రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు, మరణాలు | Hyderabad Telangana New Corona Virus Cases Recorded | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు

Jun 26 2021 7:02 PM | Updated on Jun 26 2021 7:06 PM

Hyderabad Telangana New Corona Virus Cases Recorded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడడంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,028 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,054 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3627 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1489 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 6,01,184 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

చదవండి: నేనెట్టా బతకాలి సారూ..

Advertisement
 
Advertisement
Advertisement