యమహా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరించడంతో భాగంగా.. ఏరోక్స్-ఈ ఆవిష్కరించింది. ఇప్పటికే పెట్రోల్ వెర్షన్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో దేశీయ విఫణి లాంచ్ కానుంది. ఇందులో 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 106 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాగా 9.5 కేడబ్యు ఎలక్ట్రిక్ మోటారు 48 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
యమహా ఏరోక్స్ ఈ స్కూటర్ చూడటానికి.. సాధారణ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కావదంతో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, యాబ్ బేస్డ్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉన్నాయి. ఎకో, స్టాండర్డ్, పవర్, ఓవర్‌టేకింగ్ చేసేటప్పుడు ఉపయోగించగల అదనపు బూస్ట్ మోడ్ వంటి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: ఢిల్లీ బ్లాస్ట్: తప్పు చేసిన కారు ఓనర్!
సస్పెన్షన్ సెటప్ స్టాండర్డ్ వెర్షన్ నుంచి తీసుకున్నారు. కాబట్టి దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. రెండు చివర్లలో.. డిస్క్‌లు బ్రేక్స్ ఉన్నాయి. కాబట్టి పనితీరు పరంగా బాగుంటుందని భావిస్తున్నారు. కాగా దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.


