మార్చి నెలలో అడుగు పెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు చాలానే ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు కస్టమర్లు ఈ మార్చి నెలలో తమ బ్యాంకు బ్రాంచ్‌ల సందర్శనలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక సెలవులు, అలాగే సాధారణ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ముందస్తుగా షెడ్యూల్‌ను చూసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణలు, చెక్ క్లియరెన్సులు వంటి ఇతర బ్రాంచ్ సేవలలో ఆలస్యాలను నివారించవచ్చు.
మార్చిలో బ్యాంకు సెలవులు
» మార్చి 1 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.
» మార్చి 2: హోలికా దహన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 3: హోలి, డోల్‌జాతర తదితర పండుగల సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు. మార్చి 4: యోసాంగ్ (రెండవ రోజు)తో పాటు హోలీ వేడుకల నేపథ్యంలో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 8 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 13: చాప్కార్ కత్ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేత.
» మార్చి 14 (రెండో శనివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 15 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 17: షాబ్ ఈ ఖదర్ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్‌లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 19: ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా వేడుకల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కాశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
మార్చి 20: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 21: రంజాన్-ఈద్, సర్హుల్ తదితర పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 22 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 26: శ్రీ రామ నవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
» మార్చి 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 29 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.
» మార్చి 31: మహవీర్ జయంతి సందర్భంగా ఆర్‌బీఐ సెలవుగా గుర్తించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరాంత లావాదేవీల దృష్ట్యా ప్రభుత్వ వ్యాపారం నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు ఆ రోజున తెరిచి ఉంటాయి.
యథావిధిగా డిజిటల్ సేవలు
బ్యాంకు బ్రాంచీలకు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు కొనసాగుతాయి. నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి డిజిటల్ లావాదేవీలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయి.


