‘గజ్’ క్రెడిట్‌ కార్డు గురించి తెలుసా? | Premium Metal Credit Card by IDFC FIRST Bank | Sakshi
Sakshi News home page

‘గజ్’ క్రెడిట్‌ కార్డు గురించి తెలుసా?

Dec 31 2025 3:00 PM | Updated on Dec 31 2025 3:17 PM

Premium Metal Credit Card by IDFC FIRST Bank

ముంబై: సంపన్న కస్టమర్ల కోసం ప్రైవేట్‌ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తాజాగా గజ్ (Gaj) పేరిట ప్రీమియం మెటల్‌ కార్డును ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ కస్టమర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్డుపై జాయినింగ్, వార్షిక ఫీజు రూ. 12,500గా (జీఎస్‌టీ అదనం) ఉంటుంది.

12,500 ఇన్విటేషన్ రివార్డు పాయింట్లతో ఇది లభిస్తుంది. 1 రివార్డు పాయింటు రూ. 1కి సమానంగా ఉంటుంది. వీటిని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ యాప్‌ ద్వారా ట్రావెల్‌ బుకింగ్స్‌పై వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు. వార్షికంగా రూ. 10 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీరో ఫారెక్స్‌ మార్కప్, గ్లోబల్‌ ఏటీఎంలలో వడ్డీరహితంగా నగదు లభ్యత, రూ. 50,000 వరకు విలువ చేసే ట్రిప్‌ క్యాన్సిలేషన్‌ కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ప్రీమియం మెటల్‌ క్రెడిట్‌ కార్డుల త్రయం ’అశ్వ–మయూర–గజ’లో భాగంగా ఇది ఉంటుందని బ్యాంకు పేర్కొంది.

ఇదీ చదవండి: దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement