బ్యాంకులకు వరుస సెలవులు! | Bank Holidays Next Week Know The Full Details | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు వరుస సెలవులు!

Feb 15 2026 6:05 PM | Updated on Feb 15 2026 6:10 PM

Bank Holidays Next Week Know The Full Details

దేశంలోని వివిధ ప్రాంతాలలోని.. బ్యాంకు శాఖలు వచ్చే వారం మూడు రోజులు క్లోజ్‌లో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 18, 19, 20 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.

ఫిబ్రవరి 18 (బుధవారం): టిబెటన్ నూతన సంవత్సరమైన లోసర్‌ను జరుపుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు. 
ఫిబ్రవరి 19 (గురువారం): ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 20 (శుక్రవారం): రాష్ట్ర దినోత్సవం/రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్ & మిజోరాంలలో బ్యాంకులకు సెలవు.

అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement