మారుతి బాటలో, టాటా మెటార్స్‌: కస్టమర్లకు కష్టకాలం!

Tata Motors Considering Price Hike For PVs From January - Sakshi

ధరలు పెంచనున్న టాటా మోటార్స్‌ 

న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు 2023 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే!

బ్యాటరీ ధరలూ ప్రియం అవుతున్నాయని, వీటి భారం కస్టమర్లపై ఇంకా వేయలేదని కంపెనీ ప్యాసింజర్, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఎండీ శైలేశ్‌ చంద్ర  వెల్లడించారు. బ్యాటరీ ధరలు, నూతన నిబంధనలు ఎలక్ట్రిక్‌ వాహన విభాగంపై ప్రభా వం చూపుతున్నాయని చెప్పారు. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది. పరిమిత స్థాయి మించి కాలుష్యం వెదజల్లితే ఈ పరికరం హెచ్చరిస్తుంది.  (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top