్లేతో ఫ్లిప్4 రూపుదిద్దుకుంది. 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ పొందుపరిచారు. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 8GB/256GB వేరియంట్ ధర రూ. 94,999గాను, బెస్పోక్ ఎడిషన్ 8GB/256GB రూ. 97,999 గా ఉంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్4 ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేతో 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 1-120 హెట్జ్ మెయిన్ స్క్రీన్, ఇన్ఫినిటీ–ఓ డిస్ప్లేతో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 48–120 హెట్జ్ కవర్ స్క్రీన్‌తో ఫోల్డ్4 తయారైంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఏర్పాటు ఉంది. Galaxy Z Fold 4 బేస్ వేరియంట్ (12GB/256GB) రూ. 1,54,999గా నిర్ణయించింది. ఇక 12GB/512GB , 12GB/1TB ధరలు వరుసగా రూ. 1,64,999 రూ. 1,84,999గాఉన్నాయి. ఆఫర్లు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై జడ్ ఫోల్డ్4 ప్రీ-బుకింగ్‌తో రూ 8,000 క్యాష్‌బ్యాక్ లేదా జడ్ ఫ్లిప్4 బుగింగ్పై రూ. 7,000 తగ్గింపు పొందవచ్చు. దాని కోసం మీకువసరం. పాత ఫోన్‌తో exchange చేసుకుంటే 7 వేల నుంచి 8 వేల రూపాయల దాకా ప్రయోజనం లభిస్తుంది. Galaxy Z Fold 4ని ప్రీ-బుక్ చేసే కస్టమర్లు రూ. 34,999 విలువైన Galaxy Watch 4 Classic (46mm బ్లూటూత్)ని కేవలం రూ. 2,999కి కొనుగోలు చేయవచ్చు You have truly unfolded your world with the all-new foldables. We are delighted to share that #GalaxyZFold4 and #GalaxyZFlip4 have crossed 50,000+ pre-bookings! Thank you for your great response. pic.twitter.com/nyIbMtJPY0 — Samsung India (@SamsungIndia) August 18, 2022 -
రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ కొత్త 5జీ మొబైల్‌ని విడుదల చేసింది. Realme 9i పేరుతో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 9ఐకి 5జీ వెర్షన్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మూడు రంగుల్లో రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. చదవండి : నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు ధరలు, లభ్యత, ఆఫర్లు 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 14,999. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 16,999 ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 24, మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్ మీషోరూంలు, ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం. అలాగే లాంచింగ్ ఆఫర్‌గా రూ. 1000 తగ్గింపు ఆఫర్‌ను కూడా సంస్థ ప్రకటించింది. అంటే ముందుగా కొనుగోలు చేసిన వారికి 13,999, 15999ల రేంజ్లో ఈ ఫోన్లను సొంతంచేసుకోవచ్చు. (చదవండి: ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) Realme 9i 5జీ ఫీచర్లు 6.6 అంగుళాల డిస్ప్లే, Dimensity 810 చిప్సెట్ 2,400×1,800 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 12 ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాగా ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ చార్జర్ T100 ఇయర్ బడ్స్ Realme కొత్త 5G ఫోన్‌తో పాటు Realme Buds T100ని కూడా లాంచ్ చేసింది. T100 రూ. 1499 గాకంపెని నిర్ణయించింది. ఇవి మొత్తం 28 గంటల ప్లేబ్యాక్ సమయం, T100 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయని కంపెనీ తెలిపింది. రాకిన్ రెడ్, పాప్ వైట్, జాజ్ బ్లూ , పంక్ బ్లాక్ నాలుగు రంగుల్లో ఇవి లభ్యం. -
ఆల్ న్యూ ఆల్టో కే10- 2022 వచ్చేసింది.. మోర్ ఎనర్జీ ఫీచర్స్‌తో
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు) కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!) -
డైనమిక్ ఫీచర్లతో బీఎండబ్ల్యూ కొత్త బైక్స్, ధర తెలిస్తే షాక్!
సాక్షి,ముంబై: అంత్యంత ఖరీదైన బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ సిరీస్‌లో 2022 బైక్స్ మోడల్స్‌ను ఇండియా మార్కెట్లలో లాంచ్ చేసింది. లగ్జరీ బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022 మోడల్స్ బైక్స్‌ని ప్రీమియం టూరింగ్ రేంజ్లో బీఎండబ్ల్యూ ఇండియా తీసుకొచ్చింది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన కే 1600 గ్రాండ్ అమెరికా ధర రూ. 33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గాను, బేస్ వేరియంట్ ఆర్1250 ఆర్టీ ధరను రూ. 23.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గాను కంపెనీ నిర్ణయంచింది. R1250 RT, K 1600 బాగర్, K 1600 GTL, K 1600 గ్రాండ్ అమెరికా ఇలా నాలుగు వేరియంట్లలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022 బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభం. ఫ్రెష్ లుక్స్, డైనమిక్స్ ఫీచర్లతో పాటు, లెజెండరీ 2-సిలిండర్ బాక్సర్ ఇంజన్ బీఎండబ్ల్యూ ShiftCam లాంటి స్పెషల్ ఫీచర్లతో లాంగ్ హైవే రైడర్లకు స్మూత్ రైడింగ్ ఫీలింగ్ వస్తుందని కంపెనీ తెలిపింది. కే1600లో 6సిలిండర్ ఇన్-లైన్ ఇంజన్ అమర్చింది.ఇది 6750 RPM వద్ద 160 HPని, 5250 RPM వద్ద 180 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇక R 1250 RT లో 1254 cc ఇంజీన్ 7750 RPM వద్ద 136 HP, 6250 RPM వద్ద 143 Nm శక్తిని అందిస్తుంది. బీఎండబ్ల్యూ కే-1600 GTL డ్రాగ్ టార్క్ కంట్రోల్ (డైనమిక్ ఇంజన్ బ్రేక్ కంట్రోల్), డైనమిక్ ESA పవర్‌ట్రెయిన్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కనెక్టివిటీ, కొత్త 10.25-అంగుళాల TFT కలర్ డిస్ప్లే అద్భుతమైన రీడబిలిటీ , స్పష్టమైన మెను నావిగేషన్, ఆడియో సిస్టమ్ 2.0 ఫీచర్‌ను జోడించింది. ఈ కొత్త బైక్స్ వివిధ రంగుల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్‌ను సొంతం చేసుకున్న కస్టమర్లకు బీఎండబ్ల్యూ పలు ఆఫర్లు కూడా ఇస్తోంది. అన్ లిమిటెడ్ కిలీమీటర్లు, 3 సంవత్సరాల పాటు ప్రామాణిక వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్, 24×7 365-రోజుల బ్రేక్‌డౌన్ ప్యాకేజీ లాంటివి ప్రకటించింది. -
టాటా నెక్సాన్‌కు పోటీ:మహీంద్ర ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400 లాంచింగ్ డేట్ ఇదే!
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నమహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచింగ్డేట్ రివీల్అయింది. ఇండిపెండెన్స్ డే నాటి స్పెషల్ ఈవెంట్లో ఎక్స్‌యూవీతోపాటు 5 ఎలక్ట్రిక్ కార్ల (E8, XUV.E9, BE.05, BE.07 BE.09)ను పరిచయం చేసిన మహీంద్రా తాజాగా ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400 సెప్టెంబర్ 6న విడుదల చేయాలని యోచిస్తోందట. టాటా నెక్సాన్ EVకి ప్రత్యర్థిగా మార్కెట్లోకి అడుగుపెట్టపోతున్న ఈ కారు డెలివరీలు అక్టోబరు నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్దగా ఆకట్టుకోని REVAi, e2o ,eVerito తరువాత మహీంద్రా తీసుకొస్తున్న తొలి ఈవీ ఇది. ఈ వెహికల్లో 150హెచ్‌పీ శక్తిని అందించే ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్, రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ 700 మాదిరిగా క్యాబిన్ లోపల, Adreno X ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ADAS, తదితర ఫీచర్లతో రాబోతుందని అంచనా. -
జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్
ముంబై: రిలయన్స్ జియో మరో సంచలనానికి సన్నద్ధమవుతోంది. భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై హింట్ ఇచ్చినప్పటికీ, అంతకుమించి వివరాలను వెల్లడించారు. అయితే సరసమైన ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ వినియోగదారులకు అందించనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది రిలయన్స్ జియో , గూగుల్ సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు ఆగస్ట్ 29న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ 5 జీస్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని అంచనా.. జియో ఫోన్ 5జీ ధర: అంచనా 5జీ జియో ఫోన్ ధర సుమారు 12 వేల రూపాయల లోపునే ఉండనుందట. అలాగే జియో ఫోన్ నెక్స్ట్ మాదిరిగానే, వినియోగదారులు రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని మార్కెట్ వర్గాల్లో ఊహాగానాలు విరివిగా ఉన్నాయి.గతంలో లాగానే ఈఫోన్ కొనుగోలు చేసినవారికి అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఇతర బంపర్ ఆఫర్లను అందించనుందట జియో.పూర్తి వివరాలు అధికారంగా ప్రకటించేంతవరకు సస్పెన్స్ తప్పదు.! జియో 5జీ ఫోన్ ఫీచర్లు 6.5 అంగుళాల HD డిస్ప్లే ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 సాక్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ 13ఎంపీ ప్రైమరీ సెన్సార్+2 ఎంపీ డ్యూయల్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా -
వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్
ముంబై: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఇండియా తన ఫ్లాగ్షిప్ మొబైల్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 10టీ 5 జీ పేరుతోఈ స్మార్ట్‌ఫోన్‌ను 16 జీబీ వేరియంట్‌తో భారతదేశంలో అత్యుత్తమ ర్యామ్‌తో తీసుకొచ్చింది. మొత్తం 8, 12, 16జీబీ ర్యామ్ వేరియంట్లలో లాంచ్ చేసింది. 12జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54999గా నిర్ణయించింది. అలాగే 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధరను రూ. 55999గా ఉంచింది. 8 జీబీ వేరియింట్పై అమెజాన్, వన్‌ప్లస్ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్ (8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్) 49వేల 999 రూపాయలకు అందుబాటులో ఉంచింది. అయితే అమెజాన్, వన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా తగ్గింపు ధరలో దీన్ని కొనుగోలు చేయవచ్చ. దీంతోపాటు ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుచేస్తే 3 వేల తగ్గింపు లభిస్తుంది. అలాగే కోటక్ బ్యాంక్ కార్డు కొనుగోలుతో ఈఎంఐ ఎంచుకున్నవారికి 1500 తగ్గింపు అదేవిధంగా, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే 1500 ధరతగ్గుతుంది. అంతేకాకుండా పాత వన్‌ప్లస్ సెల్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా వినియోగదారులు రూ. 15,750 దాకా ప్రయోజనం పొందవచ్చు. వన్‌ప్లస్ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.7-అంగుళాల పూర్తి-HD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే 1080×2,412 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ 50MP, 8MP 2MP ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,800mAh బ్యాటరీ 150వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ -
మిషన్ ఎలక్ట్రిక్ 2022: మెగా ఈవెంట్లో ఓలా ఏం చేయబోతోంది?
సాక్షి, ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఏడాది కూడా సంచలనానికి తెరతీయనుందా? ఆగస్టు 15న మిషన్ ఎలక్ట్రిక్ 2022 పేరుతో తన ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో ఓలా కొత్త ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటర్ , ఈవీ బ్యాటరీని లాంచ్ చేయనుందనే అంచనాలు ఊపందుకున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఓలాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15, 2022న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఈ మేరకు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తన వీల్స్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్లో ఎలక్ట్రిక్ కారు చిన్న వీడియోను షేర్ చేశారు. ఎలక్ట్రిక్ కారును ప్రకటిస్తూ అగర్వాల్ ట్విటర్లో ఒక వీడియోను పంచుకున్నారు. “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్. 15 ఆగస్ట్ 2గంటలకు కలుద్దాం" అంటూ ట్వీట్ చేశారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో రెండు కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేయనుంది. ఫ్లాగ్షిప్ S1 ప్రోతో పోలిస్తే మరింత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని భావిస్తున్నారు.గత ఏడాది ఇదే రోజున ఓలా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. S1, S1 ప్రో వేరియంట్లను పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం S1 అమ్మకాలను నిలిపివేసి , S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తున్న సంగతి గమనార్హం Wheels of the revolution! pic.twitter.com/8zQV3ezj6o — Bhavish Aggarwal (@bhash) August 13, 2022 -
మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ స్విఫ్ట్‌లో S-CNG వెర్షన్‌ను దేశంలో విడుదల చేసింది. హ్యాచ్‌బ్యాక్ కారు రెండు (VXi , ZXi) వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు కిలోకి 30.90 కిలోమీటర్లతో మోస్ట్పవర్ఫుల్, అద్భుతమైన ఇంధన సామర్థ్యమున్న హ్యాచ్‌బ్యాక్ కార్ అని కంపెనీ చెబుతోంది. మారుతి కొత్త స్విఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 7.77 లక్షల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం. అలాగే నెలవారీ సబ్స్క్రిప్షన్ రుసుముతో రూ. 16,499తో (అన్ని కలుపుకొని) ఈ కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో 6,000rpm వద్ద 76bhp, 4,300rpm వద్ద 98Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే వచ్చింది. 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGలో డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, (ECU) ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను జోడించింది. తుప్పు ఎలాంటి లీకేజీ లేకుండాస్టెయిన్లెస్ స్టీల్ పైపులు, జాయింట్లతో ఈ మోడల్ మరింత సేఫ్టీగా ఉంటుందని కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
2023 ఆడి క్యూ3 బుకింగ్స్ షురూ, తొలి కస్టమర్లకు ఆఫర్లు
సాక్షి, ముంబై: లగ్జరీకార్ల సంస్థ ఆడి 2023 ఆడి క్యూ3ని పరిచయం చేసింది. లగ్జరీ ఎస్యూవీ ఆడి క్యూ3ని ముందస్తు బుకింగ్ కోసం అందుబాటులో ఉంచింది. రూ. 2 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితేముందుగా బుక్ చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) వినూత్న డిజైన్,బెస్ల్ఇన్ క్లాస్ ఎమినిటీస్‌తో తమ బెస్ట్-సెల్లింగ్ మోడల్ కొత్త ఆడి క్యూ3ని దక్కించుకునేందుకు అద్భుత అవకాశమని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. వినియోగదారులు www.audi.inలో లేదా 'myAudi కనెక్ట్' యాప్ ద్వారా కారును ఆన్లైన్లో కాన్ఫిగర్ చేసి, ఆర్డర్ చేయవచ్చు. 2023 ఆడి క్యూ 3 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం ప్లస్ అండ్, టెక్నాలజీ, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించింది. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) అలాగే, మొదటి 500 మంది కస్టమర్లు 2+3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీతోపాటు 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు ఉచిత సర్వీస్ ప్యాకేజీలాంటి ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆడి కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరాతో, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్స్టీరియర్ మిర్రర్స్, పవర్-అడ్జస్టబుల్, హీటెడ్, పవర్ ఫోల్డింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ఇంటర్ఫేస్,6-స్పీకర్ ఆడియో సిస్టమ్ అందిస్తోంది. 2023 ఆడి క్యూ3లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 190 పిఎస్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్లు వేగం పుంజుకుంటుంది. ప్రీమియమ్ ప్లస్ వేరియంట్లో 18-అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హై గ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ, 4-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. -
మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ మోటారోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో మోటో జీ62 5 జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌నుతీసుకొచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే,స్నాప్‌డ్రాగన్ 695 SoCతో దీన్ని విడుదల చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరాలో నైట్ విజన్, సినిమాగ్రాఫ్, పోర్ట్రెయిట్, లైవ్ ఫిల్టర్, డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్ లాంటి ఫీచర్లను జోడించింది.అలాగే ఫ్రంట్ కెమెరా ఫేస్ బ్యూటీ , స్లో మోషన్ వీడియోలకు సపోర్ట్ చేసే సెల్ఫీకెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) భారతదేశంలో మోటో జీ62 5జీ ధర,ఆఫర్లు 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. వీటి ధరలు ధర రూ.17,999, రూ. 19,999గా ఉంచింది. హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంక్ నుండి బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 1500 తగ్గింపు. అంటే ఈ ఫోన్‌ను దీని తుది రూ. 16,499 సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న కొనుగోలుదారులు రూ. 1,750 వరకు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మిడ్నైట్ గ్రే ,ఫ్రాస్టెడ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది ఆగస్ట్ 19 మధ్యాహ్నం 12 PM తొలి సేల్ ఉంటుంది. మోటో జీ62 5 జీ ఫీచర్లు 6.55 అంగుళాల పంచ్-హోల్ LCD డిస్ప్లే 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డడ్రాగన్ 695 సాక్ 1 టీబీవరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 50+8 +2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000mAh బ్యాటరీ -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్‌గా మల్టీప్లేయర్ గేమ్స్‌తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్‌లలో అద్భుతమైన విజువల్స్‌ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్‌తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్‌తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్‌తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్‌కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్‌లైటింగ్ లోకల్ డిమ్మింగ్‌తో గేమింగ్‌కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్‌తో మీ వాయిస్‌ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్‌ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్‌ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్‌తో అధునాతన ఫోటో ఫ్రేమ్‌గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్‌ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!
సాక్షి,ముంబై: హోండా 2వీలర్స్ తన కస్టమర్లకు మరో చక్కటి స్కూటర్‌ను అందించనుందా. కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ ఈ అంచనాలనే బలపరుస్తోంది. “కమింగ్ సూన్” అంటూ రానున్న హోండా యాక్టివా స్కూటర్‌పై వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రానున్న కొత్త స్కూటర్ ఫీచర్లు లాంటి విషయాలపై హోండా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ టీజర్‌లోని సిల్హౌటీని చూసి హోండా యాక్టివా 7జీ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా 6జీని తీసుకొచ్చింది. ఫ్రంట్ టర్న్ ఇండికేటర్లు, హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, హ్యాండిల్ బార్స్తోపాటు, కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో హోండా యాక్టివా 7జీ రానుంది. అయితే యాక్టివా 6 జీ మోడ్‌తో పోలిస్తే ఫీచర్లను మరింత అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. (జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్) BS6-కంప్లైంట్ 109.51cc, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సింగిల్-సిలిండర్ ఇంజన్ని ఉపయోగిస్తుంది. ఈ మోటార్ 8,000rpm వద్ద 7.79bhpను, 5,250rpm వద్ద 8.79Nm శక్తిని అందిస్తుంది. 'సైలెంట్ స్టార్ట్' సిస్టమ్, పాస్ లైట్ స్విచ్, 12 అంగుళాల ఫ్రంట్ వీల్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ యూనిట్‌తో సహా చాలా ఫీచర్లు యథావిధిగా ఉంటాయని అంచనా. అలాగే టీవీఎస్ జూపిటర్ వంటి ప్రత్యర్థులు కూడా అందిస్తున్న బ్లూటూత్ కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లను వచ్చే దీపావళి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం. చదవండి : Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? రాబోయే హోండా హోండా యాక్టివా 7జీ ఖరీదైనదిగా ఉండనుందట. ప్రస్తుత స్టాండర్డ్ మోడల్ ధర రూ. 72,400, డీలక్స్ వేరియంట్‌కు రూ. 74,400 వద్ద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇది హీరో ప్లెజర్ ప్లస్, టీవీఎస్ జూపిటర్ప్లస్, హీరో Maestro Edge 110, యమహా ఫాసినోలాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. Raise the bar with style that is unlike any other. Stay tuned! pic.twitter.com/u9RwNWe48F — Honda 2 Wheelers (@honda2wheelerin) August 9, 2022 -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్‌షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్‌లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!
సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్పోర్టీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హోండా డియో స్పోర్ట్స్ పేరుతో రెగ్యులర్ డియో మోటో-స్కూటర్ స్పోర్టీ వెర్షన్‌గా లాంచ్ చేసింది. అయితే లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొచ్చిన హోండా స్పోరర్ట్స్ పరిమిత కాలంలోనే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర 68,317/- (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ డీలక్స్ వేరియంట్ ధర రూ. 73,317 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ ప్రకటించింది. రెగ్యులర్ డియో స్టాండర్డ్ , డీలక్స్ ధర రూ. 73,599, రూ. 77,099 (ఎక్స్-షోరూమ్)ధరలతో పోలిస్తే కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధరలు చౌకగా ఉండటం విశేషం. ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ స్పోర్టీ రెడ్ రియర్ సస్పెన్షన్‌తో తీసుకొచ్చిన హోడా డియో స్పోర్ట్స్ స్కూటర్ బ్లాక్‌తో స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ ,స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ 2 కలర్ స్కీమ్‌లలో వస్తుంది. డీలక్స్ వేరియంట్ అదనంగా అల్లాయ్ వీల్స్‌ను అందిస్తుంది. 110 cc PGM-FI ఇంజిన్‌తో మెరుగైన స్మార్ట్ పవర్ (eSP) సాంకేతికతను అందిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్, పాస్ స్విచ్ , ఇంజన్ కట్-ఆఫ్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా డియో స్పోర్ట్స్‌లో హోండా కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS) ఈక్వలైజర్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం 3-స్టెప్ ఎకో ఇండికేటర్‌ని జోడించింది. -
వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది.. ఆఫర్ అదిరింది!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్10టీ పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది. ఈ 5జీ మొబైల్ ప్రారంభ ధర రూ. 49,999గా ఉంచింది. వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఇంతకుముందు తీసుకొచ్చిన వన్‌ప్లస్ ప్రో కంటే అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. అలాగే తొలి వన్‌ఫ్లస్ 16 జీబీ స్మార్ట్‌ఫోన్. ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ను తొలగించిన తొలి వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.. (చదవండి: గుడ్ న్యూస్: డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ కోత) ధర,ఆఫర్, లభ్యత) 8జీబీ/128 జీబీ స్టోరేజ్‌ధర రూ. 49,999. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 54,999. 16 జీబీ, 256 జీబీ ధర రూ.55,999. అయితే ఐసీఐసీఐ, లేదా ఎస్బీఐ కార్డుల ద్వారా OnePlus 10T 5జీని కొనుగోలు చేస్తే, వినియోగదారులు రూ. 5,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంటే 8జీబీ/128 జీబీ స్టోరేజ్‌ధర రూ. 44,999, 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్రూ. 49,999, 16 జీబీ, 256 జీబీ రూ. 50,999లకే సొంతం చేసుకోవచ్చు. మూన్‌స్టోన్ బ్లాక్ , జేడ్ గ్రీన్ కలర్స్‌లో, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యం. OnePlus 10T ప్రీ బుకింగ్ షురూ అయ్యాయి. ఓపెన్ సేల్స్ ఆగస్టు 6న ప్రారంభం కానున్నాయి. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 10టీ 5జీ ఫీచర్లు 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED ప్యానెల్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ OS 12.1 50 + 8 + 2ఎంపీ ట్రిపుల్ వెనుక కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4800mAh బ్యాటరీ 150W ఛార్జింగ్ ఇదీ చదవండి: Fortune Global 500: రిలయన్స్ హైజంప్, ర్యాంకు ఎంతంటే? -
టాటా టియాగో కొత్త వెర్షన్ వచ్చేసింది! ధర చూస్తే...
