Positive
-
వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో ఇళ్లకు (హౌసింగ్) డిమాండ్‌ను పెంచేందుకు ఆర్బీఐ రెపో రేటును కనీసం 0.25 శాతం నుంచి 0.30 శాతం వరకు అయినా తగ్గించాలని రియల్టర్ల మండలి నరెడ్కో డిమాండ్ చేసింది. ‘‘రియల్టీ రంగం బలమైన వృద్ధి, సానుకూల సెంటిమెంట్‌ను చూస్తోంది. రెపో రేటును కొంత మేర తగ్గించడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. 25–30 బేసిస్ పాయింట్లను తగ్గించాలి. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఉత్సాహం ఇవ్వడమే కాకుండా, అనుబంధ రంగాలైన నిర్మాణం, సిమెంట్, స్టీల్‌కు కూడా ప్రయోజనం కల్పించినట్టు అవుతుంది’’అని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు తెలిపారు. ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లపై తన నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్న నేపథ్యంలో నరెడ్కో ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘వడ్డీ రేట్ల తగ్గింపుతో టైర్–2, 3 పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది. సమ్మిళిత వృద్ధి, పట్టణాభివృద్ధి పట్ల ప్రభుత్వ ప్రణాళికలకు మద్దతునిస్తుంది. రేట్ల తగ్గింపుతో డెవలపర్లు, ఇళ్ల కొనుగోలుదారులకు తోడ్పాటు, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది, లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాన్ని డెవలపర్లు వేగవంతం చేయడంతోపాటు కొత్తవి ప్రారంభించేందుకు ఉత్సాహం వస్తుంది’’అని హరిబాబు తెలిపారు. రెపో రేటు తగ్గింపుతో అన్ని ప్రాంతాల్లో స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుందన్నారు. కచ్చితంగా ప్రయోజనమే.. వడ్డీ రేట్ల తగ్గింపుతో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయోజనం దక్కుతుందని, రుణాల ధరలు దిగొస్తాయని, దిగువ, మధ్యాదాయ వర్గాల్లో సానుకూల సెంటిమెంట్ ఏర్పడుతుందని నైట్‌ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బైజాల్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘రేట్ల తగ్గింపుతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో డెవలపర్లు తమ ప్రాజెక్టుల కోసం రుణాలు సులభంగా పొందగలరు’’అని ఆయన చెప్పారు. వినియోగ వృద్ధికి బడ్జెట్లో ఆర్థిక మంత్రి చేపట్టిన చర్యలకు మద్దతుగా, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గించాలని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి కోరారు. -
ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా భారత్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ ప్రకాశవంతమైన కాంతిపుంజంగా నిలుస్తోందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక సర్వే నివేదికలో వెల్లడించింది. ప్రైవేట్ పెట్టుబడులకు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని పేర్కొంది. గత ముప్ఫై రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వే ఫిబ్రవరి తొలి వారంలో పూర్తవుతుందని. ఇప్పటివరకు అందిన వివరాల ఆధారంగా మధ్యంతర నివేదికను రూపొందించినట్లు వివరించింది. మొత్తం 500 సంస్థలు సర్వేలో పాల్గొంటుండగా.. 300 సంస్థల అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. దీని ప్రకారం 79 శాతం సంస్థలు గత మూడేళ్లలో మరింత మంది ఉద్యోగులను తీసుకున్నట్లు వివరించాయి. 75 శాతం సంస్థలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు .. ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో తాము ఇన్వెస్ట్ చేస్తామంటూ 70 శాతం సంస్థలు వెల్లడించిన దాన్ని బట్టి చూస్తే వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వివరించారు. కీలక వృద్ధి చోదకాలైన ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సానుకూలంగా కనిపిస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్థిరంగా 6.4–6.7 శాతం స్థాయిలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇదీ చదవండి: అడుగు పెట్టిన చోటల్లా.. ఆధిపత్యం!రాబోయే సంవత్సరకాలంలో వచ్చే పెట్టుబడుల ప్రణాళికలతో తయారీ, సేవల రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సగటున వరుసగా 15 నుండి 22 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ రెండు రంగాల్లో పరోక్ష ఉద్యోగాల కల్పన దాదాపు 14 శాతం పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రకారం సీనియర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్/సూపర్వైజరీ స్థాయిలోని ఖాళీల భర్తీ కోసం 1 నుండి 6 నెలల సమయం పడుతోండగా, రెగ్యులర్.. కాంట్రాక్ట్ వర్కర్లను భర్తీ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతోంది.గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను సీనియర్ మేనేజ్మెంట్, మేనేజీరియల్/సూపర్వైజరీ ఉద్యోగులు, రెగ్యులర్ వర్కర్లకు వేతన వృద్ధి సగటున 10 నుండి 20 శాతంగా ఉంటుందని 40–45 శాతం సంస్థలు తెలిపాయి. -
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు -
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్ కోరారు. मेरा COVID test पॉजिटिव आया है। मुझे ५ दिनों के लिए आराम करने के लिये कहा गया है। इसलिए मैं कुछ समय के लिए नहीं मिल पाऊँगा। क्षमा करें। आप सभी भी COVID से बचने के लिए अपना ख़्याल रखें।— Digvijaya Singh (@digvijaya_28) August 20, 2024 -
పాకిస్తాన్‌కు పాకిన మంకీపాక్స్.. ముగ్గురికి పాజిటివ్
ఇస్లామాబాద్: మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది. వారికి మంకీపాక్స్ ఉన్నట్లు ఆగస్ట్ 13న పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది.కాగా ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. అప్పట్లో దేశంలో మొత్తం 11 మంకీపాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
భారత్ అవుట్‌లుక్.. పాజిటివ్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు భరోసా ఇస్తూ పది సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ భారతదేశ సార్వ¿ౌమ (సావరిన్) రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు మెరుగుపరిచింది. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని ఎస్అండ్పీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతా బాగుంటే రెండేళ్లలో సావరిన్ రేటింగ్‌నూ పెంచుతామని పేర్కొంది. కాగా, ఆరు బ్యాంకులు– ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియాన్ బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్‌లకు సంబంధించీ ఇదే అవుట్‌లుక్ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్‌నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్‌లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్‌కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్‌ల టీకాలు అందించారు. -
నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా.. పరిస్థితి విషమం!
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్‌తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv — ANI (@ANI) December 28, 2023 -
పాలమూరులో 20ఏళ్ల యువకుడికి కరోనా కొత్త వేరియంట్ పాజిటివ్
పాలమూరు: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మళ్లీ ఇప్పుడు కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో మళ్లీ అలజడి మొదలైంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మంగళవారం 14 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాకేంద్రంలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఆర్ఓగా పని చేస్తున్న సదరు యువకుడికి స్వల్ప లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ వెల్లడించారు. సదరు యువకుడి శాంపిల్స్ గాంధీ ఆస్పత్రిలోని ల్యాబ్ పంపించి ఏ రకం వైరస్ అని తెలుసుంటామని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఐదు రోజులుగా 151 మంది అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా ఆరోగ్యశాఖతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పడకలు సిద్ధం చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, పీపీ, పీసీఆర్ కిట్స్, మందుల ఇతరత్రా సామగ్రిని సమకూర్చారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని, జాతర్లు, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్లడం, జన సమూహంలో ప్రయాణించడం వల్ల కరోనా వైరస్ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..!
ఇంటిని విలాసవంతంగా డిజైన్ చేయించాలా లేక కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలా అని తర్జనభర్జన పడుతుంటారు చాలామంది. ఏ అలంకరణ అయినా ఇంటిల్లిపాదిలో పాజిటివ్ ఎనర్జీ నింపేలా ఉండాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. ద్వారపు కళ: పండగలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం తెలిసిందే. ఇదంతా పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే.. పూల కుండీ లేదా వాల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేయాలి. ప్రశాంతత ఇలా : లివింగ్ రూమ్‌లోకి ఎంటర్ అవుతూనే మదిని ప్రశాంతత పలకరించాలంటే.. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్‌తో గది కార్నర్‌ను అలంకరించుకోవాలి. ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది. నేచురల్ ఎలిమెంట్స్ : పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేయాలి. అందుకు ఇండోర్ ప్లాంట్స్, చిన్న వాటర్ ఫౌంటెన్, క్యాండిల్స్‌ను అలంకరించాలి. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం, దీని వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటివాటినీ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఇంక్లూడ్ చేయాలి. సింబాలిక్ ఆర్ట్ వర్క్: మనకు నచ్చే.. ఇంటికి నప్పే ఆర్ట్ వర్క్‌ని గోడపైన అలంకరించుకోవచ్చు. ఇందుకోసం తామరపువ్వు, నెమలి, మండలా ఆర్ట్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే వైబ్స్ ఎక్కువగా ఉంటాయి. (చదవండి: తోడొకరుండిన అదే భాగ్యము!) -
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్‌కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్‌లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
స్టాక్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ స్తర్త్స్
-
ఎవరెస్ట్ బ్రాండ్ సాంబార్ మసాలా అమ్మొద్దు: అమెరికా అధికారులు
గుజరాత్లో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి ఉత్పత్తవుతున్న సాంబార్ మసాలా, గరమ్ మసాలాను అమెరికాలో విక్రయించొద్దని అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. సల్మొనెల్లా టెస్టులో ఇవి పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించింది. సాల్మొనెల్లా అనేది.. చిన్నపిల్లలు లేదా వృద్ధులలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో ఉన్న ఇతరులలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఇది కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను కూడా కలిగిస్తుంది. సాల్మొనెల్లా సోకిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా తరచుగా జ్వరం, అతిసారం (రక్తంతో కూడినది కావచ్చు), వికారం, వాంతులు , కడుపు నొప్పి వంటి వాటితో అనారోగ్యం బారిన పడుతుంటారు. అరుదైన పరిస్థితులలో, సాల్మొనెల్లాతో ఇన్ఫెక్షన్ జీవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ధమనుల అంటువ్యాధులు (అనగా, సోకిన అనూరిజమ్స్), ఎండోకార్డిటిస్, ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. చదవండి: Viral Video: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే! -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్‌పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో BJP అనుకూల మరియు ప్రతికూల పాయింట్లు
-
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో, రాజ్‌నాథ్ సింగ్.. హోం క్వారెంటైన్లో ఉన్నారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్.. గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది. కాగా, కోవిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 13వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ఇక, మరణాలు కూడా ఎక్కవ సంఖ్యలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. Raksha Mantri #RajnathSingh has been tested positive for #COVID19 with mild symptoms and is now under home quarantine. He had attended Army's Commanders Conference yesterday at Manekshaw Centre. Praying for soonest recovery ! pic.twitter.com/WSe4jyPVbJ — Neeraj Rajput (@neeraj_rajput) April 20, 2023 -
మోసపూరిత చెక్కులకు పీఎన్బీ చెక్
న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించి మోసాల విషయంలో కస్టమర్లను రక్షించే చర్యలో భాగంగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మరింత పటిష్ట కీలక చర్య తీసుకుంది. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకూ ఇకపై పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రూ.10లక్షలు ఆపైబడిన విలువైన చెక్కుకే పీపీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. పీపీఎస్ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. ఇది నిర్దిష్ట చెక్కులను జారీ చేసేటప్పుడు కస్టమర్లు అవసరమైన వివరాలను (ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, నగదు, లబ్ధిదారు పేరు) తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. బ్రాంచ్ ఆఫీస్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా చెక్ వివరాలను అందించడం ద్వారా కస్టమర్లు పీపీఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. చెక్ ప్రెజెంటేషన్‌కు ఒక పని రోజు ముందు ఈ వివరాలను ఆమోదించడం, లేదా వివరాలను సమర్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఎస్‌లో నమోదైన చెక్కులు మాత్రమే వివాద పరిష్కార యంత్రాంగం కిందకు వస్తాయి. -
డోపింగ్‌లో పట్టుబడిన ద్యుతీచంద్.. తాత్కాలిక నిషేధం
భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ''ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్, సార్మ్స్ (ఎన్బోర్సమ్), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్‌లో ఉందని.. శాంపిల్-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది. ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది. Dutee Chand has been temporarily suspended following a positive analytical finding by WADA. The sample B test and hearing have not yet been released. pic.twitter.com/de0Blbsdnm — Doordarshan Sports (@ddsportschannel) January 18, 2023 చదవండి: Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్‌యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది భారత్. రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తోంది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే భారత్‌కు వచ్చిన 39 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 6000 మందికి రాండమ్‌గా పరీక్షలు నిర్వహించినట్లు విమానయాన శాఖ అధికారవర్గాలు తెలిపాయి. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియీ గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే 40 రోజులు కీలకం.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో వచ్చే 40 రోజులు కీలకంగా మారనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. వచ్చే 40 రోజుల్లో భారత్‌లో కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, గతంలోని డేటా ప్రకారం జనవరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఇదీ చదవండి: తమిళనాడు ఎయిర్‌పోర్టుల్లో నలుగురికి పాజిటివ్.. చైనా వేరియంట్? -
బ్యాంకింగ్ అవుట్‌లుక్ ‘పాజిటివ్’
ముంబై: బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్‌ను దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం ‘పాజిటివ్’కు అప్‌గ్రేడ్ చేసింది. రుణ నాణ్యత పెరుగుదల, మూలధన పటిష్టతలు తన అవుట్‌లుక్ పెంపునకు కారణమని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) చివరికల్లా స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) ఈ దశాబ్ద కనిష్ట స్థాయి.. 4 శాతానికి దిగివస్తాయని విశ్వసిస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. ప్రస్తుత 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 15.2 శాతం ఉంటే, 2023–24 నాటికి ఈ రేటు 11 నుంచి 11.6 శాతానికి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వ రంగం బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణవృద్ధి 13.4–14.1 శాతం శ్రేణిలో ఉంటే, 2022–23లో ఈ రేటు 9.5–10.1 శాతం శ్రేణికి దిగివస్తుందని ఇక్రా అంచనావేసింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ విషయంలో ఈ రేటు 14.5–15.5 శాతం శ్రేణి నుంచి 12.6–13.5 శాతం శ్రేణికి దిగివస్తుందని విశ్లేíÙంచింది. వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణంగా పేర్కొంది. 2023–24 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ 1 శాతం లోపునకు దిగివస్తుందని అంచనావేసింది. బ్యాంకింగ్ నికర వడ్డీ మార్జిన్లు 2023–24లో భారీగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి డిపాజిట్ రేటు భారీ పెంపు అవకాశాలను కారణంగా చూపింది. అయితే అధిక రుణ విలువలు బ్యాంకింగ్ పటిష్టతకు దోహదపడుతుందని విశ్లేషించింది. చక్కటి లాభదాయకత ద్వారా బ్యాంకింగ్ స్వయంగా మూలధన అవసరాలను తీర్చుకోగలుగుతాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ప్రధాని మోదీతో భేటీకి ముందు హిమాచల్ సీఎంకు షాక్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకీ ముందు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కరోనా బారినపడ్డారు. ఇవాళ(సోమవారం) ఆయన ఢిల్లీలో ప్రధానిని కలవాల్సి ఉంది. కానీ అంతకుముందే నిర్వహించే సాధారణ వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సీఎంకు కరోనా లక్షణాలు లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్లోకి వెళ్లారని హిమాచల్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ వాయిదా పడినట్లు చెప్పారు. సీఎం సుఖ్వీందర్, డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభ సింగ్‌తో పాటుు 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో పాటు డిసెంబర్ 16న రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత మూడో రోజే సీఎం వైరస్ బారినపడ్డారు. సుఖ్వీందర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా కలిశారు. చదవండి: TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి -
TS: మూడేళ్ల తర్వాత అక్కడ స్వైన్‌ఫ్లూ కలకలం.. బాలికకు పాజిటివ్!
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో మూడేళ్ల తర్వాత మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇచ్చిన శాంపిల్ పరీక్ష చేయగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. జిల్లాలో చివరగా 2019 ఆగస్టులో స్వైన్‌ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు ఇలా.. ఇది హెచ్1 ఎన్1 రకం ఇన్ఫ్లూ ఎంజా వైరస్. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్‌ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. గతంలో పందులు తిరుగుతున్న ఆవరణలో దగ్గరగా ఉన్న వారికి వచ్చేది. ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా త్వరగా సోకుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే.. స్వైన్‌ఫ్లూ టీకా, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులోకి రాకుండా చూడాలి. ఆక్సిజన్‌తోపాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు వాడాల్సి ఉంటుంది. వారికే ఎక్కువగా.. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు ఇలా.. ఏడాది పాజిటివ్ కేసులు 2013 3 2014 5 2015 37 2016 3 2017 5 2018 4 2019 4 2022 1 జాగ్రత్తలు పాటించండి జిల్లాకేంద్రంలో ఒకరికి స్వైన్‌ఫ్లూ రావడంతో కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచడంతోపాటు అవసరమైన మందులు ఇచ్చాం. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వైరస్ సోకిన వారు ఎక్కువ సమయం నిద్రించడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. – కృష్ణ, డీఎంహెచ్ఓ -
ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత రెండు మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత.. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. After developing flu like symptoms, I got my self tested for COVID-19 and my reports are positive. I request everybody who has come in contact with me in last 48 hours to kindly isolate and get yourself tested, if you develop any symptoms. — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 12, 2022 -
ఆ వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ... నమోదైన తొలి కేసు
ఇటలీలోని ఒక వ్యక్తి ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవి ఎటాక్ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తి ఐదు రోజుల స్పెయిన్ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గత తొమ్మిది రోజులుగా తీవ్ర జ్వరం, తల, గొంతు నొప్పులతో బాధపడ్డాడని చెప్పారు. అంతేగాక అతని ప్రైవేట్ భాగాలలో తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడ్డాడని వివరించారు. అదీగాక అతని చర్మం పై దద్దుర్లు, పెద్ద పెద్ద గాయాలు వంటివి కూడా వచ్చాయని చెప్పారు. దీంతో అతన్ని ఆస్పత్రి వర్గాలు అత్యవసర ఇన్ఫెక్షన్ విభాగానికి తరలించి చికిత్స అందించడం ప్రారంభంచారు. తొలుత అతనికి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ టెస్టులు చేయగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇలా ఒకేసారి మూడు వ్యాధులు ఎటాక్ అయ్యిన తొలికేసు ఇదేనని వైద్యులు చెబుతున్నారు. అతనికి కరోనాకి సంబంధించి ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ కూడా సోకిందని తేలింది. దీంతో అతనికి కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోవిడ్, మంకీపాక్స్ నుంచి బయటపడి కోలుకున్నాడని చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిడ్స్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసు మంకీపాక్స్, కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియజేసిందన్నారు. అలాగే ఒక వ్యక్తి లైంగిక అలవాట్లు వ్యాధుల నిర్ధారణ చేయడానికి ఎంత కీలకమో ధృవీకరించిందన్నారు. పైగా ఆయా రోగులకు చికిత్స అందించేటప్పుడూ వైద్యులు కూడా తగిన జాగ్రత్తల తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. (చదవండి: మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి) -
మళ్లీ కరోనా బారిన అమితాబ్, ఆస్పత్రిలో చేరిన బిగ్‌బి..
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేస్తూ.. ఇటీవల తనని కలిసిన వారంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ కాగా బిగ్‌బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన రష్మిక మందన్నాతో గుడ్‌బై, ఊంచాయి మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. 2021లో అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్‌లు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. చదవండి: త్రిష పార్టీకి బలం అవుతుందని నేను అనుకోవడం లేదు: మాజీ అధ్యక్షుడు T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022 -
దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ ... ఎనిమిదికి చేరిన కేసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా ఎనిమిదికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నివశిస్తున్న 35 ఏళ్ల నైజిరియన్ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపినప్పుడు పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి ఎల్‌ఎన్‌జీపీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన నేపథ్యం కూడా లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అంతకు ముందురోజే యూఏఈ నుంచి కోజీకోడ్ వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వచ్చింది. ప్రస్తుతం అతను మలప్పురంలో చికిత్స పొందుతున్నాడు. అదీగాక ఇటీవలే కేరళలో మంకీపాక్స్‌తో మరణించిన తొలి కేసును కూడా అధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి మంకీపాక్స్ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినట్లు కూడా తెలిపారు. దీంతో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నియంత్రణ కోసం, వ్యాక్సిన్ల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జాతీయ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాదవియా వెల్లడించారు. ఈ టాస్క్ఫోర్సులో డాక్టర్ వీకే పాల్ తోపాటు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నేతృత్వంలో ఇతర సభ్యులు ఉన్నారని చెప్పారు. (చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి!) -
దేశంలో తొలి మంకీపాక్స్ మరణంపై ప్రకటన.. పాజిటివ్ అని తెలిసినా గప్‌చుప్‌గా భారత్‌కు!
తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ మరణంపై అనుమానాలు వీడాయి. కేరళ త్రిస్సూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌తోనే మృతి చెందినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో యూఏఈ నుంచి వచ్చిన యువకుడు మృతి చెందాడన్న విషయం తెలిసే ఉంటుంది. అయితే అతనిలో మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయ్యిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్, రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. యూఏఈ నుంచి జులై 22న సదరు యువకుడు భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆపై తన కుటుంబంతో గడిపాడు. స్నేహితులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడాడు కూడా. నాలుగు రోజుల తర్వాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ మరుసటి రోజు..అంటే జులై 27న అతను ఆస్పత్రిలో చేరాడు. జులై 28వ తేదీన అతన్ని వెంటిలేటర్ మీదకు షిఫ్ట్ చేశారు. చికిత్స పొందుతూ.. జులై 30వ తేదీన అతను కన్నుమూశాడు అని తెలిపారు మంత్రి వీణాజార్జ్. అయితే.. జులై 19వ తేదీన యూఏఈలోనే అతనికి మంకీపాక్స్ టెస్టులు జరిగాయని, భారత్‌కు వచ్చే ముందు రోజు అంటే జులై 21వ తేదీనే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మంత్రి వీణాజార్జ్ తెలిపారు. అయితే ఆ యువకుడు విషయాన్ని దాచిపెట్టి.. మామూలుగానే ఉన్నాడని, భారత్‌కు చేరుకుని చివరికి వైరస్ ప్రభావంతో మరణించాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైద్యం సమయంలోనూ అతను తన రిపోర్ట్ వివరాలను వెల్లడించాలేదని, చివరకు మృతుడి శాంపిల్స్‌ను అలప్పుజాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా అతనిలో మంకీపాక్స్ వైరస్ ఉన్నట్లు తేలిందని వీణాజార్జ్ వెల్లడించారు. అయితే కేరళ అధికారిక ప్రకటనపై కేంద్రం స్పందించాల్సి ఉంది. అదే సమయంలో అలపుజ్జా వైరాలజీ సెంటర్ నుంచి శాంపిల్స్‌ను పూణెకు పరీక్షల కోసం పంపింది. A young boy returned from UAE on July 22, he was with his family when on July 26 he developed a fever & was admitted on July 27. On July 28 he was moved to a ventilator. He got tested on July 19 for monkeypox in UAE, the result of which was positive:Kerala Health min Veena George pic.twitter.com/43VGAtkoB5 — ANI (@ANI) August 1, 2022 కాంటాక్ట్ ట్రేసింగ్.. ప్రొటోకాల్ ప్రకారం.. ప్రస్తుతం హై రిస్క్ జోన్లో ఉన్న 20 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, మెడికల్ స్టాఫ్ కూడా అందులో ఉన్నట్లు ఆమె తెలిపారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. మంకీపాక్స్ బాధితుడు బయట తిరిగాడు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సైతం ఆడాడు. అంతేకాదు త్రిస్సూర్‌తో పాటు చావక్కాడ్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ అతన్ని తిప్పారని, ఆ కాంటాక్ట్ లిస్టింగ్ కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని వీణాజార్జ్ వెల్లడించారు. ఆసియాలో మొదటిది ఇదిలా ఉంటే.. ప్రపంచంలో ఆఫ్రికాలోనే మంకీపాక్స్ మరణాలు చోటు చేసుకున్నాయి ఇప్పటిదాకా. తాజాగా ప్రపంచంలో తొలి ఆఫ్రికన్‌యేతర దేశంగా బ్రెజిల్లో మంకీపాక్స్ మరణం సంభవించింది. ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్న వ్యక్తి మంకీపాక్స్‌తో చనిపోయాడు కూడా. అలాగే స్పెయిన్‌లో రెండు మరణాలు వెనువెంటనే సంభవించాయి. తాజాగా కేరళ మరణంతో.. ప్రపంచంలో నాలుగో ఆఫ్రికన్‌యేతర మంకీపాక్స్ మరణం భారత్‌లో నమోదు అయ్యింది. అంతేకాదు ఆసియాలోనే తొలి మంకీపాక్స్ మరణానికి భారత్ కేంద్ర బిందువు అయ్యింది. అయితే కేరళ త్రిస్సూర్ యువకుడు కావడం, అతనిలో ఇతర సమస్యలేవీ లేకపోవడం, అంతకు ముందు కూడా వ్యాధులు లేకపోవడంతో కేరళ ఆరోగ్య శాఖతో పాటు కేంద్రమూ అప్రమత్తమైంది. -
డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు వారం రోజుల ముందు బర్మింగ్‌హామ్‌కు అర్హత సంపాదించిన స్ప్రింటర్ ఎస్. ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఇద్దరు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. 37 మంది సభ్యుల అథ్లెట్ల బృందం నుంచి తప్పించారు. 100 మీ. పరుగు, 4x100 మీ. రిలే పరుగుకు అర్హత సంపాదించిన ధనలక్ష్మి నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) మేలో, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) జూన్‌లో నమూనాలు సేకరించింది. ఈ రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది. రిలే బృందం నుంచి ఆమెను తప్పించి ఎం.వి.జిల్నాను ఎంపిక చేశారు. గత నెలలో జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఐశ్వర్య 14.14 మీటర్ల జంప్‌తో జాతీయ రికార్డుతో స్వర్ణం గెలిచింది. ఆ సమయంలోనే ఆమె నమూనాలను సేకరించిన ‘నాడా’ పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. -
డైరెక్టర్ మణిరత్నంకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మరణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య, నటి సుహాసిని ప్రకటన ఇవ్వనున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ప్రస్తుతం మరణిత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ ఈ మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూలై 8న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బలిటెన్ రావాల్సి ఉంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్
Varalaxmi Sarath Kumar Tested Covid 19 Positive: కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అనేక చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ 'క్రాక్' సినిమాలో జయమ్మగా, అల్లరి నరేశ్ 'నాంది' మూవీలో లాయర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫ్యాన్స్‌కు బాధాకరమైన న్యూస్ చెప్పింది. ఆమె కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, సెట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ Covid Positive..inspite of all precautions..actors plz start insisting on masking up the entire crew bcos we as actors cant wear masks.. Those who have met me or been in contact with me plz watch out for symptoms and get checked.. Plz be careful and mask up..covid is still here pic.twitter.com/MyegWOSQ5a — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) July 17, 2022 నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై సెలబ్రిటీలు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్' అని స్పందిస్తున్నారు. 'జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని నటి రాధిక కామెంట్ చేశారు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సమంత 'యశోద', 'బాలయ్య 107', 'హనుమాన్', 'శబరి' వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో చిరంజీవి సమర్పణలో హిందీ చిత్రం.. తెలుగులో.. -
Maharashtra Political Crisis: క్లైమాక్స్ కు చేరిన మహా సంక్షోభం..
-
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..
-
‘మహా’లో మరో ట్విస్ట్.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్‌కు కరోనా పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే కరోనా బారినపడ్డారు. బుధవారం ఆయన కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. సీఎంకు కరోనా సోకడంతో వర్చువల్‌గా కేబినెట్ భేటీలో పాల్గొననున్నట్టు తెలిపారు. కాగా, కేబినెట్ భేటీ అనంతర ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు.. రాజీకయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో గవర్నర్ కోశ్యారీ.. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో గోవా గవర్నర్ శ్రీధరణ్ పిళ్లైకి కేంద్రం.. అదనంగా మహారాష్ట్ర బాధ్యతలను కూడా అప్పగించింది. #WATCH | Mumbai: "Maharashtra CM Uddhav Thackeray has tested positive for #COVID19," says Congress Observer for the state, Kamal Nath. pic.twitter.com/wl22yJkXXt — ANI (@ANI) June 22, 2022 ఇది కూడా చదవండి: ‘మహా’ సంకటం: కీలక పరిణామం అసెంబ్లీ రద్దు.? -
భారత మార్కెట్‌పై అమెజాన్ బుల్లిష్
న్యూఢిల్లీ: భారత మార్కెట్ పట్ల తాము సానుకూలంగా (బుల్లిష్) ఉన్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు, ఎంఎస్ఎంఈల డిజిటైజేషన్ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ‘‘వచ్చే ఆరు నెలల్లో మేము ఎంత పెద్ద, మెరుగైన సంస్థో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌లో కొనుగోళ్లు, విక్రయాలను పూర్తిగా మార్చాలన్న మా లక్ష్యం దిశగా పనిచేస్తూనే ఉన్నాం’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ (కన్జ్యూమర్ బిజినెస్) మనీష్ తివారీ పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడుల ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధం అంటూ సీసీఐ ఇచ్చిన తీర్పును అమెజాన్ ఎన్సీఎల్టీలో సవాలు చేయగా.. అక్కడ ప్రతికూల తీర్పు రావడం తెలిసిందే. సీసీఐ తీర్పును సమర్థిస్తూ, అమెజాన్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ తిరస్కరించడం తెలిసే ఉంటుంది. సీసీఐ రూ.200 కోట్ల పెనాల్టీని కూడా ఎన్సీఎల్టీ సమర్థించింది. దీనిపై మాట్లాడేందుకు తివారీ తిరస్కరించారు. కోర్టు ఆదేశాలను సంబంధిత వ్యక్తులు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వేగంగా వృద్ధి అమెజాన్ 9 ఏళ్ల క్రితం 100 విక్రయదారులు, ఒక గోదాముతో సేవలు మొదలు పెట్టింది. ఇప్పటికి తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయదారుల సంఖ్యను 11 లక్షలకు పెంచుకుంది. 23 కోట్ల ఉత్పత్తులను విక్రయానికి ఉంచింది. గోదాములు 60కి చేరాయి. -
కమెడియన్‌కు రెండోసారి కరోనా.. అభిమానులకు క్షమాపణలు
Comedian Vir Das Test Positive For Covid 19 Second Time: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. బ్రేక్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా విరుచుకుపడుతున్నట్లుగా ఉన్నాయి కొవిడ్ కేసులు. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కత్రీనా కైఫ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు, కమెడియన్ వీర్ దాస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా బుధవారం (జూన్ 15) తెలిపాడు. ఇలా ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి. ఇదివరకు ఈ ఏడాది జనవరిలో మహమ్మారి బారిన పడ్డాడు. ప్రస్తుతం గుజరాత్లో ఉన్న దాస్.. తన కామెడీ షోలు వాయిదా పడటంతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రాష్ట్రంలో జరగాల్సిన ఈ కామెడీ షోలు తర్వాతి తేదిలలో నిర్వహిస్తారని పేర్కొన్నాడు. 'మీకు కావాలంటే మీ టికెట్లు వాపసు ఇవ్వబడతాయి. క్షమించండి గుజరాత్. నేను ఈ విషయం గురించి చాలా విచారంగా ఉన్నాను. కానీ తర్వలో మిమ్మల్ని లైవ్‌లో చూడాలని కోరుకుంటున్నాను. మీరు కొత్త తేదిలలో షోకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.' అని 43 ఏళ్ల వీర్ దాస్ తెలిపాడు. చదవండి:👇 ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
షారుక్‌కి కరోనా
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఇదే నెలలో హీరోలు ఆదిత్యారాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే మే 25న దర్శక–నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీ వేదికగానే బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారనే వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. గత నెలలో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారినపడి 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరుకాని విషయం తెలిసిందే. -
సోనియా గాంధీకి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. గురువారం వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యే ముందు సోనియా కరోనా బారినపడ్డారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియా ఈనెల 8వ తేదీన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇక, ఇటీవల సోనియాతో సమావేశమైన నేతలకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. Congress president #SoniaGandhi tests covid positive. I pray for her speedy recovery. pic.twitter.com/uhQnKj9arP — Gautam (@GautamIND29) June 2, 2022 -
బూస్టర్ డోస్ వేసుకున్నా కమలా హారిస్‌కు కరోనా
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కరోనా (57) బారిన పడ్డారు. మంగళవారం చేసిన రాపిడ్, పీసీఆర్ పరీక్షలు రెండింట్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అయితే వ్యాధి లక్షణాలేమీ కన్పించలేదు. నెగెటివ్‌గా తేలేదాకా ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ఇంటినుంచే పని చేయనున్నారు. కమల నుంచి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్యకు కరోనా సోకే ప్రమాదమేమీ లేదని ఆమె ప్రెస్ సెక్రెటరీ కిర్‌స్టెన్ అలెన్ తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి వారిని ఆమె కలవలేదని వివరించారు. కమల కరోనా రెండు డోసులతో పాటు రెండు బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. ఆమె భర్త డగ్ ఎమోఫ్ నెల క్రితమే కరోనా బారిన పడి కోలుకున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు, వైట్‌హౌస్ ఉన్నతాధికారులకూ కరోనా సోకింది. చదవండి: (4,800 కోట్ల డాలర్లతో జపాన్ అత్యవసర ప్యాకేజీ) -
కరోనా బాధితులకు పిల్లలు పుట్టరా..? టెన్షన్ పెడుతున్న రీసెర్చ్!
సాక్షి, ముంబై: ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా కరోనా సోకిన వారిపై చేసిన అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో భాగంగా కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వారు తెలుసుకున్నారు. కాగా, పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గత వారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ అధ్యయనంలో వైరస్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా తేలినట్లు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్యకణాల నమూనాలను విశ్లేషించినట్లు తెలిపారు. కరోనా బారినపడిన వారితో ఆరోగ్యవంతుల.. వీర్య కణాలను పోల్చగా.. గణనీయంగా కణాల తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు. కరోనా బాధితుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. ఇక, కొవిడ్‌కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది చదవండి: భారత్‌లో ఎక్స్ఈ స్ట్రెయిన్ కేసులు.. ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు ఇవే.. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన శ్రుతి, త్వరలోనే కలుస్తానంటూ ట్వీట్
హీరోయిన్ శ్రుతి హాసన్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు శ్రుతి ట్వీట్ చేస్తూ.. ‘హాయ్.. నేను ఇస్తోన్న ఈ అప్డేట్ సరదా కోసం కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే కలుస్తాను థ్యాంక్యూ’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. అలాగే ఇటీవల ఆమె కలిసివారంతా పరీక్షలు చేసుకోవాలని ఆమె సూచిందింది. కాగా శ్రుతి హాసన్ ప్రస్తుతం సలార్, బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్ల తెరకెక్కుతోన్న ఎన్బీకే107లో(#NBK107) హీరోయిన్గా నటిస్తోంది. pic.twitter.com/O8ENJ3ZBp5 — shruti haasan (@shrutihaasan) February 27, 2022 -
హోంక్వారంటైన్‌కు బ్రిటన్ గుడ్‌బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!
కరోనా మహమ్మారీ ప్రపంచ దేశాలను ఎలా గజగజలాడించిందో చూశాం. అంతేకాదు చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. అయితే కొంతమంది త్వరితగతిన కోలుకుంటే మరీ కొంతమందికి ప్రాణాంతకంగా మారి చనిపోవడం కూడా జరిగింది. మరి కొద్దిమంది ఈ కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ దుష్ప్రభావాలతో పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడోక వ్యక్తికి మాత్రం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా బారిన పడ్డాడు . అసలు విషయంలోకెళ్తే... టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్‌కి గతేడాది నవంబర్ 2020న తొలిసారిగా కరోనా సోకింది. దీంతో కయాసన్ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతను నిర్భంధంలోనే ఉంటున్నాడు. నిజానికి కొన్ని రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్ట్‌లో కయాసన్‌కి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కయాసన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా విచారించగా..అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది. ఇది ఒకరకమైన బ్లడ్ కేన్సర్. ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికే సహాయపడే తెల్లరక్తకణాలు తగ్గిపోవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోదంతుందని వైద్యులు తెలిపారు. అందువల్లే కయాసన్ శరీరం నుంచి కరోనా వైరస్ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు వెల్లడించారు. కానీ కయాసన్ ఏడాదిగా అంటే సుమారు 14 నెలలు నుంచి నిర్భంధంలోనే ఉన్నాడు. పైగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు అతను కరోనా పాజిటివ్ కారణంగా వ్యాక్సిన్ వేయించుకోలేని దుర్భర స్థితిలో ఉండటంబాధకరం. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (చదవండి: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!) -
మరోసారి కరోనా బారిన పడ్డ హీరో శరత్ కుమార్
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకరకంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు కరోనాతో పోరాడుతుండగా తాజాగా ప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నా సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంతో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు’ అంటూ శరత్ కుమార్ ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ సమయంలో ఆయనకు కరోనా సొకింది. తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో శరత్ కుమార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Good evening my near and dear friends relatives and my brothers and sisters In the political party,this evening I have tested positive and have self isolated myself,I humbly request all the dear ones who have been in contact for the past week to test yourself immediately — R Sarath Kumar (@realsarathkumar) February 1, 2022 -
కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు జైశంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. External Affairs Minister Dr S Jaishankar tested #COVID19 positive. pic.twitter.com/H3pYqDECBV — ANI (@ANI) January 27, 2022 చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కావున ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
దేశంలో కరోనా ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా 3,37,704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 488 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్ పాజిటివిటి రేటు 17.22 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 10,050 కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 13వేల 365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 161 కోట్లకు పైగా కరోనా డోసుల పంపిణీ జరిగింది. -
ఇదెక్కడి గోస నాయనా! అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు
దేశం కాని దేశంలో ప్రయాణం మధ్యలో చిక్కుకుని భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. లగేజీ లేక ఫోన్లు కలవక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఊహకందని విధంగా మార్గమధ్యలో వచ్చిన కరోనానే అందుకు కారణం. టొరంటో వెళ్తూ హైదరాబాద్‌కి చెందిన సయ్యద్ ఓమర్ అజామ్ అనే వ్యక్తి ఇండియా నుంచి కెనడాలోని టోరంటో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అబుదాబి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడున్న గేట్ నంబర్ 28 దగ్గరే అతన్ని గంటల తరబడి ఉంచారు. దీంతో సాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా అతను కోరాడు. చాలా సేపటి తర్వాత వచ్చిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని ఐసోలేషన్‌లో భాగంగా ఆల్ రజీమ్ క్వారంటైన్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. లగేజీ ఇతర ముఖ్యమైన వస్తువులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాయి. అక్కడి అధికారులు ఎవరితో పెద్దగా కలవనివ్వడం లేదంటూ మరో ట్వీట్ చేశారు అజామ్ I’m traveling from Hyderabad, India to Toronto, Canada via Abu Dhabi (20-Jan-2022). We are struck at Abu Dhabi airport since 18+ hours as some of the passengers including myself were tested positive for COVID19 (did multiple Rapid RT PCR test at airport facility). pic.twitter.com/Gwzx2DOS5h — Syed Omar Azam (@SyedOmarAzam1) January 20, 2022 మరింత మంది అజామ్ ట్వీట్‌కి క్వారంటైన్ సెంటర్లో ఉన్న మరో భారతీయుడు కూడా స్పందించాడు. మనిద్దరమే కాదు అనేక మంది ఈ క్వారంటైన్ సెంటర్లో ఉన్నారని.. ఇక్కడ సౌకర్యాలు బాగాలేవంటూ తెలిపాడు. చివరకు ఆల్ రజీమ్ క్వారంటైన్ సెంటర్లో ఉన్న తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదా స్వదేశానికి వచ్చే విధంగా సాయం చేయాలంటూ వారు విదేశాంగ మంత్రి జయ్శంకర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా సాయం కోరారు. Dear sir i am also in al razeen camp that because you tested positive i know it is very hard to live here i am also living here with 5 people and there are lot of indians here. So dont loose hope and stay strong. Tell your room number and building number. — Voice of hyderabad (@Voiceofhyderab5) January 21, 2022 సాయం చేయండి ఇండియా నుంచి యూరప్, అమెరికాకు వెళ్లే అనేక మంది దుబాయ్, అబుదాబిలో కనెక్టింగ్ ప్లైట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. విమానం ఎక్కే ముందే కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించే విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ మార్గమధ్యంలో చేసే పరీక్షల్లో పాజిటివ్‌గా తేలుతున్నారు. దీంతో అజామ్ తరహాలో అనేక మంది దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ ఇలాంటి వారికి అవసరమైన సాయం అందించే విషయంలో ముందుకు రావాలని కోరుతున్నారు. చదవండి: ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం -
మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్
రామచంద్రపురం(తూర్పుగోదావరి): రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని మంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది. సంక్రాంతి సంబరాల అనంతరం ఈ నెల 17న ఆయన అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కేబినెట్ సమావేశం ఉండటంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురువారం మరోసారి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్‌గా తేలింది. అయితే సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు -
కరోనా బారినపడిన మరో సీఎం.. హోం ఐసోలేషన్‌లో..
షిల్లాంగ్: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని, ఏ రంగాల వారిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు కాన్రాడ్ సంగ్మా ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కాగా, కాన్రాడ్ సంగ్మా 2020లోను కరోనా బారిన పడ్డారు. I have tested positive for COVID-19. I am isolating myself for the required time. I have mild symptoms. All those who came into contact with me last few days are requested to observe their symptoms and test if necessary. — Conrad Sangma (@SangmaConrad) January 21, 2022 చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా.. -
కరోనా కేసులతో వణికిపోతున్న మేడ్చల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరిగింది. పాజిటివిటీ రేటు ఒక శాతం లోపుంటే కరోనా నియంత్రణలో ఉన్నట్లు లెక్క. కానీ రాష్ట్రంలో గత వారం సరాసరి పాజిటివిటీ రేటు మూడు శాతం నమోదైంది. అయితే ఏడు జిల్లాల్లో మాత్రం ఏకంగా నాలుగు శాతానికి మించడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6.95 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో 5.65, రంగారెడ్డి జిల్లాలో 4.92, నిజామాబాద్ జిల్లాలో 4.81, కామారెడ్డి జిల్లాలో 4.51, సంగారెడ్డి జిల్లాలో 4.21, మెదక్ జిల్లాలో 4.02 శాతం నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 0.25 శాతం, గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 0.29 శాతం చొప్పున పాజిటివిటీ రేటు నమోదైనట్లు తెలిపింది. 17 జిల్లాల్లో ఒక శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు నమోదైనట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. చదవండి: కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా 3.3 శాతానికి పెరిగిన పడకల ఆక్యుపెన్సీ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్, ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ శాతం కూడా కాస్త పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాంధీ సహా జిల్లా ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఆక్సిజన్, ఐసీయూ పడకలు 2.7 శాతం నిండిపోగా, ఈ నెల 12వ తేదీనాటికి 3.3 శాతానికి పెరిగింది. అయితే చాలావరకు కేసులు పెద్దగా సీరియస్ కావడం లేదని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ రోగుల కోసం 56,036 పడకలు కేటాయించారు. ఇందులో 97 శాతం వరకు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. పెరిగిన పిల్లల పడకలు పద్నాలుగు ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవడానికి వీల్లేదు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పిల్లల పడకలను పెంచింది. 33 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలను 6 వేలు చేసింది. అందులో ఆక్సిజన్ పడకలు 4,125 ఉండగా, ఐసీయూ పడకలు 1,875 ఉన్నాయి. అలాగే ఆయా ఆసుపత్రుల్లో పిల్లల వైద్యులు 256 మంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. కొనసాగుతున్న ఫీవర్ సర్వే రాష్ట్రంలో లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం కోసం ఫీవర్ సర్వే జరుగుతోంది. తద్వారా ముందస్తుగా గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, వైద్యం చేయడం వంటివి చేస్తున్నారు. చాలా మందికి తేలికపాటి లక్షణాలే ఉంటాయి. కొందరికి అసలు లక్షణాలే ఉండటం లేదని తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 1,231 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షా కేంద్రాలున్నాయి. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 చోట్ల, ప్రైవేట్ లేబొరేటరీల్లో 76 చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. రోజుకు కనీసం 71,600 టెస్టులు లక్ష్యం ప్రతిరోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. కనీసం 71,600 పరీక్షలైనా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో రోజుకు కనీసం 12,300 పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అయితే కనీసం కంటే ఎక్కువగానే కొన్నిసార్లు రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటికే రెండుసార్లు కనీస లక్ష్యానికి మించి టెస్టులు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ఏకంగా 90,021 పరీక్షలు చేయగా అంతకుముందు రోజు 83,153 పరీక్షలు చేశారు. మరోవైపు కొందరు సొంతంగా పరీక్షలు చేసుకుంటున్నారు. అవి రోజుకు దాదాపు 10 వేలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్
-
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఈ వైరస్ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఖర్గే కార్యదర్శి రవీంద్ర గరిమెళ్ళ ఓ ప్రకటనలో తెలిపారు. ఖర్గే రెండు డోసులు తీసుకున్నారు. అయితే బూస్టర్ డోసు తీసుకునేందుకు అయన అర్హులు కారు. ఎందుకంటే బూస్టర్ డోసు తీసుకోవాలంటే రెండో డోసు నుంచి కనీసం తొమ్మిది నెలల గ్యాప్ అవసరం. ఢిల్లీలోని ఖర్గే కార్యాలయంలోని గరిమెళ్లతో సహా ఐదుగురు సిబ్బందికి కొద్ది రోజుల క్రితం వైరల్ వ్యాధి సోకింది. ప్రస్తుతం వారందరూ హోమ్ ఐసోలేషన్‌లో బాగా కోలుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఖర్గేతో పరిచయం ఉన్నవారు తమ లక్షణాలను గమనించి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమను తాము పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. -
కరోనా థర్డ్ వేవ్.. వైరస్ పడగలో వీఐపీలు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ఉధృతి పెరగడంతో ప్రముఖులు పెద్దసంఖ్యలో వైరస్‌కు గురవుతున్నారు. సీఎం బొమ్మైకి కోవిడ్ సోకడం తెలిసిందే. ఆయన కుమారుడు భరత్, కోడలుకు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. మంత్రి మాధుస్వామి, ఆయన కుమారునికి, అలాగే మరో ఎమ్మెల్యే హెచ్.ఎం.రేవణ్ణ, కాంగ్రెస్ నేత ఇబ్రహీంకి కోవిడ్ నిర్ధారణ అయింది. సీఎం కొడుకు, కోడలు మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారు. ఇంట్లోనే సీఎం క్వారంటైన్ సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఇంట్లోనే చికిత్స కొనసాగించాలని సూచించారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ కరోనా లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్టీ నగరలోని నివాసంలోనే వారంరోజులు క్వారంటైన్లో ఉంటారు. అక్కడి నుంచే పరిపాలనా పనులు నిర్వహిస్తారు. చదవండి: బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు -
స్టార్ హీరో మాజీ భార్యకు కరోనా.. పెద్ద మొండిఘటం
Sussanne Khan Test Positive For Covid 19: బాలీవుడ్లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గట్లేదు. రోజురోజూకీ ఉగ్రరూపం దాల్చుతోంది కొవిడ్ మహమ్మారి. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. తాజాగా బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసనే ఖాన్ కొవిడ్ బారిన పడింది. మంగళవారం తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా కరోనా సోకినట్లు చెప్పుకొచ్చింది. 'కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్న తర్వాత మూడో సంవత్సరం ఈ మొండిఘటమైన ఒమిక్రాన్ నా రోగనిరోధక వ్యవస్థలోకి చొరబడింది. నేను సోమవారం రాత్రి పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి.' అని పోస్ట్ పెట్టింది సుసనే. ఈ పోస్ట్‌కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సుసనే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 'త్వరగా కోలుకోండి' అని బ్యూటీ బిపాసా బసు రాయగా, 'మీరు త్వరలో కోలుకుంటారు' అని సుసనే సోదరి ఫరా ఖాన్ అలీ కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే జనవరి 10న హృతిక్ బర్త్‌డే సందర్భంగా సుసనే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 'నువ్ చాలా అద్భుతమైన తండ్రివి. నీలాంటి తండ్రి ఉండటం రే అండ్ రిడ్జ్‌ల అదృష్టం. నీ కలలన్నీ నెరవేరుతాయి. ఇప్పటికీ ఎప్పటికీ బిగ్ హగ్' అని సుసనే విష్ చేసింది. View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) ఇదీ చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది -
సినీ పరిశ్రమను వణికిస్తోన్న కరోనా, మరో స్టార్ హీరోయిన్‌కు పాజిటివ్
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమ వణికిస్తోంది. వరసగా సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో రోజురోజుకు పరిశ్రమల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్‌గా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన హీరో మంచు మనోజ్, లక్ష్మి మంచు, సూపర్ స్టార్ మహేశ్ బాబు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు కరోనా రాగా తాజాగా ‘మహానటి’ కీర్తి సూరేశ్ కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది. అంటే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. మీరు మీ వాళ్ళు అంతా క్షేమంగా ఉండండి. త్వరగా రికవర్ అయి ఫాస్ట్ గా వస్తానని కోరుకుంటుంన్నాను’ అని పోస్ట్ చేసింది. pic.twitter.com/YF2lCxotOo — Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022 -
శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది
Did Janhvi Kapoor Khushi Kapoor Test Positive For Covid 19: బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. జనవరి 10న జాన్వీ కపూర్ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోస్‌తో వారికి కరోనా సోకిందని అనుమానాలు వచ్చాయి. ఈ పోస్ట్‌లో జాన్వీ తన నోట్లో థర్మామీటర్ పెట్టుకుని కనిపించింది. ఆమెతోపాటు ఖుషీ కపూర్ కూడా ఉంది. జాన్వీ ఇన్‌స్టా పోస్ట్ చూసి వారికి కరోనా సోకిందని భావిస్తున్నారు. వీరితో పాటు బోనీ కపూర్ కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో వారి నివాసాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు (బీఎంసీ) సీల్ వేసి శానిటైజ్ చేసిన విషయం తెలిసిందే. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా అర్జున్, అన్షులా, రియాకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా వారు అధికారికంగా వెల్లడించలేదు. బాలీవుడ్ తారలను కరోనా తెగ ఇబ్బందిపెడుతుంది. ఇప్పటికే జాన్ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్, మధుర్ భండార్కర్, ప్రేమ్ చోప్రా, అతని భార్య ఉమా చోప్రా, మృణాల్ ఠాకూర్, స్వరా భాస్కర్లకు కొవిడ్ సోకింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని -
బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక
Legendary Actor Sathyaraj Hospitalized Suddenly Due To Coronavirus Positive: సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోహీరోయిన్లు వరసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, మంచు మనోజ్, లక్ష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్లకు కరోనా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా లెజండరి నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్.. కాగా ఇంతకు ముందు తమిళ పరిశ్రమకు చెందిన కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారిన పడ్డారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్‌తో పాటు కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అదే విధంగా సండే లాక్‌డౌన్‌ను కూడా విధించారు. కరోనా కేసుల తీవ్రతను బట్టి అక్కడి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్ -
కరోనా కలకలం: స్టార్ హీరో దంపతులకు కోవిడ్ పాజిటివ్
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, నటి నోరా ఫతేహీ, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఆయన భార్య ప్రియా రుంచల్ కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి ‘కొద్ది రోజుల క్రితం నేను కలిసి ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా నాకు, నా భార్య ప్రియకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇటీవల మేమిద్దరం వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం. అయినా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి’ అని వెల్లడించాడు. అంతేగాక ప్రతి ఒక్కరూ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటీవల కాలంలో తనని కలిసిన వారు వెంటనే టెస్ట్ చేసుకోవాలని, ఐసోలేషన్‌కు వెళ్లాలని జాన్ అబ్రహం సూచించాడు. కాగా ఇటీవల కాలంలో బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువురు రాజకీయ నేతలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. -
జెర్సీ హీరోయిన్‌కు కరోనా.. సురక్షితంగా ఉండండని పోస్ట్
Mrunal Thakur Tested Positive For Covid 19: బాలీవుడ్లో కరోనా కలకలం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోన రక్కసి తన కోరలు చాస్తూ బీటౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవలే హిందీ పాపులర్ స్టార్స్ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కొవిడ్ రావడంతో తన నివాసానికి బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు సీల్ వేసి శానిటైజ్ చేశారు. హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కరోనాతో ఎంత ఇబ్బంది పడుతుంతో కూడా ఇటీవలే వివరించింది. తాజాగా జెర్సీ హీరోయిన్, బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఈ మహమ్మారి బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది మృణాల్. 'నేను కొవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాను. దానిలో పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను బాగానే ఉన్నాను. నాకు నేను ఐసోలేట్ అయ్యాను. వైద్యులు సూచించిన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారు దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. సురక్షితంగా ఉండండి.' అని మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ షేర్ చేసింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా కలిసి నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది ఈ మూవీ. ఇదీ చదవండి: అర్జున్ కపూర్‌కి కరోనా.. ఇల్లుకు సీల్ వేసిన బీఎంసీ -
కరోనా బారిన మరో బాలీవుడ్ బ్యూటీ, కొద్ది రోజులుగా బెడ్‌కే పరిమితం..
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహీకి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. చదవండి: మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళన అక్కర్లేదంటూ ఎమోషనల్ ట్వీట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నా. నిజం చెప్పాలంటే ఈ వైరస్ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత కొద్ది రోజులుగా బెడ్‌కే పరిమితయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ ప్రభావం నాపై తీవ్రంగా చూపించింది. ఇది ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి ” అంటూ తెలియజేసింది నోరా ఫతేహి. చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా? -
మంత్రి ఎర్రబెల్లికి కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ధాన్యం సేకరణ విషయమై మంత్రుల బృందంతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. నిన్న రాత్రే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో తనను కలిసిన వాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని ఎర్రబెల్లి సూచిస్తున్నారు. -
వివాహ కనీస వయసు.. పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కూడా!
అమ్మాయిల కనీస పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలనే నిర్ణయాన్ని భాగస్వామ్యులైన నేటి యువతరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. అయితే దేశంలోని పేదరికం, విద్య, వైద్య సదుపాయాలు... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మనస్తత్వం, వైవాహిక వ్యవస్థపై బలంగా నాటుకుపోయిన భావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనేది నిపుణుల భావన. పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలనేది వారి సూచన. ఈ నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వాదనలేమిటనేది ప్రస్తావనార్హం. అనుకూల వాదన ► అమ్మాయిలకు చదువులు కొనసాగించే వీలు కలుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. దాంతో సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వారో హోదాను పొందుతారు. మహిళా సాధికారికతకు దోహదపడుతుంది. ► ప్రపంచం, చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన విస్తృతం అవుతుంది. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. స్థిరమైన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోగలుగుతారు. తమ గొంతుకను బలంగా వినిపించగలరు. ► లేబర్ ఫోర్స్‌లో (ఉద్యోగాల్లో) మహిళల సంఖ్య పెరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ 2019 అంచనాల ప్రకారం భారత లేబర్ ఫోర్స్‌లో మహిళలు 20.3 శాతం మాత్రమే. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో ఇది 30.5 శాతం. శ్రీలంకలో 33.7 %. 2020లో ప్రపంచ సగటు 46.9 % ► పోషకాహార స్థాయి పెరుగుతుంది. ► గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల కారణంగా (గర్భస్రావం, ప్రసవ సమయంలో) సంభవించే మరణాలు తగ్గుతాయి. 21 ఏళ్లు దాటితే శారీరక ఎదుగుదల బాగుంటుంది కాబట్టి అమ్మాయిలు బిడ్డను కనేందుకు అనువైన వయసు అవుతుంది. ప్రతి లక్ష మందితో గర్భధారణ, ప్రసవ సమయంలో ఎంత మంది మరణిస్తున్నారనే దాన్ని ‘మాటర్నల్ మొర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్)గా పిలుస్తారు. 2014–16 మధ్య ఎంఎంఆర్ భారత్‌లో 130 ఉండగా, 2016–18 మధ్య ఇది 113 చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంఎంఆర్‌ను 70గా నిర్దేశించారు. ప్రతికూల వాదన ► అమ్మాయి పెళ్లి ఎప్పుడనేది భారత సమాజంలో తల్లిదండ్రులకు నిత్యం ఎదురయ్యే ప్రశ్న. వారిపై బయటికి కనిపించని సామాజిక ఒత్తిడి. కనీస వయసును 21 ఏళ్లకు పెంచినా గ్రామీణ భారతంలో ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ► కనీస వయసు 21 ఏళ్లకు పెంచకముందే... భారత్‌లో 2019 నాటికే అమ్మాయిల సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లుగా ఉందని భారత గణాంక, పథకాల అమలు శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, పేదల్లో బాల్యవివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ► ప్రస్తుతం పీసీఎంఏ– 2006లో బాల్యవివాహం చేసిన వారికి, సహకరించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఫిర్యాదు వస్తేనే కేసులు నమోదవుతున్నాయి. సామాజికంగా ఆమోదయోగ్యం కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేకపోతే చెల్లుబాటు అవుతున్నాయి. తేబోయే చట్ట సవరణలో 21 ఏళ్ల కింది వయసులో పెళ్లిళ్లను నిషేధిస్తేనే ఫలితం ఉంటుంది. ► అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. పరువు, కులం పేరిట తల్లిదండ్రులు యువజంటలకు వ్యతిరేకంగా దీన్నో ఆయుధంగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో... అధికభాగం 18 ఏళ్లు నిండకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు పెడుతున్నవే ఉన్నాయి. ప్రపంచంలోని భిన్న ఖండాల్లోని వివిధ దేశాల్లో అమ్మాయిలు, అబ్బాయిల కనీస వివాహ వయసు ఇలా ఉంది. అమెరికాలో మూడు నాలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నా మెజారిటీ రాష్ట్రాల్లో 18 ఏళ్లుగానే ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Telangana: మరో నలుగురికి ఒమిక్రాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులు మొత్తంగా ఏడుకు చేరాయి. తొలి మూడు కేసులు వచ్చిన మరునాడే మరిన్ని కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని.. స్థానికంగా ఒమిక్రాన్ కేసులేవీ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. తాజా కేసుల్లో ఒకరు హైదరాబాదీ: బుధవారం నమోదైన మూడు కేసుల్లో ఒకరు సోమాలియాకు, మరొకరు కెన్యాకు చెందినవారుకాగా.. మరొకరు కెన్యా నుంచి వచ్చిన బెంగాలీ. తాజాగా గురువారం వెలుగు చూసిన నాలుగు కేసుల్లో ఒకరు బ్రిటన్ నుంచి వచ్చిన 31 ఏళ్ల హైదరాబాద్ వాసి. యూసఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఆయన.. లండన్ నుంచి దుబాయ్ మీదుగా ఈ నెల 15న హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. ఇక మిగతా ముగ్గురు కెన్యా దేశస్తులే. వీరిలో ఇద్దరు 24 ఏళ్ల యువతులు, ఒకరు 44 ఏళ్ల పురుషుడు ఉన్నారని.. ఈ నెల 13, 14 తేదీల్లో షార్జా, దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారని అధికారులు చెప్తున్నారు. వారు వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌కు వచ్చారని సమాచారం. అయితే వైద్యారోగ్యశాఖ మాత్రం పూర్తి సమాచారం ఇవ్వలేదు. ముప్పున్న దేశాల నుంచి మరో 120 మంది.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉన్న ‘రిస్క్’దేశాల నుంచి వచ్చిన 120 మంది గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారందరికీ పరీక్షలు చేయగా.. ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు. మొత్తంగా రిస్క్ దేశాల నుంచి ఇప్పటివరకు 6,764 మంది వచ్చారు. అందులో 21 మందికి సాధారణ కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. ఇక ‘రిస్క్’లేని దేశాల నుంచి వేలాది మంది రాష్ట్రానికి రాగా.. వారిలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకినట్టు వెల్లడైంది. తాజాగా మరో ముగ్గురి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో మరో 190 కేసులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా 40,103 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 190 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 6,79,064కి పెరిగాయి. వైరస్ బారినపడి మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాలు 4,012కు చేరాయి. -
భారత్ కార్పొరేట్ అవుట్‌లుక్... పాజిటివ్
న్యూఢిల్లీ: భారత్ కంపెనీల అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో నెలకొన్న పటిష్ట డిమాండ్, విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ ఇందుకు దోహదపడుతున్న అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, అధిక ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండడం కూడా కంపెనీల సానుకూల అవుట్‌లుక్‌కు కారణమని పేర్కొంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.3 శాతం ఉంటుందని అంచనా. ఆ తర్వాత 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ► స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు వీలుగా భారత కంపెనీలకు క్రెడిట్ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉన్నాయి. పటిష్ట వినియోగదారుల డిమాండ్, అధిక కమోడిటీ ధరల కారణంగా రేటెడ్ కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ► వ్యాక్సినేషన్ విస్తృతి, స్థిరమైన వినియోగదారుల విశ్వాసం, తక్కువ వడ్డీ రేట్లు, అధిక ప్రభుత్వ వ్యయం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సానుకూల క్రెడిట్ ఫండమెంటల్స్ బలాన్ని అందిస్తున్నాయి. ► ఆయా అంశాలు భారతదేశ వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలలో స్థిరమైన పునరుద్ధరణకు దోహదపడుతున్నాయి. ఆంక్షల సడలింపు తర్వాత వినియోగదారుల డిమాండ్, వ్యయం, తయారీ కార్యకలాపాలు కోలుకుంటున్నాయి. అధిక కమోడిటీ ధరలతోసహా ఈ పోకడలు రాబోయే 12–18 నెలల్లో రేటెడ్ కంపెనీల స్థూల ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని పెంచుతాయి. ► మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్ డిమాండ్లను పెంచుతుంది. మరోవైపు పెరుగుతున్న వినియోగం, దేశీయ తయారీ పురోగతికి కేంద్రం తోడ్పాడు, నిధుల లభ్యత సజావుగా ఉండడానికి చర్యలు కొత్త పెట్టుబడులకు తగిన పరిస్థితులను సృష్టిస్తాయి. మూడవవేవ్ వస్తే మాత్రం కష్టమే... ఎకానమీకి మూడవ వేవ్ సవాళ్లూ ఉన్నాయి. ఇదే జరిగితే తాజా లాక్డౌన్ల ప్రకటనలు జరుగుతాయి. ఇది వినియోగ సెంటిమెంట్ పతనానికి దారితీస్తుంది. ఇలాంటి వాతావరణం ఆర్థిక క్రియాశీలతను, వినియోగ డిమాండ్‌ను పడగొడుతుంది. కంపెనీల స్ళూల ఆదాయాలూ పడిపోతాయి. కరోనా మూడవ వేవ్ పరిస్థితుల్లో– స్థూల ఆదాయాలు వచ్చే 12 నుంచి 18 నెలల్లో 15 నుంచి 20 శాతం పతనం అయ్యే వీలుంది. దీనికితోడు ప్రభుత్వ వ్యయంలో జాప్యం, పారిశ్రామిక ఉత్పత్తిని తగ్గించే తరహాలో చోటుచేసుకునే ఇంధన కొరత, ధరా భారం, డిమాండ్ పెంపునకు వస్తువుల ధరలను తగ్గించడం వంటి అంశాలు కంపెనీల ఆదాయాలను తగ్గిస్తాయి. ద్రవ్యోల్బణం సవాళ్లు... ప్రస్తుతం దేశ తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నిధుల సమీకరణ వ్యయాలను తగ్గిస్తున్నాయి. డిమాండ్ పెరిగేకొద్దీ కొత్త మూలధన పెట్టుబడికి మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం కనిపిస్తోంది. ఇది వడ్డీ రేటల్లో ఊహించిన దానికంటే వేగవంతమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ఇలాంటి ధోరణి వ్యాపార పెట్టుబడులపై అధిక భారాన్ని మోపుతుంది. -
బిగ్ బాస్‌కి హోస్ట్‌గా శ్రుతీహాసన్!
తమిళ ‘బిగ్ బాస్’ షోకి హీరోయిన్ శ్రుతీహాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ 5వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్‌తో కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాత ఎవరు ఉంటారనే చర్చ జరుగుతోంది. కమల్ స్థానంలో ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌ను తీసుకోవాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అనుకున్నారట. శ్రుతీని సంప్రదించారని కూడా టాక్. ఆమె కూడా షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించినట్లు భోగట్టా. కాగా ‘బిగ్ బాస్’ తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టులో హీరో సూర్య, నటి రమ్యకృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. మరి కమల్ ‘బిగ్ బాస్’కి వచ్చేవరకూ ఎవరు హోస్ట్ చేస్తారనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
పాపం నటరాజన్‌కే ఎందుకిలా?
-
గొరిల్లాలకు సోకిన కరోనా
-
తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్
కోల్‌సిటీ (రామగుండం): కరోనా సోకిన ఓ నిండు గర్భిణికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి పండంటి ఆడ శిశువుకు పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్మ గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. గోదావరిఖనిలోనే ఉంటున్న ఆమె భర్త ప్రతినెలా ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండడడంతో బుధవారం ఆస్పత్రికి రాగా.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, దీనికి ముందుగా కరోనా టెస్ట్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు గురువారం కోవిడ్ నిబంధనల ప్రకారం గైనకాలజిస్ట్ డాక్టర్ కల్యాణి, అనస్థీషియా డాక్టర్ అగర్‌బాబా పీపీఈ కిట్ ధరించి ఆపరేషన్ చేశారు. పుట్టిన ఆడశిశువుకూ కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. బాలింతను కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు కళ్యాణి, అగర్‌బాబా, స్టాఫ్‌నర్సులు భవాని, లీలా, సిబ్బంది ఆశిష్, ఓదెలును ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంఓ భీష్మ, కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఇన్చార్జి రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రాజేంద్రప్రసాద్ తదితరులు అభినందించారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
పండగలప్పుడు జరభద్రం!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అప్రమత్తత అవసరమనీ, రాబోయే పండుగలను కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ జరుపుకోవాలని కోరింది. కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ మధ్యలోనే ఉందన్నారు. పండగల తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా 41 జిల్లాల్లో కోవిడ్ వీక్లీ పాజిటివ్ రేటు 10% కంటే ఎక్కువగానూ, 27 జిల్లాల్లో 5–10 శాతాల మధ్యలోనూ నమోదవుతోందని వివరించారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు భారీగా పెరుగుతాయన్నారు. జనం ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడడాన్ని నివారించడం చాలా ముఖ్యమని వివరించారు. ఒక్క కేరళలోనే లక్ష యాక్టివ్ కేసులున్నాయనీ, మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇవి 51.19% అని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో యాక్టివ్ కేసులు 10 వేల నుంచి 1లక్ష వరకు ఉన్నట్లు తెలిపారు. రోజువారీ వ్యాక్సినేషన్ రేటు కూడా జూలైలో 43.41 లక్షలుండగా ఆగస్టులో అది 52.16 లక్షల డోసులకు పెరిగిందన్నారు. దేశంలో గత రెండు, మూడు వారాలుగా ఏ రాష్ట్రం నుంచి కూడా కోవిడ్ టీకా కొరత ఉందంటూ ఫిర్యాదులు అందలేదని భూషణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉపయోగించని/ నిల్వ ఉన్న టీకా డోసులు 2.5 కోట్లకు తగ్గలేదని తెలిపారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80 లక్షల డోసుల టీకా వేసినట్లు తమకు వివరాలందాయని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ లభ్యత సంతృప్తికరంగా ఉందని వివరించారు. దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 50 శాతం మందికి కోవిడ్ టీకా మొదటి డోసు అందగా, వీరిలో 15%మంది రెండో డోసు కూడా వేయించుకున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మెడికల్ ఆక్సిజన్ నిల్వలు సరిపోను ఉన్నాయని పేర్కొన్నారు. -
ప్రధాని సిబ్బందికి కరోనా.. క్వారెంటైన్ అవసరం లేదంటూ ప్రకటన
లండన్: చట్టం ముందు అందరూ సమానులే, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయంటారు. కానీ ఇవి మాటలకే గానీ ఆచరణలకు కాదనేలా నిరూపిస్తోంది ఈ ఘటన. తాజాగా బ్రిటన్‌లో ప్రజలకు ఒకలా, ప్రధానికి మరోలా నిబంధనలను అమలుచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారాల్లో ప్రధాని చేసిన పర్యటనల్లో, ఆయన వెంట వెళ్లిన సిబ్బందిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే జాన్సన్‌కు క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రధాని అధికారిక కార్యాలయం డౌన్ స్ట్రీట్ స్పష్టం చేసింది. జాన్సన్ బుధవారం ఫైఫ్‌లోని పోలీసు కళాశాలను, అలానే గురువారం అబెర్డీన్షైర్లోని విండ్‌ఫార్మ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి తిరిగిన సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. ఆతనికి స్కాట్లాండ్ ప్రయాణంలో నిబంధనల ప్రకారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఈ ఫలితాల అనంతరం ప్రధానికి ఐసోలేషన్ అక్కర్లేదని డౌన్ స్ట్రీట్ పేర్కొంటూ, అందుకు వివరణగా.. ఇటీవల జాన్స్‌న్ యూకే అంతటా క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారని, అదే క్రమంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రయాణాలు జరుగుతున్నాయని తెలిపింది. "పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయిన ఎవరితోనూ ప్రధాని కాంటెక్ట్ కాలేదు, కనుక ఆయన క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని డౌన్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే దీనిపై ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు తమకు ఓ రూల్, దేశ ప్రజలందరీకి ఒక రూల్‌ను అమలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. -
పీటలపై వధువు.. వరుడికి అప్పుడే చేసిన టెస్ట్‌లో షాకింగ్ విషయం
లక్నో: పెళ్లంటే ఒక తెలియని ఆనందం. పెళ్లిపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ జంట పెళ్లి చేసుకునే వేళ ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది. కొన్ని గంటల్లో ఇద్దరు ఒక్కటవుతున్నారని అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ వచ్చి పడి ఆ పెళ్లి వాయిదా పడింది. వారి పెళ్లికి అడ్డంకిగా నిలిచింది ఏమిటో కాదు మహమ్మారి కరోనా. బాజభజంత్రీలతో ఉత్సాహంగా ఊరేగింపుగా బయల్దేరిన వరుడికి పాజిటివ్ తేలింది. దీంతో మండపంలో ఉండాల్సిన అతడు హోం ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఆగిపోయిన పెళ్లి వార్త విశేషాలు మీరే చదవండి. ఉత్తరాఖండ్‌లోని ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా చందోయ్ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం జరగాల్సిన పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్ నిర్వహించుకుంటూ వధువు గ్రామం చందోయ్‌కు బయల్దేరారు. రాష్ట్ర సరిహద్దులో వీరిని పోలీసులు అడ్డగించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెగటివ్ ఉన్నవారినే యూపీలోకి అడుగు పెట్టనిస్తున్నారు. ‘సార్ పెళ్లి ఉంది.. వదిలేయండి’ అని ఎంత బతిమిలాడినా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు విసుగు చెంది అక్కడే సరిహద్దులో పరీక్షలు చేయించుకున్నారు. 41 మందికి పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగటివ్ వచ్చింది. కానీ ఆ ఒకరికి మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అది కూడా వరుడికి పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. పెళ్లి ఉండడంతో జాలిపడి పోలీసులు మూడుసార్లు పరీక్షలు చేశారు. మూడింటిలోనూ పాజిటివ్ అని తేలింది. దీంతో వరుడికి కరోనా సోకిందని నిర్ధారించారు. వెంటనే బంధువులను వెనక్కి పంపించారు. వరుడిని ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. ఈ విషయాన్ని వధువు కుటుంబసభ్యులకు చేరవేశారు. ఈ హఠాత్పరిణామానికి వారు అవాక్కయ్యారు. చివరకు చేసేదేమీ లేక పెళ్లిని వాయిదా వేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీ పెళ్లి మా సావుకొచ్చింది’ అంటూ కరోనా భయంతో బంధువులు వెనక్కి తగ్గారు. -
ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా
టోక్యో: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా టోక్యో ఒలింపిక్స్‌ను ఏదో ఒక రూపంలో కరోనా వెంటాడుతూనే ఉంది. తాజాగా అథ్లెట్ల ‘క్రీడా గ్రామం’లో పని చేస్తున్న సిబ్బందిలో ఇద్దరు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలారు. నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరు గేమ్స్ విలేజ్‌తో సంబంధం లేని మరో ఇద్దరు బయటి వ్యక్తులతో కలిసి భోజనం చేసినట్లుగా సమాచారం. ఒలింపిక్స్ చేరువవుతున్న సమయంలో ఇప్పటికే ఉగాండాకు చెందిన అథ్లెట్, కోచ్... మరో సెర్బియా అథ్లెట్ కూడా కరోనా బారిన పడటంతో కలవరం పెరిగింది. ఈ స్థితిలో తాజా రెండు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా పరిణామాలతో ఇప్పటికే టోక్యోలో ఉన్న ఆస్ట్రేలియా బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వీరిలో 98 శాతం వ్యాక్సిన్ తీసుకొని ఉన్నా సరే... ఒలింపిక్ నిర్వాహకుల నిబంధనలతో పాటు తమ ఆటగాళ్లు సొంతంగా ఇతర కఠిన నిబంధనలు పాటించాలని ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం సూచించింది. మరోవైపు జపాన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్ టార్చ్ రిలేలను దాదాపు అన్ని చోట్లా రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఒక్క చోటకు చేరకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. టోక్యోకు దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న దీవి ‘ఒగాసవారా’లో మాత్రం షెడ్యూల్ ప్రకారం టార్చ్ రిలే కొనసాగుతుంది. -
రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు, మరణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడడంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,028 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3627 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1489 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 6,01,184 మంది డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: నేనెట్టా బతకాలి సారూ.. -
టెస్టుకు ముందు పళ్ల రసాలు.. కరోనా రిజల్ట్ తారుమారు?
కరోనా వైరస్, రెండో దఫా లాక్డౌన్ ప్రభావంతో మూతపడ్డ విద్యాసంస్థల్ని.. కొన్ని దేశాలు తెరవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇంగ్లండ్‌లో బడికి వెళ్లడం ఇష్టంలేని కొందరు పిల్లలు హుషారుతనం ప్రదర్శిస్తున్నారు. పండ్ల రసాల్ని, కెచప్‌లను ఉపయోగించి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రులకు పంపిన హెచ్చరిక సందేశం ద్వారా అసలు విషయం బయటపడింది. లండన్: మెర్సెసైడ్‌లోని బెల్లె వాలేలో ఉన్న గేట్‌ఎకర్ స్కూల్ యాజమాన్యం తాజాగా పేరెంట్స్‌కి ఒక మెయిల్ పెట్టింది. ల్యాటెరల్ ఫ్లో టెస్ట్ (ర్యాపిడ్ తరహా టెస్ట్) టైంలో చాలామంది పిల్లలు ఆరెంజ్, కచెప్.. ఇతరత్రా పండ్లరసాలు తాగుతున్నారని, దాంతో స్వాబ్ నమూనాలు మారిపోయి.. ఫలితం తేడా వస్తోందని తెలిపింది. దాని ద్వారా అంతా బాగానే ఉన్న పిల్లలకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తోందని, ఇలాంటి తప్పుడు పనులను తాము సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మెయిల్లో హెచ్చరించింది. జూన్ 21 సోమవారం నుంచి నిర్వహిస్తున్న టెస్టుల్లో వరుసబెట్టి ఆ స్కూల్ పిల్లలకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయట. ఆ అనుమానంతోనే ఈ మెయిల్ పంపింది స్కూల్. అయితే వాళ్లలో ఎంత మంది ఇలాంటి పనికి పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది. అదే టైంలో బ్రిటన్ వ్యాప్తంగా చాలా స్కూళ్లలో స్టూడెంట్స్ ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు రుజువైందని, అందుకే తమ స్కూల్ పిల్లలపై కూడా అనుమానంతోనే ఆ మెయిల్ పంపామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులనే తాము నమ్ముతామని పేరెంట్స్‌కి స్పష్టం చేసింది. మరోవైపు పండ్ల రసాలు, ఫిజ్జీలాంటి జ్యూస్‌లతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ కొందరు టిక్‌టాక్‌లు చేస్తుండడంతో స్టూడెంట్స్పై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. చదవండి: వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్!! -
బాబోయ్, ఈ వ్యక్తికి పది నెలలుగా పాజిటివ్.. చివరికి
లండన్: సాధారణంగా కోవిడ్ మహమ్మారి సోకితే రెండు వారాలు క్వారెంటైన్లో ఉండి పౌష్టికాహారం తీసుకోవడంతో వైరస్‌ను మన శరీరంలోంచి పంపగలమని వైద్యులు చెప్తున్నారు. కానీ బ్రిటన్‌లో వైద్యులకు సైతం అంతుచిక్కని ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పది నెలలుగా కరోనా తోటి సహజీవనం చేస్తున్నాడు. అతనికి వైరస్ సోకినప్పటి నుంచి మధ్య మధ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటవ్‌గానే ఫలితాలు వచ్చేవి. కాగా ఈ వైరస్ ఇంత కాలం ఓ వ్యక్తి శరీరంలో కొనసాగడం ఇదే మొదటి సారని ఆ దేశ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన రిటైర్డ్ డ్రైవింగ్ టీచర్ డేవ్ స్మిత్ పది నెలల ముందు కరోనా వైరస్ సోకింది. ఇక అప్పటి నుంచి అతనికి చేసిన పరిక్షల్లో 43 సార్లు పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయని, ఏడుసార్లు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపాడు. ఒకానొక దశలో అతని మరణిస్తాడేమో అతని కుటుంబసభ్యులు తన అంత్యక్రియలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చాడు. అతని భార్య మాట్లాడుతూ .. స్మిత్‌కు ఎన్ని సార్లు పరిక్షిలు జరిపినా పాజిటివ్ రావడం, మళ్లీ హోం క్వారెంటైన్‌కు వెళ్లడం గత పది నెలలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఒక్కోసారి స్మిత్ ఆరోగ్యం క్షీణించేది అప్పుడు నాకు చాలా భయమేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గత సంవత్సరమంతా మాకు నరకంలా గడిచిందని ఆమె తెలిపింది. ఎట్టికేలకు వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజుల తరువాత చివరికి స్మిత్‌కు నెగటివ్ రావడం అది కూడా దాదాపు 305 రోజుల తరువాత ఇలా జరగడంతో ఆ దంపతులు షాంపైన్ బాటిల్‌తో ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. స్మిత్ కేసుని అధ్యయనం చేస్తున్న వైద్యుల ప్రకారం.. అతని శరీరంలో వైరస్ ఎక్టివ్‌గా కొనసాగుతోంది. వైరస్ శరీరంలో ఎక్కడ దాక్కుంటుంది? ఇది నిరంతరం సోకుతూ ఎలా ఉంటుంది? అనే దానిపై అధ్యయనం కొనసాగిస్తున్నామని తెలిపారు. చదవండి: Fact Check: ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా? -
Tokyo Olympics: కరోనా కలకలం.. ఫస్ట్ కేసు గుర్తింపు!
సమ్మర్ ఒలింపిక్స్ 2020(2021)లో కరోనా కలకలం మొదలైంది. వేడుకలకు ఐదు వారాల ముందే ఆటగాళ్లలో మొట్టమొదటి కేసును అధికారులు గుర్తించారు. టోక్యో గడ్డపై అడుగుపెట్టిన ఉగాండాకు చెందిన ఓ అథ్లెట్‌కు కరోనా పాజిటివ్ సోకడంతో అంతా ఉలిక్కి పడ్డారు. టోక్యో: ఒలింపిక్స్ కోసం శనివారం రాత్రి ఎనిమిది మందితో కూడిన ఉగాండా టీం టోక్యోలోని నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. ఆ మరుసటి రోజు వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా ఎలా సోకిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఆ ఆటగాడి పేరును వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ఇక జపాన్‌లో అంతర్జాతీయ ప్రయాణికులకు రెండువారాల క్వారంటైన్ అమలులో ఉన్నప్పటికీ.. ఒలింపిక్స్ ప్లేయర్స్ కోసం ఆ నిబంధనను మార్చారు. వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఫర్వాలేదని పేర్కొంటూ.. బయో బబుల్స్, సోషల్ డిస్టెన్స్ పాటించడం, రోజూవారీ పరీక్షల్లో పాల్గొన్నా సరిపోతుందని పేర్కొంది. విమర్శలు.. కరోనా టైంలో ఒలింపిక్స్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వేల మంది ఆటగాళ్ల మధ్య కరోనాను ఎలా కట్టడి చేస్తారని మండిపడుతున్నారు. ఇక తాజా పరిణామం(ఉగాండా ఆటగాడికి పాజిటివ్)తో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈసారి ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం టోక్యో ఒలింపిక్స్ కమిటీ భేటీ కానుంది. చదవండి: కండోమ్‌లు ఇక ఇంటికి తీసుకెళ్లండి -
ప్రమాదకరం.. ‘ఫాల్స్ నెగిటివ్’.. అంటే ఏంటి?
సాక్షి, కాకినాడ: అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో తీరుగా ఉంటోంది. లక్షణాలున్నవారు, ఆరోగ్య పరిస్థితి దిగజారినవారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే కొంతమందికి నెగిటివ్‌గా.. ఎటువంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్‌గా ఫలితం వస్తోంది. ఇలాంటివి అరుదుగా ఎదురవుతున్నప్పటికీ ప్రమాదకరంగానే పరిగణించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా పరీక్షల ఆధారంగా వైద్యం అందించాల్సిన కీలక సమయాల్లో ఇదొక సమస్యగా పరిణమిస్తోందని అంటున్నారు. కాకినాడ జీజీహెచ్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డీఎస్ మూర్తి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆయనను తూర్పుగోదావరి జిల్లాలో వీఆర్డీ ల్యాబ్‌కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై డాక్టర్ మూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఫాల్స్ నెగిటివ్ అంటే.. కరోనా లక్షణాలున్నప్పటికీ పరీక్షలో రిపోర్ట్ నెగిటివ్‌గా వస్తే దాన్ని వైద్య పరిభాషలో ఫాల్స్ నెగిటివ్ అంటారు. పరీక్షలు చేసేవారికి సరైన శిక్షణ లేకపోవడం, సరైన స్వాబ్‌ను వాడకపోవడం, శాంపిల్ పరిమాణం తక్కువగా సేకరించడం, సేకరించాక సరిగా భద్రపర్చకపోవడం, శాంపిళ్లను సరైన రీతిలో పరీక్ష కేంద్రాలకు తరలించకపోవడం ఫాల్స్ నెగిటివ్‌కు కారణాలవుతున్నాయి. ఫాల్స్ పాజిటివ్ కంటే ఫాల్స్ నెగిటివ్ ప్రమాదకరం. ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్ వల్ల బాధితుడు వైద్యానికి దూరమవుతాడు. తద్వారా తన ఆరోగ్యాన్ని ప్రమాదకరస్థితిలోకి నెట్టుకోవడమే కాకుండా వైరస్ వ్యాప్తికి కూడా కారకుడవుతాడు. ఫాల్స్ పాజిటివ్ అంటే.. శాంపిల్స్ తారుమారైనా, వైరస్ తగ్గి 90 రోజులు గడవక ముందు మళ్లీ టెస్ట్ చేయించుకున్నా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. దీనివల్ల బాధితుడి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వ్యాధి లేకున్నా మందులు వేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితి వైరస్ నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తోంది. వైరస్ మృతకణాలు సైతం పరీక్షల్లో కనిపించడం వల్ల పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. అందుకే ప్రభుత్వం రీ టెస్ట్‌ను సిఫార్సు చేయడం లేదు. మ్యుటేషన్ల వల్ల ఫలితాల్లో తేడా పరీక్షకు సేకరించిన నమూనాల్లో మ్యుటేషన్లు (వైరస్ పరివర్తన) చోటు చేసుకుంటే ఫలితాల్లో తేడాలు కనిపిస్తాయి. పరీక్షకు ముందు ఆహారం తీసుకున్నా.. ద్రవాలు తాగినా పరీక్ష ఫలితాల ఖచ్చితత్వం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఘన, ద్రవ ఆహారాలు శరీరంలో వివిధ క్రియలపై చూపే ప్రభావమే దీనికి కారణం. నిర్లక్ష్యం వద్దు.. అరుదైన సందర్భాల్లోనే ఫాల్స్ పాజిటివ్, నెగిటివ్‌లకు అవకాశం ఉంది. అయితే వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే మాత్రం నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో తిరిగి మరోమారు ఆర్టీపీసీఆర్ పరీక్షే చేయించుకోవాలి. అప్పటికీ నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే తప్పకుండా సీటీ స్కాన్ చేయించుకోవాలి. హై రిజల్యూషన్ సీటీ స్కాన్ టెస్ట్ (హెచ్ఆర్సీటీ) రేడియేషన్ కారణంగా అందరికీ సురక్షితం కాదు. గర్భిణులు సీటీ స్కాన్ చేయించుకోవాల్సి వస్తే ఉదరంపై అబ్డామిన్ షీట్ ఉంచుకోవాలి. -
టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు
సాక్షి, అమరావతి: మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. ఈ కరోనా కట్టడిలో.. వ్యాక్సిన్ పంపిణీలో ఏపీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా పరీక్షలు ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. అమరావతిలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏకే సింఘాల్ మీడియాతో మాట్లాడారు. మే 16వ తేదీన పాజిటివిటీ రేటు 25.56% ఉండగా ప్రస్తుతం 9.37%గా ఉందని, రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు తగ్గిందని వివరించారు. ఇప్పటివరకు 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. జులై 10వ తేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి చేస్తామని ఏకే సింఘాల్ ప్రకటించారు. చదవండి: ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్ -
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,933 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 3,527 మంది వైరస బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి .రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,93,103కు చేరింది. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,394కి పెరిగింది. గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 165 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి: Corona Virus: తప్పని ‘మహ’ ముప్పు -
ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 64,800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,872 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 86 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,552 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 13,702 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 37 వేల 149 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 1,98,56,521 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 166, విజయనగరం- 207, విశాఖ- 189, తూ.గో- 810, ప.గో- 160, కృష్ణా- 175, గుంటూరు- 374, ప్రకాశం- 447, నెల్లూరు- 232, చిత్తూరు- 961, అనంతపురం- 535, కర్నూలు- 212, వైఎస్ఆర్ జిల్లా- 404 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
మేలో దేశాన్ని వణికించిన కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: సెకండ్ వేవ్‌లో ఏప్రిల్‌నాటి కోవిడ్ సంక్షోభ రికార్డులను తిరగరాస్తూ కరోనా మే నెలలో ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. నెల ప్రారంభంలో విజృంభించిన కరోనా నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టింది. కేవలం మే నెలలో దేశంలో 90,10,075 పాజిటివ్ కేసులు, 1,20,042 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య, కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య తగ్గనప్పటికీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువకు దిగిరావడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. మార్చి 1వ తేదీన దేశంలో 12,286 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కరోనా విస్తృతి విపరీతంగా పెరిగి ఏప్రిల్ 6వ తేదీన 1.15 లక్షల కొత్త కేసులొచ్చాయి. తర్వాత కరోనా సంక్రమణ వేగం ఒక్కసారిగా ఊపందుకోవడంతో మేలో రోజువారీ కొత్త కేసులు 4 లక్షల మార్క్‌ను దాటేశాయి. మార్చి 1తో పోలిస్తే 67 రోజుల తర్వాత మే 6 న ఈ సంఖ్య 34 రెట్లు పెరిగి 4.14 లక్షలు దాటింది. గత 24 రోజుల్లో 63% తగ్గిన పాజిటివ్ కేసులు మే 6 తర్వాత దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత 24 రోజుల్లో రోజు వారీ పాజిటివ్ కేసులు 63% తగ్గి నెలాఖరున 1,27,510 కేసులు నమోదయ్యాయి. 26 రెట్లు పెరిగిన కరోనా మరణాలు దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య భయపెడుతోంది. మార్చి 1న దేశంలో 92 మరణాలు సంభవించగా, మే 18వ తేదీన దేశంలో అత్యధికంగా 4,529 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా దేశంలో సగటున రోజువారీ మరణాల సంఖ్య 3523గా నమోదవుతోంది. మార్చి నెలలో 5,766, ఏప్రిల్ నెలలో 48,926, మే నెలలో 1,20,042 కరోనా మరణాలు సంభవించాయి. గత 54 రోజుల్లోనే అతి తక్కువ కేసులు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 1,27,510 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ కేసులు రావడం గత 54 రోజుల్లో ఇదే తొలిసారి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు పెరిగింది. గత 24 గంటల్లో 2,795 మంది కోవిడ్‌తో మరణించారు. మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,31,895కు పెరిగింది. ఇంత తక్కువ మరణాలు నమోదవడం గత 35 రోజుల్లో ఇదే తొలిసారి. దేశంలో గత 24 గంటల్లో 2,55,287 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,59,47,629కు పెరిగింది. రికవరీ రేటు 92.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18,95,520కు చేరుకుంది. 43 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షల దిగువన నమోదైంది. కరోనా పాజిటివిటీ రేటు 6.62%గా నమోదైంది. మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. -
తెలంగాణలో కొత్తగా 1,801 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 61,053 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 16 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,660 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,37,522 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 35,042యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,50,89,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బాధితుల్లో 3,263 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కేసులు అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 390, రంగారెడ్డి 114, మేడ్చల్ 101, కరీంనగర్లో 92 కరోనా కేసులు నమోదయ్యాయి. చదవండి: Telangana: జూన్ 15నుంచి రైతుబంధు -
తెలంగాణలో కొత్తగా 2,982 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,00,677 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,982 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 21 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,837 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,33,862 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 36,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,50,27,996 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బాధితుల్లో 3247 మంది మృతి చెందారు. చదవండి: TS: రేపటి నుంచి ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్ -
