
టీవీఎస్ మోటార్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ ‘ఎన్‌టార్క్ 150’ను మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ, ప్రీమియం లుక్‌తో వస్తున్న ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్‌షోరూం వద్ద బేస్ వేరియంట్ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్‌టీ వేరియంట్ ధర రూ.1,29,000 గా ఉంది.
149.7సీసీ ఇంజిన్.. గరిష్టంగా 7,000 ఆర్‌పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.
ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తొలి కస్టమర్ ఎవరంటే..
హై–రిజల్యూషన్ టీఎఫ్‌టీ క్లస్టర్‌తో పాటు టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్షన్ టెక్నాలజీ ఉంది. అలెక్సా, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, టర్న్–బై–టర్న్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్, చివరిగా పార్క్ చేసిన స్థానం, కాల్/మెసేజ్ అలర్ట్స్, రైడ్, స్ట్రీట్ మోడ్‌లు, ఓటీఏ అప్‌డేట్స్, కస్టమ్ విడ్జెట్‌లు వంటి మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి.