Economic Partnership
-
ద.కొరియాకు దగ్గరగా...
ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకున్నప్పుడు మన దేశంలో విదేశీ అధినేతల పర్యటనలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. దానికితోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సృష్టించిన అనిశ్చితి సరేసరి. ఇలాంటి వాతావరణంలో ఆదివారం భారత్కొచ్చి మూడు రోజులు పర్యటించి వెళ్లిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్కు ఇది అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ పర్యటనకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఆ మాటెలా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరు దేశాల మధ్యా ప్రస్తుతం ఉన్న 2,700 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి 5,000 కోట్ల డాలర్లకు చేర్చాలని అధినేతలిద్దరూ సంకల్పించారు. ఇందుకోసం 2010లో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)ను మరింత విస్తృతపరచాలని నిర్ణయించారు. భారత్లో విదేశీ పెట్టుబడుల్లో దక్షిణ కొరియా అయిదో స్థానంలో ఉంది. మ్యూంగ్ తనతోపాటు 200 మంది వ్యాపార వేత్తలూ, సీఈవోలతో కూడిన భారీ ప్రతినిధి బృందాన్ని వెంట బెట్టుకుని వచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), రక్షణ, షిప్పింగ్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, క్రీడలు, సాంస్కృతిక రంగం వగైరాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్యా సాంస్కృతిక బంధానికి ఎంతో చరిత్ర ఉందంటారు. క్రీస్తుశకం 48లో అయోధ్యకు చెందిన యువతి హియోహాంగ్కు అప్పటి కొరియా రాజు సురోతో వివాహమైందని 13వ శతాబ్దంనాటి ఒక బౌద్ధ సన్యాసి రచించిన పుస్తకంలో ఉంది.అందులో ప్రస్తావించిన ‘అయుత’ ఇప్పటి అయోధ్య అయివుంటుందని అనేకులు భావిస్తారు. కొరియా చరిత్రలో ఆమె యువరాణి సురిరత్నగా నమోదైంది. అయోధ్యలో సరయూ నది ఒడ్డున రాణి హియోహాంగ్ స్మృతిలో ఒక పార్క్ నిర్మించారు. 2019లో ఆమె స్మారకార్థం రెండు దేశాలూ కలిసి ఒక స్టాంపు విడుదల చేశాయి. నాలుగో శతాబ్దంలో బౌద్ధం ఆ దేశంలో ప్రవేశించింది. 1973లో తొలిసారి దౌత్య సంబంధాలు ఏర్పడినా... అంతకు చాన్నాళ్లముందే 1950–53 నాటి కొరియా యుద్ధకాలంలో మన దేశంనుంచి వైద్య బృందాలు అక్కడికెళ్లి పనిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిశాక తొలిసారి 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆ దేశంలో పర్యటించారు. ప్రత్యేకించి ఎలాంటి కారణాలూ లేకపోయినా 2018లో అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–యీ తర్వాత దౌత్య సంబంధాల్లో స్తబ్ధత ఆవరించింది. అప్పుడూ, అంతకుముందూ కుదిరిన ఒప్పందాలు ఆచరణలో కొనసాగుతున్నా ఇరు దేశాల వాణిజ్య లోటుపై మన దేశానికి కొంత అసంతృప్తి ఉంది. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 2,700 కోట్ల డాలర్లున్నా, అక్కడినుంచి మనకొచ్చే దిగుమతుల విలువ దాదాపు 2,100 కోట్ల డాలర్లు. మన ఎగుమతుల విలువ 600 కోట్ల డాలర్లు మించదు. ఇందులో సమతౌల్యత సాధించాలని మన దేశం ఎప్పటినుంచో భావిస్తోంది. ఆరోగ్య కారణాలు చూపి, చీడపీడలు చూపి మన సాగు ఉత్పత్తులను దక్షిణ కొరియా అడ్డుకుంటోంది. నౌకా నిర్మాణంలో దక్షిణ కొరియా సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరుంది. పర్యావరణ హితమైన, అత్యాధునిక నౌకల నిర్మాణంలో, ఇతర నౌకాసంబంధ కార్యకలాపాల్లో మన దేశానికి సహకరించేందుకు అంగీకరించింది. నౌకాశ్రయాలను సాంకేతికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లటంతోపాటు ఓడల మరమ్మతుకు, అతి పెద్ద ఓడల నిర్మాణానికి తోడ్పడే భారీ డ్రై డాక్ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది. రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. విమాన విధ్వంసక ఫిరంగులు, క్షిపణి వ్యవస్థలు ఇక్కడే అభివృద్ధిపరచడానికి, అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతల్ని బదిలీ చేయటానికి దక్షిణ కొరియా అంగీకరించింది. యుద్ధక్షేత్రంలో చురుగ్గా కదిలి, శత్రుసైన్యాన్ని దీటుగా ఎదుర్కొనగలిగే సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ కె9 వజ్ర కొరియా సహకారంతోనే ఇక్కడ ఉత్పత్త వుతోంది. ఇవిగాక సెమీ కండక్టర్లు, ఫార్మా, జౌళి, ఐటీ రంగాలకు సైతం సహకారం విస్తరించటానికి సంకల్పించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో భిన్న రంగాల్లో మరింత దగ్గరయ్యేందుకు దక్షిణ కొరియా అధినేత పర్యటన దోహదపడుతుంది. -
