జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే | India exports in January indeed expected to be positive | Sakshi
Sakshi News home page

జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే

Feb 12 2026 8:20 AM | Updated on Feb 12 2026 8:20 AM

India exports in January indeed expected to be positive

వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ 

భారత వస్తు, సేవల ఎగుమతులు ఈ ఏడాది ఇప్పటి వరకు సానుకూల వృద్ధిని నమోదు చేసిట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జనవరిలోనూ సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు. జనవరి నెలకు సంబంధించి అధికారిక డేటా ఈ నెలలో విడుదల అవుతుందన్నారు. బయోఫాచ్‌ 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన జర్మనీలోని న్యూరెమ్‌బర్గ్‌కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.

భారత్‌లోని 20 రాష్ట్రాలకు చెందిన 100 మంది ఎగ్జిబిటర్లు ఆర్గానిక్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. ఐరోపా సమాఖ్య వీటికి పెద్ద మార్కెట్‌గా ఉంది. దేశ వస్తు ఎగుమతులు గత డిసెంబర్‌లో 2 శాతం పెరిగి 38.5 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. అదే నెలలో దిగుమతులు 8.7 శాతం పెరిగి 63.55 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు (9 నెలల్లో) వస్తు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలి్చతే 2.44 శాతం పెరిగి 330.29 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు, సేవల ఎగుమతులు 850 బిలియన్‌ డాలర్లకు మించి నమోదవుతాయని వాణిజ్య శాఖ అంచనాగా ఉంది.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement