గిఫ్ట్‌ సిటీలో తొలి ఐపీవో | XED Executive Development IPO | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌ సిటీలో తొలి ఐపీవో

Feb 28 2026 6:30 AM | Updated on Feb 28 2026 6:30 AM

XED Executive Development IPO

ఎక్స్‌ఈడీ ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ రెడీ 

ధరల శ్రేణి షేరుకి 10–10.5 డాలర్లు

న్యూఢిల్లీ: దేశీయంగా ఏర్పాటైన ఐఎఫ్‌ఎస్‌సీ.. గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌సిటీ(గిఫ్ట్‌ సిటీ) ద్వారా ఎక్స్‌ఈడీ ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ తొలిసారి పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ లెరి్నంగ్‌ సొల్యూషన్లు అందించే కంపెనీ ఇందుకు షేరుకి 10–10.5 డాలర్ల ధరల శ్రేణి నిర్ణయించింది.  

పబ్లిక్‌ ఇష్యూ మార్చి 6న ప్రారంభమై 18న ముగియనుంది. తద్వారా 1.2 కోట్ల డాలర్లు సమీకరించే యోచనలో ఉంది. వెరసి ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ) మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటైన గిఫ్ట్‌ సిటీ ద్వారా తొలి ఐపీవో వెలువడనుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం అర్హతగల ఎన్‌ఆర్‌ఐసహా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు, అనుమతిగల ఇతర విదేశీ ఇన్వెస్టర్లు ఇష్యూకి దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.

 గ్లోబల్‌ ప్రోగ్రామ్‌ విస్తరణ, లోతైన యూనివర్సిటీ భాగస్వామ్యాలు, కీలక మార్కెట్లలో డెలివరీ సామర్థ్యాలపై పెట్టుబడుల కోసం నిధుల సమీకరణ చేపడుతున్నట్లు ఎక్స్‌ఈడీ వ్యవస్థాపకుడు, ఎండీ జాన్‌ కలెలిల్‌ పేర్కొన్నారు. ఐఎఫ్‌ఎస్‌సీ ఎకోసిస్టిమ్‌కు తాజా ఐపీవో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలవనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్‌ ఎక్సే్ఛంజ్‌(ఐఎక్స్‌) ఎండీ, సీఈవో వి.బాలసుబ్రమణ్యం తెలియజేశారు. దీంతో అంతర్జాతీయ దృష్టిగల కంపెనీలు విదేశాలలో పెట్టుబడుల సమీకరణకు తగిన ప్లాట్‌ఫామ్‌గా గిఫ్ట్‌ సిటీని గుర్తించనున్నట్లు అభిప్రాయపడ్డారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement