ఒక్క యాప్: రైల్లో పోయిన ఐప్యాడ్ దొరికిందిలా.. | Passenger Forgets iPad On Train To Bhopal Recovers It Using RailMadad | Sakshi
Sakshi News home page

ఒక్క యాప్: రైల్లో పోయిన ఐప్యాడ్ దొరికిందిలా..

Dec 31 2025 4:06 PM | Updated on Dec 31 2025 4:43 PM

Passenger Forgets iPad On Train To Bhopal Recovers It Using RailMadad

రైల్లో ప్రయాణించేటప్పుడు.. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ఇతరత్రా మరిచిపోయే అవకాశం ఉంది. వాటిని తిరిగి పొందటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి అదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

డిసెంబర్ 27న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో భోపాల్‌కు వెళుతున్నప్పుడు తన ఐప్యాడ్‌ను మర్చిపోయానని ఎక్స్ యూజర్ 'దియా' వెల్లడించారు. ట్రైన్ దిగిన ఒక గంట తరువాత మరిచిపోయిన విషయం గ్రహించి, చాలా బాధపడినట్లు ఆమె వెల్లడించారు. రైల్లో మరిచిపోయిన తన ఐప్యాడ్ తిరిగిపొండటానికి.. రైల్వే హెల్ప్‌లైన్ (#139)కు కాల్ చేసి, RailMadad యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన సిబ్బంది.. ట్రైన్ వివరాలు, కోచ్ నెంబర్ ఆధారంగా ఆమె ఐప్యాడ్ గుర్తించారు. ఆ తరువాత ఆమెకు కాల్ చేసి దానిని అప్పగించారు. ఈ విషయాన్ని దియా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

ఐప్యాడ్ తిరిగి పొండటంతో దియా చాలా సంతోషించింది. సిబ్బందికి కృతజ్ఞత చెబుతూ.. మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకు ఎదురైన సంఘటనల గురించి కూడా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement