బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 544.66 పాయింట్లు లేదా 0.64 శాతం లాభంతో 85,219.74 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 26,136.35 వద్ద నిలిచింది.
కేఎస్ఆర్ ఫుట్‌వేర్ లిమిటెడ్, ఆస్పిన్‌వాల్ అండ్ కంపెనీ, కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్, కిరి ఇండస్ట్రీస్, ఓరియంట్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్, వోడాఫోన్ ఐడియా, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