సాక్షి, ముంబై: టాటామోటార్స్ టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ కారును బుధవారం లాంచ్ చేసింది. ఎన్ఆర్జీ తొలివార్షికోత్సవాన్ని పురస్కరించు కుని, క్రాస్ఓవర్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. 6.42 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఊహించినట్టుగానే ఎక్స్‌టీ వేరియంట్‌తో పోలిస్తేకొత్త ఫీచర్లను జోడించిమరీ 41వేల రూపాయల ధర తగ్గించింది. ఇంజీన్, ఫీచర్లు టాటా కొత్త ఎంట్రీ-లెవల్ కారు టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ వేరియంట్ 2 ట్రిమ్‌లలో లభిస్తుంది. మాన్యుల్ గేర్ బాక్స్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజీన్‌ను పొందుపర్చింది. 14-అంగుళాల హైపర్‌స్టైల్ వీల్స్, హర్మాన్ 3.5-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ లాంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. అలాగే రిథమ్ ప్యాక్ కావాలంటే అదనంగా 30వేలు చెల్లించాలి. మిడ్నైట్ ప్లమ్ కలర్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఒపల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ ఫ్లేమ్ రెడ్ కలర్స్‌లో ఇది లభ్యం. The wait is finally over! Introducing the all-new Tiago XT NRG, built for the ones who dare to #LiveDifferent. Get, Set, and #DoMoreWithXTraNRG in your all-new #TiagoXTNRG. Visit https://t.co/Hq2GY0aoPI to book your #Tiago.#TiagoNRG #UrbanToughroader #SeriouslyFun pic.twitter.com/8CNPaaGOV1 — Tata Motors Cars (@TataMotors_Cars) August 3, 2022 -
వన్‌ప్లస్‌కి పోటీ: ఐకూ 9టీ 5జీ వచ్చేసింది..ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: వివో అనుబంధ సంస్థ ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఐకూ 9టీ 5జీ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, పంచ్-హోల్ డిజైన్‌తో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు రియర్ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయ. ఆప్టిమైజ్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం Vivo V1+ ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ ను ఇందులో అమర్చింది. మరోవైపు వన్‌ప్లస్ రేపే( ఆగస్టు 3న ) వన్ ప్లస్10టీ లాంచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఐకూ 9టీ 5జీ విడుదల కావడం విశేషం. ఐకూ 9టీ 5జీ ఫీచర్లు 6.78 అంగుళాల E5 AMOLED ఫ్లాట్ డిస్ప్లేను పూర్తి HD+ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50ఎంపీ మెయిన్ కెమెరా, 13+2+12 ఎంపీ కెమెరాలు 4,700mAh బ్యాటరీ, W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్ రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. వీటి ధరలు వరుసగా రూ.49,999 , రూ.54,999. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం. iQOO 9T 5G iQOO ఇండియా వెబ్సైట్ ద్వారా సేల్ షేరూ అయింది. iQOO.com ద్వారా 9Tని కొనుగోలు చేసిన వారికి రూ. 3,999 విలువైన గేమ్‌ప్యాడ్ ఉచితం. అమెజాన్ ఆగస్టు 4 నుంచి అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ ఆఫర్‌తో, వినియోగదారులు రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది.అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. -
Hero Super Splendor Canvas Black Edition: అదిరిపోయే లుక్స్, డిజైన్‌తో
సాక్షి, ముంబై: హీరో కంపెనీ స్ప్లెండర్ మోడల్లో ఒక సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను కంపెనీ ప్రకటించింది. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. హీరో సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ ఫీచర్లు, ఇంజన్ ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్డేటెడ్ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హీరో వెల్లడించింది. డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ఎంపికతో వస్తుంది. డిజి-అనలాగ్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ USB ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. 5 సంవత్సరాల వారంటీతో పాటు, గ్రాఫిక్స్‌తో కస్టమర్లు కస్టమైజ్ చేసుకునే చాన్స్ కూడాఉంది. ఈ బైక్‌లోని 125cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 RPM వద్ద 10.7 HP , 6000 RPM వద్ద 10.6 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్‌తో పాటు, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, సరికొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అందించింది. చదవండి: 2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ! -
వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!
సాక్షి,ముంబై: వోల్వో ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. XC40 రీఛార్జ్ ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధరను రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంచింది. పెట్రోల్‌వెహికల్ ఎక్స్‌సి 40తో పోలిస్తే రూ 1.40 లక్షలు ఎక్కువ. బెంగళూరు సమీపంలోని హోస్కోట్లోని వోల్వో యూనిట్లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది. ఇది వోల్వో వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గలకొనుగోలుదారులు రూ. 50వేలు చెల్లించి రేపటి(జూలై27)నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఎక్స్‌సీ40 రీఛార్జ్ 11kW వాల్-బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది.కారుపై మూడేళ్ల వారంటీతోపాటు, బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది. వోల్వో XC40 రీఛార్జ్ 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78kWh బ్యాటరీని ఈ కారులో అందించింది. 33 నిమిషాల్లో కారులో 10 నుండి 80 శాతం వరకు, 50kW ఫాస్ట్ ఛార్జర్‌తో సుమారు 2.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది. 418km పరిధితో, ఎక్స్‌సీ40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ "ట్విన్" వెర్షన్లో అందుబాటులో ఉంది, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408hp , 660Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్‌తో నడిచే XC40 కంటే దాదాపు రెండు రెట్లు శక్తివంతమైందనీ, లగ్జరీ ఆడి ఇ-ట్రాన్ 55 క్వాట్రో పోలి ఉందని భావిస్తున్నారు. 55.90 లక్షల ధరతో, XC40 రీఛార్జ్ ఒకవైపు మినీ కూపర్ ఎస్ఈ, BMW i4 , Kia EV6 వంటి లగ్జరీ ఈ-కార్లకు గట్టిపోటి ఇస్తుందని అంచనా. -
మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్: ధరలు ఎలా ఉన్నాయంటే..!
Mahindra Scorpio N Price, సాక్షి,ముంబై: మహీంద్ర లేటెస్ట్ మిడ్ సైజ్ వెహికల్ 2022 మహీంద్రా స్కార్పియో-N ధరలను కంపెనీ ప్రకటించింది. లాంచ్ అయిన నెల తరువాత ఆల్-న్యూ మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్ వేరియంట్లు, టాప్-స్పెక్ 4X4 ట్రిమ్ వేరియంట్ల ధరలు తాజాగా బహిర్గత మైనాయి. వేరియంట్ వారీగా ఈ కారు ధరలు రూ. 11.99 లక్షల నుండి రూ. 23.90 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉండనున్నాయి. బుకింగ్‌లు ఆన్లైన్లో, ఏకకాలంలో మహీంద్రా డీలర్‌షిప్‌లలో జూలై 30, ఉదయం 11 గంటల నుండి ప్రారంభం. బుకింగ్‌లు 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన, కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి డెలివరీ తేదీ ఆధారపడి ఉంటుంది.సెప్టెంబరు 26న ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 అర్ధరాత్రి వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే బుకింగ్ ఎడిట్ చేసుకునే చాన్స్ ఉంటుంది. మాన్యువల్ ట్రిమ్ తో పోలిస్తే Z4 నుండి Z8 L వరకు ప్రతి ఆటోమేటిక్ ట్రిమ్ ధర 1.96 లక్షలు అదనం. అంతేకాదు ప్రారంభ ధరలు మొదటి 25,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని మహీంద్రా తెలియజేసింది. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్ గత నెలలో ఇండియాలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద ప్రారంభించగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23.90 లక్షలుగా ఉంటుంది. ఐదు ట్రిమ్స్‌లో లభ్యం. Z2, Z4, Z6, Z8 & Z8 L, అనే వేరియంట్లలో పెట్రోలు, డీజిల్ వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్) Z2 రూ.11.99 లక్షలు నుంచి రూ.12.49 లక్షలు Z4 ధరలు: రూ.13.49 లక్షలు, రూ.15.45 లక్షలు, రూ.13.99 లక్షలు, రూ.16.44 లక్షలు రూ.15.95 లక్షలు, రూ.18.40 లక్షలు Z6 ధరల: రూ.14.99 లక్షలు , రూ.16.95 లక్షలు Z8 ధరలు: రూ.16.99 లక్షలు, 18.95 లక్షలు, 17.49 లక్షలు, 19.94 లక్షలు, రూ19.45 లక్షలు రూ.21.90 లక్షలు Z8 L ధర : రూ.18.99 లక్షలు, రూ.20.95 లక్షలు, రూ.19.49 లక్షలు, రూ.21.94 లక్షలు రూ.21.45 లక్షలు, రూ. 23.90 లక్షలు -
రూ. 8 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌టీవీ, ఫీచర్లు సూపర్
న్యూఢిల్లీ: 10 వేల రూపాయల లోపు స్మార్ట్ టీవీకోసంఘ ఎదురుచూస్తున్న వారికి చక్కని అవకాశం. ఇన్ఫినిక్స్ ఇండియా (ట్రాన్సియాన్ గ్రూపు) తక్కువ ధరలో ‘వై1 స్మార్ట్ టీవీ’ ఇటీవల లాంచ్ చేసింది. దాదాపు 9 వేల రూపాయలకే 32 అంగుళాల ఈ టీవీని పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర, ఫీచర్లను ఒకసారి చూద్దాం. 32 అంగుళాల ‘వై1 స్మార్ట్ టీవీ’ని ధర రూ.8,999కు అందిస్తోంది ఇన్ఫినిక్స్. ఈ టీవీలో ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5, ఎరోస్‌నౌ, ఆజ్‌తక్ తదితర ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్స్టాల్ చేసి ఉంటాయని సంస్థ తెలిపింది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం తగ్గింపును పొందవచ్చు, అంటే రూ.900. తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం 8,099 రూపాయలకే వై1 స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చు. డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్‌తో, 20 వాట్ అవుట్‌పుట్ స్పీకర్లతో ఇది వస్తుంది. అలాగే, 512 ఎంబీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజీతో, మూడు హెచ్డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఒక ఆప్టికల్, ఒకటి లాన్, ఒకటి మిరాకాస్ట్, వైఫై, క్రోమ్‌కాస్ట్‌తో ఉంటుందని ఇన్ఫినిక్స్. తెలిపింది. దేశీ మార్కెట్లో అతి చౌక స్మార్ట్ టీవీగా దీన్ని పేర్కొంది. -
ఎట్టకేలకు ‘సిట్రోయెన్ సీ3’ లాంచ్, ధర, ఫీచర్ల వివరాలివిగో!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ సీ 3 కార్లను ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మంట్లో వీటిని సరికొత్తగా తీసుకొచ్చింది. ఈ కార్ ధరను రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్, పరిచయ ధర) గా కంపెనీ నిర్ణయించింది. భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ హౌస్ నుండి వచ్చిన తొలి చిన్న ఎస్యూవీ ఇది. మొత్తం ఆరు వేరియంట్లలో, పది రంగుల్లో సిట్రోయెన్ సీ3 లభిస్తుంది. ఈ ఫైవ్ సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తిగా ఇండియా కస్టమర్లకోసం లాంచ్ చేయడం విశేషం. ఇంజన్, ఫీచర్లు రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభ్యం. 5 స్పీడ్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5,750 ఆర్పీఎం వద్ద 81 బీహెచ్పీ, 115 టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 5,750 ఆర్పీఎం వద్ద, 108 బీహెచ్పీని, 1150 ఆర్పీఎం వద్ద 190 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఫంకీ డిజైన్, V-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్స్ అమర్చింది. డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్, చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో సిట్రోయెన్ సీ3 ముస్తాబైంది. డ్యూయల్-టోన్ డాష్ బోర్డ్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటీరియర్ ఫీచర్లుగా ఉన్నాయి. సిట్రోయెన్ సీ3 ధరలు లైవ్: రూ. 5,70,500 ఫీల్: రూ. 6,62,500 ఫీల్ వైబ్ ప్యాక్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 6,92,500 టర్బో ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 8,05,500 దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లా మైసన్ సిట్రోయెన్ ఫిజిటల్ షోరూమ్‌లలో వినియోగదారులకు కొత్త సీ3 డెలివరీలు నేటి (జూలై 20) నుండి ప్రారంభం. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, చండీగఢ్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ వంటి 19 నగరాల్లోని లా మైసన్ సిట్రోయెన్ ఫైజిటల్ షోరూమ్‌లలో కొత్త సిట్రోయెన్ సీ3 రిటైల్‌గా అందుబాటులో ఉంది. -
మారుతి ఆల్ న్యూ గ్రాండ్ విటారా: సరికొత్త టెక్నాలజీతో
సాక్షి, ముంబై: మారుతితి సుజుకి గ్రాండ్ విటారాను ఎట్టకేలకు ఈ రోజు (జూలై 20) ఇండియాలో పరిచయం చేసింది. అర్బన్ క్రూయిజర్, గ్లాంజా తరువాత టయోటా సుజుకి భాగస్వామ్యంతో తయారైన కొత్త మోడల్ ఎస్యూవీ గ్రాండ్ విటారా. 28 కిలోమీటర్ల మైలేజీ ఎస్‌యూవీగా కంపెనీ వెల్లడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి డీలర్షిప్ వద్ద లేదా ఆన్లైన్లో రూ. 11,000తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. 2020 మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్యూవీ ధర రూ.9.50 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండనుంది. డిజైన్, ఫీచర్లు, ఇంజన్ గ్రాండ్ విటారా ఎస్యూవీ కూడా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్యూవీ మాదిరిగానే ఉన్నా. SUV క్రోమ్ స్ట్రిప్, ట్రైఎల్ఈడీ టెయిల్ లైట్ల పొడవైన బంపర్, స్పోర్టి ఎయిర్ డ్యామ్, పూర్తి-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ స్పెషల్. ప్రత్యేకమైన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుపర్చింది. 27.97km మైలేజీని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే,వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్-డిస్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా , అనేక ఇతర స్మార్ట్ కార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగూ ఆల్‌గ్రిప్ AWD సాంకేతికతను కూడా జోడించింది. AllGrip సిస్టమ్‌లో ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ అనే నాలుగు మోడ్లు అందుబాటులో ఉంటుంది. ఏడబ్యూడీ టెక్నాలజీని అందించిన మారుతి సుజుకీ ఏకైక కారు గ్రాండ్ విటారా. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణీకులకు 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం. ఇందులో ఒకటి 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్. ఇది 92hp , 122Nm టార్క్‌ను, 79hp, 141Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్రెజ్జా, XL6 , ఎర్టిగాలో ఇదే ఇంజన్‌ను అమర్చింది.ఇది 103hp , 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
టర్బో ప్రాసెసర్, భారీ కెమెరా, అతితక్కువ ధర: ‘వివో టీ1ఎక్స్’
సాక్షి, ముంబై: మొబైల్ మేకర్ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. T-సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందించనుంది. వివో టీ1 ఎక్స్ పేరుతో, మూడు వేరియంట్లలో ఈ మొబైల్‌ను బుధవారం తీసుకొచ్చింది. వివో టీ1 ఎక్స్ బేసిక్ మోడల్ ధరను ధర రూ. 11,999గా ఉంచింది. వివో టీ1 ఎక్స్ ఫీచర్లు 6.58 అంగుళాల FHD+ డిస్ప్లే క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ ఆండ్రాయిడ్ 12 OS 50MP డ్యూయల్ కెమెరాలు 8MP సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ,18W ఫాస్ట్ ఛార్జింగ్ ధరలు, లభ్యత 4 జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ రూ. 11,999, 4 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 10,999 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్రూ. 14,999 గ్రావిటీ బ్లాక్ , స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్ వివో ఇ-స్టోర్ ద్వారా జూలై 27వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల కొనుగోళ్లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తుంది. Arm yourself with the all-new #vivoT1x that gets you, and your action-packed life! Take your gaming experiences to the max with Turbo Snapdragon 680 Processor, while you stay uber cool with the Segment’s First Turbo 4 Layer Cooling System. Sale starts 27th July on @Flipkart pic.twitter.com/YhIlm5MQye — Vivo India (@Vivo_India) July 20, 2022 -
అనూహ్యంగా ‘గూగుల్ పిక్సెల్ 6 ఏ’ వచ్చేస్తోంది!
సాక్షి, ముంబై: ఊహించిన దానికంటే ముందుగానే గూగుల్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. తాజా సమాచారం ప్రకారం గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌ను రేపే ( జూలై 21న) భారత మార్కెట్లో విడుదల కానుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ లాంచింగ్‌ను గూగుల్ ఇంకా ధృవీకరించలేదు. అయితే, గత రెండు రోజులుగా, హ్యాండ్సెట్లు ఇండియాకు షిప్ అవుతున్నాయన్న ఊహాగానాల మధ్య లాంచింగ్ అంచనాలు ఊపందుకున్నాయి. గూగుల్ పిక్సెల్ 6ఏ బాక్స్ ధర రూ. 43,999 అయినప్పటికీ ఇండియాలో రూ. 37,000లుగా ఉండవచ్చని అంచనా. అమెరికాలో దీన్ని సుమారు రూ. 35,000లకు విక్రయిస్తోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెక్స్ 6.1 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ 12 OS 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 12.2MP + 12ఎంపీ డ్యూయల్ కెమెరాలు 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4306 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ -
ఆ హై-స్పీడ్ ఈ-స్కూటర్లు వచ్చేశాయిగా.. ఫీచర్లు, ధర?
సాక్షి, ముంబై: ఈవీయం మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా4కి చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్ ఈవీయం పేరుతో కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాస్మో, కామెట్ , జార్ అనే పేరుతో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా( ఎక్స్-షోరూమ్) వరుసగా రూ. 1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, 2.16 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. వీటి బుకింగ్‌లు ఆగస్టు 8 నుంచి మొదలు కానున్నాయి. మూడు ఇ-స్కూటర్లు ఒకే 72V 31 Ah లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తితో పని చేస్తాయి. అయితే వీటి మైలేజీ, పరిధి, ఛార్జింగ్ టైం, ఎలక్ట్రిక్ మోటారు భిన్నంగా ఉంటాయి. కాస్మో, కామెట్ రెండూ 2000W ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చినప్పటికీ, టాప్-ఆఫ్-ది-లైన్ జార్ 4000W ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చింది. జార్, కామెట్ రెండూ ఒకే ఛార్జ్‌పై 150 కి.మీ పరిధిని, కాస్మో ఒకే ఛార్జ్‌తో 80 కి.మీ పరిధిని అందిస్తాయి. ఈ స్కూటర్లు స్పీడ్ మోడ్లు (ఎకో, నార్మల్, స్పోర్ట్స్) లభ్యం. కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, లేటెస్ట్ LCD డిస్ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రియల్ టైమ్ ట్రాఫికింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్, లొకేట్ మై వెహికల్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. కాస్మో అతి తక్కువ వేగాన్ని గంటకు 65 కి.మీ, కామెట్, జార్ రెండూ గంటకు 85 కిలీమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. భారతీయ మార్కెట్లో తమ బ్రాండ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, తమ మూడు ఈ-స్కూటర్లు వినియోగదారుల మనసు దోచుకుంటాయని విశ్వసిస్తున్నామని కంపెనీ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. -
3వ తరం ఏథర్ 450ఎక్స్ త్వరలోనే: అద్భుతమైన బ్యాటరీతో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త స్కూటర్‌ను తీసుకొస్తోంది. 3వ తరం 450X స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు(మంగళవారం) ఆవిష్కరించ నుంది. లాంచింగ్ తరువాత బుకింగ్‌లను స్టార్ట్ చేయనుంది. అలాగే ధర ఫీచర్లపై లాంచింగ్ తరువాత మాత్రమే అధికారిక కన్మఫరమేషన్ వస్తుంది. ప్రస్తుతం అందిస్తున్న 75-80 కిలోమీటర్ల పరిధితో పోలిస్తే ఒక్కచార్జ్కి 146 కి.మీ సామర్థ్యమున్న బ్యాటరీని అందించడం కీలకమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత ఏథోర్ 450ఎక్స్‌లోని 2.8 kWh బ్యాటరీతో పోలిస్తే 19 కిలోల నికెల్ కోబాల్ట్ ఆధారితంగా పెద్ద బ్యాటరీని ఈస్కూటర్లో జోడించింది. ప్రస్తుతమున్న వార్ప్, స్పోర్ట్, రైడ్, ఎకో ,స్మార్ట్ ఎకో రైడింగ్ మోడ్స్‌తో కొత్త 3వ-జెన్ ఏథర్ 450ని తీసుకురానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏథర్ 450 ప్లస్ ధర రూ.1.58 లక్షలు (ఆన్-రోడ్)గా ఉంది. అయితే 450ఎక్స్ ధర రూ. 1.81 లక్షలుగా ఉంటుందని అంచనా. తన ఉత్పత్తులకు ఎప్పుడూ ప్రీమియం ధరను నిర్ణయించే ఏథర్ ఎనర్జీ ఈ సారి కూడా అదే చేయబోతోంది. -
మారుతి కొత్త S-ప్రెస్సో, మోర్ ఫీచర్స్, మోర్ మైలేజీ, రూ.4.25 లక్షలు
సాక్షి, ముంబై: మారుతి సుజుకి ఇండియా కొత్త ఎస్-ప్రెస్సోను లాంచ్ చేసింది. 1.0 లీటర్ల నెక్స్ట్ జెన్ K-సిరీస్‌లో 2022ఎస్-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. సుమారు 1.44 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. పాత ఎస్-ప్రెస్సోతో పోలిస్తే, ఫీచర్లనుఅప్డేట్ చేసి, ధరను సుమారు 71,వేల రూపాయలు పెంచింది. అత్యాధునిక ఇంజీన్, ఎక్కువ మైలేజీతో మైక్రో-SUVగా తీసుకొచ్చింది. స్టార్ట్-స్ట్రాప్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ వీవీటీ ఇంజన్, మెరుగైన ఇంధన-సామర్థ్యం, అదనపు ఫీచర్లు కస్టమర్లకు ఆకర్షణీయమైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఫీచర్లు, మైలేజీ, ధర 1.0L డ్యూయల్ జెట్, ఐడిల్-స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో డ్యూయల్ వీవీటి ఇంజన్‌తో కొత్త S-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మోడల్ 4 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో స్టాండర్ట్, LXi, Vxi Vxi వేరియంట్లలో వస్తుంది. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 5.99 లక్షల మధ్య ఉంటుంది. దీని ఇంజీన్ 5,500rpm వద్ద 65bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎకానమీ 25.30 కిలోమీటర్ల మైలేజీ, అందిస్తుందని, అయితే మాన్యువల్ వెర్షన్ 24.76kmplని ఆఫర్ చేస్తుందని మారుతి వెల్లడించింది. స్టాండర్డ్, Lxi, Vxi Vxi+. మాన్యువల్ శ్రేణి ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు రూ. 5.49 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, ఏజీఎస్ గేర్‌బాక్స్ వరుసగా రూ. 5.65 లక్షలు ,రూ. 5.99 లక్షల ధర కలిగిన Vxi , Vxi+ వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉంది. Image source: Maruti Suzuki 5-స్పీడ్ మాన్యువల్, AGS(ఆటో-గేర్ షిఫ్ట్), ఎంట్రీ-లెవల్ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ప్రీ-టెన్షనర్లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ తోపాటు, హ్యాచ్‌బ్యాక్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, వాయిస్ కన్సోల్, ట్విన్ ఛాంబర్ హెడ్‌ల్యాంప్‌లు , డైనమిక్ సెంటర్ కన్సోల్ స్మార్ట్ ప్లే స్టూడియో లాంటివి ప్రధాన ఫీచర్లు. -
బీఎండబ్ల్యూ కొత్త స్పోర్టీ బైక్ : ఇంతకంటే తక్కువ ధరలో మరే బైక్ లేదట!
సాక్షి, ముంబై: బీఎండబ్ల్యూ ఎఫర్డ్బుల్ ప్రైస్‌లో సరికొత్త బైక్‌ను భారత మార్కెట్లో శుక్రవారం లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ తన తొలి జీ 310 ఆర్ఆర్ పేరుతో ఈ సూపర్ బైక్స్ మోడళ్లను విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ మోడల్స్కనునుగుణంగా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్తో ఆకర్షణీమైన రంగుల్లో తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ జీ310 ఆర్, జీఎస్ అడ్వెంచర్ టూరర్ తర్వాత 310 సిరీస్‌లో బవేరియన్ బ్రాండ్‌కు సంబంధించి మూడో మోడల్ ఇది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించిన కంపెనీ నెలకు రూ. 3,999ల ఈజీ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఈ ఫీచర్ల విషయానికి వస్తే ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను వెనుక టెయిల్-ల్యాంప్లలోని బుల్ హార్న్ స్టైల్ LED ఎలిమెంట్స్‌తో పాటు, రీడిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ, 5-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BI-LED ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ప్రధానంగా ఉన్నాయి. ఈ బైక్‌లో 313 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 9,700 rpm వద్ద 34 bhpని, 7,700 rpm వద్ద 27 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. ఇందులో రైడ్ , డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లున్నాయి. మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్210, కేటీఎం ఆర్సీ 390 లాంటి బైక్స్‌కి పోటీగా నిలవనుంది. Reveal your racing attitude with the first-ever BMW G 310 RR. Ex-showroom prices start at INR 2.85 Lakhs. Also available at an attractive EMI of INR 3,999 per month*. #BMWMotorradIndia #BMWMotorrad #BMWG310RR #G310RR #BMWG310RRBookingsOpen #NewLaunch #RevealYourRacingAttitude pic.twitter.com/whJ1QDSoDJ — BMWMotorrad_IN (@BMWMotorrad_IN) July 15, 2022 -
ఎస్యూవీ లవర్స్ కోసం: సరికొత్తగా న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ టక్సన్ 2022నికొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్ ఎస్యూవీ ఆగస్ట్ 4 ఇండియాలో లభ్యం కానుంది. కొత్త డిజైన్, పలు సేఫ్టీ ఫీచర్లతో దీన్ని తీసుకురానుంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్ తాజాగా ఎస్యూవీ కార్ లవర్స్ కోసం 2022 హ్యుందాయ్ టక్సన్ పోలరైజింగ్ డిజైన్, AWD, ADAS లాంటి ఫీచర్లు జోడించింది. హ్యుందాయ్ బెస్ట్ ఎస్‌యూవీగా ఉన్న ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ టక్సన్: డిజైన్, ఫీచర్లు ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కొత్తగా రూపొందించిన 'పారామెట్రిక్-జువెల్' గ్రిల్‌ను ఫ్రంట్ ఫాసియా , బంపర్‌పై హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌తో పాటు పదునైన కట్‌తో స్పోర్టినెస్ డిజైన్‌తో తీర్చిదిద్దింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC/VSM, హిల్ స్టార్ట్-స్టాప్ అసిస్ట్, లెవల్ 2 ADAS సూట్ వంటి 60 ప్లస్ సేఫ్టీ ఫీచర్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ , డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ లాంటి అనేక ఫీచర్లతో హ్యుందాయ్ టక్సన్ వస్తుంది. వాయిస్ ఆదేశాలకు మద్దతు ఇచ్చే హ్యుందాయ్ బ్లూలింక్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే 10.25అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్లెస్ ఛార్జర్లాంటి ఫీచర్లున్నాయి. హ్యుందాయ్ టక్సన్: ఇంజీన్ , ధర 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త Nu 2.0 పెట్రోల్ ఇంజన్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త ఆర్ 2.0 డీజిల్ ఇంజన్‌తో లభించనుంది. అంతేకాకుండా, ఇంజిన్లు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పని చేస్తాయి. ఎలాంటి కఠినమైన భూభాగంలో నావిగేట్ చేయగల సామర్థ్యం దీని సొంతం. హ్యుందాయ్ టక్సన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, దాదాపు రూ. 23 లక్షలు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ ఎస్యూవీ మార్కెట్లో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, ఇతర మోడళ్లతో పోటీపడనుంది. The all new @HyundaiIndia #TUCSON premieres in India. #HyundaiTUCSON #NextdriveNow #HyundaiSUVLife @MobilityOutlook pic.twitter.com/T0IaikZVAU — Deepangshu Dev Sarmah (@deepangshu) July 13, 2022 -
త్వరలో మోంట్రా ఈ–వాహనాలు
చెన్నై: మోంట్రా బ్రాండ్ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్లు రెండు నెలల్లో భారత మార్కెట్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. మురుగప్ప గ్రూప్ కంపెనీ అయిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియాకు (టీఐఐ) చెందిన టీఐ క్లీన్ మొబిలిటీ మోంట్రా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు టీఐఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ మురుగప్పన్ వెల్లడించారు. ‘కంపెనీ త్రిచక్ర వాహనాలు మార్కెట్లో సంచలనం సృష్టించనున్నాయి. ఇవి విలక్షణమైన, ఉన్నతమైన పనితీరు కలిగి ఉంటాయి. వినియోగదార్లు లక్ష్యంగా అధునాతన సాంకేతికతతో రూపొందుతున్నాయి. పర్యావరణ అనుకూల ఉత్పత్తులతో జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చడం మా ధ్యేయం. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన విపణి 2025 నాటికి 1.7 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో ఒకటిగా నిలవనుంది. తొలి ఏడాది చెన్నై ప్లాంటులో 75,000 యూనిట్ల త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తాం. ప్రయాణికులు, సరుకు రావాణాకు అవసరమైన వాహనాలను రూపొందిస్తాం. దేశవ్యాప్తంగా 40 కేంద్రాల్లో పంపిణీ వ్యవస్థ ఉంది. దీనిని డిసెంబర్‌కల్లా 100కు చేరుస్తాం. ఇతర విభాగాల్లోకి ప్రవేశిస్తాం. ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సెలెస్ట్రియల్‌ను కొనుగోలు చేశాం. చెన్రై వెలుపల సెలెస్ట్రియల్ ట్రాక్టర్స్ కొత్త ప్లాంటును స్థాపిస్తోంది’ అని వివరించారు. -
ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధర: ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా ఆకర్షణీయమైన సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ‘లావా బ్లేజ్’ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చిన ఈ మొబైల్లో వెనుక గ్లాస్ ఫినిషింగ్, ట్రిపుల్ కెమెరా, బిగ్‌స్క్రీన్ వాటర్‌డ్రాప్ నాచ్ లాంటి ప్రీమియం ఫీచర్లను జోడించింది. పోకో సీ31, రియల్మీ సీ30 లాంటి ఫోన్లకు గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. లావా బ్లేజ్ అసలు ధరను రూ.9,699 గా నిర్ణయించిన కంపెనీ ప్రత్యేక ఆఫర్ కింద రూ.8,699కే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ కోనుగోళ్లపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కి అందుబాటులో ఉంది. జూలై 15 నుండి సేల్స్ ప్రారంభం. ప్రీ-బుకింగ్ చేసుకున్న వారికి లావా ఇయర్ బడ్స్ ఉచితం. Introducing Blaze by Lava #HaqSeChamak ₹8,699 ✔ Premium glass back design ✔ 64GB ROM and 3+3*GB RAM ✔ 13MP Triple AI Rear Camera Pre-booking is LIVE on Blaze. First 500 successful registrations get a chance to win FREE** Probuds. Prebook now: https://t.co/jwGAftqOhl *T&C pic.twitter.com/p0O41PeHXd — Lava Mobiles (@LavaMobile) July 7, 2022 లావా బ్లేజ్ స్పెసిఫికేషన్స్ 6.5 అంగుళాల IPS LCD స్క్రీన్ ఆండ్రాయిడ్ 12, 1600 x 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్ ఎంట్రీ-లెవల్ సాక్ మీడియా టెక్ హీలియో ఏ 22 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం . 13+2 ఎంపీ కెమెరా + VGA సెన్సార్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జర్ -
ఎట్టకేలకు కీవే కే-లైట్ 250వీ బైక్ వచ్చేసింది: ఫీచర్లు, ధర వివరాలు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హంగేరియన్ కంపెనీ కీవే తాజాగా కే-లైట్ 250వీ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. పరిచయ ఆఫర్లో రూ.2.89 లక్షలకే ఈ బైక్‌ను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ బైక్ ఫీచర్లను గమనిస్తే ఇందులో 249 సీసీ ఇంజన్ పొందుపరిచారు. ఇది 18.7 బిహెచ్పీ, 19ఎన్ఎమ్లను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో ముందు, వెనుక డిస్క్‌లను కలిగి ఉంటుంది. రిమోట్ ఇంజన్ కట్ ఆఫ్, జియో ఫెన్స్, రైడ్ రికార్డుల నిర్వహణ, గరిష్ట వేగం నియంత్రణ వంటి ఫీచర్లున్నాయి. బైక్‌కి సంబంధించిన అధికారిక డెలివరీలు జూలై మధ్యలో ప్రారంభమవుతాయి. మ్యాట్ బ్లూ కలర్ ధర రూ. 2.89 లక్షలు కాగా, మ్యాట్ డార్క్ గ్రే , మ్యాట్ బ్లాక్ ధరలు వరుసగా రూ. 2.99 లక్షలు , రూ. 3.09 లక్షలు (అన్నీ ఎక్స్-షోరూమ్ ఇండియా)గా కంపెనీ నిర్ణయించింది. -
వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ లాంచ్, ఫీచర్లు చూశారా?
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ ‘నార్డ్ 2టీ’ 5జీ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. జూలై 5 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై లాంచింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. 8జీబీ ర్యామ్/ 125 స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఆఫర్లు, లభ్యత: అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్లతో పాటు దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,500 తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంటే రూ. 27,499 లకే సొంతం చేసుకోవచ్చన్నమాట. 8జీబీ ర్యామ్, 125 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. రూ. 28,999 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజహ మోడల్ ధరను రూ. 33,999 గ్రే షాడో అలాగే జేడ్ ఫాగ్ రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం. ‘నార్డ్ 2టీ’ 5జీ ఫీచర్లు 6.43 అంగుళాల AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ ఆక్సిజన్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 50+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీ,80W SuperVOOC ఛార్జింగ్ Sorry to keep you waiting folks. But we're almost there. #OnePlusNord2T coming soon. Get Notified: https://t.co/oEqZLKClpD pic.twitter.com/73Z3jUD0Sc — OnePlus India (@OnePlus_IN) July 2, 2022 -
ఆల్ న్యూ మారుతి బ్రెజా వచ్చేసింది, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ ఎస్యూవీ బ్రెజాను గురువారం లాంచ్ చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా బ్రెజా 2022 మోడల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. అలాగే మొదటిసారిగా ప్యాడిల్ షిఫ్టర్లను కూడా జోడించింది. మొత్తం 10 వేరియంట్లు, ఇందులో 7 మాన్యువల్ ట్రిమ్లుగా, 3 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.మూడు డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా బ్రెజా తొమ్మిది రంగుల్లో తీసుకొచ్చింది. కొత్త మారుతి సుజుకి బ్రెజా కొత్త గ్రిల్, హెడ్లైట్లు, టెయిల్ లైట్లతో సహా ఎక్ట్సీరియర్‌లో డిజైన్‌లో అనేక మార్పులను పొందింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, వైర్లెస్ ఛార్జింగ్ డాక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పరిసర లైటింగ్, హెడ్ అప్ డిస్ప్లేస్, 360 డిగ్రీ కెమెరా ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించిన 8 రోజుల్లోనే 45 వేలకుపైగా ఆర్డర్లను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో సరికొత్త మారుతి సుజుకి బ్రెజా రూ. 7.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా, హై ఎండ్ మోడల్ ధర రూ. 13.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్ ‘నార్డ్ 2 టీ’..కమింగ్ సూన్
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ తన నార్డ్ 2 సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 టీ (5జీ)పేరుతో జూలై 1న ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు నోటిఫై పేజ్‌ను కూడా లాంచ్ చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో అమెజాన్ ద్వారా కూడా వన్‌ప్లస్ నార్డ్ 2 టీ లభించనుంది. ఇప్పటివరకు యూరప్ , యునైటెడ్ కింగ్డమ్లో మాత్రమే లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 1న భారత మార్కెట్లో కూడా తీసుకొస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ ల్యాండింగ్ పేజీని సెటప్ చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీస్టోరేజ్బేస్ వెర్షన్‌తోపాటు, హై-ఎండ్ వేరియంట్‌గా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అందించనుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 టీ ఫీచర్లు 6.43 అంగుళాల డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 50 +8+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 4,500mAh బ్యాటరీ 80W సూపర్ ఛార్జింగ్ ధరలు : బేస్ వేరియంట్ధర రూ. 28,999. హై ఎండ్ వేరియంట్ ధర రూ. 33,999 ఉంటుందని అంచనా. -
పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. జూన్ 23 సాయంత్రం వర్చువల్ ఈవెంట్లో పోకో ‘ఎఫ్ 4 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. పోకో బ్రాండింగ్‌తో ఫ్లాట్ బాడీ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు పోకో ట్వీట్ చేసింది. ఫీచర్లు, అంచనాలు ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు రెడ్మి కే40ఎస్కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్ అండ్ గ్రీన్ రంగులలో ఇది లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత ఎంఐయుఐ 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC 12 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్ కెమెరా, దీంతోపాటు పోకో ఎక్స్ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు పోకో ట్విటర్ ద్వారా వెల్లడించింది. A new thinnest #POCOF4 that's sure to make some big waves. Watch our global launch event on June 23rd for more. See you in two days. #AllTheStrengths pic.twitter.com/6umW3TrZti — POCO (@POCOGlobal) June 21, 2022 పోకో ఎక్స్ 4 జీటీ ఫీచర్లు 6.6అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SOC 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64ఎంపీ రియర్ కెమెరా 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Every action will feel a lot more magical when you record moments using Clone Mode on the POCO F4 5G. Get ready to create even cooler videos starting 23-06-2022 - https://t.co/k1MjtkjFVq pic.twitter.com/XZw58DHRaT — POCO India (@IndiaPOCO) June 21, 2022 -
అతి తక్కువ ధరలో రియల్మీ కొత్త ఫోన్ వచ్చేస్తోంది!
సాక్షి, ముంబై: చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రియల్మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. సీ-సిరీస్‌లో రియల్మీ సీ30 పేరుతో ఎంట్రీ లెవల్ ఫోన్‌ను ఈ రోజు (జూన్ 20) మధ్యాహ్నం తీసుకొస్తోంది. రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరికొద్ది గంటల్లో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. రియల్మీ సీ 30 ఫీచర్లు 6.6-అంగుళాల ఫుల్ హెచ్ + డిస్ప్లే వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఆక్టా-కోర్ Unisoc T612 SoC 13 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీని 2 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో బ్యాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రారంభ ధర రూ. 7వేలుగా ఉంటుందని అంచనా. -
భారత మార్కెట్‌పై అమెజాన్ బుల్లిష్
న్యూఢిల్లీ: భారత మార్కెట్ పట్ల తాము సానుకూలంగా (బుల్లిష్) ఉన్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు, ఎంఎస్ఎంఈల డిజిటైజేషన్ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ‘‘వచ్చే ఆరు నెలల్లో మేము ఎంత పెద్ద, మెరుగైన సంస్థో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌లో కొనుగోళ్లు, విక్రయాలను పూర్తిగా మార్చాలన్న మా లక్ష్యం దిశగా పనిచేస్తూనే ఉన్నాం’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ (కన్జ్యూమర్ బిజినెస్) మనీష్ తివారీ పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడుల ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధం అంటూ సీసీఐ ఇచ్చిన తీర్పును అమెజాన్ ఎన్సీఎల్టీలో సవాలు చేయగా.. అక్కడ ప్రతికూల తీర్పు రావడం తెలిసిందే. సీసీఐ తీర్పును సమర్థిస్తూ, అమెజాన్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ తిరస్కరించడం తెలిసే ఉంటుంది. సీసీఐ రూ.200 కోట్ల పెనాల్టీని కూడా ఎన్సీఎల్టీ సమర్థించింది. దీనిపై మాట్లాడేందుకు తివారీ తిరస్కరించారు. కోర్టు ఆదేశాలను సంబంధిత వ్యక్తులు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వేగంగా వృద్ధి అమెజాన్ 9 ఏళ్ల క్రితం 100 విక్రయదారులు, ఒక గోదాముతో సేవలు మొదలు పెట్టింది. ఇప్పటికి తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయదారుల సంఖ్యను 11 లక్షలకు పెంచుకుంది. 23 కోట్ల ఉత్పత్తులను విక్రయానికి ఉంచింది. గోదాములు 60కి చేరాయి. -
వావ్..లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌కార్: హాట్ సేల్
న్యూఢిల్లీ: ఇటాలియన్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని మరో సూపర్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కార్‌ను తీసుకొచ్చింది. ప్యూర్ పెట్రోల్ వీ12 ఇంజన్‌తో ఈ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. కూపే, రోడస్టర్ రెండు వేరియంట్లలో దీన్ని పరిచయం చేసింది. కూపే మోడల్లో 350, రోడ్‌స్టర్ బాడీ స్టైల్లో 250 యూనిట్లను విక్రయించనుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమేపనితీరు-స్పెసిఫికేషన్లు... కొంత మార్పు చేసినప్పటికీ, అవెంటడార్ ఎస్వీజే, అవెంటడార్ ఎస్ మాదిరిగానే ఉండనున్నాయి. లంబోర్ఘిని అవెంటడార్ LP780-4 Ultimae ఫీచర్లు అత్యంత శక్తివంతమైన 6,498 సీసీ వీ12 ఇంజన్. ఇది 770bhp వద్ద 8,500ఆర్పీఎంను, 6,750 ఆర్పీఎం వద్ద 720 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త స్టైలింగ్, కొత్త ఫ్రంట్ బంపర్, మాసివ్ సైడ్ స్కర్ట్లు, రియర్ డిఫ్యూజర్, 20- అంగుళాల అల్లాయ్ వీల్స్ 7- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, గరిష్టంగా గంటలకు 355 కిలోమీటర్ల వేగం లాంటి ఇతర ఫీచర్లు ఈ కారుసొంతం. అవెంటడార్ ఎస్ కంటే ఇది 25 కిలోల బరువు తక్కువ. అయితే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన కార్లన్నీ ఇప్పటికే అమ్ముడు పోయాయట. ఇండియాలో ఒక్కరు మాత్రమే ఈ కారును సొంతం చేసుకున్నారు. అయితే ఈ కారు ధరను లంబోర్ఘిని వెల్లడించలేదు. -
శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీ, న్యూడిజైన్, ఫీచర్లు చూశారా?
సాక్షి, ముంబై: శాంసంగ్ కొత్త టీవీలను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 43 అంగుళాల 4కే డిస్ప్లే, బెజిల్లెస్ డిజైన్‌తో శాంసంగ్ శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ పేరుతో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. హెచ్డీఆర్ 10+ సపోర్ట్ బెజిల్లెస్ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌తో ఈ స్మార్ట్ టీవీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గేమింగ్ కోసం ఆటో గేమ్ మోడ్ వంటి హై-ఎండ్ ఫీచర్ కూడా ఇందులో పొందుపర్చింది. ఆడియో కోసం డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్‌తో 20వాట్ల స్పీకర్‌ను, అలాగే స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌ను కూడా ఉంచింది, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, బిక్స్బీలకు ఈ క్రిస్టల్ 4కే నియో టీవీ సపోర్ట్ చేస్తుంది. దీంతో చానెల్స్ మార్చడం, కంటెంట్ వెతకడం, వాల్యుమ్, ప్లే బ్యాక్‌ను వాయిస్‌తోనే కంట్రోల్ చేయవచ్చు. ప్రైస్ అండ్ సేల్ ప్రారంభ ఆఫర్లో 43 అంగుళాల క్రిస్టల్ 4కే నియో టీవీ ధర రూ.35,990 వద్ద అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభ్యం. శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ ఫీచర్లు 3,840x2160 పిక్సెల్స్ రెజల్యూషన్ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్క్రీన్ 1.5 ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ డిస్ప్లే HDR10+ కంటెంట్ సపోర్ట్ ప్లే బ్యాక్‌ను వాయిస్ కంట్రోల్ -
ఒప్పో సూపర్ 5జీ ఫోన్ లాంచ్, వివరాలు ఇలా ..
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ‘ఒప్పో కే 10 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో కే10 5జీ ఫీచర్లు 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఆండ్రాయిడ్12 MediaTek డైమెన్సిటీ 810 సాక్ చిక్ 8జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ 48+2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఇంకాసైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు , 5జీబీ వరకు డైనమిక్ RAM విస్తరణ, సెల్ఫీ కెమెరాతో ఫేస్ అన్‌లాక్ మెకానిజం లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపర్చింది. ఒప్పో కే10 5జీ ధర: ఇండియాలో ప్రస్తుతం ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఓషన్ బ్లూ , మిడ్నూట్ బ్లాక్ రెండు రంగుల్లో లభ్యం. దీని ధరను రూ. 17,499 గా నిర్ణయించింది. బ్యాంకు ఆఫర్స్: ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లతో బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. వినియోగదారులు రూ. 1500 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. జూన్ 15, 2022 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. Sleek style, fine features, and quick as light! The #OPPOK105G is here to raise the bar and give you the best experience a smartphone can. Sale starts from 15th June, 12PM on @Flipkart.#LiveWithoutLimits #Stylish5GPerformer Get notified: https://t.co/UEVFLOIg7G pic.twitter.com/rb4Y1MQUTT — OPPO India (@OPPOIndia) June 8, 2022 -
కీవే అదిరిపోయే స్కూటర్లు: అయ్య బాబోయ్ అంత ధరా!
సాక్షి, ముంబై: బెనెల్లీ గ్రూప్‌కు చెందిన హంగేరియన్ వాహన తయారీ సంస్థ కీవే సరికొత్త ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్త బ్రాండ్‌ను సిక్స్టీస్ 300ఐ, వియోస్ట్ 300లను రెండు మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.2,99,000 లుగా ఉండనున్నాయి. వాటిల్లో ఒకటి రెట్రో క్లాసిక్ మోడల్ అయితే, రెండోది మ్యాక్సీ-స్కూటర్. రూ. 10,000 ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే రెండేళ్ల అనిలిమిటెడ్ వారంటీకూడా ఉంది. కేరళలోని త్రివేండ్రంలో ఇప్పటికే ఒక బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. 1999లో ఏర్పాటు చేసిన కీవే కంపెనీ అధునాతన టెక్నాలజీతో రెట్రో క్లాసిక్ స్కూటర్‌ను తీసుకొస్తున్నామని వెల్లడించింది. కీవే కనెక్ట్ సిస్టమ్, సిమ్ కార్డు టెక్నాలజీతో ఈ స్కూటర్లు పనిచేస్తాయి. అంటే ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ యూనిట్ కీవే యాప్‌కు కనెక్ట్ అయితే వెహికల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంజిన్‌ను రిమోట్ స్విచ్ ఆఫ్ చేయడం, జియో-ఫెన్స్‌ను సెటప్ రైడ్ రికార్డ్స్ మేనేజ్, స్పీడ్ లిమిట్, కమ్యూనిటీ రైడ్‌లో లొకేషన్ సమాచారాన్ని స్నేహితులతో షేర్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. కీవే సిక్స్టీస్ 300ఐ ఫీచర్లు రెట్రో క్లాసిక్ స్కూటర్ లో 278 సీసీ సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 18.7 హెచ్‌పీ పవర్, 6000 ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 120/70-12 టైర్లు, డ్యూయల్-ఛానల్ ABSతో డిస్క్ బ్రేక్‌లు, స్ప్లిట్-సీట్, డ్యూయల్ ఎల్ఈడీ బ్రేక్ లైట్లు, సిగ్నల్ లైట్లతో కలిపి ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ ఇతర ఆకర్షణలు ఇంకా మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ స్విచ్ ఎలక్ట్రిక్ స్టార్టర్, అండర్-సీట్ స్టోరేజ్ యాక్సెస్, స్టీరింగ్ లాక్ వంటి స్పెసిఫికేషన్లు కూడా లబ్యం. మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్, మ్యాట్ గ్రే కలర్స్‌లో ఇది లభ్యం. కీవే వియోస్ట్ 300 ఫీచర్లు యాంగ్యులర్ బాడీవర్క్‌తో కూడిన ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడిన మ్యాక్సీ స్కూటర్ ఇది. 12 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, 278సీసీ లిక్విడ్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎంవద్ద 18.7హెచ్‌పీ గరిష్ట పవర్‌ను, 6000ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు ఎల్ఈడీ, ప్రొజెక్టర్లు, డీఆర్ఎల్ హెడ్లైట్లు, టర్న్ ఇండికేటర్ సిగ్నల్లు, కాంటినెంటల్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్‌లు, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్లు, డ్యూయల్-ఛానల్ ABSలు ఇతర ఫీచర్లు. మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ వైట్ అనే మూడు రంగుల్లో ఈ స్కూటరు లభిస్తుంది. Benelli | Keeway India cordially invites you to our newest dealership in Trivandrum. Come witness the roar. Visit: Benelli | Keeway - Trivandrum NH 66 Bypass, Chackai, Anayara. P.O, Trivandrum - 695029, Kerala.#Trivandrum #BenelliIndia #KeewayIndia #India pic.twitter.com/xCaELTIFZq — KeewayIndia (@keeway_india) June 1, 2022 అలాగే 2022 చివరికి నాలుగు కేటగిరీల్లో మొత్తం ఎనిమిది ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయాలని కీవే భావిస్తోంది. ముఖ్యంగా హై-ఎండ్ స్కూటర్లు, క్రూయిజర్లు, స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు, రెట్రో-స్ట్రీట్ బైక్స్‌పై దృష్టిపెట్టినట్టు కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. The #Vieste300 is a modern powerhouse with a chiselled design, made to ease your city commute. Experience its brilliant performance first hand. Starts at ₹ 2.99 Lakhs* with 2-Year Unlimited KMS warranty ,Book yours online at ₹ 10 000 only from https://t.co/TZ4YeukZv3 T&C* Apply pic.twitter.com/Xiyn0EvPia — KeewayIndia (@keeway_india) May 31, 2022 -
పుత్తడి, వెండి: కొనుగోలుదారులకు ఊరట
సాక్షి, ముంబై: జూన్ మాసం ఆరంభంలోనే వెండి, బంగారం ధరలు వినియోగదారులకు ఊరటనిచ్చాయి. వరుసగా రెండో రోజు బుధవారం (జూన్,1) ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) పుత్తడి, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఆగస్టు 5, 2022న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ. 281 తగ్గి రూ. 50,700గా ఉంది. అదేవిధంగా, జూలై 5, 2022 నాటి వెండి ఫ్యూచర్లు రూ. 535 లేదా 0.88 శాతం క్షీణించాయి. మునుపటి ముగింపు రూ. 61,125తో పోలిస్తే ఎంసీఎక్స్‌లో కిలో రూ. 60,876 వద్ద కొనసాగుతోంది. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 47,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి దాదాపు 300 తగ్గి ప్రస్తుత ధర 51, 820గా ఉంది. అలాగే కిలో వెండి ధర 67వేల రూపాయలుగా ఉంది. మంగళవారం నాటితో పోలిస్తే 500 రూపాయలు తగ్గింది. కాగా ఫెడరల్ రిజర్వ్ మనీ పాలసీ, డాలర్ బలం గత రెండు నెలలుగా పసిడిపై ఒత్తిడి పెంచుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 200 రోజుల యావరేజ్ కిందికి చేరాయి. ఈ మేరకు ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో నెల. 200-రోజుల మూవింగ్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందనీ, దీంతో పసిడి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ ఎనలిస్ట్ భవిక్ పటేల్ అంచనా #Gold and #Silver Opening #Rates for 01/06/2022#IBJA pic.twitter.com/Cdwx54n6H3 — IBJA (@IBJA1919) June 1, 2022 -
సూపర్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్: ఐకూ నియో 6 వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: ఐకూ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం తీసుకొచ్చింది. ప్రీమియం ధరలో ఐకూ నియో 6 ..5జీ మొబైల్‌ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ నోవా , ఇంటర్ స్టెల్లార్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.1200Hz తక్షణ టచ్ శాంప్లింగ్ రేట్ 32907mm2 క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్‌తో సూపర్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ 12 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. స్పెషల్ లాంచింగ్ ధర రూ. 25000 తగ్గింపు అందిస్తోంది. ఈ ప్రత్యేక ధర జూన్ 5వ తేదీవరకు మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది. ఐసీసీఐసీఐ కార్డ్ చెల్లింపులపై మరో 3 వేల రూపాయల తగ్గింపు. ఐకూ నియో 6 ఫీచర్లు 6.62 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 870 5జెన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12, 1080x2400 పిక్సెల్స్ 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ 16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 64+12+2 ఎంపీ రియర్ కెమెరా 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ చార్జ్ -
కళ్లు చెదిరే సూపర్ బైక్‌లు , అదిరిపోయే ధర
ముంబై: బ్రిటీష్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్, తన ఫ్లాగ్షిప్ అడ్వెంచర్ (ADV) బైక్ 'టైగర్ 1200' 2022 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది, 2021 చివరిలో గ్లోబల్‌గా లాంచ్ చేసిన ‘ట్రయంఫ్ టైగర్ 1200 ’ సూపర్ బైక్‌లను ఇండియన్ మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. జీటీ ప్రో, ర్యాలీ ప్రో, జీటీ ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ అనే నాలుగు వేరియంట్లలో ఈ బైక్స్ అందుబాటులో ఉంటాయి. బేస్ వేరియంట్ ధర రూ. 19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) టాప్ వేరియంట్ ధర రూ. 21.69 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఇవి హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా, డుకాటీ మల్టీ స్ట్రాడాతో పోటీగా నిలవనున్నాయి. కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 ADVని స్పోక్డ్ వీల్స్ , లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఫీచర్లతో రెండు కేటగిరీలుగా తీసుకొచ్చింది. బ్రెంబో కాలిపర్లతో పాటు ముందు వైపున ట్విన్ 320ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్‌లు , వెనుక వైపున ఒక సింగిల్ 280ఎమ్ఎమ్ డిస్క్‌లు, డ్యూయల్-ఛానల్ ABS కూడా అమర్చింది. ఇక ప్రో, ఎక్స్‌ప్లోరర్ వేరియంట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ప్రో ట్రిమ్‌లలో అందించే 20-లీటర్‌తో పోలిస్తే ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లు 30-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లభిస్తాయి. ట్రయంఫ్ టైగర్ 1200 స్పెక్స్ T-ప్లేన్ క్రాంక్ షాఫ్ట్‌తో 1,160cc ఇన్లైన్-ట్రిపుల్ సిలిండర్ ఇంజన్. 148 బీహెచ్పీ , 130 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. బైక్ స్లిప్ ,అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా అమర్చింది. పాత బైక్‌లతో పోలిస్తే 25 కిలోల బరువు కూడా తక్కువ. కొత్త ఫ్రేమ్, డబుల్ సైడెడ్ స్వింగ్ఆర్మ్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్‌ని ఉపయోగించడం ద్వారా బైక్ బరువును తగ్గించింది. సేఫ్టీ ఫీచర్లు బ్లైండ్ స్పాట్ , లేన్ చేంజ్ వార్నింగ్ సిస్టమ్, లీన్-సెన్సిటివ్ కార్నరింగ్ లైట్లు, బ్లూటూత్ సపోర్ట్‌తో కూడిన 7-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ఆరు రైడింగ్ మోడ్ల వరకు, ఒక రాడార్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. డౌన్ క్విక్‌షిఫ్టర్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్ , కీలెస్ ఆపరేషన్. ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లలో టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హీటెడ్ రైడర్, పిలియన్ సీట్లు అదనం. -
ప్రపంచ మార్కెట్లను వెంటాడిన ఒమిక్రాన్!
ముంబై: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరోమారు ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. ఈ కొత్త రకం కేసుల సంఖ్య అంతకంతా పెరగడానికి తోడు ప్రపంచ మార్కెట్లలో అనూహ్య అమ్మకాలతో భారత మార్కెట్లో మరో ‘‘బ్లాక్ మండే’’ నమోదైంది. వైరస్ కట్టడికి ఆయా దేశాల లాక్డౌన్ల విధింపులు ఆర్థిక రికవరీ విఘాతం కలిగించవచ్చనే ఆందోళనల ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపుతుండటం.., విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,189 పాయింట్ల నష్టంతో 55,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 371 పాయింట్లు క్షీణించి 16,614 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టాల ముగింపు. శాతం పరంగా చూస్తే.., సెన్సెక్స్ మూడుశాతం, నిఫ్టీ రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 2 షేర్లు.. నిఫ్టీ50 షేర్లలో 4 షేర్లే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద మొత్తంలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లను విక్రయిస్తుండటంతో ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో పాటు యూఎస్ నాస్డాక్ ఇండెక్స్ పతన ప్రభావంతో దేశీ ఐటీ షేర్లు పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి ఆందోళనలతో మెటల్, మౌలిక రంగ షేర్లు కరిగిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు మూడున్నర శాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,565 కోట్ల షేర్లను అమ్మేయగా.., విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,764 కోట్ల షేర్లను కొన్నారు. సోమవారం సెషన్ సాగింది ఇలా..! ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 495 పాయింట్ల పతనంతో 56,517 వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు క్షీణించి 16,824 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1879 పాయింట్ల పతనమై 55,132 వద్ద, నిఫ్టీ 575 పాయింట్లు నష్టపోయి 16,410 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ స్థాయిలు సూచీలకు ఎనిమిది నెలల కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. మిడ్ సెషన్ తర్వాత ఆయా షేర్లకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో రికవరీ బాట పట్టాయి. ఫలితంగా సూచీల నష్టాలు ఎనిమిది నెలల కనిష్టం నుంచి 4 నెలల కనిష్టానికి పరిమితమయ్యాయి. ► అమెజాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిలివేయడతో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ (20%), ఫ్యూచర్ రిటైల్ (19.92%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (19.91%) షేర్లు రాణించి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ► ఇటీవల లిస్టయిన నైకా, కార్‌ట్రేడ్, జొమాటో పేటీఎంలు (న్యూ ఏజ్ స్టాక్‌లు) ఎనిమిది శాతం క్షీణించాయి. నష్టాలకు నాలుగు కారణాలు... ► వణికించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. యూరప్‌లో కేసులు పెరగడంతో ఆయా దేశాలు లాక్డౌన్ యోచనలు చేస్తున్నాయి. రెండు కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఇటీవల అమెరికా ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ కేసుల పెరిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు అమలు కావచ్చని అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ► వడ్డీ రేట్ల పెంపు భయాలు ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాలు వడ్డీరేట్ల పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించింది. దీంతో ఫలితంగా ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్ ఇండెక్స్ చేరింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ సూచీలపై పడింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో సెంటిమెంట్ బలహీనపడింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,696 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒమిక్రాన్ పరిణామాలు, అధిక వాల్యూయేషన్లు, ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు దిశగా యోచనలు చేస్తుండటంతో ఎఫ్ఐఐలు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం క్రిస్మస్, నూతన సంవత్సర సీజన్‌కు ముందు ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు 2% క్షీణించాయి. కేసుల కట్టడికి ఐరోపా దేశాల్లో మరోమారు లాక్డౌన్ విధింపు ఉండొచ్చనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ లాక్డౌన్ విధించింది. పండుగ వేళ లాక్డౌన్లు, ఆంక్షల నిర్ణయాలు వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు ఈక్విటీ మార్కెట్ల పతనానికి కార ణమయ్యాయి. ఆసియాలో చైనా, జపాన్ దేశాల స్టాక్ సూచీలు 2% వరకు క్షీణించాయి. యూరప్‌లో ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్ మార్కెట్లు 2–1% నష్టపోయాయి. యూఎస్ మార్కెట్లు 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. డిస్కౌంట్లో శ్రీరాం ప్రాపర్టీస్ లిస్టింగ్ శ్రీరాం ప్రాపర్టీస్ షేర్లు లిస్టింగ్ రోజు నష్టాలను పంచాయి. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్ఈలో 24 శాతం క్షీణించి రూ.94 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 22 శాతం మేర పతనమైన రూ.92 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 16% నష్టంతో రూ.118 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.1,686 కోట్ల వద్ద స్థిరపడింది. రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్లో గడచిన రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. సూచీలు సోమవారం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో ఈ ఒక్క రోజే రూ.6.81 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 2078 పాయింట్లు, నిఫ్టీ 634 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 1879 పాయింట్లు డౌన్ 55,132కు పతనం ముగింపు 1190 పాయింట్లు డౌన్ 55,822 వద్ద క్లోజ్ -
24 నుంచి ఐఫోన్ 13 విక్రయాలు
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు ఈ నెల 24 నుంచి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, జపాన్ తదితర చాలా దేశాల్లో అదే రోజు నుంచి విక్రయాలను మొదలవుతాయని తెలిపింది. యాపిల్ ఇండియా వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా.. ఐఫోన్ 13 మినీ ధరలను రూ.69,900 నుంచి 99,900 మధ్య నిర్ణయించింది. ఐఫోన్ 13 ధరలు రూ.79,900–1,09,900.. ఐఫోన్ 13 ప్రో ధరలు రూ.1,19,900–169,900, ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్ ధరలు రూ.1,29,900–179,900 మధ్య ఉండనున్నాయి. ఇందులో ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ను 5జీ సపోర్ట్‌తో, మరిన్ని బ్యాండ్లతో యాపిల్ తీసుకొచ్చింది. అదే విధంగా కొత్త ఐప్యాడ్ (9వ జనరేషన్) ధర రూ.30,900 నుంచి.. ఐప్యాడ్ మినీ ధర రూ.46,900 నుంచి ఆరంభమవుతుంది. ప్రీమియం ఫోన్ల జోరు.. కౌంటర్‌పాయింట్ అంచనాల ప్రకారం.. భారత్‌లో ప్రీమియం (ఖరీదైన) స్మార్ట్ఫోన్ల మార్కెట్ జూన్‌లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ ప్రీమియం మార్కెట్లో వన్‌ప్లస్ 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, యాపిల్ 25 శాతం వాటాతో రెండో స్థానంలోను, శామ్సంగ్ 13 శాతం వాటాతో మూడో స్థానంలో, వివో 12%, షావోమీ 7% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
లక్ష కోట్ల డాలర్లకు భారత రిటైల్ రంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్లలో భారత్ ఒకటని అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ డగ్ మెక్‌మిలన్ చెప్పారు. విశిష్టమైన దేశీ రిటైల్ రంగం .. 2025 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమించగలదని పేర్కొన్నారు. కన్వర్జ్ ః వాల్‌మార్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్ వైవిధ్యమైనది కావడంతో స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుందని సంస్థ సిబ్బందికి సూచించారు. దేశీ మల్టీ–బ్రాండ్ రిటైల్ రంగంలో నేరుగా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు లేనందున తాము ఇతర విధానాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నామని డగ్ వివరించారు. అమెరికా, చైనాలతో పాటు భారత్ కూడా టాప్ 3 మార్కెట్లలో ఒకటన్నారు. వాల్‌మార్ట్‌లో భాగమైన ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్‌పే మెరుగ్గా రాణిస్తున్నాయని, వీటికి భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారని డగ్ పేర్కొన్నారు. ‘ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 3,00,000 పైచిలుకు విక్రేతలు ఉండగా, ఫోన్‌పే యూజర్ల సంఖ్య 30 కోట్ల పైచిలుకు ఉంది. రెండు సంస్థలూ గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. -
ఇండియన్ మార్కెట్లో ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ఫిగో హ్యాచ్‌బ్యాక్ మోడల్లో రెండు ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో వీటి ధర రూ.7.75 లక్షల నుంచి ప్రారంభం. టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్‌లో లభిస్తాయి. స్పోర్ట్, సెలెక్ట్షిఫ్ట్ మోడ్స్‌లో 6 స్పీడ్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 96 పీఎస్ పవర్, 119 ఎన్ఎం టార్క్‌తో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్వీఎం, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, సైడ్, కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి హంగులు ఉన్నాయి.