2026 జనవరి నెలలో సగం రోజులు పూర్తైపోయాయి. కాగా వచ్చే వారంలో (జనవరి 19 నుంచి 24 వరకు) బ్యాంకు ఎన్ని రోజులు పని చేస్తాయి, సెలవు రోజులు ఎన్ని ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
23 జనవరి (శుక్రవారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు / సరస్వతీ పూజ (శ్రీ పంచమి) / వీర్ సురేంద్రసాయి జయంతి / బసంత పంచమి కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా & త్రిపురలలో బ్యాంకులకు సెలవు.
జనవరి 24 (శనివారం): నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.
జనవరి 25 (ఆదివారం): ఆదివారం కారణంగా బ్యాంకు సెలవు.
జనవరి 2026లో వారాంతాలతో సహా మొత్తం 16 బ్యాంకు సెలవులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. అంతే కాకుండా నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు. కాగా ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారే అవకాశం ఉంది.
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.


