వన్‌ప్లస్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ ‘నార్డ్‌ 2 టీ’..కమింగ్‌ సూన్‌

OnePlus Nord 2T coming to india on July 1 - Sakshi

సాక్షి, ముంబై:  చైనీస్ స్మార్ట్‌ఫోన్‌  మేకర్‌ వన్‌ప్లస్‌ తన నార్డ్‌ 2 సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేయనుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 టీ (5జీ)పేరుతో జూలై 1న ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ మేరకు నోటిఫై పేజ్‌ను కూడా లాంచ్‌ చేసింది.  

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో అమెజాన్‌ ద్వారా కూడా వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 టీ  లభించనుంది. ఇప్పటివరకు యూరప్ , యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాత్రమే లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ జూలై 1న భారత మార్కెట్లో కూడా తీసుకొస్తోంది. ఈ మేరకు కమింగ్‌ సూన్‌ ల్యాండింగ్ పేజీని సెటప్ చేసింది.

6 జీబీ ర్యామ్‌, 128 జీబీస్టోరేజ్‌బేస్ వెర్షన్‌తోపాటు, హై-ఎండ్ వేరియంట్‌గా 8 జీబీ  ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను అందించనుంది.  

వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 టీ ఫీచర్లు 
6.43 అంగుళాల డిస్‌ప్లే
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
32  ఎంపీ సెల్ఫీ కెమెరా
50 +8+2 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌  కెమెరా 
4,500mAh బ్యాటరీ
80W సూపర్‌ ఛార్జింగ్ 

ధరలు :  బేస్‌ వేరియంట్‌ధర రూ. 28,999.  హై ఎండ్‌ వేరియంట్‌ ధర రూ. 33,999  ఉంటుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top