
నేటి నుంచి భారత్–ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం అమల్లోకి
15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల రాక
న్యూఢిల్లీ: ఇకపై చాక్లెట్లు, వైన్స్, దుస్తులు, వాచీల్లాంటి పలు స్విట్జర్లాండ్ ఉత్పత్తులు భారత మార్కెట్లో చౌకగా లభించనున్నాయి. అలాగే మన దేశానికి చెందిన పలు ఎగుమతి సంస్థలకు మరింత విస్తృత మార్కెట్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి నాలుగు యూరప్ దేశాల కూటమి ఈఎఫ్‌టీఏతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) అక్టోబర్ 1 నుంచి (నేడు) అమల్లోకి రానుంది.
ఐస్ ల్యాండ్, లీషె్టన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ)తో 2024 మార్చి 10న ఈ ఒప్పందం కుదిరింది. దీని కింద, వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈఎఫ్‌టీఏ హామీ ఇచ్చింది. ఒప్పందం అమల్లోకి వచి్చన పదేళ్ల వ్యవధిలో 50 బిలియన్ డాలర్లు, ఆ తర్వాత అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల మేర కూటమి దేశాలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయనున్నాయి. దీనితో భారత్‌లో ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది.
ఒకవేళ ఏదైన కారణం వల్ల ప్రతిపాదిత పెట్టుబడులు రాకపోతే ఆ నాలుగు దేశాలకు ఇస్తున్న సుంకాలపరమైన వెసులుబాట్లను సర్దుబాటు చేసే లేదా పూర్తిగా ఎత్తివేసేందుకు వీలుగా సదరు ఒప్పందంలో నిబంధన ఉంది. ఈఎఫ్‌టీఏ దేశాలనేవి యూరోపియన్ యూనియన్‌లో (ఈయూ) భాగం కావు. ఈయూ తో కూడా భారత్ విడిగా వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తోంది. వివిధ దేశాలతో, అలాగే కూటము లతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో టీఈపీఏ పదా్నలుగోది. మోదీ సారథ్యంలోని ప్ర భుత్వం కుదుర్చుకున్న వాటిల్లో మారిషస్, యూఏఈ, యూకే, ఆ్రస్టేలియా తర్వాత అయిదోది.
ప్రయోజనాలు ఇలా..
ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్..పాలిష్డ్ డైమండ్లలాంటి వాటిపై సుంకాల భారం తగ్గుతుంది. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే తేయాకు..కాఫీ, టెక్స్‌టైల్స్, మెరైన్ ఉత్పత్తులు, లెదర్, స్పోర్ట్స్ గూడ్స్, పండ్లు, రత్నాభరణాలు మొదలైన మన దేశ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత మార్కెట్ లభిస్తుంది. సుంకాల తగ్గింపుతో ఇంజనీరింగ్ గూడ్స్, ఎల్రక్టానిక్ ఐటమ్స్, రసాయనాలు, ప్లాస్టిక్ గూడ్స్ తదితర ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది.
లీగల్, ఆడియో–విజువల్, కంప్యూటర్, అకౌంటింగ్‌లాంటి సేవలందించే భారతీయ సంస్థలకు లబ్ధి చేకూరనుంది. ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే దాదాపు 99.6 శాతం దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు లేదా పూర్తిగా తొలగించేందుకు ఈఎఫ్‌టీఏ అంగీకరించింది. అలాగే ఈఎఫ్‌టీఏ నుంచి వచ్చే 95 శాతం దిగుమతులపై సుంకాలను భారత్ తగ్గిస్తుంది. డెయిరీ, సోయా, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఈ పరిధిలోకి రావు.
దశలవారీగా కొన్ని రకాల బొగ్గు, చాలామటుకు ఔషధా లు, అద్దకపు రంగులు, టెక్స్‌టైల్స్, దుస్తులు, ఇనుము..ఉక్కు వంటి ఉత్పత్తుల దిగుమతులపై భారత్‌లో టారిఫ్‌లు సున్నా స్థాయికి తగ్గిపోతాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్‌ఐ) తెలిపింది. ప్రాసెస్డ్ కూరగాయలు, బాస్మతి బియ్యం, తాజా పండ్లు మొదలైన వాటిని ఈఎఫ్‌టీఏ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. 2023–24లో ఈఎఫ్‌టీఏ కూటమికి భారత్ నుంచి 1.94 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024–25లో 1.97 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 22.05 బిలియన్ డాలర్ల నుంచి 22.44 బిలియన్ డాలర్లకు పెరిగాయి.