హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కేరళ, బెంగళూరులో ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. రూ. 16.20 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారు వీరు.
అయితే వీరిలో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం సైతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, కొరియర్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. మ్యూల్ అకౌంట్ల ద్వారా విదేశాలకు నగదు తరలిస్తున్నారు. వీరి బారిన పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించుకున్న నగదును పోగొట్టుకుంటున్నారు.