ఇక స్విస్ చాక్లెట్లు.. వాచీలు చౌక
న్యూఢిల్లీ: ఇకపై చాక్లెట్లు, వైన్స్, దుస్తులు, వాచీల్లాంటి పలు స్విట్జర్లాండ్ ఉత్పత్తులు భారత మార్కెట్లో చౌకగా లభించనున్నాయి. అలాగే మన దేశానికి చెందిన పలు ఎగుమతి సంస్థలకు మరింత విస్తృత మార్కెట్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి నాలుగు యూరప్ దేశాల కూటమి ఈఎఫ్టీఏతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) అక్టోబర్ 1 నుంచి (నేడు) అమల్లోకి రానుంది. ఐస్ ల్యాండ్, లీషె్టన్స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో 2024 మార్చి 10న ఈ ఒప్పందం కుదిరింది. దీని కింద, వచ్చే 15 ఏళ్లలో భారత్లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈఎఫ్టీఏ హామీ ఇచ్చింది. ఒప్పందం అమల్లోకి వచి్చన పదేళ్ల వ్యవధిలో 50 బిలియన్ డాలర్లు, ఆ తర్వాత అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల మేర కూటమి దేశాలు భారత్లో ఇన్వెస్ట్ చేయనున్నాయి. దీనితో భారత్లో ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. ఒకవేళ ఏదైన కారణం వల్ల ప్రతిపాదిత పెట్టుబడులు రాకపోతే ఆ నాలుగు దేశాలకు ఇస్తున్న సుంకాలపరమైన వెసులుబాట్లను సర్దుబాటు చేసే లేదా పూర్తిగా ఎత్తివేసేందుకు వీలుగా సదరు ఒప్పందంలో నిబంధన ఉంది. ఈఎఫ్టీఏ దేశాలనేవి యూరోపియన్ యూనియన్లో (ఈయూ) భాగం కావు. ఈయూ తో కూడా భారత్ విడిగా వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తోంది. వివిధ దేశాలతో, అలాగే కూటము లతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో టీఈపీఏ పదా్నలుగోది. మోదీ సారథ్యంలోని ప్ర భుత్వం కుదుర్చుకున్న వాటిల్లో మారిషస్, యూఏఈ, యూకే, ఆ్రస్టేలియా తర్వాత అయిదోది.ప్రయోజనాలు ఇలా.. ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్..పాలిష్డ్ డైమండ్లలాంటి వాటిపై సుంకాల భారం తగ్గుతుంది. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే తేయాకు..కాఫీ, టెక్స్టైల్స్, మెరైన్ ఉత్పత్తులు, లెదర్, స్పోర్ట్స్ గూడ్స్, పండ్లు, రత్నాభరణాలు మొదలైన మన దేశ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత మార్కెట్ లభిస్తుంది. సుంకాల తగ్గింపుతో ఇంజనీరింగ్ గూడ్స్, ఎల్రక్టానిక్ ఐటమ్స్, రసాయనాలు, ప్లాస్టిక్ గూడ్స్ తదితర ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. లీగల్, ఆడియో–విజువల్, కంప్యూటర్, అకౌంటింగ్లాంటి సేవలందించే భారతీయ సంస్థలకు లబ్ధి చేకూరనుంది. ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే దాదాపు 99.6 శాతం దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు లేదా పూర్తిగా తొలగించేందుకు ఈఎఫ్టీఏ అంగీకరించింది. అలాగే ఈఎఫ్టీఏ నుంచి వచ్చే 95 శాతం దిగుమతులపై సుంకాలను భారత్ తగ్గిస్తుంది. డెయిరీ, సోయా, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఈ పరిధిలోకి రావు. దశలవారీగా కొన్ని రకాల బొగ్గు, చాలామటుకు ఔషధా లు, అద్దకపు రంగులు, టెక్స్టైల్స్, దుస్తులు, ఇనుము..ఉక్కు వంటి ఉత్పత్తుల దిగుమతులపై భారత్లో టారిఫ్లు సున్నా స్థాయికి తగ్గిపోతాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) తెలిపింది. ప్రాసెస్డ్ కూరగాయలు, బాస్మతి బియ్యం, తాజా పండ్లు మొదలైన వాటిని ఈఎఫ్టీఏ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. 2023–24లో ఈఎఫ్టీఏ కూటమికి భారత్ నుంచి 1.94 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024–25లో 1.97 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 22.05 బిలియన్ డాలర్ల నుంచి 22.44 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
భారత్, శ్రీలంకల మధ్య విజన్ డాక్యుమెంట్
న్యూఢిల్లీ: భారత్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


