ఖజానా హౌస్‌ఫుల్‌ | Corporate tax collections increased by 14. 51 percent | Sakshi
Sakshi News home page

ఖజానా హౌస్‌ఫుల్‌

Feb 12 2026 4:36 AM | Updated on Feb 12 2026 8:07 AM

Corporate tax collections increased by 14. 51 percent

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భళా 

కార్పొరేట్ల నుంచి అధికంగా వసూలు

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 10 వరకు (2025 ఏప్రిల్‌ 1 నుంచి) ప్రత్యక్ష పన్నుల నికర ఆదాయం.. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.4 శాతం పెరిగి రూ.19.44 లక్షల కోట్లకు చేరింది. ఆదాయపన్ను శాఖ డేటా ప్రకారం రిఫండ్‌లు తగ్గడం, కార్పొరేట్‌ పన్ను (కంపెనీలు చెల్లించే) వసూళ్లు బలంగా ఉండడం ఇందుకు అనుకూలించింది. 

ఈ కాలంలో కార్పొరేట్‌ పన్నుల వసూలు 14.51% పెరిగి రూ.8.90 లక్షల కోట్లుగా ఉంటే.. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌లు) నుంచి ఆదాయం 5.91 శాతం పెరిగి రూ.10.03 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆదాయపన్ను శాఖ డేటా తెలియజేస్తోంది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో ఖజానాకు రూ.50,279 కోట్లకు సమకూరింది. 

క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి వృద్ధి లేదు. పన్ను రిఫండ్‌లు (తిరిగి చెల్లింపులు) 18.82 శాతం తగ్గి రూ.3.34 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల పన్ను వసూళ్లు 4.09 శాతం పెరిగి రూ.22.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో కార్పొరేట్‌ పన్నుల స్థూల ఆదాయం రూ.10.88 లక్షల కోట్లుగా, నాన్‌ కార్పొరేట్‌ పన్నుల ఆదాయం రూ.11.39 లక్షల కోట్లుగా ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement