హైదరాబాద్‌లో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన | Man Infuses Hiv Infected Blood Into Woman Who Refused To Marry Him | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన

Mar 14 2026 12:35 PM | Updated on Mar 14 2026 1:22 PM

Man Infuses Hiv Infected Blood Into Woman Who Refused To Marry Him

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ సోకింది. యువకుడు మనోహర్‌తో యువతికి వివాహం నిశ్చయమైంది. ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి.. పెళ్లికి నిరాకరించింది.

ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి నిరాకరించడంతో మనోహర్‌ ఎయిడ్స్ ఇంజెక్షన్ చేశాడు. నిందితుడిని పోచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement