
టీవీఎస్ మోటార్ కంపెనీ.. భారత మార్కెట్లో విక్రయించే తమ కమ్యూటర్ మోటార్ సైకిళ్లు & స్కూటర్ల కొత్త ధరలను ప్రకటించింది. జీఎస్టీ సవరణల తర్వాత సంస్థ ఈ ప్రకటన వెల్లడించింది. పండుగ సీజన్ సమయంలో టూ వీలర్ ధరలు తగ్గడం అనేది.. కొత్త వెహికల్స్ కొనేవారికి ఓ మంచి శుభవార్త.
కొత్త ధరలు
●టీవీఎస్ జూపిటర్ 110: రూ. 72,400 (రూ. 6,481 తగ్గింది)
●టీవీఎస్ జూపిటర్ 125: రూ. 75,600 (రూ. 6,795 తగ్గింది)
●టీవీఎస్ ఎన్‌టార్క్ 125: రూ. 80,900 (రూ. 7,242 తగ్గింది)
●టీవీఎస్ ఎన్‌టార్క్ 150: రూ. 1,09,400 (రూ. 9,600 తగ్గింది)
●టీవీఎస్ ఎక్స్ఎల్ 100: రూ. 43,400 (రూ. 4,354 తగ్గింది)
●టీవీఎస్ రేడియన్: రూ. 55,100 (రూ. 4,850 తగ్గింది)
●టీవీఎస్ స్పోర్ట్: రూ. 55,100 (రూ. 4,850 తగ్గింది)
●టీవీఎస్ స్టార్ సిటీ: రూ. 72,200 (రూ. 6,386 తగ్గింది)
●టీవీఎస్ రైడర్: రూ. 80,900 (రూ. 6,725 తగ్గింది)
●టీవీఎస్ జెస్ట్: రూ. 70,600 (రూ. 6,291 తగ్గింది)
ధరలు ఎంచుకునే వేరియంట్ను బట్టి మారుతాయి. కాబట్టి కచ్చితమైన ధరల కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.