breaking news
venkateswara colony
-
నేనెట్టా బతకాలి సారూ..
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా కాలం.. పనులు దొరకని వైనం.. ముగ్గురు పిల్లలను తీసుకొని ఫుట్‌పాత్‌పై డబ్బా పెట్టుకొని టీ అమ్ముకుంటూ బతుకు బండిని లాగుతోంది ఓ మహిళ. అయితే ఆమెకు జీవనాధారంగా ఉన్న ఆ డబ్బాను గురువారం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడంతో ఆమె కన్నీరు మున్నీరైంది. ఈ డబ్బాను నమ్ముకునే ముగ్గురు పిల్లలను పోషిస్తున్నానని జీహెచ్ఎంసీ సిబ్బందికి మొర పెట్టుకున్నా కనికరించలేదు. బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
సాక్షి, ఎఫెక్ట్: తొలగించిన డబ్బా మళ్లీ పెట్టించారు
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు పిల్లలను పోషించేందుకు వేరే గత్యంతరం లేక ఫుట్‌పాత్‌పై టీకొట్టు పెట్టుకొని బతుకు నెట్టుకొస్తున్న పార్వతి అనే మహిళ డబ్బాను తొలగించిన వైనంపై ‘నేనెట్టా బతకాలి సారూ’ అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమై కథనం పట్ల వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి స్పందించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆస్పత్రి సమీపంలో టీకొట్టు నిర్వహిస్తున్న ఆమె వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమె డబ్బాను తిరిగి పెట్టించారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఆమెకు వీధి వ్యాపారుల కార్డు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆమెను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఈ సందర్భంగా అధికారులను కోరారు. దీంతో బాధితురాలు పార్వతి కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ‘నాతో రాకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా’ -
స్కూటర్ డిక్కీ నుంచి రూ.8.80 లక్షలు మాయం
హైదరాబాద్: స్కూటర్ డిక్కీలో ఉంచిన రూ.8.80 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సుబ్బారావు అనే డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వర కాలనీలోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ముందు స్కూటర్ నిలిపి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి డిక్కీ పగులగొట్టి ఉంది. అందులో ఉంచిన రూ.8.80 లక్షలు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పిస్టల్‌తో బెదిరించి తాళితో పరారీ
శ్రీకాకుళం: టెక్కలి మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. తంగుడు స్వప్న అనే మహిళ మెడలో నుంచి తాళిని లాక్కుని వెళ్తుండగా.. ఆమె ప్రతిఘటించడంతో అతడు కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఆమె కాలుకి గాయమైంది. దుండుగుడు ఆమెను పిస్టల్‌తో బెదిరించి పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. (టెక్కలి) -
ఉప్పుటేరులో మృతురాలి తల లభ్యం
కాకినాడ క్రైం :కాకినాడలో భర్తచేతిలో హతమైన మృతురాలి తల మూడు రోజుల అనంతరం ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఉప్పుటేరులో లభ్యమైంది. ఈ నెల 6న అర్ధరాత్రి కాకినాడ వెంకటేశ్వర కాలనీకి చెందిన గుమ్మడి మరియమ్మ (38)ని ఆమె భర్త శ్రీరామకృష్ణ హతమార్చి ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి మూటలు కట్టి వివిధ ప్రాంతాల్లో పడేసినసంగతి తెలిసిందే. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను పడేసిన అన్ని శరీర భాగాలను సేకరించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే తల, పేగులు మాత్రం దొరకలేదు. దీంతో శ్రీరామకృష్ణను ప్రశ్నించగా, ప్లాస్టిక్‌డబ్బాలో తలను, స్టీల్బాక్సులో పేగులను పెట్టి ఉప్పుటేరు పడేసినట్టు వెల్లడించాడు. పోలీసులు ఉప్పుటేరులో గాలించగా, శుక్రవారం పేగులు, శనివారం సాయంత్రం తల లభ్యమయ్యాయి. ఇదిలా ఉంటే పర్లోపేట సమీపంలోని డంపింగ్ యార్డులో పోలీసులకు మరికొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయి. శనివారం సాయంత్రం జగన్నాథపురం ఏటిమొగ వెళ్లే దారిలో ఉప్పుటేరులో తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అద్దంకి శ్రీనివాసరావు సిబ్బందితో వెళ్లి తలను పైకి తీయించారు. ఆదివారం శరీరభాగాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. నింది తుడు శ్రీరామకృష్ణను కోర్టులో ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అతనిని పోలీసులు కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. మూడు రోజులు శ్రమించిన పోలీసులు మరియమ్మను బుధవారం అర్ధరాత్రే హత్య చేసినప్పటికీ గురువారం మధ్యాహ్నానికి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శ్రీరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను నవ్వుతూ సమాధానం చెబుతుండడంతో వారు అసహనానికి గురయ్యారు. అయినా మూడు రోజులపాటు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సైలు రమేష్, రవికుమార్, పార్థసారథి, సతీష్, కిశోర్ కుమార్ తీవ్రంగా శ్రమించారు. మరియమ్మ శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేవేయడంతో వన్‌టౌన్ పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. ఘటనా స్థలంలో నోరు విప్పని నిందితుడు స్టేషన్‌కు తరలించిన తర్వాత మూటలు ఎక్కడ పడేశాడో చెప్పాడు. వాటిని సేకరించేందుకు పోలీసులు మూడు రోజులపాటు శ్రమించారు. చిన్నపాటి కత్తులతోనే ముక్కలు చేశాడు మరియమ్మ శరీర భాగాలను ముక్కలుగా కోసేందుకు చిన్నపాటి కూరగాయలు కోసే కత్తులనే ఉపయో గించానని నిందితుడు చెప్పడంతో పోలీసులు కూడా విస్మయానికి గురవుతున్నారు. రాత్రంతా తాపీగా మృతదేహాన్ని ఖండ ఖండాలుగా నరికినట్టు దర్యాప్తులో తేలిం ది. జాయింట్ల వద్ద చర్మాన్ని కోసి అక్కడ దుమ్ములను విరగొట్టి వాటిని సంచుల్లో మూట కట్టినట్టు తెలిసింది. పుట్టింటికి వెళ్లిందని నమ్మించేందుకు యత్నం శ్రీరామకృష్ణ మొదటి భార్య చనిపోవడంతో 18 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన మరియమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత విజయవాడలోనే వీరు ఉండేవారు. చిన్న కుమారుడు సీమోనుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తరచూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకురావాల్సి వచ్చేది. దీంతో కాకినాడకు మకాం మార్చారు. కుటుంబ పోషణ నిమిత్తం మరియమ్మ కూడా హోటల్లో పనిచేస్తుండేది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో శ్రీరామకృష్ణ మనస్థాపానికి గురై ఆమెను కిరాతకంగా హతమార్చాడు. మరియమ్మ గురువారం విజయవాడ వెళ్లేందుకు దుస్తులు సర్దుకోవడంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల పడేసి భార్య పుట్టింటికి వెళ్లిందని నమ్మించేందుకు యత్నించాడు. రక్తపు మరకలను స్థానికులు గమనించడంతో గుట్టురట్టయింది.