స్కూటీలోకి చొరబడిన నాగుపాము
బయటికి పంపేందుకు పాట్లు
బండి విడి భాగాలు మొత్తం తొలగింపు
కరీంనగర్ జిల్లా: ఓ మూరెడు నాగుపాము.. బైక్ యజమానిని ముప్పు తిప్పలు పెట్టింది. బయటకు రాకుండా బండి విడిభాగాలు మొత్తం విప్పేలా చేసింది. రోడ్డుపై ఉన్నవారిని హైరానా పడేలా చేసింది. చివరకు బండి పెట్రోల్ ట్యాంకు పక్కన చిక్కింది. ఈ సంఘటన జిల్లాలోని హుజూరాబాద్ పట్ట ణంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికు ల వివరాల ప్రకారం..
హుజూరాబాద్‌కు చెందిన షౌకత్ తన స్కూటీపై పని నిమిత్తం హనుమాన్ ఆలయం సమీపంలోని ఓ దుకా ణానికి వెళ్లాడు. బండి పార్క్‌చేసి లోనికి వెళ్లొచ్చేసరికి సమీపంలో ఉన్నవారు స్కూటీలో పాము చొరబడిందని చెప్పారు. హైరానా పడిన షౌకత్ బండిని బలంగా అటూ.. ఇటూ కదపగా పాము బయటకు రాలేదు. చేసేదేం లేక బండి ఒక్కో విడిభాగాన్ని వి ప్పుతూ వచ్చాడు. పెట్రోల్ ట్యాంకు పక్కన పామును గమనించి, బయటకు తీసి దూరప్రాంతంలో వదిలేశారు. దీంతో స్కూటీ య జమాని, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