ఏపీలో కొత్తగా 13,756 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 79,564 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 13,756 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 20,392 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 87 వేల 382 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90,88,611 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,73,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 666, విజయనగరం- 397, విశాఖ- 1004, తూ.గో- 2301, ప.గో- 1397, కృష్ణా- 782, గుంటూరు- 780, ప్రకాశం- 811, నెల్లూరు- 865, చిత్తూరు- 2155, అనంతపురం- 1224, కర్నూలు- 742, వైఎస్ఆర్ జిల్లా- 632 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా కరోనా మృతుల సంఖ్య.. పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి, చిత్తూరు జిల్లాలో 13, విశాఖ జిల్లాలో 10 మంది మృతి, తూ.గో, అనంతపురం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి, గుంటూరు, కృష్ణా జిల్లాలో 8 మంది చొప్పున మృతి, కర్నూలు జిల్లాలో ఏడుగురు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు మృతి, విజయనగరం జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు మృతి, కరోనాతో వైఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. చదవండి: మళ్లీ రహస్య ప్రాంతానికి ఆనందయ్య -
ఏపీలో కొత్తగా 14,429 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 14,429 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 20,746 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 66 వేల 990 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90,09,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 897, విజయనగరం- 535, విశాఖ- 1145 , తూ.గో- 2022, ప.గో- 991, కృష్ణా- 1092, గుంటూరు- 798 , ప్రకాశం- 924, నెల్లూరు- 930, చిత్తూరు- 2291, అనంతపురం- 1192, కర్నూలు- 1034, వైఎస్ఆర్ జిల్లా- 578 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,614 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 90,226 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 18 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,961 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,26,043 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 38,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,48,30,083 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బాధితుల్లో 3207 మంది మృతి చెందారు. చదవండి: రూ. 46 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలే..! -
ఏపీలో కొత్తగా 16,167 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 84,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 16,167 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 21,385 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 46 వేల 244 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,89,24,545 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 1,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో 14, ప.గో.జిల్లాలో 13, గుంటూరు, విజయనగరం జిల్లాలో 8.. అనంతపురం, నెల్లూరులో 9, ప్రకాశంలో 7, విశాఖ జిల్లాల్లో 11 మంది, తూ.గో లో ఆరుగురు, కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు చొప్పున మొత్తం 104 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 10531 మంది మరణించారు. చదవండి: ‘ఈ ఆస్పత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే’ -
అప్పుడే పుట్టిన శిశువుకు పాజిటివ్.. తల్లికేమో నెగెటివ్, షాక్‌లో వైద్యులు
లక్నో: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరినుంచి ఈ మహమ్మారి సోకుతుందో అనే భయం. ఈ నేపథ్యంలో తల్లి కడపులో నుంచి ఓ ఆడ శిశువు కరోనా పాజిటివ్‌తో ప్రపంచంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. శిశువు తల్లికి మాత్రం నెగెటివ్ రావడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన యూపీలోని వారణాసిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే 24న పురిటి నొప్పులతో సుప్రియ అనే మహిళ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) లోని ఎస్.ఎస్. ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్థారణ అయ్యింది. డెలివరీ చేసిన వైద్యులు మర్నాడు ఆమెకు పుట్టిన పాపకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యసిబ్బందితో పాటు సుప్రియ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై సుప్రియ భర్త మాట్లాడుతూ.. ఇది వింతగా ఉంది. కరోనా పరీక్షల ఫలితాన్ని చూసి మా కుటుంబ సభ్యులందరిలోను గందరగోళం నెలకొంది. ఒక వేళ పరీక్ష ఫలితాలు తప్పుగా ఉన్నాయో లేదో మాకు అర్థం కాలేదు. వీటి గురించి తెలుసుకోవడానికి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కాల్స్ చేయగా ఆయన స్పందించడంలేదని ఆమె భర్త తెలిపాడు. అయితే, శిశువుకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు బీహెచ్‌యూ రిజిస్ట్రార్ నీరజ్ త్రిపాఠి ధృవీకరించారు. ప్రస్తుతం తల్లి ,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు. చదవండి: తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3762 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3762 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 20 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3816 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,22,082 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 38,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో 528, మేడ్చల్‌లో 213, ఖమ్మంలో 214, రంగారెడ్డిలో 229 నమోదయ్యాయి. చదవండి: సమ్మె చేసేందుకు ఇది సమయం కాదు: మంత్రి కేటీఆర్ -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న 18,767 కేసులు నమోదు కాగా, ఇవాళ కేవలం 12,994 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 58,835 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,994 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,90,926 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 104 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 18,373 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 13 లక్షల 79 వేల 837 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,03,762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,86,76,222 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: 45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్ కరోనా మరణాలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నివేదిక కరోనా మరణాలపై వైద్యారోగ్యశాఖ అధికారుల నివేదిక విడుదల చేశారు. అందులో 60-80 ఏళ్ల మధ్య వృద్ధుల్లో కరోనా మరణాలు తగ్గిన్నట్లు తెలిపారు. సెకండ్ వేవ్‌లో 30-50 ఏళ్ల మధ్య ఎక్కువగా చనిపోతున్నట్లు ధృవీకరించారు. ఇక గ్రామాల్లోనూ.. పట్టణాల్లోనూ సమానంగా కరోనా మరణాలు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతంలో 50.4 శాతం, పల్లెల్లో 49.6 శాతం మరణాలున్నట్లు వెల్లడించారు. రెండో దశ కరోనాలో 41-50 మధ్య వారు ఎక్కువగా మృతి చెందినట్లు నిర్థారించారు. గతేడాది మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో 41-50 మధ్య వయస్సులో 5.96 శాతం మేర కరోనా మరణాలు పెరిగాయి. వయసు పరంగా మరణాల నమోదు 31-40 ఏళ్ల మధ్య 5.19 శాతం మేర పెరిగిన కరోనా మరణాలు 51-60 ఏళ్ల మధ్య 2.04 శాతం మేర పెరిగిన కరోనా మరణాలు 61-70 ఏళ్ల మధ్య 6.11 శాతం మేర తగ్గిన కరోనా మరణాలు 71-80 ఏళ్ల మధ్య 4.90 శాతం మేర తగ్గిన కరోనా మరణాలు 80 ఏళ్లు పైబడినవారిలోనూ 1.37 శాతం మేర తగ్గిన మరణాలు -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2242 కేసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 42,526 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2242 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 19 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4693 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,09,663 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,464 కేసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 25 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4801 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,00,247 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3085 మంది మృతి చెందారు. చదవండి: Lockdown: ‘మా కుక్కకు బాలేదు.. వచ్చే నెల నా పెళ్లి’ -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,660 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,826 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం4,95,446 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 45,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3060 మంది మృతి చెందారు. తెలంగాణలో గత 24 గంటల్లో 69,252 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,43,36,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: Coronavirus: వ్యాక్సిన్.. కోవిడ్‌పై విన్ -
బిగ్‌బాస్ విన్నర్‌కు కరోనా, భావోద్వేగంతో వీడియో షేర్ చేసిన నటి
హిందీ బిగ్‌బాస్ 14 విన్నర్, నటి రుబినా డిలైక్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిమ్లాలోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్న రుబినా మంగళవారం ఓ వీడియో షేర్ చేసింది. ఈ నెల ఒకటో తేదీన తను కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. కరోనా అని తెలిసినప్పటి నుంచి హెం క్వారంటైన్లో ఉంటూ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుందో ఆమె వీడియోలో వివరించింది. రుబినా తన యూట్యూబ్ ఛానల్లో కోవిడ్ డైరీస్ అనే పేరుతో ఈ వీడియోను షేర్ చేస్తూ... కోవిడ్ నుంచి కోలుకునేందుకు తన భర్త అభివనవ్, తల్లి, సోదరి ఎంతటి మద్దతు ఇచ్చారో చెబుతూ ఇలాంటి కుటుంబ ఉన్నందుకు తాను చాలా అదృష్టావంతురాలినంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. అనంతరం తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎవరైనా కరోనా లక్షణాలు, జ్వరంతో బాధపడితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, దీనిని సాదారణ ఫ్లూగా చూడోద్దంటూ ఆమె అభ్యర్థించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ ఊపిరిత్తిత్తుల్లో కాస్తా ఇన్ఫెక్షన్ ఉందని ఈ సందర్భంగా రుబినా వెల్లడించింది. ఇక తాను కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పింది. చివరగా ఆమె.. దయ చేసి ప్రతి ఒక్కరు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం పని కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమని, జీవితం అనేది ఉంటేనే ప్రపంచంలో మిగతావన్ని ఉంటాయని ఆమె హెచ్చరించింది. కాగా రుబినా తన భర్త, నటుడు అభినవ్‌తో బిగ్‌బాస్ 14 సిజన్లో కంటెస్టెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో తనశైలితో వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సిజన్ విన్నర్‌గా ఆమె నిలిచింది. -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,961 కేసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,961 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 5,559 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం4,80,458 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 49,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 2985 మంది మృతి చెందారు. తెలంగాణలో గత 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,41,24,316 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ( చదవండి: ఫ్రీ అంబులెన్స్! మానవత్వం చాటుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగి ) -
24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 4,298 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 6026 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 4,69,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 2928 మంది మృతి చెందారు. తెలంగాణలో గత 24 గంటల్లో 64,362 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 1,40,16,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ( చదవండి: గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు తీసుకోవాలి ) -
రెండు ఇళ్లు ఉన్నా.. బాత్రూంలోనే ఐసోలేషన్
సాక్షి, వికారాబాద్: తన ద్వారా భార్యాపిల్లలకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఓ కోవిడ్ రోగి బాత్రూంలో తలదాచుకున్నాడు. అతడి సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు అతడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్ (30)కు ఐదు రోజులక్రితం కరోనా సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన అతడు వైరస్ తన కుటుంబ సభ్యులకు కూడా సోకుతుందేమోనని భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న బాత్రూంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం అతడు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారులు గమనించి స్థానిక డాక్టర్, ఎంపీడీఓ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడిని అనంతగిరిగుట్టలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్‌కు రెండు ఇళ్లు ఉన్నాయని, ఓ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే చికిత్స అందేలా చూస్తామని చెప్పినా వినలేదని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ( చదవండి: అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం ) -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు కరోనా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు మరో సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దేశంలో కరోనా సంక్షోభానికి సంబంధించిన అంశాలను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్లపై గురువారం విచారణ జరుగాల్సి ఉండగా ఆయన అందుబాటులో లేకపోవడంతో మరో తేదీకి వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. జస్టిస్ బాబ్డే పదవీ విరమణ తరువాత ఆయన నేతృత్వంలోని ధర్మాసనం వింటున్నకోవిడ్ కేసులను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి మార్చారు. సుప్రీంకోర్టు జాతీయ విపత్తుకు " మౌనంగా ప్రేక్షకపాత్ర " వహించబోదని ఆయన ఇటీవలే కేంద్రానికి స్పష్టం చేశారు. ( చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి ) -
షాక్: పొరుగు దేశంలో 26 మంది ఎంపీలకు కరోనా
ఖాట్మండు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య కరోనా మహమ్మారి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, నిబంధనలు ఎన్ని పాటిస్తున్నా ఈ మాయదారి మహమ్మారి వదలడం లేదు . సాధారణ ప్రజలు నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులని తేడా లేకుండా అందరికీ సోకుతోంది. గత వారం నేపాల్‌లో ఎంపీలు కరోనా పరీక్షలు చేయగా అందులో ఏకంగా 26మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో ఇవాళ పార్లమెంట్లో జరగబోయే ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాసపరీక్షపై అందరికీ ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ సెక్రటేరియట్ ప్రతినిధి రోజ్నాథ్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. 200 మందికి పైగా పార్లమెంటు సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో 18 మంది పాజిటిగా నిర్ధారణ అయ్యింది. ఇక దిగువ సభలో కరోనా సోకిన సభ్యులతో కలపి ఈ సంఖ్య 26కు చేరుకుంది. ఇక సోమవారం జరగనున్న ఓలీ ప్రభుత్వ విశ్వాస పరీక్ష ఓటింగ్‌కు సంబంధించి ఈ 26 మంది ఓటింగ్ వేయడానికి ఉన్న దారులన్నీ పరిశీలిస్తున్నాము. దీనిపై ఇప్పటికే హౌస్ స్పీకర్, వైద్య అధికారులు సాధ్యమైన మార్గంలో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఓలి విశ్వాసపరీక్ష ఫలితం ? ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్లమెంట్లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు. నేపాల్ పార్లమెంట్లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్-యుఎంఎల్‌కు ప్రస్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం. ( చదవండి: 25 సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన నేపాలీ దేశస్థుడు..! ) -
కేకేఆర్ జట్టులో మరో ఆటగాడికి కరోనా
న్యూఢిల్లీ: గత సంవత్సరం యూఏఈలో మ్యాచ్‌లు జరిపిన మాదిరిగానే భారత్‌లోనూ ఈ సారి ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించాలనుకున్న బీసీసీఐ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ ఆటగాళ్లకి సోకింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ప్లేయర్ కరోనా బారినపడ్డాడు. కేకేఆర్, భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో కేకేఆర్ జట్టులో వైరస్ సోకిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ కరోనా బారినపడ్డారు. కాగా, ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ప్రసిద్ద్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఐపీఎల్ వాయిదాకి వరుణ్ చక్రవర్తి కారణమంటూ సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ చేస్తూ అభిమానులు వాళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ( చదవండి : IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్! ) -
తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు
రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లాడు. ఉదయం 11 గంటలకు వెళ్ళిన అతనికి అప్పటికే పరీక్షలు పూర్తయినట్లు సిబ్బంది చెప్పారు. కిట్లు తక్కువగా ఉన్నందున 25 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని, రేపు ఉదయం 9 గంటల కల్లా వస్తే పేరు నమోదు చేసుకుని పరీక్ష చేస్తామని చెప్పడంతో తిరుగుముఖం పట్టాడు. చైతన్యపురికి చెందిన పి.శ్రీనివాస్‌కు మూడు రోజులుగా జ్వరంతో పాటు దగ్గు వస్తోంది. దీంతో పక్కనే ఉన్న సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షకు వెళ్ళాడు. ఉదయం 10 గంటలకే అక్కడ రెండొందల మందికి పైగా పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. కొంతసేపటికి వైద్య సిబ్బందిలో ఒకరు బయటకు వచ్చి ఈ రోజు 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని, ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నామని చెప్పారు. మిగిలినవాళ్లు రేపు రావాల్సిందిగా సూచించడంతో శ్రీనివాస్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో టెస్ట్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. చదవండి: (వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందింది) సాక్షి, హైదరాబాద్: కరోనా రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. గడచిన రెండు వారాల్లోనే లక్షకు పైబడి కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి వేగాన్ని స్పష్టం చేస్తోంది. కరోనాకు కళ్ళెం వేసేందుకు పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సూచిస్తుండగా... రాష్ట్రంలో మాత్రం కోవిడ్–19 నిర్ధారణ టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో టెస్టుల కోసం వందల సంఖ్యలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నా.. ఒక్కో కేంద్రంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పరీక్షలు చేసి చేతులెత్తేస్తున్నారు. దీంతో లక్షణాలున్న వారు సైతం సకాలంలో పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. వైరస్ సోకిందీ లేనిదీ నిర్ధారణ కాక కొందరు సాధారణ జీవనాన్ని కొనసాగించడం.. కుటుంబసభ్యులకు, ఇతరులకు వ్యాపించేందుకు కారణమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,148 పరీక్షా కేంద్రాల్లో 11,42,096 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,01,966 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 8.927 శాతంగా నమోదయ్యింది. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) కిట్ల కొరతతో సతమతం వైద్య, ఆరోగ్య శాఖకు కోవిడ్–19 నిర్ధారణ కిట్ల కొరత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రం కావడంతో పరీక్షల కోసం వందల సంఖ్యలో కేంద్రాల వద్ద అనుమానితులు బారులు తీరుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరీక్షా కేంద్రానికి 200 మందికి పైగా పరీక్షల కోసం రాగా.... కేవలం 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. కిట్లు లేవని, మిగతావారు రేపు రావాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా యాచారం పరీక్షా కేంద్రంలో కేవలం 25 మంది నుంచి మాత్రమే నమూనాలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25–50 పరీక్షలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో అన్నిచోట్లా ర్యాపిడ్ టెస్టులే చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు దాదాపు నిలిచిపోయాయి. వారం క్రితం వరకు అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో ఆవశ్యకతను బట్టి ఆర్టీపీసీఆర్ శాంపుల్స్ తీసుకుని ప్రభుత్వ కేంద్రాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తుండగా... ఇప్పుడు 21 కేంద్రాలతో పాటు అన్నిచోట్లా ఈ నమూనాల స్వీకరణకు మంగళం పాడారు. మరోవైపు సెలవు దినాల్లో పరీక్షల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజూ నిర్వహిస్తున్న పరీక్షల్లో సగటున సగం మాత్రమే చేస్తున్నారు. గణనీయంగా తగ్గిన పరీక్షలు రెండు వారాల క్రితం రోజుకు లక్షకు పైబడి నమూనాలను పరీక్షించి ఫలితాలను ప్రకటించిన వైద్య, ఆరోగ్య శాఖ... ప్రస్తుతం 70 వేల నమూనాలను మాత్రమే సేకరిస్తోంది. అందులో కూడా 5 నుంచి 8 శాతం నమూనాల ఫలితాలను పెండింగ్‌లో ఉంచుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,148 కేంద్రాల్లో కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 1,085 ఉండగా.. మరో 63 ప్రైవేటు సంస్థలకు చెందినవి. ప్రభుత్వం నిర్వహిస్తున్న వాటిలో 21 కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తుండగా... 1,064 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్)లు చేస్తున్నారు. ఇక ప్రైవేటు కేంద్రాల్లో దాదాపు ఆర్టీపీసీఆర్ పరీక్షలే చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో మూడో వారం నాటికి రోజుకు లక్షకు పైగా నమూనాలను తీసుకుని పరీక్షించి ఫలితాలు ప్రకటించగా.. ఆ తరువాత నుంచి 50 వేల నుంచి 70 వేల నమూనాలను మాత్రమే తీసుకుని అందులో 95 శాతానికి సంబంధించి ఫలితాలు ప్రకటిస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో 8,89,902, ప్రైవేటు కేంద్రాల్లో 2,52,194 పరీక్షలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే ఒక్కో కేంద్రంలో రోజుకు సుమారు 70 నమూనాలను మాత్రమే స్వీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. ఏకంగా పది మందికి
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజువారి రికార్డు స్థాయి కేసులతో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ అశ్విన్ కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అశ్విన్ కుటుంబ సభ్యులు ఈ శుక్రవారం కోవిడ్ పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ప్రీతి ట్వీట్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న అశ్విన్ గతవారం సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీతి తమ అనుభవాలను అటు ట్విటర్, ఇటు ఇన్‌స్టాలో షేర్ చేశారు. గతవారంమంతా ఒక పీడకలలా గడిచింది ‘‘మా ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్ సోకింది. అందులో 6గురు పెద్దలు, 4 పిల్లలు ఉన్నారు. పిల్లల కారణంగా అందరికీ ఈ మహమ్మారి వ్యాపించింది. ప్రస్తుతం కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం మా కుటుంబానికి ఓ పీడకలలా గడిచింది. 5-8 రోజులు చాలా కష్టంగా గడిచాయి. సాయం చేయడానికి అందరూ ఉన్నా.. చేయలేని పరిస్థితి. ఇదో మాయదారి వైరస్. మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ద్వారానే వేగంగా కోలుకోగలమని భావిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోండి, టీకాతోనే మనం ,మన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారితో పోరాడగలం‘‘ అంటూ ప్రీతి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ ఐపీఎల్ సీజన్‌కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ 2021 సీజన్లో లీగ్ నుంచి తప్పుకున్న తొలి భారతీయ క్రికెటర్ అశ్విన్. కరోనా సోకి కష్టకాలంలో ఉన్న తన కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ( చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు ) Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission - the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home. — Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021 -
పెళ్లింట విషాదం: తమ్ముడి పెళ్లికొచ్చి ఎన్నారై కరోనాకు బలి
సాక్షి, హైదరాబాద్: ఒక్కో కరోనా మరణం వెనుక తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఒక్కో కథ వింటే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ యువకుడి కథ వింటే గుండెలు పిండేసేలా ఉంది. తమ్ముడి పెళ్లి కోసం అమెరికా నుంచి వచ్చిన యువకుడు తెలంగాణలో కరోనా బారినపడ్డాడు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు కన్నుమూశాడు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. దీనికి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలారం తండాకు చెందిన ప్రేమ్ లాల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య, పాపతో కలిసి అమెరికాలోనే నివసిస్తున్నాడు. అయితే మే 6వ తేదీన సోదరుడి వివాహం ఉండడంతో కొన్ని రోజులు ముందుగానే అమెరికా నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. అయితే ఇక్కడికి వచ్చాక ప్రేమ్‌లాల్ కరోనా బారిన పడ్డాడు. అతడి తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది. అనారోగ్యం చెందడంతో ప్రేమ్‌లాల్ మొదట స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించి మందులు వాడాడు. కొన్ని రోజులకు ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. ప్రేమ్‌లాల్ మృతితో పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. 577 మంది టీచర్లు కరోనాకు బలి -
పాజిటివ్ వచ్చినంత మాత్రాన అందరికీ ఆక్సిజన్ అవసరం ఉండదు
-
కరోనా బారిన మరో కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో వేగంగా వ్యాప్తిస్తూ ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ మహమ్మారి రాజకీయ ప్రముఖుల్లో కలకలం రేపుతోంది. కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అవుతున్న రాజకీయ నేతల జాబితా అంతకంతకే పెరుగుతోంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. వైద్యులు సూచనలమేరకు తాను చికిత్స తీసుకుంటానన్నారు. అలాగే ఇటీవలి కాలంలో తనను కలిసిన అధికారులు, సన్నిహతులు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవడంతోపాటు, కొద్ది రోజులపాటు హోమ్ క్వారెంటైన్లో ఉండాలని పోఖ్రియాల్ సూచించారు. (కరోనా సెకండ్ వేవ్ మోదీ మేడ్ డిజాస్టర్: దీదీ ఫైర్) కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఈ వారంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో రోజు రోజుకు వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు దాదాపు మూడు లక్షలకు చేరువలో ఉన్నాయి. అలాగే మరణాల సంఖ్య తాజాగా రెండువేల మార్క్‌ను దాటడం మరింత ఆందళన రేపుతోంది. (ఆక్సిజన్ ట్యాంక్ లీక్ : 22 మంది మృతి) This is to inform you all that I have tested COVID positive today. I am taking medication & treatment as per the advice of my doctors. Request all those who have come in my contact recently to be observant, and get themselves tested. — Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 21, 2021 -
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్
-
టీకా తీసుకున్నా.. ప్రముఖ నటికి కరోనా
కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. మరోసారి మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పటికి మహమ్మారి దాని ప్రతాపం చూపుతూ నిపుణులను, శాస్త్రవేత్తలను వెక్కిరిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి దరి చేరదని.. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ పలు ఆరోగ్య సంస్థలు, సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు టీకా తీసుకున్న వారు కరోనా పాజిటివ్‌గా రావడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మా సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఏప్రిల్ 2వ తేదీన కరోనా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ఆమె కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. కాగా నగ్మా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా రాణించిన విషయం తెలిసిందే. Had taken my 1st dose of Vaccine a few days ago tested for Covid-19 yest, my test has come ‘Positive’ so Quarantined myself at home. All Please take care and take al necessary precautions even after taking the 1st dose of Vaccine do not get complacent in anyway manner #staysafe ! — Nagma (@nagma_morarji) April 7, 2021 చదవండి: కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ప్రధాని మోదీ కరోనా విలయం: సోనూసూద్ అతిపెద్ద టీకా డ్రైవ్ -
పొద్దున సమీక్ష.. మధ్యాహ్నం పాజిటివ్: సీఎస్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ప్రకటించారు. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్ తేలిందని తెలిపారు. కొంత అస్వస్థతకు గురి కాగా పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే కరోనా లక్షణాలు ఎలాంటివి లేవని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనను ఇటీవల కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని.. పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ ప్రకటన రాకముందు మంగళవారం సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. సీఎస్‌కు కరోనా సోకడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు రెండు వేలకు చేరువగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. చదవండి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్ -
మరో బాలీవుడ్ హీరోకి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్ను లో వణుకు పుట్టిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజటివ్‌గా తేలిందని ఆదివారం ఉదయం తన ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. "ఈ ఉదయం, నేను కోవిడ్ -19 పాజిటివ్ అని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. త్వరగా మీ ముందుకు వస్తాను అంటూ ట్వీట్ చేశారు. ( చదవండి: హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్ ) -
కరుణానిధి కుమార్తెకు కరోనా.. ఆందోళనలో డీఎంకే
చెన్నె: స్టార్ క్యాంపెయినర్‌గా ఉండడం.. అధికారంలోకి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో మునిగారు. రోజు భారీ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఆమెకు తాజాగా కరోనా వైరస్ సోకింది. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలింది. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి. ఆమె తూత్తుకుడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సోదరుడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తి మేర కష్టపడుతున్నారు. ఈ క్రమంలో విస్తృత పర్యటనలు చేయడం.. ప్రజలను కలవడం చేయడంతో ఆమెకు కరోనా సోకింది. పాజిటివ్ తేలిన వెంటనే ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే ఆమె చెన్నెలోని అపోలో ఆస్పత్రి చేరినట్లు తెలుస్తోంది. ఆమెకు కరోనా సోకిన విషయం తెలియగానే ఆమె సోదరుడు స్టాలిన్ ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారానికి దూరం ఉండనున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కనిమొళి కరోనా సోకడంతో డీఎంకే ఆందోళనలో పడింది. చదవండి: ప్రసంగం ఆపి వైద్యులను పంపిన ప్రధాని -
కరోనా ఉన్నా.. మీడియా టీంతో ఇమ్రాన్ భేటీ
ఇస్లామాబాద్: కరోనా వైరస్ బారిన పడిన తరువాత కూడా తన మీడియా టీమ్‌తో వ్యక్తిగతంగా సమావేశం నిర్వహించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్‌కు కరోనా సోకినట్లుగా గత శనివారం నిర్ధారణ అయింది. కొన్ని రోజుల ముందే ఇమ్రాన్ చైనాకు చెందిన సైనోఫార్మ్ టీకాను తీసుకున్నారు. కరోనా సోకిన తరువాత క్వారంటైన్లో ఉండకుండా, సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. కరోనా నిబంధనలను ప్రధానే ఉల్లంఘించడం దారుణ మన్నారు. దేశంలో థర్డ్ వేవ్ నడుస్తున్న సమయ ంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధాని, ఆయనతో సమావేశంలో పాల్గొన్న మీడియా టీమ్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత సమావేశ వీడియోను సమాచార ప్రసార మంత్రి షిబ్లి ఫరాజ్, ఎంపీ ఫైజల్ జావేద్‌లే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ట్రాక్ సూట్లో ఉన్న ఇమ్రాన్ కొద్ది దూరంలో కూర్చుని ఉన్న ఫరాజ్, జావేద్‌లతో పాటు తన మీడియా టీమ్‌తో మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. (చదవండి: భారత్–బంగ్లా బంధాన్ని విడగొట్టలేరు) -
కరోనా విజృంభణ: ముఖ్యమంత్రి తనయుడికి పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో పాటు ఈ ప్రముఖులు కూడా ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజా శివసేన పార్టీ యువ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తనయుడు మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ‘కొన్ని లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. నన్ను ఎవరైనా కలిసిన వారు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి’ అని ఆదిత్య ఠాక్రే ట్విటర్లో పోస్టు చేశాడు. కాగా మహారాష్ట్రలో కొన్ని రోజులుగా దాదాపు రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో సంపూర్ణ, పాక్షిక లాక్డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. On having mild symptoms of COVID, I had myself tested and I am COVID positive. I request everyone who came in contact with me to get themselves tested. I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe — Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021 -
విమానం టేకాఫ్‌కు ముందు షాకిచ్చిన ప్యాసింజర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన మధ్య ఒక విమాన ప్రయాణికుడి నిర్లక్ష్య వైఖరి కలకలం రేపింది. విమానం మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకుంటుందనగా తనకు కరోనా పాజిటివ్ అంటూ ప్రయాణికుడు బాంబు పేల్చాడు. దీంతో హతాశులైన విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని నిలిపి వేసి, అధికారులకు సమాచారమిచ్చారు. ఢిల్లీ నుండి పూణే బయలుదేరిన ఇండిగో 6ఇ -286 విమానంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విమానం గాల్లోకి ఎగిరేందుకు (టేకాఫ్)సిద్ధమవుతుండగా తనకు కరోనా పాజిటివ్ అని చెప్పడంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి, పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌కు పరిస్థితిని వివరించారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన సదరు ప్రయాణికుడిని అంబులెన్స్ ద్వారా దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్‌కు తరలించారు అధికారులు. ఆ తరువాత ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించి, ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం మొత్తం శానిటైజ్ చేసిన తరువాత సుమారు గంటన్నర ఆలస్యంగా విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. అలాగే ప్రయాణీకులందర్నీ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా సూచించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. కాగా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయాన రంగం ఒకటి. గత ఏడాది మార్చి నుంచి జాతీయ,అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ప్రత్యేక నిబంధనలతో దేశీయంగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనాయి. కానీ అంతర్జాతీయంగా మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ వాణిజ్య విమానాల నిషేధాన్ని డీజీసీఏ మార్చి 31, 2021 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
సెంట్రల్ జైలులో కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియతో కరోనా మహమ్మారినుంచి దేశం కోలుకుంటున్న తరుణంలో నాగపూర్ సెంట్రల్ జైలులో మరోసారి కరోనా కలకలం రేగింది. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. సాయిబాబాకు శుక్రవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందనీ, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం తీసుకువెళ్ల నున్నామని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్ కుమార్ కుమ్రే తెలిపారు. అలాగే చికిత్స కోసం ఆయనను ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ఆసుపత్రికి తరలించాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో 90 శాతం అంగవైకల్యం, ఇప్పటికే జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఆరోగ్యంపై తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది. ఇదే జైల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీతోపాటు మరో అయిదుగురికి ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాకు నాగపూర్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా శిక్షపడింది. దీంతో 2017 మార్చి నుంచి సాయిబాబా నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వికలాంగుడైన సాయిబాబాను మానవతా దృక్ఫథంతో విడిచిపెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
శశికళకు కరోనా
సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి మార్చారు. ‘‘ప్రస్తుతం ఆమెకు కోవిడ్ 19 సోకింది. ఇతర ఏ అనారోగ్యాలు లేవు. ఆమె ఆక్సిజన్ స్థాయిలు 98 శాతంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది’’అని ఆస్పత్రి సూపరిండెంట్ రమేశ్ కృష్ణ చెప్పారు. ఆమెను మరో వారం పదిరోజుల అనంతరమే డిశ్చార్జ్ చేయవచ్చన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో బాధపడుతున్న శశికళను బుధవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు అధికారులు బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కావాల్సిఉంది. శశికళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కుట్ర జరుగుతోందని అన్నా ద్రవిడర్ కళగం ప్రధాన కార్యదర్శి, ఆమె సోదరుడు దివాకరన్ ఆరోపించారు. తమిళనాడు మన్నార్‌కుడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈమేరకు కర్ణాటక రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. -
కరోనా ఆడుకుంది!
గత సీజన్‌ను కరోనా ముంచేసింది. ఈ సీజన్‌నూ వెంటాడుతోంది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్ సింధు మ్యాచ్ ప్రాక్టీస్ లేక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సాయిప్రణీత్ కూడా ఆమెలాగే ఓడిపోయాడు. ఆట ఫలితాలు ఇలావుంటే మహమ్మారి ఫలితాలు మరో రకంగా ఆడుకున్నాయి. అగ్రశ్రేణి షట్లర్ సైనా, ప్రణయ్‌లను కోవిడ్ టెస్టులు కలవరపెట్టాయి. తీరా యాంటీబాడీ టెస్టులతో అవి గత అవశేషాలనీ తేలడంతో ఊపిరి పీల్చుకున్నారంతా! మరో భారత టాప్‌స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు చేసిన కరోనా టెస్టులైతే రక్తం చిందించేలా చేశాయి. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ సీజన్ పరేషాన్‌తో ప్రారంభమైంది. బ్యాంకాక్: ఆటకు ముందు నలుగురు ఆటగాళ్లకు నిర్వహించిన కోవిడ్ పీసీఆర్ పరీక్షల్లో ముగ్గురు బాధితులని రిపోర్టుల్లో వచ్చింది. ఆ ముగ్గురిలో ఇద్దరు మనవాళ్లే కావడంతో భారత జట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైనా నెహ్వాల్, ప్రణయ్ కరోనా బారినపడ్డారని ప్రకటించారు. దీంతో నిర్వాహకులు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకునే పనిలో భారత కోచ్ సహా అధికార వర్గాలను కోర్టు లోపలికి అనుమతించలేదు. బృంద సభ్యులు పాజిటివ్ కావడంతో అందులోని వారు మ్యాచ్ చూసేందుకు వస్తే మిగతావారికి సోకే ప్రమాదముందని భారత కోచ్, మేనేజర్లను హోటల్ గదులకే పరిమితం చేశారు. తదనంతరం నిర్వాహకులు సైనా, ప్రణయ్‌లతో పాటు మరో బాధితుడు జోన్స్ రాల్ఫి జాన్సన్ (జర్మనీ ప్లేయర్)లకు యాంటిబాడీ ఐజీజీ పరీక్షలు చేయించారు. ఆశ్చర్యకరంగా భారత ఆటగాళ్లిద్దరికీ పాజిటివ్ ఫలితాలొచ్చాయి. అంటే సైనా, ప్రణయ్‌లకు గతంలో ఎప్పుడో వచ్చివుం టుందని, అవి గతం తాలూకు అవశేషాలని గుర్తించింది. దీంతో వీరిద్దరికి ప్రస్తుతం వైరస్ సమస్య లేదని నిర్దారించుకున్న ఆర్గనైజింగ్ కమిటీ సైనా, ప్రణయ్‌లను ఆడేందుకు అనుమతించింది. వీళ్లతో మిగతావారికి ఎలాంటి ముప్పులేదని ప్రకటించింది. జర్మనీ ప్లేయర్ జాన్సన్‌కు యాంటిబాడీ ఐజీజీ టెస్టుల్లో ఇలాగే పాజిటివ్ రావడంతో అతడినీ ఆడేందుకు అనుమతించిన నిర్వాహకులు... హాతెమ్ ఎల్గమల్ (ఈజిప్ట్)కు నెగెటివ్ రావడంతో అతన్ని తాజా కరోనా బాధితుడిగా టోర్నీ నుంచి తప్పించింది. -
ఐటీ మెరుపులు..!
భారత ఐటీ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (క్యూ3) ఫలితాలు అంచనాలను మించుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్యూ3 ఫలితాలు ఇవే కావచ్చని వారంటున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. అయితే ఈసారి మాత్రం ఐటీ కంపెనీలు క్యూ3 ఫలితాల్లో దుమ్ము రేపుతాయని, కంపెనీల ఆదాయం జోరుగానే వృద్ధి చెందగల అవకాశాలున్నాయంటున్న విశ్లేషకుల అభిప్రాయాలపై - సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ..... ‘క్యూ3’ సీజన్ వస్తోంది... ఐటీ కంపెనీలకు క్యూ3 సీజన్ బలహీనమైనది. ఈ సీజన్లో సెలవులు అధికంగా ఉంటాయి. అవుట్‌సోర్సింగ్‌పై కంపెనీలు స్వల్పంగానే ఖర్చు చేస్తాయి. ఫలితంగా ఐటీ కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. కరోనా కల్లోలాన్ని తట్టుకోవడానికి డిమాండ్‌ను పెంచుకోవడానికి వివిధ రంగాల కంపెనీలు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాయి. ఇది ఐటీ కంపెనీలకు కలసివచ్చింది. గత ఏడాది చివరి ఆర్నెళ్లలో వివిధ కంపెనీలు ఐటీ సేవల కోసం భారీగానే వ్యయం చేశాయి. ఐటీకి సంబంధించిన భారీ డీల్స్ బాగా పెరగడం, ఎన్నడూ లేనంత స్థాయిల్లో కంపెనీల ఆర్డర్ల బుక్‌లు కళకళలాడుతుండటం, డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు డిమాండ్ బాగా పెరుగుతుండటం, కరోనా కారణంగా కుదేలైన రిటైల్, రవాణా తదితర రంగాలు కోలుకుంటుండటం, అధిక శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తుండటంతో వ్యయాలు తగ్గడం, పర్యాటక, మార్కెటింగ్ సంబంధిత వ్యయాలు కూడా తగ్గడం... ఈ కారణాలన్నింటి వల్ల ఈసారి క్యూ3 ఫలితాలు దుమ్ము రేపనున్నాయి. వేతన పెంపు తప్ప మరే ఇతర ఒత్తిడులు మార్జిన్లపై ప్రభావం చూపవని నిపుణులు భావిస్తున్నారు. గైడెన్స్ (భవిష్యత్తు అంచనాలు) కూడా బాగా ఉంటాయని బ్రోకరేజ్ సంస్థలు ఆశిస్తున్నాయి. మధ్య స్థాయి కంపెనీలదీ అదే దారి...: దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఇన్పోటెక్‌లు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయని అంచనాలున్నాయి. ఫలితాల సందర్భంగా కంపెనీలు వెల్లడించే విషయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీల్స్‌కు సంబంధించిన వివరాలు, కంపెనీలు అనుసరిస్తున్న కొత్త వ్యూహాలపై పురోగతి, ఇటీవల టేకోవర్ చేసిన సంస్థల ప్రభావం, వీటికి సంబంధించి యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. భారీ డీల్స్...: ఈ క్యూ3లో ఇన్ఫోసిస్ కంపెనీ 320 కోట్ల డాలర్ల భారీ ఒప్పందాన్ని దైమ్లర్ కంపెనీతో కుదుర్చుకుంది. ఇక టీసీఎస్ కంపెనీ డాషే బ్యాంక్, ప్రుడెన్షియల్ సంస్థల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఇక విప్రో కంపెనీ జర్మనీ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 100 కోట్ల డాలర్ల డీల్ కుదుర్చుకుంది. ఈఆన్, మారెల్లీ తదితర దిగ్గజాల నుంచి భారీ డీల్స్‌ను సాధించింది. ఎనలిస్టుల అంచనాలు ఈ నెల 8న టీసీఎస్ ఫలితాలు: టీసీఎస్ ఈ నెల 8న క్యూ3 ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ నెల 13న ఇన్ఫోసిస్, విప్రోలు ఫలితాలను ప్రకటించనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ఈ నెల 15న వస్తాయి. ఇటీవలి ఐటీ షేర్లు జోరుగా పెరిగాయి. ఫలితాలపై భారీ అంచనాలతో చాలా ఐటీ షేర్లు మంగళవారం ఆల్‌టైమ్ హైలను తాకాయి.టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈ కంపెనీల ఆదాయాలు సీక్వెన్షియల్‌గా 2-3శాతం మేర పెరగగలవనేది విశ్లేషకుల అంచనా. 2021-22 ఆదాయ అంచనాలను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారంటున్నారు. టీసీఎస్: ఆదాయ వృద్ధి సీక్వెన్షియల్‌గా 2-3 శాతం ఉండొచ్చు. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు పెంచినందున నిర్వహణ లాభం ఒకింత తగ్గవచ్చు. నికర లాభం కూడా 1-1.2 శాతం మేర తగ్గవచ్చు. ఇన్ఫోసిస్: ఆదాయం 3 శాతం మేర పెరుగుతుంది. నిర్వహణ లాభం ఫ్లాట్‌గా ఉండొచ్చు. లేదా ఒకింత తగ్గవచ్చు. అయితే నికర లాభం 15శాతం పెరిగే అవకాశాలున్నాయి. కరోనా వల్ల పొదుపు చర్యలు పెరగడం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, రూపాయి క్షీణత... ప్రధాన కారణాలు. విప్రో: ఈ కంపెనీ నిర్వహణ లాభం నిలకడగా ఉండొచ్చు. లేదా స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఆదాయం (సీక్వెన్షియల్‌గా)2-3 శాతం రేంజ్లో పెరగవచ్చు. ' -
అంత్యక్రియలకు వచ్చి కరోనా బారిన..
సాక్షి, సూర్యాపేట: ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లి ఏకంగా 28 మంది కరోనా బారిన పడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఈ ఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. సూర్యాపేటలోని యాదాద్రి టౌన్షిప్లో నివాసముంటున్న ఓ వ్యక్తి (63) అనారోగ్యంతో గత నెల 24న మృతిచెందారు. ఆయన అంత్యక్రియలకు టౌన్షిప్లో ఉంటున్న కుటుంబసభ్యులతోపాటు మోతె, హైదరాబాద్, నల్లగొండ, యర్కా రం గ్రామాలకు చెందిన బంధువులు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం కొంత మంది తమ ఇళ్లకు వెళ్లిపోగా.. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు మాత్రం కర్మకాండలు ముగిసే వరకు అక్కడ రెండిళ్లలో ఉండిపోయా రు. ఈ క్రమంలో క్షయ వ్యాధి ఉన్న సమీప బంధువు ఒకరు అలసటకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో తనతోపాటు అంత్యక్రియల్లో పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రెండిళ్లలో ఉంటున్న 35 మంది జనరల్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా 22 మందికి పాజిటివ్ అని తేలింది. చిన్న కర్మ కాండలకు వచ్చి ఇళ్లకు వెళ్లిపోయిన మరికొంతమంది తమ స్వస్థలాల్లో పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డిసెంబర్ 31నే తేలింది.. వీరందరికీ డిసెంబర్ 31నే పాజిటివ్ అని తేలినా సమాచారం ఎక్కడా బయటకు రాలేదు. గురువారం నుంచి అంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలనీకి చెందిన ఓ పార్టీ నేత రెండు కుటుంబాలకు పాజిటివ్ వచ్చిందని, ఆ ప్రాంతంలో శానిటైజేషన్ చేయించాలని మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. ఒకేసారి ఇంత మందికి కరోనా రావడంతో మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన అక్కడ శానిటైజేషన్ చేయించారు. అనంతరం ఈ విషయాన్ని వైద్యాధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఇంటిని సర్వే చేసి..ఎవరికైనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో సామాజిక వ్యాప్తి లేదు.. యాదాద్రి టౌన్షిప్లో 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడు మందులు అందించడంతోపాటు తగు జాగ్రత్తలు చెబుతున్నారు. అంత్యక్రియలు, చిన్నకర్మ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఒకేచోట ఎక్కువ మంది చేరడంతో వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తించాం. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. జిల్లాలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదు. – డాక్టర్ కర్పూరం హర్షవర్ధన్, జిల్లా వైద్యాధికారి -
ఆరుగురికి ‘యూకే’ వైరస్
న్యూఢిల్లీ: యూకేలో బయటపడి యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్‌లో కనిపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వీరికి కరోనా కొత్త స్ట్రెయిన్ పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ముగ్గురి శాంపిల్స్‌ను బెంగళూరు నిమ్హాన్స్లో, ఇద్దరివి హైదరాబాద్ సీసీఎంబీలో, ఒకరిది పుణెలోని ఎన్ఐవీలో పరీక్షించగా, అన్నింటిలో యూకే వేరియంట్ జీనోమ్ కలిగిన కరోనా రకం సార్స్– సీఓవీ–2 కనిపించినట్లు వివరించింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో భారత్‌కు యూకే నుంచి వచ్చే విమానాలన్నింటినీ ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 31 వరకు నిషేధించింది. విదేశీయాత్రికులకు జీనోమ్ సీక్వెన్సింగ్ డిసెంబరు 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వారందరికీ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించనుంది. కరోనా నెగెటివ్ వచ్చిన వారిని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం పరీక్షించి, రాష్ట్ర, జిల్లా నిఘా అధికారుల పర్యవేక్షణలో ఉంచుతారని తెలిపింది. యూకే స్ట్రెయిన్ సహా కొత్తరకం వైరస్‌లను గుర్తించేందుకు చర్యలు చేపట్టాము. జీనోమ్ పరీక్షల కోసం 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. దేశంలోకి కొత్త వేరియంట్ రాకముందే దాదాపు 5వేల జీనోమ్ పరీక్షలు చేశాం. ఈ సంఖ్యను క్రమంగా పెంచుతాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్యలో యూకే నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు 33వేల మంది వచ్చారని కేంద్రం తెలిపింది. వీరిందరినీ ఆయా రాష్ట్రాలు ట్రేస్ చేసి పీసీఆర్ పరీక్షలు నిర్వహించాయని, వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని తెలిపింది. వైరస్ కొత్త రకంపైనా వ్యాక్సిన్ల ప్రభావం కోవిడ్–19 వ్యాక్సిన్లు కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం లేదనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే), దక్షిణాఫ్రికాల నుంచి ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని వెల్లడించింది. యూకే విమానాలపై నిషేధం కొనసాగింపు? యునైటెడ్ కింగ్డమ్, భారత్ మధ్య విమానాల రాకపోకలపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించే అవకాశం ఉందని విమానయాన మంత్రి హర్దీప్ చెప్పారు. త్వరలో దీనిపై స్పష్టతనిస్తామన్నారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణ తదుపరి రౌండ్‌ను 2021లో ఆరంభించవచ్చని ఏఏఐ చైర్మన్ అర్వింద్ సింగ్ చెప్పారు. -
వరుణ్ తేజ్‌కు కరోనా.. మెగా కుటుంబంలో టెన్షన్!
మెగా ఫ్యామిలీలో మరొకరికి కరోనా సోకింది. ఈ రోజు ఉదయమే తాను కరోనా బారినపడినట్లు రామ్‌చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్ట్ చేసుకోవాలని కోరారు. అయితే చరణ్ అనంతరం ప్రస్తుతం మరో మెగా హీరోకు కరోనా బారిన పడ్డారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. చదవండి: రామ్ చరణ్‌కి కరోనా పాజిటివ్ ‘ఈ రోజు ఉదయం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్దిగా లక్షణాలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో క్వారంటైన్లో ఉన్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని’. అని ఓ నోట్ విడుదల చేశారు. మెగా హీరోలిద్దరూ కరోనా సోకడంతో అభిమానులు #Get Well Soon అనే హ్యష్‌ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా నాలుగు రోజుల క్రితమే వరుణ్‌తేజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్ జరుపుకున్నారు. ఇప్పుడు వీరంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చరణ్, వరుణ్‌కు పాజిటివ్‌గా తేలడంతో మెగా కుటుంబంలో టెన్షన్ మొదలైంది. చదవండి: బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్.. pic.twitter.com/V7OHOsoQa5 — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020 -
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు కరోనా
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మాక్రాన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా తేలిందని అధ్యక్ష భవనం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్ధారణ కాగానే మాక్రాన్ ఏడు రోజుల సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. క్వారంటైన్లో ఉంటూనే ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.ఇటీవల మాక్రాన్ చాలా మంది ప్రపంచ నేతల్ని కలుసుకున్నారు. ఈయూ సదస్సుకు సైతం హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో అధ్యక్షుడిని కలుసుకున్న వారంతా క్వారంటైన్లోకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధ్యక్ష భవనం ప్రతినిధులు సూచించారు. ఇటీవల ఫ్రాన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఆరువారాల పాటు లాక్డౌన్ కూడా విధించారు. ఈ నెల 27 నుంచి ఫ్రాన్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ తర కరోనా బారిన పడి కోలుకున్నారు. -
ఈ కష్టాన్ని దాటేస్తా!
‘‘కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను. గృహనిర్భందంలో ఉంటున్నాను’’ అన్నారు కృతీ సనన్. ఇటీవల ఓ హిందీ చిత్రం షూటింగ్ ముగించుకుని చండీగఢ్ నుంచి ముంబై చేరుకున్నాక కృతీ సనన్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ అనే వార్త వచ్చినప్పటికీ మొదట ఆమె స్పందించలేదు. అయితే, కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని బుధవారం సోషల్ మీడియా ద్వారా ఆమె స్పష్టం చేశారు. ‘‘ఈ కష్టాన్ని దాటేస్తాను. బాగా విశ్రాంతి తీసుకుని, త్వరలో మళ్లీ నా పనులు మొదలుపెడతాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ మహమ్మారి (కరోనా) ఇంకా మనతోనే ఉంది’’ అన్నారు కృతీ సనన్. -
కరోనా బారిన కశ్యప్...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. కశ్యప్‌తోపాటు భారత ఇతర షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్, ప్రణవ్ చోప్రాలకు కూడా కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ‘ఈ నలుగురు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఈ నలుగురిలో ఒకరికి కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. కశ్యప్, గురుసాయిదత్, ప్రణవ్, ప్రణయ్‌లకు పాజిటివ్ రాగా... కశ్యప్ భార్య, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు నెగెటివ్ వచ్చింది. కొన్నిసార్లు తొలి పరీక్షలో ఫాల్స్ పాజిటివ్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దాంతో కొన్ని రోజులు వేచి చూశాక మళ్లీ పరీక్షకు హాజరు కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. సోమవారం వీరందరూ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటారు’ అని పుల్లెల గోపీచంద్ అకాడమీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 25న వివాహం చేసుకున్న గురుసాయిదత్ ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోగా... మిగతా ఆటగాళ్లు గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. -
వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్
చండీగఢ్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఒక వలంటీర్‌గా తీసుకున్న హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నవంబర్ 20న ప్రయోగాత్మకంగా టీకా తొలి డోసు తీసుకున్న ఆయనకు రెండు వారాలు తిరిగిందో లేదో వైరస్ సోకినట్టు తేలింది. 67 ఏళ్ల వయసున్న విజ్ తనకు కరోనా సోకిన విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంబాలా కాంట్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని విజ్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం పానిపట్ వెళ్లిన విజ్ అక్కడ బీజేపీ నాయకుడిని కలుసుకున్నారు. అతనికి తర్వాత కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని విజ్ తొలుత పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఆ మర్నాడు కాస్త లక్షణాలు కనిపించడంతో మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజులయ్యాకే యాంటీ బాడీలు విజ్‌కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకోవాలని, మంత్రికి ఇంకా ఒక్క డోసు మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది. కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వైరస్ నుంచి తట్టుకునే యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందుతాయి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. అది తీసుకున్న 14 రోజుల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అంటే మొత్తంగా వ్యాక్సిన్ పని చేయడానికి 42 రోజులు పడుతుంది. ఈ మధ్యలో కోవిడ్ నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి విజ్ కూడా చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కాస్త జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలిపారు. -
అమ్మో అడిలైడ్!
సిడ్నీ: భారత్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు కొత్త సమస్య వచ్చి పడింది. తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన అడిలైడ్‌లో సోమవారం ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఆదివారం వరకు 4 కేసులు ఉన్న అడిలైడ్‌లో సోమవారం 17 కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ నగరం ఉండే సౌత్ ఆస్ట్రేలియాతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తమ సరిహద్దులు మూసివేస్తున్నట్లు పక్క రాష్ట్రాలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీ, టాస్మేనియా, క్వీన్స్లాండ్ ప్రకటించాయి. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా కచ్చితంగా 14 రోజుల హోటల్ క్వారంటైన్‌కు వెళ్లేలా ఆదేశాలు జారీ చేశాయి. అయితే డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టు (డే–నైట్)కు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించింది. అప్పటిలోగా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తొలి టెస్టుకు స్టేడియంలో సగం మంది ప్రేక్షకులను అనుమతించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే పరిస్థితి మారకపోతే మాత్రం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగవచ్చు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాలని సీఏ భావిస్తోంది. కరోనా సమస్య లేని సిడ్నీకి (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం) అందరినీ తీసుకెళితే అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనేది సీఏ ఆలోచన. ప్రస్తుతం భారత జట్టు సిడ్నీలోనే ఉంది. -
బ్రిటన్ ప్రధానికి మళ్లీ కరోనా
లండన్: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సభ్యుడు ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకూ వైరస్ సోకినట్లు తేలిందని బ్రిటన్ ప్రధాని అధికార నివాస వర్గాలు సోమవారం తెలిపాయి. అధికారుల సూచనలను అనుసరించి ప్రధాని నవంబర్ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని, కరోనా వైరస్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తారని వివరించారు. బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన పడినప్పటికీ లక్షణాలేవీ కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్ ప్రధాని తొలిసారి కోవిడ్–19 బారిన పడటమే కాకుండా.. పరిస్థితి తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కోవిడ్–19 నియంత్రణకు జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సెన్ తయారు చేసిన టీకా తుది పరీక్షలకు రంగం సిద్ధమైంది. యూకే మొత్తమ్మీద 6వేల మందికి ఈ టీకా ఇచ్చి 12 నెలలపాటు పరీక్షించనుంది. దశలవారీగా ఈ టీకా పరీక్షల కోసం ఆరు దేశాల నుంచి సుమారు 30 వేల మందిని ఎంపిక చేస్తామంది. -
పాజిటివ్... కానీ లక్షణాలు లేవు
కరోనా మహమ్మారి ఇంకా తన పంజా విసురుతోంది. ఇప్పటికే సినిమా రంగానికి చెందిన పలువురు కరోనా బారిన పడి కోలుకోగా, మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా హీరో చిరంజీవి కరోనా బారిన పడ్డారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించనున్న ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి జాయిన్ కావాల్సి ఉంది. షూటింగ్లో పాల్గొనబోతున్న సందర్భంగా ముందస్తుగా చేయించుకున్న కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ‘‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత నాలుగైదు రోజుల్లో నన్ను కలిసినవారందరూ కూడా కోవిట్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. -
ట్రంప్‌కు మరో తలనొప్పి!!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. మరోవైపు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదు కావడం వణికిస్తోంది. తాజాగా వైట్ హౌస్ చీఫ్, నార్త్ కరోలినా మాజీ శాసనసభ్యుడు మార్క్ మెడోస్ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణాంతకమైన వైరస్ సోకిందని మెడోస్ తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో వైట్ హౌస్, మెడోస్ కార్యాలయం నుండి అధికారికగా స్పందించాల్సి ఉంది. (‘‘చిల్ డొనాల్డ్ చిల్’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్) డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందంలో మరో ముఖ్యుడు నిక్ ట్రైనర్‌కు కూడా కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ అయినట్టుగా తెలుస్తోందని రాయిటర్స్ నివేదించింది. ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లోనూ ట్రంప్‌తో కలిసి వీరు పాల్గొన్నారు. అంతేకాదు పలువురు ట్రంప్ ముఖ్య అనుచరుల పాల్గొన్న ఎన్నికల రాత్రి వైట్‌హౌస్ పార్టీలో కూడా మెడోస్ పాల్గొన్నారని రాయిటర్స్ తెలిపింది. ఎన్నికల అనంతరం తనదే విజయమంటూ ట్రంప్ ప్రకటించిన సమావేశానికి మాస్క్ లేకుండా మెడోస్ హాజరయ్యారు. దీంతో ఒకవైపు అందనంత దూరం పోతున్న అధికార పీఠం, మరోవైపు తన ప్రధాన సలహాదారులకు వైరస్ సోకడం ట్రంప్‌కు తలనొప్పిగా పరిణమించింది.(వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోతున్న ట్రంప్..?!) కాగా డొనాల్డ్ ట్రంప్ అతని భార్య మెలానియా, కుమారుడు బారన్ కూడా అక్టోబరులో వైరస్ బారినసంగతి తెలిసిందే. ట్రంప్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అలాగే ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ కూడా వైరస్ బారిన పడ్డారు. ట్రంప్‌తో ర్యాలీలో పాల్గొన్న అనంతరం కరోనా బారిన పడిన మరో సన్నిహితుడు మాజీ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి హర్మన్ కేన్ చనిపోయారు. అమెరికాలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 9.82 మిలియన్లను దాటేసింది. మరణాల సంఖ్య 2 లక్షల 36వేలకు చేరుకుంది. -
భారత షట్లర్లకు కరోనా కష్టాలు!
సార్‌బ్రుకెన్ (జర్మనీ): కోవిడ్–19 కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ ప్రారంభమైన సార్లార్ లక్స్ ఓపెన్ సూపర్–100 టోర్నీనుంచి మన షట్లర్లు అజయ్ జయరాం, శుభాంకర్ డే అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారమే మరో ఆటగాడు లక్ష్య సేన్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. కరోనా భయమే దీనికంతటికీ కారణం. వివరాల్లోకెళితే... ఆటగాళ్లతో పాటు కోచ్ హోదాలో టోర్నీకి వచ్చిన లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ బుధవారం కరోనా ‘పాజిటివ్’గా తేలారు. దాంతో ఆయనతో కలిసి ఉన్న లక్ష్య సేన్ టోర్నీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే సేన్‌తో కలిసి సాధన చేసిన, ప్రయాణించిన జయరామ్, శుభాంకర్ కూడా తప్పుకోవాలని టోర్నీ నిర్వాహకులు సూచించారు. ఈ విషయాన్ని ‘బీడబ్ల్యూఎఫ్’ కూడా ప్రకటించింది. దాంతో వీరిద్దరు కూడా నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం కనీసం 10 నవంబర్ వరకు ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పిన నిర్వాహకులు అందుకు తగినట్లుగా కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎక్కడ ఉండాలో, అన్ని రోజులు ఖర్చులు ఎలా భరించాలనే విషయంపై కూడా స్పష్టతనివ్వకుండా వారి మానాన వారిని వదిలేశారు. నిజానికి వీరిద్దరికి ఎలాంటి లక్షణాలు లేవు. జర్మనీ రావడానికి ముందే చేయించుకున్న పరీక్షల ‘నెగెటివ్’ రిపోర్టులు కూడా ఉన్నాయి. డీకే సేన్ రిపోర్టు వచ్చే సమయానికి జయరామ్ ఒక మ్యాచ్ కూడా ఆడేశాడు. ఈ విషయంలో టోర్నీ ఆరంభంలో సరైన కోవిడ్–19 నిబంధనలు పాటించని నిర్వాహకులతో పాటు పరీక్షలు చేయించుకోకుండా వచ్చిన లక్ష్యసేన్ తప్పు కొంత వరకు ఉండగా... వీరిద్దరు కూడా బాధితులయ్యారు. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన జయరామ్ తన బాధను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎట్టకేలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) దీనిపై స్పందించింది. వారి భోజన, వసతి ఖర్చులను తాము భరించనున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఊరట పొందిన జయరామ్...సాధ్యమైనంత తర్వాత స్వదేశం తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
కేంద్రమంత్రి అథవాలేకు కరోనా, ఆసుపత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మయూర్ బోర్కర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.అటు అథవాలే కూడా తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా ప్రకారం తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అలాగే తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జాగ్రత్త తీసుకోండి, సురక్షితంగా ఉండండని పేర్కొన్నారు. (నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఇన్నింగ్స్) మరోవైపు పాయల్ ఘోష్ పార్టీలో చేరిన సందర్భంగా అథవాలే సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పాయల్ ఘోష్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆమెను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో అథవాలే, పాయల్ ఘోష్ ఫేస్ మాస్క్ వేసుకున్నప్పటికీ దాన్ని ముక్కుమీద నుంచి తొలగించి మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు. వేదికపై ఉన్నవారు కూడా దాదాపు ఇలానే ఉండటం గమనార్హం. తాజాగా అథవాలే కరోనా బారిన పడటంతో సమావేశానికి హాజరైన వారిలో ఆందోళన మొదలైంది. కాగా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఫిబ్రవరి 20న ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద చైనా కాన్సుల్ జనరల్ టాంగ్ గ్యుకోయి, కొద్దిమంది బౌద్ధ సన్యాసులతో కలిసి ‘గో కరోనా గో’ అంటూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. I have tested #COVID19 positive and as per advise of Doctors I have been hospitalised for few days. Those who have been come in contact with me are advised to get COVID-19 tests done. Take Care & Stay Safe — Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 27, 2020 अभिनेत्री पायल घोष का आरपीआय मे स्वागत है। @iampayalghosh आपके साथसे आरपीआय की महिला आघाडी और मजबूत करेंगे! महिलाओंको न्याय दिलाने की लढाई मजबुतीसे लढेंगे!डॉ बाबासाहेब आंबेडकरजीके संविधान का समतावादी भारत साकार करेंगे! pic.twitter.com/xvt1EksnIl — Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 26, 2020 -
35 దేశాల్లో భారత్‌కు ఆరో స్థానం
లండన్: మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. వారి కృషికి గుర్తింపు ఇవ్వడంతో, గౌరవించడంలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్ గత వారం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా ఒక్కో దేశంలో వెయ్యి మందిని ప్రశ్నించారు. టీచర్లను మీరు విశ్వసిస్తున్నారా? వారు మీలో స్ఫూర్తిని నింపుతున్నారా? మీ టీచర్లు ప్రజ్ఞావంతులా? తదితర ప్రశ్నలు సంధించారు. టీచర్లకు గుర్తింపు ఇవ్వడంలో చైనా, ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారత్ దేశాలు తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యత అని వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ చెప్పారు. భారత్‌లో ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో విద్యపై 14శాతం ఖర్చు పెడుతోంది. రెండో స్థానంలో నిలిచిన ఘనాలో 22.1 శాతాన్ని విద్యపై వెచ్చిస్తున్నారు. -
ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తనకు కరోనా సోకిన నేపథ్యంలో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్ లోనే విధులు నిర్వర్తించనున్నానని చెప్పారు. నలుగురు డిప్యూటీ గవర్నర్లు బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎండి పత్రా, ఎం రాజేశ్వర్ రావు నేతృత్వంలో బలంగా ఉన్న ఆర్బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని గవర్నర్ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ కాలంలో కార్యకలాపాలను సమీక్షిస్తూ, ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలతో గవర్నర్ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. కాగా దేశంలో కరోనా విస్తరణ కాస్త తగ్గుముఖంపట్టినట్టు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాటి గణాంకాల ప్రకారం 78 లక్షలకు పైగా కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది. I have tested COVID-19 positive. Asymptomatic.Feeling very much alright.Have alerted those who came in contact in recent days.Will continue to work from isolation. Work in RBI will go on normally. I am in touch with all Dy. Govs and other officers through VC and telephone. — Shaktikanta Das (@DasShaktikanta) October 25, 2020 -
మాజీ సీఎంకు కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నాయకులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు. ‘లాక్డౌన్ నుంచి నిరంతరం పనిలో ఉన్నాను. ఇపుడిక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నాడు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. వరుసగా అగ్రనేతలకు కరోనా రావడంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన అశోక్ గస్తీ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేవేంద్ర ఫడ్నవీస్ కోవిడ్ నుంచి కోలుకోవాలని బీజేపీ అగ్ర నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. (అజిత్ పవార్‌కు కరోనా పాజిటివ్) I have been working every single day since the lockdown but now it seems that God wants me to stop for a while and take a break ! I have tested #COVID19 positive and in isolation. Taking all medication & treatment as per the advice of the doctors. — Devendra Fadnavis (@Dev_Fadnavis) October 24, 2020 -
హృతిక్ తల్లికి కరోనా
దర్శక–నిర్మాత రాకేష్ రోషన్, హీరో హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ విషయం గురించి పింకీ రోషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతీ 20 రోజులకు ఓసారి మా కుటుంబ సభ్యులందరం, అలాగే మా స్టాఫ్ అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నాం. ఇటీవల చేసిన టెస్ట్‌లో నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే నాకు ఏ లక్షణాలూ లేవు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటున్నాను. క్రమశిక్షణగా యోగా చేయడం, వ్యాయామం వల్ల మీ మీద కోవిడ్ అంత ప్రభావం చూపించలేకపోయింది అని మా డాక్టర్లు అన్నారు. ఇంకో వారంలో మళ్లీ టెస్ట్ చేయించుకుంటాను. కచ్చితంగా నెగటివ్ వస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు. -
అజిత్ పవార్‌కు కరోనా పాజిటివ్
సాక్షి,ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్సీపీ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోవిడ్-19 బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆయన గృహ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. అటు పార్టీ కార్యాలయంలో జరగాల్సిన సమావేశానికి అజిత్ పవార్ హాజరు కావడంలేదని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావ్ గార్జే బుధవారం ట్వీట్ చేశారు. అయితే దీనికి గల కారణాలను ఆయన పేర్కొనలేదు. మరోవైపు గురువారం జరగాల్సిన జనతా దర్బార్ రద్దు చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతవారం కొంతమంది సీనియర్ నాయకులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన అజిత్ పవార్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఏ ఒక్క రైతునూ కష్టాల్లో ఉండనీయం అంటూ వ్యాఖ్యానించారు. నష్టాన్ని అంచనా వేసే పనిని అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా వైరస్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర టాప్ లో ఉంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాల సంఖ్య 43 వేలను దాటింది. దేశంలో మొత్తం 77,06,946 కేసులు నమెదు కాగా మరణాలు 1,16,616 కు చేరాయి. -
కరోనా బారిన కాంగ్రెస్ సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ, తనతో సన్నిహితంగా మెలిగినవారిని అప్రమత్తం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని ట్వీట్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసుల నమోదు కాస్త తగ్గినప్పటికీ ఉధృతి కొనసాగుతోంది. వైరస్ కేసుల సంఖ్య 73 లక్షలను దాటేసిన సంగతి తెలిసిందే. I have tested positive for COVID-19. I am in home quarantine. Those who came in contact with me in last few days may kindly follow the protocol. — Ghulam Nabi Azad (@ghulamnazad) October 16, 2020 -
ట్రంప్ కుమారుడికి కరోనా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్‌కు కరోనా సోకినట్లు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెల్లడించారు. తమ దంపతులకు కరోనా సోకినప్పటినుంచి బారెన్ విడిగా ఉంటున్నాడని, అప్పటి నుంచి బారెన్‌కు తరచూ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో బారెన్‌కు పాజిటివ్ వచ్చిందని వివరించారు. అయితే కరోనా వచ్చినా, అదృష్టవశాత్తు పద్నాలుగేళ్ల బారెన్‌కు ఎలాంటి లక్షణాలు కానరాలేదని చెప్పారు. తమ ముగ్గురికీ దాదాపు ఒకే సమయంలో కరోనా సోకడంతో ఒకరికొకరం అండగా ఉండి ఈ సంక్షోభం నుంచి బయటపడ్డామన్నారు. ప్రస్తుతం తనకు నెగెటివ్ వచ్చిందన్నారు. కరోనా చికిత్స కోసం ట్రంప్‌ను మిలటరీ ఆస్పత్రికి తరలించగా, మెలానియా మాత్రం వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ఒకరకంగా తాను చాలా అదృష్టవంతురాలినని, చిన్నపాటి లక్షణాలతోనే బయటపడ్డామని మెలానియా చెప్పారు. కరోనా సమయంలో ఒళ్లునొప్పులు, దగ్గు, అలసట ఉన్నాయని, చికిత్సలో భాగంగా మరిన్ని విటమిన్లు, పౌష్టికాహారం తీసుకున్నానని తెలిపారు. తమకు చికిత్సనందించిన డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రంప్ మరో ప్రధాన సలహాదారుడుకి పాజిటివ్
వాషింగ్టన్ : అమెరికాను వణికిస్తోన్న కరోనా మహమ్మారి వైట్ హౌస్ లో ప్రకంపనలు రేపుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లెర్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ బారిన పడిన వైట్ హౌస్ సిబ్బంది సంఖ్య 10కి చేరినట్టు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ రిమోట్ గా విధులు నిర్వహిస్తున్న తనకు రోజూ నెగిటివ్ వచ్చినా, తాజాగా కరోనా నిర్ధారణ అయిందని మిల్లెర్ మంగళవారం వెల్లడించారు. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్టు పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిల్లెర్ భార్య కేటీ మిల్లర్‌కు గతంలో వైరస్ వచ్చింది. కాగా ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా నిర్ధారణైన అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు గత వారం కరోనా బారిన పడినట్టు గుర్తంచారు. ఈ మేరకు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ట్రంప్ ఈ సోమవారం సోమవారం డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ ఎనానీ, ముగ్గురు సిబ్బంది కూడా పాజిటివ్ పరీక్షించారు. అలాగే వైట్ హౌస్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు పాత్రికేయులకు కూడా వైరస్ సోకింది. దీంతో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. పీపీఈ కిట్లను ధరించడం లాంటి జాగ్రత్తలతోపాటు ట్రంప్ కుటుంబంతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్న సిబ్బందికి ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 7.53 మిలియన్లుగా ఉండగా, మరణించిన వారి సంఖ్య రెండు లక్షలను అధిగమించింది. -
తమన్నా పాజిటివ్
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై ఆర్నెళ్లు దాటినా ఇంకా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు... ఇలా తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. తాజాగా హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడ్డారు. ఆ మధ్య తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా వారు కోలుకున్నారు. తాజాగా తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిసింది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు. అధిక జ్వరంతో బాధపడుతున్న తమన్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు తెలుగు చిత్రాలున్నాయి. వాటిలో ‘గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధాధూన్’ ఉన్నాయి. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నారు తమన్నా. -
కరోనా : ట్రంప్‌నకు మరో దెబ్బ
వాషింగ్టన్ : మరో నెల రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండవ సారి కూడా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలనే ప్రయత్నాలపై మరో దెబ్బ పడింది. ఇప్పటికే ట్రంప్, ఆయన భార్య మెలానియాకు కూడా కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ట్రంప్ మిలిటరీ ఆసుపత్రిలో చేరడంతో రిపబ్లికన్ పార్టీ ప్రచార కార్యక్రమాలపై ఆందోళన నెలకొంది. తాజాగా ప్రచార నిర్వాహకుడు బిల్ స్టెపియన్ (42) కు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే ట్రంప్ ప్రధాన సలహాదారు హోప్ హిక్స్ కరోనా సోకడంతో ప్రచారంలో ఉన్న సీనియర్ సభ్యులంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో స్వల్ప జ్వరంతో బాధపడుతున్న బిల్ కు కరోనా సోకినట్టు తేలిందని అధికారులు ప్రకటించారు. తాజా పరిణామంతో స్టెపియన్ రిమోట్‌గా ప్రచార బాధ్యతలను కొనసాగిస్తారని డిప్యూటీ క్యాంపెయిన్ మేనేజర్ జస్టిన్ క్లార్క్ ప్రధాన బాధ్యతలను పర్యవేక్షిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు రిపబ్లికన్ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రోనా మక్ డేనియల్ కరోనా నిర్ధారణ అయింది. దీంతో అధ్యక్షుడి రాజకీయ యంత్రాంగంలో ఇద్దరు ప్రధాన వ్యక్తులు ప్రత్యక్ష ప్రచారంనుంచి తాత్కాలికంగా తప్పుకున్నట్టే. ట్రంప్‌కు మాజీ కౌన్సిలర్ అయిన కెల్లియాన్ కాన్వే , ఉత్తర కరోలినా రిపబ్లికన్ సెనేటర్ థామ్ టిల్లిస్ కూడా కరోనా సోకింది. మరోవైపు అధ్యక్ష పదవి బరిలో ఉన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హ్యారిస్ మాత్రం అటు ఓపీనియన్ పోల్స్ లో ఇటు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా ట్రంప్ మేరీల్యాండ్‌లోని బెథెస్డాలోని సైనిక ఆసుపత్రి వాల్టర్ రీడ్ మెడికల్ ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను బాగానే ఉన్నానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. రెమెడెసివిర్తో పాటు, కాక్టెయిల్, రెజెనెరాన్ లాంటి ప్రయోగాత్మక మందుల ద్వారా ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. Tonight I tested positive for COVID-19. My symptoms are mild (light cough) and I’m feeling fine. I have begun a quarantine process in consultation with physicians. As always, my heart is with everyone affected by this global pandemic. ❤️ — Kellyanne Conway (@KellyannePolls) October 3, 2020 -
ట్రంప్‌కు కరోనా!
విధిరాతకు చిన్నా పెద్దా, పేదా గొప్పా తారతమ్యం లేదని కరోనా మరోమారు రుజువు చేసింది. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి స్వయంగా దాని బారిన పడ్డారు. మాస్కు పెట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన పెద్దన్న చివరకు క్వారంటైన్ గూటికి చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోవిడ్ బారిన పడటం ట్రంప్‌నకు షాక్ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్‌తో డిబేట్లో పాల్గొన్న బైడెన్‌కు కూడా కరోనా వస్తుందా? ఒకవేళ వస్తే ప్రధాన అభ్యర్థులిద్దరూ క్వారంటైన్లో ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయి? నూతన అభ్యర్థులు రంగంలోకి వస్తారా? ఎన్నికలు వాయిదా పడతాయా? ఇలాంటి పలు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.. వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. తామిద్దరికీ కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, తక్షణమే ఇరువురం క్వారంటైన్ ఆరంభిస్తున్నామని ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశారు. కలిసికట్టుగా తామిద్దరం దీన్ని ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ట్రంప్‌నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నట్లు అధ్యక్షుడి ఆస్థాన వైద్యుడు సీన్ కొన్లే చెప్పారు. ప్రస్తుతం ట్రంప్, మెలానియా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వైట్‌హౌస్‌లోనే వారి క్వారంటైన్ జరుగుతుందని చెప్పారు. వైట్‌హౌస్ వైద్యుల బృందం, తాను ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామన్నారు. రికవరీ దశలో అధ్యక్షుడు తన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తాను వెల్లడిస్తానని చెప్పారు. ట్రంప్ సలహాదారు హోప్ హిక్స్‌కు ఒక్కరోజు క్రితమే కరోనా సోకినట్లు పరీక్షలో వెల్లడయింది. హోప్ ఎన్నికల కోసం చాలా కష్టపడుతున్నదని, తనకు కరోనా సోకినట్లు తెలిసిందని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. హోప్‌కు కరోనా రావడంతో తను, మెలానియా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే ప్రెసిడెంట్‌తో కలిసి హోప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయా ణం చేసింది. ఎన్నికల ప్రచారం జోరు గా సాగుతున్న తరుణంలో ట్రంప్‌నకు కరోనా సోకడం ఆయన ప్రచార కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కరోనా సోకడంతో ట్రంప్ బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అనేకమంది తోటి అమెరికన్లు కరోనా బారిన పడ్డట్లే తామూ కరోనా బారినపడ్డామని, ఇద్దరం కలిసి దీన్ని జయిస్తామని మెలానియా ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో పలువురు వైట్‌హౌస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు యూఎస్‌లో కరోనా కారణంగా దాదాపు 2 లక్షల మరణాలు సంభవించాయి. వయోభారం, భారీ కాయం.. అమెరికా అధ్యక్షుల్లో దశాబ్దాల కాలంలో ఎవరూ ఎదుర్కోని సీరియస్ ఆరోగ్యసమస్యను ట్రంప్ ఎదుర్కొంటున్నారని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది. 74 ఏళ్ల వయసు, ఒబేసిటీతో ఆయన కరోనా బాధితుల్లో అత్యధిక రిస్కు జోన్లో ఉన్నారని తెలిపింది. వయసు పెరిగే కొద్దీ కరోనా బాధితుల్లో రిస్కు పెరుగుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్‌లైన్స్ చెబుతున్నాయి. ఉదాహరణకు 50ల్లో ఉన్న వారికి 40ల్లో ఉన్నవారితో పోలిస్తే తీవ్ర అస్వస్థతకు గురయ్యే చాన్స్ అధికమని, అదేవిధంగా 60, 70ల్లో ఉన్నవాళ్లకు మరింత రిస్కని తెలిపింది. ట్రంప్ ఆరోగ్యం గానే ఉన్నా, అధిక బరువు ఉన్నందున కరోనా సోకితే ఊపిరితిత్తులకు ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దీనికితోడు ట్రంప్ మాస్కు వాడకానికి వ్యతిరేకి. కానీ, ర్యాలీల అనంతరం ప్రతిసారీ ట్రంప్ కోవిడ్ పరీక్ష చేయించుకునేవారు. త్వరలో ఈ సమస్య సమసిపోతుందని చెప్పేవారు. అనూహ్యంగా ఆయనే కరోనా బారిన పడ్డారు. ప్రముఖుల పరామర్శ అగ్రరాజ్యాధిపతికి కరోనా రావడంపై వివిధ దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘నా స్నేహితుడు, ఆయన భార్య తొందరగా రికవరీ కావాలి, మంచి ఆర్యోగంతో ఉండాలి’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లక్షలాది మంది అమెరికన్లతో పాటు తాను కూడా ట్రంప్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు. ఈ కష్టకాలంలో ట్రంప్‌నకు తన పూర్తి మద్దతు ఉంటుందని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ట్రంప్ వేగంగా రికవరీ కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. అమెరికాలోని పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆస్ట్రేలియా వ్యవసాయ మంత్రి, టోక్యో గవర్నర్, ప్రపంచ మీడియా సంస్థలు ట్రంప్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించాయి. కరోనాపై ట్రంప్ మొదటినుంచీ విరుచుకుపడుతున్నా చైనా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చైనా సోషల్ మీడియోలో మాత్రం ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు కనిపించాయి. ట్రంప్ పూర్తిగా కోలుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గ్యుటెర్రస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆకాంక్షించారు. కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మాస్కు ధరించడం ఇష్టపడని ట్రంప్‌ను కరోనా ఇష్టపడిందంటూ కొందరు వెటకారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విమర్శించే ట్రంప్ ఎట్టకేలకు ఒక విషయాన్ని ‘పాజిటివ్’గా ట్వీట్ చేశారని ఓ చైనీయుడు జోక్ చేశారు. కోవిడ్ బాధితులకు క్రిమిసంహారక(డిస్ఇన్ఫెక్టెంట్) మందులు ఇంజెక్షన్ చేయాలని ట్రంప్ గతంలో అన్నారు కనుక ఇప్పుడు వాటిని తీసుకునే సమయం ట్రంప్‌నకు వచ్చిందని జపాన్ ఇంటర్నెట్ వ్యాపారి హిరోయుకి నిషిమురా వ్యాఖ్యానించారు. తొలి నుంచీ నిర్లక్ష్యమే! కరోనా విపత్తు ఆరంభం నుంచి ట్రంప్ నిర్లక్ష్య వైఖరినే చూపుతూ వచ్చారు. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని, మాస్కు అవసరం లేదని, ఎకానమీని షట్‌డౌన్ చేయక్కర్లేదని చెప్పడమే కాకుండా కరోనాపై జాగ్రత్తలు చెప్పినవాళ్లను ఎగతాళి చేశారు. కానీ చివరకు తానే దాని బారిన పడ్డారు. ప్రజలు ఎక్కువగా భయపడకుండా ఉండేందుకే తాను కరోనాను తక్కువ చేసి చూపానని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. జనవరి 21న యూఎస్‌లో తొలి కరోనా కేసు నమోదయింది. అప్పటి నుంచి కరోనాపై ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు.. జనవరి: కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారదు. అమెరికాలో కరోనా పూర్తి నియంత్రణలో ఉంది. ఫిబ్రవరి: ఏప్రిల్ కల్లా వేసవి ఆరంభం కాగానే కరోనా మాయమవుతుంది. కరోనా మహ్మమారి తాత్కాలికమే. ఒక్కమారుగా మాయమవుతుంది. మార్చి: అమెరికన్లకు కరోనా రిస్కు చాలా తక్కువ. జాతీయ ఎమర్జెన్సీ అనవసరం. కానీ విధించక తప్పట్లేదు. ఏప్రిల్: కరోనా వైరస్ సోకినవారు డిస్‌ఇన్ఫెక్టెంట్‌ను ఇంజెక్షన్‌గా తీసుకుంటే చాలా వేగంగా మళ్లీ ఆరోగ్యవంతులుగా మారడం ఖాయం మే: పిల్లల్లో కరోనా ప్రభావం చాలా తక్కువ. షట్‌డౌన్ కొనసాగిస్తే కోవిడ్ మరణాల కంటే ఇతర కారణాలతో∙ ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. జూన్: కరోనా మరణాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంది. కరోనా కేసుల్లో 99% ప్రమాదరహితాలు. జూలై: ప్రపంచంలో అమెరికాలోనే కరోనా మరణాలు తక్కువ. సెప్టెంబర్: మాస్కు పెట్టుకొని దేశాధినేతలను కలవడం అమర్యాద. అధ్యక్ష పోటీదారు బైడెన్లాగా నేను మాస్కు ధరించను. పెన్స్ చేతికి పగ్గాలు?? ప్రస్తుత అధ్యక్షుడు కరోనా బారిన పడడంతో అమెరికా రాజకీయరంగంలో మార్పులు జరగవచ్చని రాజకీయ నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలైతే యూఎస్ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చు. వైస్‌ప్రెసిడెంట్ కూడా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితులుంటే, స్పీకర్ ఆఫ్ హౌస్ తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. అయితే, ఒకపక్క అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గరపడుతోంది, కీలక పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతల బదిలీ ఉండకపోవచ్చని మరికొందరి అంచనా. అధ్యక్ష అభ్యర్ధులు ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలై నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వస్తే పార్టీలకు సైతం అగ్ని పరీక్ష ఎదురుకానుంది. కొత్తగా మరో అభ్యర్థిని ఎంచుకొని, వారితో ప్రచారం నిర్వహించాల్సి వస్తుంది. ఇవన్నీ కలగలసి అమెరికా రాజకీయ యవనికపై పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలేనని, పరిస్థితి అంతదూరం రాకపోవచ్చని ఎక్కువమంది అంచనా. ట్రంప్ వేగంగా కోలుకోకపోతే మాత్రం పెన్స్ చేతికి పగ్గాలు తాత్కాలికంగానైనా వచ్చే అవకాశాలున్నాయి. రాజ్యాంగానికి జరిపిన 25వ సవరణ ప్రకారం అధ్యక్షుడు తాను బాధ్యతలు నిర్వహించలేనని ప్రకటిస్తే ఉపాధ్యక్షుడు తాత్కాలిక బాధ్యతలు చేపడతారు. తిరిగి అధ్యక్షుడు తాను బాగానే ఉన్నానని స్వయంగా చెప్పేవరకు ఉపాధ్యక్షుడు అధ్యక్ష వ్యవహారాలు చూస్తాడు. గతంలో ఎప్పుడు? ► 1985లో రొనాల్డ్ రీగన్ శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జార్జ్ డబ్లు్య బుష్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించారు. ► 2002, 2007లో కొలనొస్కోపి చేయించుకోవాల్సిన సమయంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ తన బాధ్యతలు, అధికారాలను డిక్ చెనీకి తాత్కాలికంగా బదలాయించారు. రెండో ఆప్షన్ అధ్యక్షుడు తన బాధ్యతలు, అధికారాలు స్వయంగా తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదలాయించడం కాకుండా కేబినెట్లో మెజార్టీ సభ్యులు, ఉపాధ్యక్షుడు తమకు తామే ఇలాంటి బదలాయింపును ప్రకటించవచ్చని యూఎస్ రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. అధ్యక్షుడు బాధ్యతలు నిర్వహించలేడని భావించిన పక్షంలో కేబినెట్లో అధికులు, ఉపాధ్యక్షుడు కలిసి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యూఎస్‌లో ఇలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగించాలంటే పెన్స్‌తో సహా కేబినెట్లోని సీనియర్స్ 15 మందిలో 8మంది ట్రంప్ బాధ్యతలు నిర్వహించలేరని భావించాల్సిఉంటుంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ అంగీకరించకున్నా సెనేట్, హౌస్‌లు ఆమోదిస్తే వాస్తవ రూపం దాలుస్తుంది. పెన్స్ యత్నాలను ట్రంప్ ముందే గమనిస్తే ట్రంప్ తనను ముందే డిస్మిస్ చేయవచ్చు. మరోవైపు ట్రంప్ అనారోగ్యంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటికే ఓటింగ్ ఆరంభమైనందున వాయిదా సాధ్యం కాదని ఎక్కువమంది అంచనా. రాజ్యాంగంలో ఎన్నికల తేదీ గురించి ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల ఎన్నికలు వాయిదా వేయాలంటే అటు సెనేట్, ఇటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలపాల్సిఉంటుంది. ఎన్నికలతో సంబంధం లేకుండా ట్రంప్ పదవీ కాలం వచ్చే జనవరి 20తో ముగియనుంది. బైడెన్‌కు నెగెటివ్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జో బైడెన్‌కు, ఆయన భార్య జిల్ ట్రేసీ జాకొబ్ బైడెన్‌కు శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ పరీక్షలో ఇద్దరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు కరోనా సోకినట్లు తేలడంతో బైడెన్ దంపతులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ట్రంప్, బైడెన్ల మధ్య చర్చా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కరోనా నెగటివ్ అని తేలడంతో ప్రచార కార్యక్రమాలను కొనసాగించాలని బైడెన్ నిర్ణయించారు. ప్రచారంలో భాగంగా ఆయన మిషిగన్‌కు వెళ్లనున్నారు. -
మమతను హత్తుకుంటా: బీజేపీ నేతకు కరోనా
సాక్షి, కోలకతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనుపమ్ హజ్రాను తథాస్తు దేవతలు దీవించినట్టున్నారు. ఏదో ఒక సమయంలో కరోనా సోకుతుందని, అపుడు మమతా బెనర్జీని హత్తుకుంటానంటూ రెచ్చిపోయిన హజ్రాకు తాజాగా కోవిడ్-19 నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. స్వల్ప అనారోగ్యం కారణంగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలిందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జాతీయ కార్యదర్శిగా నియమితులైన అనుపమ్ హజ్రా తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ అనుపమ్‌పై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. (‘కరోనా వస్తే మమత బెనర్జీని కౌగిలించుకుంటా’) -
కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు
వాషింగ్టన్ : ప్రపంచాన్ని వణిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పించుకోలేకపోయారు. తాజాగా ఆయనకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. దీంతో ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ట్వీట్ చేశారు. తాము క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించి తగిన చికిత్స తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష) కాగా ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ తాజాగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే తాను కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోనున్నట్టు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్ కేసులతో అమెరికా అతలాకుతలమవుతున్నతరుణంలో మాస్కును ధరించాలని, వైద్య సిబ్బంది, అధికారులు హెచ్చరించినా అధ్యక్షుడు బేఖాతరు చేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ ఆసుపత్రి సందర్శన సందర్భంగా నలుపు రంగు మాస్క్ ధరించి అందర్నీ విస్మయపర్చారు. కాగా కరోనాకు అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7.31 మిలియన్ల మంది వైరస్ బారిన పడగా, మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. -
ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు కరోనా బారిన పడ్డారు. దీంతో ట్రంప్ కూడా కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణం, మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చిన్నవిరామం కూడా తీసుకోకుండా కష్టపడుతున్న హోప్ హిక్స్ కరోనా బారిన పడ్డారు. దీంతో తన భార్య, తాను పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. క్వారంటైన్ లోకి వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. ఈ వారంలో ఆమె ట్రంప్‌తో పలుసార్లు ప్రయాణించారు. అలాగే బుధవారం ఒక ర్యాలీలో పాల్గొన్న మరుసటి రోజు ఆమెకు కరోనా సోకడంతో పార్టీ వర్గాల్లో అలజడి మొదలైంది.(ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ కష్టం) మంగళవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన సమావేశంతో సహా ఆమె ఇటీవల అధ్యక్షుడితో పలుసార్లు ప్రయాణించారు. మిన్నెసోటాలో ట్రంప్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం ముందు జాగ్రత్త చర్యగా అధ్యక్షుడు ట్రంప్ పరీక్షలు చేయించుకున్నట్టు పేర్కొన్నారు. హిక్స్ గతంలో వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రతినిధిగా పనిచేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తిరిగి వైట్ హౌస్ కు వచ్చారు. Hope Hicks, who has been working so hard without even taking a small break, has just tested positive for Covid 19. Terrible! The First Lady and I are waiting for our test results. In the meantime, we will begin our quarantine process! — Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020 -
కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లాన్సెట్ సంచలన హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో పేర్కొంది. ఫలితంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు అందడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వారిని నిరోధిస్తుందని, ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. శాస్త్రీయ ఆధారాలనుంచి తప్పుకోవడంతోపాటు రాజకీయంగా ప్రేరేపితమైన ధోరణిగా వ్యాఖ్యనించడం గమనార్హం. దేశంలో మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వం చాలా పాజిటివ్ ధోరణితో ఉందని ఆరోపించింది. పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య వాస్తవాలను దాచి, ప్రజల్లో తప్పుడు ఆశలను కల్పించవద్దని దేశ నాయకులకు పిలుపునిచ్చింది. అసలు నిజాలు చెప్పకుండా, కప్పివుంచడం అంటే ఆరోగ్య సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించకుండా ప్రజలను నిరోధించcడమేనని వ్యాఖ్యానించింది. నివారణ చర్యల పట్ల ప్రజల్లో అనిశ్చితికి దారి తీయడమే కాకుండా, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని లాన్సెట్ పేర్కొంది. ఆశావాదాన్ని ప్రోత్సహించే ఒత్తిడికి దేశ శాస్త్రీయ సంస్థలు కూడా ప్రభావితమయ్యాయని తెలిపింది. మహమ్మారి ప్రారంభం తగిన సాక్ష్యాలు లేనప్పటికీ యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ న్వాడకంపై ఐసీఎంఆర్ పాత్రను ప్రశ్నించింది.అలాగే స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ టీకాను ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటనను కూడా తప్పుబట్టింది. ఇది వివాదాస్పదంగా ఉందని సంపాదకీయం పేర్కొంది. ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు ఉందని భారత ప్రభుత్వం వాదించడాన్ని లాన్సెట్ సవాలు చేసింది. కేసులు,మరణాల డేటా పారదర్శకతను తప్పుబట్టింది ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా నివేదించినా, ఈ సంఖ్యలు పోల్చదగినవా కావా అని తెలుసుకోవడం కష్టంగా ఉందంటూ సందేహాలను వ్యక్తం చేసింది. మహమ్మారిని నిలువరించే సామర్థ్యం భారతదేశానికి ఉందనీ, కానీ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపింది. వైద్యం, మందులు, ప్రజారోగ్యం, పరిశోధన, తయారీలో తగినంత నైపుణ్యం ఉందని పేర్కొంది. తప్పుడు ఆశావాదాన్ని ప్రజలకు అందించకుండా వీటన్నింటిని ఉపయోగించాలని, గౌరవించాలని హితవు పలికింది. అయితే కరోనా నిర్వహణకు సంబంధించి కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసించింది. -
నటి జరీనాకి కరోనా
దక్షిణ, ఉత్తరాది సినిమా పరిశ్రమల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ కూడా కరోనా కారణంగా క్వారెంటైన్లో ఉన్నారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారం క్రితం చికిత్స కోసం ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేరారు. జ్వరం, శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకి చికిత్స అందించారు డాక్టర్లు. ఆస్పత్రిలో చేరిన ఐదు రోజులకే జరీనా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్ అయ్యారు. అయితే జరీనాకి ఇంకా నెగటివ్ రాలేదు. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో ఉంటున్నారామె. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో జరీనా వహాబ్ నటించారు. తాజాగా రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో జరీనా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
ఎయిరిండియాకు మరోసారి కరోనా సెగ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కాలంలో వందేభారత్ మిషన్ కింద విదేశీ ప్రయాణికులను చేరవేస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలకు మరోసారి కరోనా సెగ తగిలింది. ఎయిరిండియా విమానంలో దుబాయ్ వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీరియస్ గా స్పందించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను15 రోజులపాటు నిషేధించింది. ఈ సస్పెన్షన్ సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. సెప్టెంబర్ 4న జైపూర్ నుండి దుబాయ్ వచ్చిన ప్రయాణీకుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని దుబాయ్ అధారిటీ తన సస్పెన్షన్ నోటీసులో పేర్కొంది. ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం ఇది రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 2వ తేదీన జైపూర్ లోని ఒక డయాగ్నిస్టిక్ సెంటర్ ద్వారా అతనికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహించారని పేర్కొంది. తద్వారా విమానంలో ఉన్న ఇతర ప్రయాణీకులను ప్రమాదంలో పడేసారనీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రాంతీయ మేనేజరుకు రాసిన లేఖలో ఆరోపించింది. కరోనా మహమ్మారి కాలంలో ఇరు దేశాల మధ్య కుదరిన ఒప్పందాన్ని ఉల్లంఘించారని మండిపడింది.