నేనెట్టా బతకాలి సారూ.. 

Banjara Hills: Woman Tea Stall Removed By GHMC Staff - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసలే కరోనా కాలం.. పనులు దొరకని వైనం.. ముగ్గురు పిల్లలను తీసుకొని ఫుట్‌పాత్‌పై డబ్బా పెట్టుకొని టీ అమ్ముకుంటూ బతుకు బండిని లాగుతోంది ఓ మహిళ. అయితే ఆమెకు జీవనాధారంగా ఉన్న ఆ డబ్బాను గురువారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించడంతో ఆమె కన్నీరు మున్నీరైంది. ఈ డబ్బాను నమ్ముకునే ముగ్గురు పిల్లలను పోషిస్తున్నానని జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మొర పెట్టుకున్నా కనికరించలేదు. బంజారాహిల్స్‌లోని క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top