గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ! | China Rent A Dog Trend For Loneliness | Sakshi
Sakshi News home page

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

Nov 8 2026 2:09 PM | Updated on Nov 8 2026 2:09 PM

China Rent A Dog Trend For Loneliness

ఫండే

వింతలు విశేషాలు

కుక్క కావాలి... కానీ పెంపకం బాధ్యతలు వద్దు! వాకింగ్‌ చేయించాలి... తిండి పెట్టాలి... డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి... ఇన్ని పనులు మనకెందుకులే అనుకుంటున్నారా? అయితే, చైనాలో గంటల లెక్కన కుక్కలను అద్దెకు తీసుకునే సదుపాయం వచ్చేసింది!

‘వాంగ్‌ఫు’ అనే ఆన్‌లైన్‌ వేదికలో నచ్చిన కుక్కను ఎంచుకుని, గంటకు సుమారు రూ.120 నుంచి రూ.720 చెల్లిస్తే చాలు... కాసేపు దానితో ఆడుకోవచ్చు, వాకింగ్‌కు తీసుకెళ్లొచ్చు. అంతా బాగుంది కాని, ఇప్పుడు ఈ అద్దె స్నేహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కుక్కలతో గడపడం వల్ల వాటిని దత్తత తీసుకోవాలనే ఆసక్తి పెరుగుతుందని కొందరు అంటుంటే, తరచూ మనుషులు, పరిసరాలు మారడం వాటికి ఒత్తిడిని కలిగిస్తుందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.

మొత్తానికి, మనుషుల ఒంటరితనానికి అద్దె కుక్కలు పరిష్కారమవుతున్నాయి! గంట ముగియగానే కుక్కను వెనక్కి ఇచ్చేయొచ్చు గానీ, అప్పటికే దానితో పెరిగిన అనుబంధాన్ని మాత్రం రిటర్న్‌ చేయలేకున్నారట! మరి, ఈ అద్దె స్నేహం కుక్కలకు ఎంతవరకు నచ్చుతుందో చూడాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement