భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్ | Elon Musk Retweets X User Post Over China Silver Export Controls and Industrial Impact | Sakshi
Sakshi News home page

పెరిగిన ధరలు.. వెండి అవసరం!: మస్క్ ట్వీట్

Dec 28 2025 7:18 PM | Updated on Dec 28 2025 7:37 PM

Elon Musk Retweets X User Post Over China Silver Export Controls and Industrial Impact

బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.

చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.

చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.

ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!

వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement