నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌కు వెళ్లి వస్తుండగా.. విషాదం! | Hyderabad Student Dies In Road Accident Incident | Sakshi
Sakshi News home page

నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌కు వెళ్లి వస్తుండగా.. విషాదం!

Aug 10 2026 7:59 AM | Updated on Aug 10 2026 8:30 AM

Hyderabad Student Dies In Road Accident Incident

షేక్‌ హసిన్‌ మెహతా (ఫైల్‌)

మెదక్‌ జిల్లా రోడ్డు ప్రమాదంలో నగర విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్‌ ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన షేక్‌ హసిన్‌ మెహతా(19) బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు.

స్నేహితులు వెంకటగిరీష్‌, చంద్ర, దేవ సునందన్‌ సాయితో కలిసి మియాపూర్‌ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలోని అర్బన్‌ పార్క్‌ సందర్శనకు బైక్‌లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్‌ సమీపంలోని టర్నింగ్‌ వద్ద బైక్‌ అతివేగంగా రెయిలింగ్‌ను ఢీకొట్టగా హసిన్‌ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement