సుజుకి కొత్త స్కూటర్‌, అదిరే ఫీచర్స్‌, ప్రీమియం లుక్‌, ధర ఎంతంటే?

Suzuki Burgman Street EX launched in India check price - Sakshi

సాక్షి,ముంబై:  మారుతి సుజుకి ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త స్కూటర్‌ను ఇండియాలో  లాంచ్‌ చేసింది. బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్  పేరుతో దీన్ని తీసుకొచ్చింది. బర్గ్‌మన్ స్ట్రీట్‍కు అప్‍గ్రేడెడ్‍ వెర్షన్‍గా ఈ ఈఎక్స్ మోడల్‍ను  విడుదలచేసింది. లేటెస్ట్ టెక్నాలజీ,నయా ఫీచర్లతో ప్రీమియం లుక్‌లో ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. (వాట్సాప్‌ అవతార్‌ వచ్చేసింది..మీరూ కస్టమైజ్‌ చేసుకోండి ఇలా!)

ధర: సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్ ధరను రూ.1,12,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మారుతి సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ స్టాండర్డ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 89,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ), సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ రూ. 93,300 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి అందుబాటులో ఉంది.మెటాలిక్ మ్యాట్ ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో ఈ స్కూటర్  లభ్యం.

సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీమ్ ఈఎక్స్  ఇంజీన్‌ ఫీచర్లు 
ఎఫ్‍ఐ టెక్నాలజీతో పాటు ఎకో పర్ఫార్మెన్స్ ఆల్ఫా (SEP-a) ఇంజిన్‍తో  124cc  సీసీ  మోటార్‌ను అమర్చింది. ఇది  8.6PS గరిష్ట శక్తిని ,10Nm గరిష్ట టార్క్‌ను  అందిస్తుంది. ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ,సైలెంట్ స్టార్టర్ సిస్టమ్‌ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. వెనుక 12 అంగుళాల వెడల్పైన, పెద్ద టైర్‌ను అమర్చింది.  

సుజుకీ రైడ్ కనెక్ట్‌
బ్లూటూత్ డిజిటల్ ఎనేబుల్డ్ కన్సోల్‍తో కూడిన సుజుకీ రైడ్ కనెక్ట్ ఫీచర్ ను సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్  మరో  ఫీచర్‌. ఇది స్మార్ట్‌ఫోన్‌ను సింక్ చేసే సౌలభ్యాన్ని రైడర్‌కు అందిస్తుంది. నావిగేషన్, ఇన్‍కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‍లు, వాట్సాప్ అలెర్ట్స్‌  ఈ బైక్ డిస్‍ప్లేలో చూడవచ్చు.

స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవల్స్‌ కూడా డిజిటల్ కన్సోల్‍లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్‍లను ఈ స్కూటర్ కన్సోల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా  స్పీడ్ ఎక్సీడింగ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ లాంటి వివరాలు కూడా ఈ బైక్ డిజిటల్ కన్సోల్‍లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్‍లను ఈ స్కూటర్ కన్సోల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top