Vivo X90 Series Full Specifications And Price Details Leaked - Sakshi
Sakshi News home page

Vivo X90: సూపర్‌ ఫీచర్లతో వివో ఎక్స్‌90 సిరీస్‌ వచ్చేస్తోంది!

Nov 22 2022 3:25 PM | Updated on Nov 22 2022 4:09 PM

Vivo X90 series Full Specifications Leaked check details - Sakshi

సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వివో కొత్త సిరీస్‌ ఫోన్లను  దేశీయ మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. వివో ఎక్స్‌80 సిరీస్‌కు కొన‌సాగింపుగా వివో ఎక్స్‌90 సిరీస్‌ను లాంచ్‌ చేయనుంది. అద్భుతమైన ఫీచర్స్‌తో, ముఖ్యంగా నాలుగుపవర్‌ ఫుల్‌ కెమెరాలతో తీసుకొస్తోంది. వివో ఎక్స్90, వివో ఎక్స్‌90ప్రొ, వివో ఎక్స్‌90ప్రొ+ మూడు వేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్‌ చేయనుంది. త్వరలోనే భారత మార్కెట్లలో కూడా లాంచ్‌ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రైట్ రెడ్,  బ్లాక్ క‌ల‌ర్‌లో ఇవి లభ్యం కానుంది. చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్  వైబోలో ఫోటోలు, ఫీచర్లు  లీక్‌ అయ్యాయి. 


వివో ఎక్స్90 ఫీచర్లు అంచనాలు
6.78 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 13
క్వాల్‌కాం ఫ్లాగ్‌షిప్ ప్రాసెస‌ర్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్ 
50+50+ 64+48 రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా 
12 జీబీ ర్యామ్‌ 
4,700mAh బ్యాటరీ

ధర: ఈ రోజు (నవంబరు 22) సాయంత్రం లాంచ్‌ కానున్న  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరలపై  అధికారిక ప్రకటన లేనప్పటికీ,  800 డాలర్లు, సుమారు రూ. 65,315 ఉంటుందని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement