కర్ణాటక: ఒకే బైకులో వెళుతున్న ముగ్గురు ఆకతాయిలు రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని వేధించారు. ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి బీటీఎం లేఔట్‌లో ఈ కీచకపర్వం జరిగింది. స్కూటర్‌లో హెల్మెట్ ధరించి వెళుతున్న యువతిని బైక్‌లో హెల్మెట్ ధరించకుండా అడ్డదిడ్డంగా నడుపుతున్న యువకులు వెంటాడారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర యువతిని ఫాలో చేస్తూ పదే పదే అడ్డు వస్తూ వేధింపులకు గురి చేశారు. ఈ మొత్తం ఘటనను ఒక కారులో ఉన్న వ్యక్తి వీడియో తీసి పోలీసులకు షేర్ చేశాడు. వీడియో ఆధారంగా, బైక్ నంబర్, యజమాని వివరాలను గుర్తించి, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
बेंगलुरु : देर रात सुनसान सड़क पर अकेली लड़की को छेड़ने लगे, मनचलों की करतूत का वीडियो
पूरी खबर: https://t.co/BtbymEecXU #Bengaluru | #ViralVideo pic.twitter.com/DhDwa7IvTh— NDTV India (@ndtvindia) December 27, 2025


