ఈ 'రారాజు'కు ఓ రోజు! | World Lion Day Celebrations At Nehru Zoological Park In Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ 'రారాజు'కు ఓ రోజు!

Aug 10 2026 8:27 AM | Updated on Aug 10 2026 9:02 AM

World Lion Day Celebrations At Nehru Zoological Park In Hyderabad

ప్రపంచ సింహాల దినోత్సవాన్ని నెహ్రూ జులాజికల్‌ పార్క్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంతు సంరక్షకులు జూ సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించడంతో పాటు సింహాలపై టాక్‌ షో నిర్వహించారు. వాటి ఆహార అలవాట్లు, ప్రవర్తన, సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జూ పార్కులో ఆసియా, ఆఫ్రికన్‌ సింహాలు ఉన్నాయని డిప్యూటి క్యూరేటర్‌ మురళీధర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ క్యూరేటర్లు నజియ తబస్సుమ్, లక్ష్మణ్, పీఆర్‌వో హనీఫ్, జూ పార్క్‌ ఎడ్యుకేషన్‌ అధికారి దీపక్‌ తరుణ్, యానిమల్‌ కీపర్‌ అయూబ్‌ కౌసర్‌ పాల్గొన్నారు. - హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement